సాక్షి, ముంబై: భారత్, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సామ్నా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. చైనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు వర్తించే జాతీయవాద పాలసీని రూపొందించాలని తెలిపారు. అయితే మహారాష్ట్రలో చైనా పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపివేసామని, కానీ కేంద్ర ప్రభుత్వం మళ్లీ మనసు మార్చుకొని యూటర్న్ తీసుకుంటుందేమోనని ఆందోళనగా ఉందన్నారు. దేశంలో చైనా పెట్టుబడుల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన పాలసీని రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. దేశ భక్తి అందరికి ఒకేవిధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
కానీ భవిష్యత్తులో చైనా ప్రెసిడెంట్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ హిందీ చైనీ బాయి, బాయి అంటే మాత్రం మేము చాలా నష్టపోతామని అన్నారు. ఇటీవల ప్రధాని అధ్యక్షతన నిర్వహించిన వీడియో సమావేశంలో తాను జాతీయ పాలసీపై మాట్లాడినట్లు ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు. చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేదించిన తర్వాత దేశీయ ఇంటర్నెట్ కంపెనీలకు భారీగా డిమాండ్ పెరిగింది. (చదవండి: మహారాష్ట్ర పరిస్థితికి ఆయనే కారణం: కాంగ్రెస్ నేత)
Comments
Please login to add a commentAdd a comment