భగవత్ నిజమే చెప్పారు: శివసేన | Sena defends RSS chief's Teresa remarks | Sakshi
Sakshi News home page

భగవత్ నిజమే చెప్పారు: శివసేన

Published Wed, Feb 25 2015 9:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

Sena defends RSS chief's Teresa remarks

మదర్ థెరీసాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్కు శివసేన పార్టీ బాసటగా నిలిచింది. ఆయన కొంత నిజమే చెప్పారని ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది. విదేశాలనుంచి మిషనరీలుగా వస్తున్న క్రైస్తవ సంస్థలు దేశంలో చాలామందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాయని శివసేన ఆ పత్రికలో వ్యాఖ్యానించింది.

 

ముస్లింలు కత్తితో బెదిరించి మత మార్పిడి చేస్తే.. క్రైస్తవులు డబ్బు, సేవల పేరిట మతమార్పిడిలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ ఆరోపించింది. అయితే, మనమంతా మదర్ థెరిసా సేవలను గుర్తించామని, ఆమెలాగే చాలామంది కూడా సేవలందించారని, కానీ ఎలాంటి మత మార్పిడిలకు దిగలేదని పేర్కొంది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement