rss chief mohan bhagavath
-
కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు కోరిన అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆదివారం ముంబయిలోని ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియాలో ఏర్పాటు చేసిన విందుకు మోహన్ భగవత్ హాజరయ్యారు. కార్యక్రమానికి పాల్గొన్న ఆయన్ను ముఖేశ్ అంబానీ, అనంత్ అంబానీ కలిసి లోపలికి ఆహ్వానించారు. ఈ క్రమంలో కారులో నుంచి దిగిన మోహన్ భగవత్ కాళ్లకు నమస్కరించి అనంత్ ఆశీర్వాదాలు కోరారు. తన పెళ్లికి తప్పకుండా హాజరుకావాలని తెలిపారు.అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహాం జూలై 12న జరుగుతున్న నేపథ్యంలో ముఖేష్-నీతా అంబానీ దంపతులు కొందరు ప్రముఖులకు ఆదివారం ముంబయిలోని తమ నివాసం యాంటిలియాలో విందు ఏర్పాటు చేశారు. ఈ ఆతిధ్యానికి హాజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాదాలకు అనంత్ సమస్కరిస్తున్నపుడు తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది.జులై 12న అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుక ‘శుభ్ వివాహ్’తో ప్రారంభం కానుంది. జులై 13న 'శుభ్ ఆశీర్వాద్', జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమాలతో వేడుకలు ముగియనున్నాయి. ఇటీవల ఈ జంట ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్‌నగర్‌లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను అంగరంగవైభవంగా జరుపుకున్నారు. -
Ayodhya Ram mandir: ‘భరతవర్ష’ పునర్నిర్మాణానికి నాంది
న్యూఢిల్లీ: అయోధ్యలోని జన్మస్థలానికి శ్రీరాముడి ప్రవేశం, ఆలయ ప్రాణప్రతిష్ట ఉత్సవం ‘భరతవర్ష’పునర్నిర్మాణానికి నాంది అని రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ‘భరతవర్ష’లో సమాజంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం, శాంతి, అభివృద్ధి, ఐక్యత, సామరస్య సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ వెబ్సైట్లో ఆదివారం ఆయన రాసిన వ్యాసం పోస్ట్ అయ్యింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం హిందూ సమాజం పోరాటం, సంక్షోభాలు ఇక ముగిసి పోవాలని ఆయన ఆకాంక్షించారు. అయోధ్య పునర్నిర్మాణం ఇక మనందరి బాధ్యతని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధికులు పూజించే దైవం శ్రీరాముడేనని ఆయన తెలిపారు. మందిర నిర్మాణం ‘జాతి గౌరవానికి పునరుజ్జీవనం’గా ఆయన అభివర్ణించారు. ‘‘రామజన్మభూమిలో రామ్ లల్లా ప్రవేశం, ప్రాణ ప్రతిష్ట భరతవర్ష పునర్నిర్మాణానికి నాంది. ఇది అందరి శ్రేయస్సు కోసం, భేదభావం లేకుండా అందరినీ అంగీకరించడం, సామరస్యం, ఐక్యత, పురోగతి, శాంతి మార్గాన్ని చూపుతుంది. యావత్ ప్రపంచ పునర్నిర్మాణానికి బాటలు వేస్తుంది’’ అని భాగవత్ అన్నారు. -
ఇస్లాంకు వచ్చిన ముప్పేమీ లేదు: ఆరెస్సెస్ ఛీఫ్
భారత్‌లో ఇస్లాం మతం ప్రమాదంలో పడిందన్న కొందరి అసత్య ప్రచారాలను నమ్మొద్దని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అసలు అలాంటి ప్రచారాల వలలో చిక్కుకోవద్దని ముస్లింలను కోరాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్. ఘజియాబాద్: ఆ గడ్డపై హిందూ-ముస్లిం తేడాలేవీ లేవని.. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ పునరుద్ఘాటించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఆరెస్సెస్ ముస్లిం విభాగం) ఏర్పాటు చేసిన ‘హిందుస్తానీ ఫస్ట్.. హిందుస్తాన్ ఫస్ట్’ అనే కార్యక్రమంలో భగవత్ ప్రసంగించారు. ప్రజలు చేసే ఆరాధనలను బట్టి వారిని వర్గాలుగా విభజించలేమని అన్నారు. మూక దాడులకు పాల్పడే వాళ్లు హిందుత్వానికి వ్యతిరేకులేనని తేల్చిచెప్పిన ఆయన.. మూకదాడులపై కొన్ని సందర్భాల్లో తప్పుడు కేసులు నమోదవుతున్నాయని ఆక్షేపించారు. ఏ ఒక్క మతమో కాదు దేశంలో ప్రజల మధ్య ఐక్యత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘‘హిందు, ముస్లిం వర్గాలు వేర్వేరు కాదు. మతాలతో సంబంధం లేకుండా భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే. జాతీయవాదం, మన పూర్వీకులు సాధించిన కీర్తి ప్రజల మధ్య ఐక్యతకు ఆధారం కావాలి. హిందు–ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలకు పరిష్కార మార్గం చర్చలే. ఈ రెండు వర్గాల ఐక్యతపై తప్పుడు ప్రచారం సాగుతోంది. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, దేశంలో ఏ ఒక్క మతమో ఆధిపత్యం చెలాయించలేదు. కేవలం భారతీయులు మాత్రమే ఆధిపత్యం చెలాయించగలర’’ని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. కాగా, తాను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమో, వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికో ఈ కార్యక్రమానికి రాలేదని, దేశాన్ని బలోపేతం చేయడానికి.. సమాజంలో అందరి బాగు కోసం ఆరెస్సెస్ పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. అది అభివృద్ధికి ముప్పే! వివిధ రంగాలకు చెందిన 150 మంది ముస్లిం ప్రముఖులతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. జనాభా విపరీతంగా పెరగడం రాష్ట్ర అభివృద్ధికి ముప్పేనని ముస్లిం ప్రముఖులు అంగీకరించారని సమావేశం అనంతరం సీఎం కామెంట్ చేశారు. ఈ మేరకు అభివృద్ధి కోసం సూచనలు చేయడానికి వారితో 8 ఉపవర్గాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. -
ఆర్ఎస్ఎస్ను ఆపార్థం చేసుకుంటున్నారు
-
తీర్పుపై భగవత్, రాందేవ్‌ల రియాక్షన్..
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్వాగతించారు. ఈ తీర్పు ఏ ఒక్కరి విజయమో..ఓటమో కాదని వ్యాఖ్యానించారు. సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు పట్ల అందరూ శాంతి, సంయమనంతో వ్యవహరించాలని కోరారు. అయోధ్య కేసులో తీర్పు జాప్యమైనా తాజా తీర్పును స్వాగతిస్తామని అన్నారు. మసీదు, మందిరం పక్కనే ఉన్నా ఎలాంటి సమస్య ఉండబోదని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును అనుసరిస్తామని స్పష్టం చేశారు. అయోధ్య వివాదంపై గతంలో మధ్యవర్తిత్వ ప్రక్రియ విఫలమైందని అన్నారు. భారతీయులను హిందూ, ముస్లింలుగా తాము చూడబోమని చెప్పారు. శాంతి, సుహృద్భావం వెల్లివిరియాలి : రాందేవ్ అయోధ్య కేసులో సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని యోగా గురు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. మతాలు వేరైనా మనమంతా రాముడి వారసులమేనని అన్నారు. సుప్రీం తీర్పుతో అయోధ్య వివాదాలన్నీపరిష్కారమైనట్టేనని చెప్పారు. అయోధ్య వివాదంసై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందని అంటూ సాధుసంతులు, మీడియా సమాజంలో శాంతి సామరస్యం నెలకొనేలా వ్యవహరించాలని సూచించారు. మందిర నిర్మాణానికి హిందువులకు ముస్లింలు సహకరించాలని కోరారు. (చదవండి: అయోధ్య తీర్పు.. వారిదే ఘనత) -
ఆర్ఎస్ఎస్ అధినేతతో అమిత్ చర్చలు
అహ్మదాబాద్: రామ మందిర నిర్మాణం విషయమై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తదితరులతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా భేటీ అయ్యారు. రాజస్తాన్ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ఆర్ష విద్యామందిర్‌లో రెండు రోజులపాటు జరిగిన హిందూ ఆచార్య సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్‌తోపాటు సాధువులు పాల్గొన్నారు. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో ఆలయం నిర్మించే విషయంలో వేర్వేరు పరిష్కారాలను ఈ సమావేశంలో చర్చించినట్లు పాల్గొన్న నాయకులు తెలిపారు. ప్రధాని మోదీ పదవీ కాలం ముగిసేలోగా అంటే, మే 2019కు ముందుగానే రామాలయ నిర్మాణం చేపట్టాలనే మెజారిటీ అభిప్రాయం ఈ సభలో వ్యక్తమయిందని సమాచారం. అయోధ్యలో మందిరం నిర్మించటం ఖాయమని ఈ సందర్భంగా అమిత్‌షా వారికి హామీ ఇచ్చారు. జనవరిలో సుప్రీంకోర్టులో అయోధ్య అంశం విచారణకు రానున్న విషయాన్ని కూడా వారితో అమిత్‌షా చర్చించారు. వచ్చే రెండు లేక మూడు నెలల్లో బీజేపీ ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు జోథ్‌పూర్‌కు చెందిన ఆచార్య సత్‌గిరి మహారాజ్ తెలిపారు. ఆలయ నిర్మాణ స్థలాన్ని పొందే విషయంలో అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి విలేకరులకు తెలిపారు. అయితే, సుప్రీంకోర్టులో విచారణ ఎప్పుడు ప్రారంభమయ్యేదీ తెలియదన్నారు. రామాలయం విషయంలో హిందూ సంస్థలతో సంప్రదింపులు, చర్చలు జరుపుతున్న ఎన్డీఏలోని కీలక భాగస్వామ్య పార్టీ బీజేపీ ఆలయం కోసం చట్టంపై ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు. -
భిన్నత్వంతో విభేదాలు రాకూడదు
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న భిన్నత్వం గురించి గర్వించాలి, భిన్నత్వాన్ని గౌరవించాలి తప్ప సమాజంలో విభేదాలకు అది కారణం కాకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆరెస్సెస్ మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘భవ్యిషత్ భారతం–ఆరెస్సెస్ దృక్పథం’ సదస్సును భాగవత్ సోమవారం ప్రారంభించారు. ఆరెస్సెస్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హాజరవ్వాల్సిందిగా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులకూ ఆహ్వానం పంపామని ఆరెస్సెస్ చెబుతుండగా.. తమనెవరూ పిలవలేదనీ, పిలిచినా వెళ్లే వాళ్లం కాదని కాంగ్రెస్ సహా కొందరు విపక్ష నేతలు పేర్కొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, అధికార బీజేపీ నాయకులతోపాటు అనేక మంది బాలీవుడ్ నటీనటులు, విద్యావేత్తలు సదస్సుకు వచ్చారు. భాగవత్ మాట్లాడుతూ ‘దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కాంగ్రెస్ గొప్ప పాత్ర పోషించింది. భారత్‌కు ఎంతోమంది గొప్ప నాయకులను ఇచ్చింది’ అని కొనియాడారు. ఆరెస్సెస్ పరిణామ క్రమాన్ని వివరించిన ఆయన.. ఆరెస్సెస్ సేవలను ఇతర ఏ సంస్థతోనూ పోల్చలేమన్నారు. ఆరెస్సెస్ నియంతృత్వ సంస్థ కాదనీ, అత్యంత ప్రజాస్వామిక సంస్థ అని చెప్పుకొచ్చిన భాగవత్.. ఆరెస్సెస్ తన సిద్ధాంతాలను ఎప్పుడూ ఇతరులపై రుద్దదనీ, అలాగే అనుబంధ సంస్థలపై తమ నియంత్రణేమీ లేదని స్పష్టం చేశారు. బీజేపీని ఆరెస్సెస్ నియంత్రిస్తోందన్న విమర్శల నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘భారత్ భిన్నత్వంతో కూడిన దేశం. దాన్ని అందరూ గౌరవించాలి, గర్వించాలి. సమాజంలో విభేదాలకు భిన్నత్వం కారణం కాకూడదు’ అని భాగవత్ విజ్ఞప్తి చేశారు. అధికారంతో సంబంధం లేదు ‘అధికారంలో ఎవరుంటారు?, దేశం ఏ విధానాలను ఆమోదిస్తుంది అనేది సమాజం, ప్రజలు నిర్ణయించాల్సింది. వీటితో మాకు సంబంధం లేదు. సమాజం బాగుండటమే మాకు ముఖ్యం’ అని భాగవత్ స్పష్టం చేశారు. -
అని, అనలేదని అనడం ఆయనకే చెల్లు!
-
అని, అనలేదని అనడం ఆయనకే చెల్లు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అన్ని విధాల అండగా ఉంటున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మరోసారి నోరు జారడంపై వివాదం రగులుతోంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అనాలోచితంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత సర్దుకోలేక సతమతమవడం మోహన్ భాగవత్‌కు మొదటి నుంచి అలవాటే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోహన్ భాగవత్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. బీసీలు ఎక్కువగా ఉన్న బీహార్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల బీసీలు దూరమయ్యారని, పర్వవసానంగా ఎన్నికల్లో గెలవాల్సింది, ఓడిపోయామని బీజేపీ వర్గాలు ఇప్పటికీ వాదిస్తాయి. మొన్న ఆదివారం నాడు కూడా ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. యుద్ధానికి సన్నద్ధం కావాలంటే భారత సైన్యానికి ఆరు నెలల కాలం పడుతుందని, అదే ఆరెస్సెస్‌కు మూడు రోజులు చాలని అన్నారు. కశ్మీర్ సరిహద్దుల్లో పాక్‌సైనికులు, టెర్రరిస్టులను తరచూ ఎదుర్కొంటూ భారత సైనికులు అసువులు భాస్తున్న సమయంలో మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు వారిని అవమానించేలా ఉన్నాయి. జరిగిన నష్టాన్ని గ్రహించి తర్వాత ఆరెస్సెస్ ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. మీడియానే ఆయన వ్యాఖ్యలను వక్రీకరించినట్లుగా పేర్కొంది. ‘భారత సైన్యాన్ని ఆయన అవమానపర్చలేదు. ఇతర భారతీయులకన్నా ఆరెస్సెస్ మంచి క్రమశిక్షణగల వారని చెప్పడమే ఆయన ఉద్దేశమని వివరణ ఇచ్చింది. ‘భారత రాజ్యాంగం అనుమతిస్తే పౌర సమాజాన్ని యుద్ధానికి సన్నద్ధం చేయడానికి సైన్యానికి ఆరు నెలలు పడుతుందని, అదే ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు కనుక మూడు రోజుల్లోనే యుద్ధం చేయడానికి సిద్ధం అవుతారు’ అని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారని ఆరెస్సెస్ నాయకుడు మన్మోహన్ వైద్య వివరణ ఇచ్చారు. భారత సైన్యంతో ఆరెస్సెస్‌ను ఆయన పోల్చలేదని, సాధారణ పౌర సమాజంతో, ఆరెస్సెస్ కార్యకర్తలను పోల్చారని, ఇరువురికి శిక్షణ ఇవ్వాల్సింది సైన్యమేనని వైద్య చెప్పుకొచ్చారు. ఆయనే కాకుండా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజీజు, కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కూడా వెనకా ముందు ఆలోచించకుండా మోహన్ భాగవత్ ‘అలా’ అనలేదంటూ వివరణలు ఇచ్చారు. మరి ‘ఎలా’ అన్నారో ఆయన ప్రసంగం వీడియో టేపును చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది కదా! -
ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల్లో తప్పేముంది..?
సాక్షి, పాట్నా: సరిహద్దులను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ సంస్థ చెబుతున్న మాటలపై వివాదం రేపడం సరికాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను బీహార్ సీఎం నితీష్ కుమార్ సమర్ధించారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు వివాదాస్పదమైనవా అంటూ ఎదురు ప్రశ్నించారు. అయితే మొత్తం వ్యవహారంపై తనకు అవగాహన లేదని అన్నారు. బీహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. సైనికులను తయారుచేసేందుకు సైన్యం ఆరేడు నెలలు తర్ఫీదు ఇస్తుంటే రాజ్యాంగం అనుమతిస్తే తాము మూడు రోజుల్లోనే సైనికులను సుశిక్షితులుగా తీర్చిదిద్దుతామని ఆయన వ్యాఖ్యానించారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ క్షమాపణకు రాహుల్ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశం కోసం ప్రాణాలొడ్డిన సైనికులను అగౌరవపరిచేలా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సైన్యం కంటే వేగంగా సుశిక్షితులైన సైనికులను ఆర్ఎస్ఎస్ సిద్ధం చేస్తుందని భగవత్ చేసిన వ్యాఖ్యల పట్ల రాహుల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ దీనిపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు ప్రతి భారతీయుడిని అవమానించేలా ఉన్నాయని, జాతి కోసం మరణించిన వారిని అగౌరవపరిచేలా ఆయన మాట్లాడారని రాహుల్ తప్పుపట్టారు. సైనికులంతా జాతీయ పతాకానికి శాల్యూట్ చేస్తారని..దీంతో భగవత్ చేసిన వ్యాఖ్యలు జాతీయ పతాకాన్ని కూడా అవమానించినట్టేనని రాహుల్ ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల భేటీలో భగవత్ మాట్లాడుతూ భారత సైన్యం ఆరేడు నెలల్లో తయారుచేసే సైనికులను సంఘ్ పరివార్ కేవలం మూడు రోజుల్లోనే సిద్ధం చేస్తుందని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశానికి అలాంటి పరిస్థితి ఎదురైతే సైనికులను దీటుగా సన్నద్ధం చేయగల సత్తా సంఘ్‌కు ఉందని, రాజ్యాంగం అనుమతిస్తే అందుకు తాము సిద్ధమని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. -
హిందుస్తాన్ హిందువులదే: భాగవత్
ఇండోర్: భారత్ కేవలం హిందువుల దేశమేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘జర్మనీ ఎవరి దేశం? జర్మన్లది. బ్రిటన్ బ్రిటిషర్లది. అమెరికా అమెరికన్లది. అలాగే హిందుస్తాన్(భారత్) హిందువులది’ అని అన్నారు. ఇతర మతస్తులు భారత్‌లో జీవించవచ్చని సెలవిచ్చారు. భారత సంస్కృతిని అనుసరిస్తూ జీవించేవారందరూ భారతీయులేనన్నారు. ఏ రాజకీయ నేత, పార్టీ కూడా దేశాన్ని గొప్పగా మార్చలేరని, ఇందుకు తొలుత సమాజంలో చైతన్యం రావడం అవసరమన్నారు. ప్రజలు తమ మనసుల్లోంచి అన్ని రకాల వివక్షల్ని తొలగించుకుంటేనే భారత్ శక్తిమంతమైన విశ్వ గురువుగా అవతరిస్తుందన్నారు. -
ఆర్ఎస్సెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : గోసంరక్షణ పేరిట జరుగుతున్న దురాగతాలను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పరోక్షంగా సమర్థించారు. గోసంరక్షకులు చట్టాలను ఉల్లంఘించడంలేదని, వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయదశమి సందర్బంగా పుణేలో ఆర్ఎస్సెస్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. గోసంరక్షణ రాజ్యాంగంలో భాగమేనన్నారు. ఆవు ఒక మతానికి సంబంధించినది కాదని, ఎంతో మంది ముస్లింలు ఆవులను పెంచి పోషించారని, వాటి రక్షణ కోసం ప్రాణాలు కూడా అర్పించారని పేర్కొన్నారు. కావాలనే కొంతమంది గోసంరక్షణ పేరిట హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారన్నారు. కానీ, గోవులను దొంగ రవాణా చేసే వారి చేతుల్లో కూడా గోసంరక్షకులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారనే విషయం గుర్తించాలని సూచించారు. గోసంరక్షణ సమస్యను మతంతో ముడిపెట్టకుండా చూస్తున్నామని తెలిపారు. ఆవు పాలు, మూత్రాలను ఉపయోగించే మనదేశంలో, చిన్నా చితక రైతులకు ఆవులు ఎంతో అవసరమని, గో ఆధారిత వ్యవసాయాన్ని రక్షించాలని రాజ్యాంగంలో ఉందని ఈ సందర్భంగా మోహన్ భగవత్ గుర్తుచేశారు. గోసంరక్షకులపై కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వాలు సంఘ విద్రోహ శక్తులకు చేయూతనిస్తున్నాయని ఆరోపించారు. రోహింగ్యాలు దేశానికి ముప్పు.. రోహింగ్యాలు దేశ భద్రతకు ముప్పు అని, వారికి ఆశ్రయం కల్పించవద్దని ప్రధాని నరేంద్రమోదీకి భగవత్ సూచించారు. ఇప్పటికే అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీలతో సమస్య ఎదుర్కొంటున్నామన్నారు. రోహింగ్యాలతో ఉద్యోగాలకు ముప్పు వాటిల్లడమే కాక దేశంలో హింసాత్మక ఘటనలు చెలరేగుతాయని, మయన్మార్‌లో వారు సృష్టించిన ఘటనలే సాక్ష్యమని భగవత్ పేర్కొన్నారు. -
భగవత్ నిజమే చెప్పారు: శివసేన
మదర్ థెరీసాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు శివసేన పార్టీ బాసటగా నిలిచింది. ఆయన కొంత నిజమే చెప్పారని ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది. విదేశాలనుంచి మిషనరీలుగా వస్తున్న క్రైస్తవ సంస్థలు దేశంలో చాలామందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాయని శివసేన ఆ పత్రికలో వ్యాఖ్యానించింది. ముస్లింలు కత్తితో బెదిరించి మత మార్పిడి చేస్తే.. క్రైస్తవులు డబ్బు, సేవల పేరిట మతమార్పిడిలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ ఆరోపించింది. అయితే, మనమంతా మదర్ థెరిసా సేవలను గుర్తించామని, ఆమెలాగే చాలామంది కూడా సేవలందించారని, కానీ ఎలాంటి మత మార్పిడిలకు దిగలేదని పేర్కొంది.