ముంబయి: మహారాష్ట్రలోని విదర్భలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్రపై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. ఇప్పుడు రైతుల కన్నీళ్లు తుడిచేందుకని పాదయాత్రలు చేయడం కాదని, అంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టపోయి.. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాల కన్నీళ్లు తుడవాలని హితోపదేశం చేసింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ విదర్భ రైతులకు నిధులు కేటాయిస్తే వాటిని ఎందుకు అందజేయలేకపోయారని నిలదీసింది.
రాహుల్ పాదయాత్రపై తన అధికారిక పత్రిక సామ్నాలో ప్రత్యేక వ్యాసం వెలువరించిన శివసేన.. మహారాష్ట్ర సర్కారును కూడా విమర్శించింది. రైతుల సమస్యలు తీర్చకుండా, వారు ఆత్మ హత్యలతో ప్రాణాలు బలితీసుకుంటుంటే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చోద్యం చూస్తున్నారని ఆరోపించింది. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫడ్నవీస్ ఇచ్చిన సందేశం చూసి సిగ్గుపడాలని పేర్కొంది.
'ముందు నువ్వు చేయాల్సిన పనిచేయి'
Published Tue, May 5 2015 1:47 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement
Advertisement