'కన్హయ్యకు బీజేపీ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చింది'
ముంబయి: బీజేపీపై శివసేన మరోసారి దాడికి దిగింది. దేశ ద్రోహం ఆరోపణల కిందట అరెస్టై గత వారమే బెయిల్ పై బయటకు వచ్చిన జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్కు బీజేపీ ఉచితంగా ప్రచారం కల్పిస్తుందని శివసేన ఆరోపించింది. ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో సోమవారం ప్రచురించిన సంపాదకీయంలో బీజేపీని దుయ్యబట్టింది.
'ఏ ఒక్కటి కూడా ఉచితంగా రాదు. కానీ, కన్హయ్యకు ఉచితంగా ప్రచారం ఎలా వచ్చింది? ఎవరూ దానికి బాధ్యత? అని ఎడిటోరియల్లో ప్రశ్నించింది. దీంతోపాటు గుజరాత్లో పటేళ్ల రిజర్వేషన్ కోసం పోరాటం నడిపిన హార్ధిక్ పటేల్తో కన్హయ్య కుమార్ను పోలుస్తూ కన్హయ్య విడుదల కేంద్ర ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అన్నారు. అంతేకాకుండా తాజాగా ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో ప్రావిడెంట్ ఫండ్ పై ట్యాక్స్ విధించడాన్ని కూడా శివసేన ఖండించింది.