‘నేను బీజేపీ ఐటమ్‌ గర్ల్‌ని’ | SP Leader Azam Khan Said I Am The Item Girl of BJP | Sakshi
Sakshi News home page

‘నేను బీజేపీ ఐటమ్‌ గర్ల్‌ని’

Published Wed, Oct 24 2018 5:15 PM | Last Updated on Wed, Oct 24 2018 5:17 PM

SP Leader Azam Khan Said I Am The Item Girl of BJP - Sakshi

సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజామ్‌ ఖాన్‌ (ఫైల్‌ ఫోటో)

లక్నో : నోటి దురుసుతో వార్తల్లో నిలిచే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజామ్‌ ఖాన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను బీజీపీ ఐటమ్‌ గర్ల్‌ను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల క్రితం ఘజియాబాద్‌లో హజ్‌ హౌస్‌ ప్రారంభోత్సావానికి హాజరైన అజామ్‌ ఖాన్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. దాంతో అంబేడ్కర్‌ మహాసభ సభ్యులు అజామ్‌ ఖాన్‌ మీద మంగళవారం (నిన్న) హజ్రత్‌గని పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఈ విషయంపై ఆయన స్పందిస్తూ ‘బీజేపీ గత ఎన్నికల్లో నా పేరే వాడింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కూడా నా పేరును అడ్డు పెట్టుకుని ప్రచారం చేయాలని భావిస్తోంది. ఎందుకంటే బీజేపీ నన్ను తన ఐటమ్‌ గర్ల్‌గా భావిస్తోంది. ఇక మీదట కూడా నాకు సమన్లు, వారెంట్లూ వస్తూనే ఉంటాయాం’టూ అజామ్‌ మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement