అనవసరంగా నా పేరు లాగకండి: రాఖీ సావంత్
రాజకీయ నాయకులు ప్రత్యర్థులను విమర్శించడానికి అనవసరంగా తన పేరు లేనిపోని వివాదాల్లోకి లాగడం తగదని బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ మండిపడింది. అరవింద్ కేజ్రీవాల్ కంటే రాఖీ సావంతే నయమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై రాఖీ ఇలా చెప్పింది. ''కేజ్రీవాల్ కంటే నేను మంచి రాజకీయ నాయకురాలిని అవుతానని ఉద్ధవ్ ఠాక్రే భావిస్తే అందుకు ఆయనకు కృతజ్ఞతలు. కానీ, నా పేరును అనవసరంగా రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటే నాకు నచ్చదు. నేను కేవలం కష్టపడి పనిచేసే నటిని మాత్రమే'' అని ఆమె చెప్పింది.
అంతకుముందు.. ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కంటే, బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ చాలా నయమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో.. నేరుగా కేజ్రీవాల్పై తన విమర్శలు ఎక్కుపెట్టారు. కేజ్రీవాల్ కంటే రాఖీ సావంత్ను ఆ కుర్చీలో కూర్చోబెడితే బాగా చేసేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో రాఖీని ఐటెం గర్ల్ అని విమర్శించినవాళ్లు ఇప్పుడామెను సన్మానించాలని తెలిపారు.