samna
-
ప్రధానిపై కథనం..సంజయ్ రౌత్‌పై కేసు
ముంబై: శివసేన(ఉద్ధవ్)నేత,రాజ్యసభ ఎంపీ సంజయ్‌రౌత్‌పై మహారాష్ట్రలోని యావత్మాల్ పోలిస్స్టేషన్లో రాజద్రోహం కేసు నమోదైంది. ప్రధాని మోదీపై పార్టీ పత్రిక సామ్నాలో అభ్యంతరకర ఆర్టికల్ రాశారన్న కారణంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. యావత్మాల్ బీజేపీ కన్వీనర్ నితిన్ భుటాడా ఫిర్యాదు మేరకు రౌత్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోమవారం(డిసెంబర్11)న రౌత్ సామ్నాలో ప్రధానిపై అభ్యంతరకర ఆర్టికల్ రాశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ పత్రిక సామ్నాకు రౌత్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. రౌత్‌పై రాజద్రోహం(ఐపీసీ 124ఏ)తో పాటు రెండు వర్గాల మధ్య విద్వేషాలు రేపేందుకు ప్రయత్నించారని ఐపీసీ153(ఏ) సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదీచదవండి..యాదవ్‌కు సీఎం పదవి..బీజేపీ బిగ్ స్కెచ్ -
‘హిందీ-చైనీ భాయి భాయి అంటే నష్టం’
సాక్షి, ముంబై: భారత్, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సామ్నా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. చైనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు వర్తించే జాతీయవాద పాలసీని రూపొందించాలని తెలిపారు. అయితే మహారాష్ట్రలో చైనా పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపివేసామని, కానీ కేంద్ర ప్రభుత్వం మళ్లీ మనసు మార్చుకొని యూటర్న్ తీసుకుంటుందేమోనని ఆందోళనగా ఉందన్నారు. దేశంలో చైనా పెట్టుబడుల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన పాలసీని రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. దేశ భక్తి అందరికి ఒకేవిధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కానీ భవిష్యత్తులో చైనా ప్రెసిడెంట్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ హిందీ చైనీ బాయి, బాయి అంటే మాత్రం మేము చాలా నష్టపోతామని అన్నారు. ఇటీవల ప్రధాని అధ్యక్షతన నిర్వహించిన వీడియో సమావేశంలో తాను జాతీయ పాలసీపై మాట్లాడినట్లు ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు. చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేదించిన తర్వాత దేశీయ ఇంటర్నెట్ కంపెనీలకు భారీగా డిమాండ్ పెరిగింది. (చదవండి: మహారాష్ట్ర పరిస్థితికి ఆయనే కారణం: కాంగ్రెస్ నేత) -
‘ఫడ్నవీస్‌వి చిన్న పిల్లల తరహా ఆరోపణలు’
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చిన్న పిల్లల తరహా ఆరోపణలు చేస్తున్నారని శివసేన ముఖ్యనేత రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. సంజయ్ రౌత్ శివసేన పత్రిక సామ్నాలో రొహతక్ కాలమ్‌లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిని ప్రస్తావించారు. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని కూటమిని మహారాష్ట్రతో పాటు దేశం మొత్తం స్వాగతించిందని తెలిపారు. శక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా త్రయాన్ని ఢీకొట్టి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మా కూటమి ప్రభుత్వం కచ్చితంగా ఐదేళ్లు కొనసాగుతుందని సంజయ్ రౌత్ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షమే లేదంటూ ఫడ్నవీస్ అతివిశ్వాసం ప్రదర్శించారని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చొరవతోనే కూటమి సాధ్యమయిందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో విభేదాల గురించి రౌత్ స్పందిస్తూ కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌ను సమర్థించిన విషయాన్ని గుర్తు చేశారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం లోని ‘మహా వికాస్ ఆఘాడి’ విశ్వాస పరీక్షలో నెగ్గి ఉద్దవ్ థాక్రే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 145 కాగా 169 మంది ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరేసి చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. -
ఇంత అవమానమా.. ఇక శాశ్వత ముగింపు!
సాక్షి, మహారాష్ట్ర: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో బీజేపీ-శివసేన మధ్య ఏర్పడ్డ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పదవుల పంపకాలతో ప్రారంభమైన వీరి మనస్పర్థలు కూటమి విచ్ఛినం వరకూ వెళ్లాయి. ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన శివసేన వారి విజ్క్షప్తి మేరకు కేంద్రమంత్రి పదవి కూడా రాజీనామా చేసింది. దీంతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్లయింది. తాజాగా పార్లమెంట్ సమావేశాలు వారి మధ్య దూరాన్ని మరింత పెంచాయి. 30 ఏళ్లకు పైగా ఉన్న ప్రయాణానికి పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లయింది. సోమవారంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభలో చర్చలో భాగంగా శివసేనకు ప్రతిపక్షం వైపు సీట్లను కేటాయించారు. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆదివారమే ప్రకటించారు. మొన్నటి వరకు అధికారపక్షం వైపు కూర్చున సేన ఎంపీలు.. తాజాగా ప్రతిపక్షంలో కూర్చోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కావచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై మంగళవారం సామ్నాలో ఎడిటోరియల్ వేదికగా శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం తమను సంప్రదించకుండానే విపక్ష వైపు తమ స్థానాలను మార్చారని విమర్శించింది. ‘ఎన్డీయే ఏర్పడటానికి ముఖ్య కారణం దివంగత బాలాసాహెబ్ ఠాక్రే. ఆ నాడు హిందుత్వ, జాతీయవాదం గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ విషయాన్ని బీజేపీ నాయకులు మర్చిపోవడం దారుణం. ఎన్డీయే ఏర్పడిన తొలి నాళ్లలో బీజేపీతో కలసి రావడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. తొలుత బీజేపీతో భాగస్వామ్యం అయిన పార్టీ శివసేన. తాజా పరిస్థితుల నేపథ్యంలో మాపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు. ఇంత జరిగాక బీజేపీతో మళ్లీ మేం కలవడంలో అర్థంలేదు. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడినా.. బీజేపీతో కలిసేందుకు మేం సిద్ధంగా లేం. బాలా సాహెబ్ వర్థంతి సందర్భంగా యావద్దేశమంతా ఆయకు నివాళి అర్పించింది. కానీ అదే రోజున ఆయన పునాది వేసిన ఎన్డీయే నుంచి శివసేనను బహిష్కరించడం బాధాకరం. అవమానకరం. ఇక నో బీజేపీ, నో ఎన్డీయే’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడింది. కాగా ఎన్నికల ఫలితాలు ఏర్పడి నెల రోజులు కావస్తున్నా.. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. బీజేపీ వెనక్కి తగ్గడంతో ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతో సీఎం పీఠం అధిష్టించాలని శివసేన భావించింది. ఈ మేరకు మూడు పార్టీ మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నా.. ముంగింపు దశకు మాత్రం చేరుకోవడంలేదు. రోజుకో ప్రకటన చేస్తూ కాలం గడుపుతున్నారేతప్ప.. ఓ అంగీకారానికి మాత్రం రావడంలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందన్న కారణంతో రాష్ట్రపతి పాలన విధించారు. కానీ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ చర్చలు మాత్రం ఓ వైపు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభకావడంతో వారి ప్రయత్నలు మరికొన్ని రోజులు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మోదీజీ..కొలువులు ఎక్కడ..?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం, వృద్ధి రేటు మందగించడంపై బీజేపీ మిత్రపక్షం శివసేన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నూతన ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు చేపట్టాలని శివసేన సూచించింది. నిరుద్యోగం, ధరల పెరగుదల, పారిశ్రామిక ఉత్పత్తి పడిపోవడం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌కు ఎదురయ్యే ప్రధాన సవాళ్లని ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. దేశంలో నిరుద్యోగ సమస్యకు బీజేపీని నిందించరాదన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వాదనతో శివసేన అంగీకరించినా దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి తెస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇవ్వడాన్ని మరువరాదని గుర్తుచేసింది. మోదీ చెప్పినట్టుగా ఇప్పుడు పది కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉండగా అది జరగలేదని, దీనికి నెహ్రూ-గాంధీ కుటుంబాలను ఎలా విమర్శిస్తారని సంపాదకీయం పేర్కొంది. ఇక ప్రభుత్వ కొలువుల్లో నియామకాలు 30 నుంచి 40 శాతం మేర పడిపోయాయని, 2016-17లో కేవలం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలే భర్తీ చేశారని తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో లోపాలను చక్కదిద్ది ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చొరవ చూపాలని సేన సంపాదకీయం పేర్కొంది. -
రాహుల్, ప్రియాంక చాలా కష్టపడ్డారు : శివసేన
ముంబై : నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని పీఠం అలంకరిస్తారని బీజేపీ మిత్రపక్షం శివసేన ధీమా వ్యక్తం చేసింది. మంగళవారం తన అధికార పత్రిక సామ్నాలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకల మీద కూడా ప్రశంసలు కురిపించింది. ‘ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయనే విషయం మాకు అనవసరం. ప్రజల ఉత్సాహం చూస్తూంటే నరేంద్ర మోదీనే మరోసారి ప్రధాని అవుతారనే నమ్మకం కల్గుతుంది. ఇక పోతే ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక చాలా కష్ట పడ్డారు. వారి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఈ సారి పార్లమెంట్లో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేద’ని శివసేన పేర్కొంది. అంతేకాక ‘2014లో కాంగ్రెస్‌కు సరిపడా సీట్లు లభించకపోవడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఈసారి తప్పకుండా ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నుంచే ఉండబోతున్నారు. దీన్ని రాహుల్ విజయంగానే చెప్పుకోవాలి’ అని శివసేన అభిప్రాయపడింది. ఏడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు స్పష్టమైన ఆధిక్యతను కట్టబెట్టాయి. తరువాతి స్థానం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు దక్కనున్నట్లు సర్వేలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో జట్టుకట్టిన శివసేన పరోక్షంగా కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని చెబుతూనే ఆ పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిలవబోతోందని అభిప్రాయపడింది. -
బురఖా బ్యాన్పై వెనక్కి తగ్గిన సంజయ్
సాక్షి, ముంబై: బురఖా నిషేధంపై ఇటీవల సామ్నా సంపాదకీయంలో చేసిన వ్యాఖ్యలు శివసేన ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రావుత్ ఆదివారం ఉప సంహరించుకున్నారు. దీంతో గత వారం రోజులుగా జరుగుతున్న ఈ వివాదానికి తెరపడినట్లు అయింది. గత నెలలో శ్రీలంకలో ఈస్టర్ వేడుకల సందర్బంగా వివిధ చర్చిల్లో వరుస పేలుళ్లు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత పేలుళ్లకు ఓ ఉగ్రవాద సంస్ధ బా«ధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. దీంతో దేశ ప్రజల భద్రత దృష్ట్య శ్రీలంకా ప్రభుత్వం ముస్లిం మహిళలు బుర్ఖా ధరంచడంపై నిషేధం విధించింది. చదవండి: (బురఖా బ్యాన్‌కు కేంద్ర మంత్రి నో..) ఇదే తరహాలో భారతదేశంలో కూడా బుర్ఖాలను నిషేధించాలని శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయాలో సంజయ్ రావుత్ ఇటీవల వ్యాఖ్యలు రాసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సంఘాలు, మహిళల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. సర్వత్రా వ్యతిరేకత రావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కసాగింది. దీంతో పరిస్ధితులు అదుపుతప్పక ముందే సంజయ్ రావుత్ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని, వాస్తవ సంఘటనలపై విశ్లేషణలో ఒక భాగంగానే సంపాదకీయంలో పొందుపరిచామని స్పష్టం చేశారు. బుర్ఖా నిషేధించాలని శివసేన పార్టీగాని, ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేగాని డిమాండ్ చేయలేదని సంజయ్ వెల్లడించారు. -
‘బుర్ఖా వేసుకున్న వారంతా ఉగ్రవాదులు కారు’
న్యూఢిల్లీ : శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో బుర్ఖాలతో సహా ముఖాన్ని కవర్ చేసుకునేందుకు ఉపయోగించే దుస్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మన దేశంలో కూడా బుర్ఖా ధరించి బయటకు రావడాన్ని నిషేధించాలంటూ శివసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఈ విషయం గురించి ప్రచురించింది. అంతేకాక ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే సర్జికల్ దాడులు చేసిన దానికన్నా ఎక్కువ ధైర్యం కావాలంది. లంకలో బుర్ఖాలపై నిషేధం విధించారు.. మరి అయోధ్యలో ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు మోదీ అంటూ ప్రశ్నించింది. అయితే శివసేన డిమాండ్‌ను పలువురు బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. సేన డిమాండ్‌పై స్పదించిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహ్మ రావు.. భారతదేశంలో ఇలాంటి నిషేధం అవసరం లేదని స్పష్టం చేశారు. మరో కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే మాట్లాడుతూ.. ‘బుర్ఖా ధరించే ముస్లిం మహిళలంతా ఉగ్రవాదులు కారు. ఇది వారి సంప్రదాయం. దాన్ని గౌరవించాలి. భారతదేశంలో బుర్ఖాలపై నిషేధం అనవసరం’ అన్నారు. అయితే సాధ్వి ప్రజ్ఞా సింగ్ మాత్రం సేన డిమాండ్‌ను సమర్థించారు. కొన్ని నిర్ణయాలను దేశ రక్షణ కోసం తీసుకుంటాము. ఇలాంటి వాటిని అందరు తప్పక పాటించాలన్నారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వాసిమ్ రిజ్వీ కూడా ఈ డిమాండ్‌ను వ్యతిరేకించారు. ‘ఇది ముస్లిం మహిళలకు సంబంధించిన నిర్ణయం. బుర్ఖా ధరించాలా వద్దా అనేది వారి ఇష్టం. అంతేతప్ప దేశ వ్యాప్తంగా బుర్ఖాను నిషేధించడం అనేది బాధ్యతారహితమైనదే కాక రాజ్యంగ విరుద్ధమైన డిమాండ్’ అంటూ మండిపడ్డారు. -
‘మరో జలియన్‌వాలా బాగ్ ఉదంతం ఇది’
ముంబై : అమృత్సర్ రైలు ప్రమాదాన్ని జలియన్‌వాలా బాగ్ ఉదంతంతో పోలుస్తూ శివసేన తన పత్రిక సామ్నాలో కథనం వెలువరించింది. బ్రిటిషర్ల చేతిలో జలియన్ వాలా బాగ్‌లో అమాయక ప్రజల మీద ఊచకోత జరిగితే.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భారతీయులు చీమల్లా చచ్చిపోతున్నారంటూ ఘాటుగా విమర్శించింది. విజయదశమి వేడుకల సందర్భంగా శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రావణ దహనాన్ని వీక్షిస్తున్న వందలాది మంది రైల్వే ట్రాక్‌పైకి రావడంతో రైలు ఢీకొని 61 మంది మరణించగా.. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే ఈ పెను ప్రమాదం సంభవించిందని శివసేన విమర్శించింది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్రమాదం జరిగిన పదహారు గంటల తర్వాత ఘటనాస్థలికి చేరుకోవడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రతీసారి ఓ నూతన రైల్వేశాఖా మంత్రి మనకు దర్శనమిస్తారంటూ ఎద్దేవా చేసింది. నాడు డయ్యర్ సృష్టించిన నరమేధం.. భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన ఘటనగా జలియన్ వాలాబాగ్ నరమేధం నిలిచింది. పంజాబ్‌లోని అమృత్సర్ పట్టణంలో జలియన్ వాలాబాగ్‌లో ఏప్రిల్ 13, 1919న భారీ సంఖ్యలో ప్రజలు సమావేశమయ్యారు. ఆంగ్లేయుల అరాచకాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలు వినేందుకు, రౌలట్ చట్టం కింద సత్యపాల్, సైఫుద్ధీన్ కిచ్లూలను అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ సిక్కులు జలియాన్ వాలాబాగ్‌కు చేరుకున్నారు. అదే రోజు సిక్కుల ఆధ్యాత్మిక నూతన సంవత్సరం కూడా కావడంతో చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరు అక్కడికి వెళ్లారు. దీంతో ఆగ్రహించిన జనరల్ డయ్యర్...నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపించాడు. పది నిమిషాలపాటు, 1650 రౌండ్లు కొనసాగిన ఈ కాల్పుల్లో... అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం మృతుల సంఖ్య 1000 కి పైగానే ఉండగా.. మరో 2000 మందికి పైగా గాయపడ్డారు. పారిపోయేందుకు కూడా వీలు లేకపోవడంతో బుల్లెట్ల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది అక్కడ ఉన్న బావిలో దూకగా వారిని కూడా పైకి తీసుకొచ్చి అత్యంత దారుణంగా హతమార్చారు. అదే సమయంలో నగరంలో కర్ఫ్యూ కూడా కొనసాగుతుండటంతో, ఆస్పత్రికి తీసుకువెళ్లే వీలులేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. -
10వేల ఏళ్లలో ఇదే చెత్త పాలన...
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపై బీజేపీసోదర పార్టీ శివసేన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. పదివేల ఏళ్లలో ఇంత దారుణమైన చెత్త పాలనను చూడలేదంటూ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. డీమానిటైజేషన్, మహిళల కష్టాలపై స్పందించిన శివసేన బీజేపీపై పదునైన వ్యాఖ్యలతో మరోసారి దాడికి దిగింది. అంతేకాదు పెద్ద నోట్ల రద్దుతో మహిళల్నిభారీ కష్టాల్లోకి నెట్టేసిన తరువాత కూడా నల్లధనం నిర్మూలన అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఫూల్స్ పారడైజ్ లో జీవిస్తున్నారని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శించింది. ఆర్ బీఐ కార్యాలయం ముందు ఓ మహిళ చేపట్టిన ఆందోళన నేపథ్యంలో శివసేన స్పందించింది. ఓ బాధిత మహిళ గోడు కనలేని వినలేని క్రూరమైన మరియు చెవిటి పాలన గత 10 వేల సంవత్సరాలలో ఉనికిలో లేదని పేర్కొంది. పెద్దనోట్ల రద్దుతో నల్లధనాన్ని నిర్మూలించినట్టు బీజేపీ సంబరపడుతోందనీ, కానీ పేదమధ్య తరగతి ప్రజలు, నిరుద్యోగులు చాలా బాధలు పడ్డారని ఆరోపించింది. దీన్నికూడా జాతీయవాదంగా మీరు చెబితే మీ మెదళ్ళకు చికిత్సకు తాలిబన్ వైద్యుడు అవసరముందంటూ బీజీపేనుద్దేశించి వ్యాఖ్యానించింది. మహిళలపై ఇలాంటి అమానుష దాడులు తాలీబన్ పద్ధతుల్లో మాత్రమే జరుగుతాయని అని శివసేన చెప్పింది. ఇది ప్రభుత్వమే ఉసికొల్పిన నిర్భయ విషాదం లాంటిదంటూ సామ్నా సంపాదకీయంలో మండిపడింది. పనిలో పనిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పై తన దాడిని ఎక్కుపెట్టింది శివసేన. నిస్సహాయమైన మహిళకు మద్దతిస్తారా, పెద్ద నోట్ల రద్దుకు మద్దుతిస్తారో తేల్చుకోవాలంటూ సీంఎకు సవాల్ విసిరింది. ఈ మహిళ దుర్దశను చూసిన తరువాత కూడా పెద్ద నోట్లరద్దకు గట్టి మద్దతు ఇస్తున్న సీఎం కడుపు మండక పోవడం అతని నిస్సహాయత్వాన్ని తెలుపుతోందని పేర్కొంది. కాగా రెండు రోజులక్రితం ఢిల్లీలోని ఆర్ బీఐ కార్యాలయం ముందు ఓ మహిళ టాప్ లెస్ గా ఆందోళనకు దిగింది. తన దగ్గర ఉన్నకొద్దపాటి పాతనోట్ల మార్పిడి ప్రయత్నించి విఫలం కావడంతో నిరసనదిగడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. -
వ్యాధి కంటే వైద్యమే భయంకరం!
ముంబై: నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు. వ్యాధి కంటే వైద్యమే భయంకరంగా ఉందంటూ ఉద్ధవ్ ఠాక్రే సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించారు. మోదీ తీసుకున్న నిర్ణయం యావత్ దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చిందని దుయ్యబట్టారు. నల్ల ధనాన్ని అంతమొందించేందుకు మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, కానీ ఆయన ఎంచుకున్న మార్గం చాలా భయానకంగా ఉందన్నారు. దేశంలో ఉన్న జనాభా అంతటిని అవినీతి పరులు, నల్లధనం గల వారని ప్రభుత్వ భావిస్తుందా? అని ప్రశ్నించారు. నల్ల ధనం అనేది కేవలం 125 వ్యాపార, రాజకీయ కుటుంబాల వద్దనే ఉందని ఆరోపించారు. కాగా మీరు తీసుకున్న నిర్ణయంతో ఎంతమంది రూ.500, 1000 నోట్ల బండళ్లు చేతపట్టుకుని క్యూలో నిలబడ్డారని ఉద్ధవ్ మోదీని ప్రశ్నించారు. కొద్ది మంది పారిశ్రామిక వేత్తల వద్ద ఉన్న నల్ల ధనాన్ని వెలికి తీసేందుకు యావత్ దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు. మోదీ తీసుకున్న కఠోర నిర్ణయం వల్ల కోట్లాది పేద ప్రజలు రోడ్డున పడ్డారని, భోజనం లేక బ్యాంకు క్యూలలో విలవిల కొట్టుకుంటూ ప్రాణాలు వదులుతున్నారన్నారు. నల్లధనం దేశానికి క్యాన్సర్ లాంటిదే, కాని దాన్ని వెలికి తీసే పద్ధతి మాత్రం ఇది కాదన్నారు. గతవారం రోజులుగా నరకం అనుభవిస్తున్న దేశ జనాభా మీ నిర్ణయాన్ని స్వాగతిస్తారా అంటూ ప్రశ్నలు సంధించారు. -
'భారత మాతాకీ జై అంటే సమస్యలు పరిష్కారం కావు: శివసేన
ముంబై: 'భారతమాతాకీ జై' అని నినాదాలు చేసే బదులు రాష్ట్రంలోని నీటి సమస్యకు పరిష్కారంను సూచించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఎన్డీఏ మిత్రపక్షమైన శివసేన సూచించింది. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై సత్వరచర్యలు తీసుకోకుంటే శాంతి భద్రతల సమస్యగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 'భారతమాతాకీ జై' అని నినదిస్తూ తన సీటును కాపాడుకోలేరని శివసేన అధికార పత్రిక 'సామ్నా'లో ఘాటుగా విమర్శించింది. గత ప్రభుత్వాలు నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని, భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది నీటి కోసమేనని తెలిపింది. యువతలో అసహనం పెరిగి మావోయిజం వైపు ఆకర్షితులవుతున్నారని ఇలాంటి పరిసితుల్లో 'భారత మాతాకీ జై' అనే నినాదాలు చేస్తే లాభం లేదని నిర్మొహమాటంగా పేర్కొంది. ఔరంగాబాద్ లాంటి ప్రాంతాల్లో 40 రోజులకొకసారి కూడా తాగునీరు రావడంలేదని, పుణే, థానె, నాగపూర్, ముంబైల్లో పరిస్థితి దారుణంగా ఉందని రాష్ట్రం స్మశానాన్ని తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. పరిశ్రమలు మూతపడుతున్నాయని, దేశభక్తి పేరుతో ప్రజల దాహం తీర్చలేమంటే సహించేదిలేదని హెచ్చరించింది. -
'కన్హయ్యకు బీజేపీ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చింది'
ముంబయి: బీజేపీపై శివసేన మరోసారి దాడికి దిగింది. దేశ ద్రోహం ఆరోపణల కిందట అరెస్టై గత వారమే బెయిల్ పై బయటకు వచ్చిన జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌కు బీజేపీ ఉచితంగా ప్రచారం కల్పిస్తుందని శివసేన ఆరోపించింది. ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో సోమవారం ప్రచురించిన సంపాదకీయంలో బీజేపీని దుయ్యబట్టింది. 'ఏ ఒక్కటి కూడా ఉచితంగా రాదు. కానీ, కన్హయ్యకు ఉచితంగా ప్రచారం ఎలా వచ్చింది? ఎవరూ దానికి బాధ్యత? అని ఎడిటోరియల్‌లో ప్రశ్నించింది. దీంతోపాటు గుజరాత్లో పటేళ్ల రిజర్వేషన్ కోసం పోరాటం నడిపిన హార్ధిక్ పటేల్‌తో కన్హయ్య కుమార్‌ను పోలుస్తూ కన్హయ్య విడుదల కేంద్ర ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అన్నారు. అంతేకాకుండా తాజాగా ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో ప్రావిడెంట్ ఫండ్ పై ట్యాక్స్ విధించడాన్ని కూడా శివసేన ఖండించింది. -
'ముందు నువ్వు చేయాల్సిన పనిచేయి'
ముంబయి: మహారాష్ట్రలోని విదర్భలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్రపై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. ఇప్పుడు రైతుల కన్నీళ్లు తుడిచేందుకని పాదయాత్రలు చేయడం కాదని, అంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టపోయి.. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాల కన్నీళ్లు తుడవాలని హితోపదేశం చేసింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ విదర్భ రైతులకు నిధులు కేటాయిస్తే వాటిని ఎందుకు అందజేయలేకపోయారని నిలదీసింది. రాహుల్ పాదయాత్రపై తన అధికారిక పత్రిక సామ్నాలో ప్రత్యేక వ్యాసం వెలువరించిన శివసేన.. మహారాష్ట్ర సర్కారును కూడా విమర్శించింది. రైతుల సమస్యలు తీర్చకుండా, వారు ఆత్మ హత్యలతో ప్రాణాలు బలితీసుకుంటుంటే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చోద్యం చూస్తున్నారని ఆరోపించింది. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫడ్నవీస్ ఇచ్చిన సందేశం చూసి సిగ్గుపడాలని పేర్కొంది. -
భగవత్ నిజమే చెప్పారు: శివసేన
మదర్ థెరీసాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు శివసేన పార్టీ బాసటగా నిలిచింది. ఆయన కొంత నిజమే చెప్పారని ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది. విదేశాలనుంచి మిషనరీలుగా వస్తున్న క్రైస్తవ సంస్థలు దేశంలో చాలామందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాయని శివసేన ఆ పత్రికలో వ్యాఖ్యానించింది. ముస్లింలు కత్తితో బెదిరించి మత మార్పిడి చేస్తే.. క్రైస్తవులు డబ్బు, సేవల పేరిట మతమార్పిడిలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ ఆరోపించింది. అయితే, మనమంతా మదర్ థెరిసా సేవలను గుర్తించామని, ఆమెలాగే చాలామంది కూడా సేవలందించారని, కానీ ఎలాంటి మత మార్పిడిలకు దిగలేదని పేర్కొంది. -
వైదిక్ది రాజద్రోహమే.. చర్య తీసుకోండి: శివసేన
వేద్ ప్రతాప్ వైదిక్ వ్యవహారం కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతోంది. ముంబై ఉగ్రదాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్‌ను వైదిక్ కలవడం రాజద్రోహమేనని బీజేపీ మిత్రపక్షం శివసేన మండిపడింది. తమ అధికారిక పత్రిక సామ్నాలో వైదిక్ దేశభక్తుడు కారని, ఉగ్రవాదిని ఆయన కలవడం రాజద్రోహమని శివసేన వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించడాన్ని కూడా విమర్శించింది. అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, ఎవరైనా పాత్రికేయుడు హఫీజ్ సయీద్‌ను గానీ, దావూద్ ఇబ్రహీంను గానీ కలిసుంటే బీజేపీ తప్పనిసరిగా ప్రభుత్వాన్ని విమర్శించి ఉండేదని సామ్నా సంపాదకీయంలో రాశారు. కానీ వాళ్లిప్పుడు అధికారంలో ఉన్నారని, అందుకే తమకు సంబంధం లేదని అంటున్నారని చెప్పారు. ఈ విషయం జాతీయ భద్రతకు సంబంధించినది కాబట్టి ఇందులో హిందూ ముస్లిం వివక్ష ఏమీ ఉండకూడదని, ఆ జర్నలిస్టును అలాగే వదిలేస్తే రేపు వెళ్లి దావూద్ ఇబ్రహీంతోను, టైగర్ మెమన్తోను, సయీద్తోను వెళ్లి బిర్యానీ తిని వస్తారని సామ్నాలో వ్యాఖ్యానించారు. -
‘మహా’ చాన్స్!
సాక్షి, ముంబై: ‘మహా’కూటమి నేతలకు మంచి రోజులొచ్చాయి. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా 42 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకున్న ఈ రాష్ట్రం నుంచి ఎక్కువ మందికి మంత్రి పదవులు లభించే అవకాశం కనబడుతోంది. ఇందుకనుగుణంగానే శివసేన, బీజేపీ నేతలు పదవులు దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సంఖ్యాబలంగా చూస్తే మహాకూటమిలోని బీజేపీకి 23, శివసేన 18, స్వాభిమాని షేత్కారీ పార్టీ ఒకటి ఇలా మొత్తం 42 స్థానాలు దక్కాయి. దీంతో రాష్ట్రానికి కనీసం ఏడెనిమిది కేబినెట్లు, అదే సంఖ్యలో సహాయ మంత్రి పదవులు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. వీటిలో రెండు కేబినెట్లు శివసేనకు, మిగిలినవి రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు లభిస్తాయని భావిస్తున్నారు. దీంతో అనేక మంది నేతల్లో ఆశలు చిగురించాయి. శివసేన నేత అనంత్ గీతేకు కేంద్ర కేబినెట్ పదవి లభించే ఆస్కారాలున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రకాంత్ ఖైరే, ఆనందరావ్ అడసూల్, అనిల్ దేశాయి, శివాజీరావ్ ఆడల్‌రావ్ పాటిల్ పేర్లు అందరికంటే ముందున్నాయి. సంజయ్ రావుత్ బలమైన నాయకుడైనా, ఇటీవలే గుజరాతీ సమాజంపై విమర్శలు గుప్పిస్తూ సామ్నాలో సంపాదకీయం రాసినందుకు ఆయనకు మంత్రి మండలిలో చోటుదక్కే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రిగా ముండే...? బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండేకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పలుమార్లు ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రైతుల సమస్యలు పరిష్కరించేందుకు గోపీనాథ్ ముండేకు వ్యవసాయశాఖ మంత్రి పదవిని కట్టబెడతామన్నారు. దీనిపై ముండే మాత్రం ఏమీ చెప్పడం లేదు. పార్టీ ఏ బాధ్యతలిచ్చినా స్వీకరిస్తానని చెబుతున్నారు. అయితే ముండేకు మాత్రం కేంద్ర రాజకీయాలకంటే రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి ఉందని తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సీఎం కావాలనుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగపూర్ నుంచి ఎంపీగా గెలిచిన నితిన్ గడ్కారీకి పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలలో ఏదేని ఒక పదవి లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. కిరీట్ సోమయ్య, హంసరాజ్ ఆహిర్, హీనా గావిత్లకు అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంది. దళితనాయకుడైన ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలేకు సహాయమంత్రి పదవి, రాజు శెట్టికి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఇంత భారీ మొత్తంలో రాష్ట్రానికి కేంద్రమంత్రి పదవులు వస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులను భారీ మొత్తంలో తెచ్చుకునేందుకు వీలుంటుంది. తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపొచ్చని మహా కూటమి నేతలు భావిస్తున్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపొచ్చని లెక్కలు వేస్తున్నారు. భారీ మొత్తంలో కేంద్ర మంత్రి పదవులు వచ్చినా అందరూ కలిసి ఐకమత్యంగా సమర్థంగా పనిచేస్తేనే రాష్ర్ట భవిష్యత్‌ను మార్చేందుకు వీలుంటుందంటున్నారు. -
చల్లారని చిచ్చు!
సాక్షి, ముంబై: గుజరాతీలకు వ్యతిరేకంగా సామ్నాలో వచ్చిన సంపాదకీయం రాజేసిన చిచ్చు రగులుతూనే ఉంది. ఇది గుజరాతీ-మరాఠీల మధ్య వివాదంగా రూపాంతరం చెందుతోందని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఈ వివాదాన్ని స్వార్థప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తుండడంతో రానున్న రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. గతంలో ఉత్తరభారతీయులు-భూమిపుత్రుల(మరాఠీ ప్రజలు) మధ్య తలెత్తిన వివాదం ఎంతటి నష్టాన్ని కలగజేసిందో తెలిసిందే. తాజాగా అటువంటి వివాదమే మళ్లీ రాజుకుంటోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముంబైని గుజరాతీ ప్రజలు, వ్యాపార వేత్తలు వేశ్యలాగా వినియోగించుకున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలతో సామ్నా పత్రికలో ఓ సంపాదకీయం ప్రచురితమైంది. గుజరాతీలు మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోలేదని, వారు మోడీ ర్యాలీకే ప్రాధాన్యతనిచ్చారని సంపాదకీయంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. తెరదించే ప్రయత్నం చేసిన శివసేన... పరిస్థితిని గమనించిన శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేతోపాటు ఆయన కుమారుడైన యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. గుజరాతీలు ముంబైలో భాగమని, అన్ని విషయాలపై బాల్‌ఠాక్రేతో వారు చర్చించేవారని, ఆయనతో సన్నిహితంగా మెలిగేవారని ఉద్ధవ్, ఆదిత్యఠాక్రేలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. చివరకు సామ్నా సంపాదకీయంతో పార్టీకి సంబంధం లేదని, సామ్నా మాటను పార్టీ మాటగా భావించరాదంటూ ప్రకటించారు. అప్పటితో వివాదం సద్దుమణిగిందనే అంతా భావించారు. మళ్లీ చిచ్చురేపిన ‘ప్రకటన’... గుజరాతీయుల కారణంగానే ముంబై ఆర్థికంగా అభివృద్ది చెందడంతోపాటు ఇతర అభివృద్ధి జరిగిందంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ప్రకటనగా మలిచి బెస్ట్బస్సులపై అతికించడం తాజా వివాదానికి కారణమైంది. ఇటువంటి ప్రకటన బెస్ట్ బస్సులపై కనిపించడంపట్ల మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే సమర్థించవచ్చు గాక! కానీ బెస్ట్ బస్సులపై గుజరాతీ వార్తా పత్రిక ప్రకటనలను మా పార్టీ వ్యతిరేకిస్తోంది. ముంబై అభివృద్ధిలో మరాఠీ ప్రజల సహకారాన్ని ఆ పత్రిక నిర్లక్ష్యం చేసింది. ముంబై అభివృద్ధిలో గుజరాతీలు చేసిన ప్రయత్నాలకు మాత్రమే ‘సందేశ్’ పత్రిక ప్రాధాన్యమిచ్చింద’ని ఎమ్మెన్నెస్ కార్పొరేటర్ సందీప్ దేశ్‌పాండే విమర్శించారు. ముంబై అభివృద్ధిలో మరాఠీల పాత్రే లేనట్టుగా సదరు ప్రకటన ఉందన్నారు. అందువల్ల వెంటనే ఆ పత్రిక ప్రకటనలను తొలగించాలని పాండే డిమాండ్ చేశారు. ముంబై అభివృద్ధికి మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగానూ తోడ్పడలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఆ పత్రిక ప్రకటనలో మరాఠీల ప్రస్తావనే లేదన్నారు. ఈ ప్రకటనలను తొలగించనట్లయితే తమదైన పద్దతిలో ఆందోళనకు దిగుతామని కూడా ఎమ్మెన్నెస్ హెచ్చరించింది. ఈ వివాదంపై స్పందించిన శివసేన సభ్యుడు, బెస్ట్ కమిటీ చైర్మన్ అరుణ్దూధ్వాడకర్ మాట్లాడుతూ, ఆ అడ్వర్టయిజ్మెంట్ను పరిశీలిస్తామని, ఏమైనా అభ్యంతరకరమైనవి ఉంటే తొలగిస్తామని హామీ ఇచ్చారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలించే ఇటువంటి ప్రకటనలను తొలగించాల్సిందేనని అన్నారు. పోస్టర్లను తొలగించిన బెస్ట్ ఎమ్మెన్నెస్ హెచ్చరికల నేపథ్యంలో బెస్ట్ బస్సులపై అతికించిన ‘సందేశ్’ ప్రకటన పోస్టర్లను శనివారం తొలగించారు. ఇరుప్రాంతాల ప్రజల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బెస్ట్ తీసుకున్న నిర్ణయం అమలై, పోస్టర్లను తొలగించడంతో వివాదం సద్దుమణిగితే మంచిదేనని, అయితే రాజకీయ నాయకుల స్వార్థపూరిత బుద్ధి మళ్లీ చిచ్చు రేపేందుకు కారణాలు వెతికే అవకావశముందని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెన్నెస్ నేతలు తమ పార్టీ అధినేతను కాదని ఇటువంటి ప్రకటనలు చేయడం అగ్నికి ఆజ్యం పోయడమేనని, పార్టీ అధినేత కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. -
యువరాజ్‌కు ప్రేరణ కోసమా..
సాక్షి, ముంబై : కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్‌సింగ్, టీవీ యాంకర్ అమృతారాయ్ ప్రేమ విషయంపై శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. సామ్నాలో శనివారం ‘చలా ప్రేమాలా లాగా..!’ అనే శీర్షికతో ప్రచురించిన సంపాదకీయంలో దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రకటనల వీరుడుగా ముద్రపడ్డ దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు ప్రేమవీరుడిగా మారారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాగూ అధికారం దూరమవుతుంది కాబట్టి.. పెద్దగా పని ఉండదని కాబోలు.. కాంగ్రెస్ పెద్దలు కొందరు ఇలా ప్రేమ వ్యవహారాలు ప్రారంభించారేమోనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది నాయకులు ప్రేమ వ్యవహారాల కారణంగా చర్చల్లో నిలుస్తుండడం యువరాజుకి ప్రేరణగా మారుతుందా..? అనే ప్రశ్న అనేక మంది మనసులో మెదులుతోందని రాహుల్ గాంధీకి కూడా చురకలంటించారు. ‘కాంగ్రెస్ నేత ఎన్ డి తివారీ సైతం 90 ఏళ్ల ముదిమి వయసులోనూ తండ్రి కావచ్చని అందరికి తెలిసేలా చేశారు.. పాత ప్రేమవ్యవహారం అంగీకరించి రోహిత్ శర్మకు తానే తండ్రినని అంగీకరించారు.. మరోవైపు దివంగత ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడైన ఆర్ కె ధవన్ కూడా 75 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కారు. శశిథరూర్, ఇటీవల మృతిచెందిన సునందా పుష్కర్ ప్రేమ జంటనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మహారాజు దిగ్విజయ్ సింగ్ ప్రేమ విషయం ప్రజలముందుకు వచ్చింది. ఇలా ప్రేమవ్యవహారం బయటపడిన వారందరిని మరాఠీలో ‘జరఠ్రావ్’ (దేవదాసులు)గా పేర్కొంటాం.. ఈ దేవదాసులందరూ తమ ప్రేమవిషయాలను బయటపెడుతూ ఒకరి తర్వాత ఒకరు పెళ్లిపీటలపెకైక్కుతున్నారు.. అయితే దేశంలోని మోస్ట్ ఎలిజిబల్ బ్యాచ్‌లర్ శ్రీమాన్ రాహుల్‌గాంధీ మాత్రం ఇంకా ప్రేమకోసం వెతుకులాటలోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో దిగ్విజయ్‌సింగ్‌తోపాటు ఇతరులు రాహుల్‌కు ప్రేమవిషయంలో తగిన సల హాలు, సూచనలు చేసి యువరాజు కల్యాణం చేయడంలో తప్పేమీలేదు..’ అని ఎద్దేవా చేశారు. -
అనవసరంగా నా పేరు లాగకండి: రాఖీ సావంత్
రాజకీయ నాయకులు ప్రత్యర్థులను విమర్శించడానికి అనవసరంగా తన పేరు లేనిపోని వివాదాల్లోకి లాగడం తగదని బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ మండిపడింది. అరవింద్ కేజ్రీవాల్ కంటే రాఖీ సావంతే నయమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై రాఖీ ఇలా చెప్పింది. ''కేజ్రీవాల్ కంటే నేను మంచి రాజకీయ నాయకురాలిని అవుతానని ఉద్ధవ్ ఠాక్రే భావిస్తే అందుకు ఆయనకు కృతజ్ఞతలు. కానీ, నా పేరును అనవసరంగా రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటే నాకు నచ్చదు. నేను కేవలం కష్టపడి పనిచేసే నటిని మాత్రమే'' అని ఆమె చెప్పింది. అంతకుముందు.. ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కంటే, బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ చాలా నయమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో.. నేరుగా కేజ్రీవాల్‌పై తన విమర్శలు ఎక్కుపెట్టారు. కేజ్రీవాల్ కంటే రాఖీ సావంత్‌ను ఆ కుర్చీలో కూర్చోబెడితే బాగా చేసేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో రాఖీని ఐటెం గర్ల్ అని విమర్శించినవాళ్లు ఇప్పుడామెను సన్మానించాలని తెలిపారు.