
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, పాట్నా: సరిహద్దులను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ సంస్థ చెబుతున్న మాటలపై వివాదం రేపడం సరికాదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను బీహార్ సీఎం నితీష్ కుమార్ సమర్ధించారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వ్యాఖ్యలు వివాదాస్పదమైనవా అంటూ ఎదురు ప్రశ్నించారు. అయితే మొత్తం వ్యవహారంపై తనకు అవగాహన లేదని అన్నారు.
బీహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. సైనికులను తయారుచేసేందుకు సైన్యం ఆరేడు నెలలు తర్ఫీదు ఇస్తుంటే రాజ్యాంగం అనుమతిస్తే తాము మూడు రోజుల్లోనే సైనికులను సుశిక్షితులుగా తీర్చిదిద్దుతామని ఆయన వ్యాఖ్యానించారు.