కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు కోరిన అనంత్‌ అంబానీ | Anant Ambani welcomed Bhagwat warmly as they prepared for the wedding celebration | Sakshi
Sakshi News home page

కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు కోరిన అనంత్‌ అంబానీ

Published Mon, Jul 1 2024 12:02 PM | Last Updated on Mon, Jul 1 2024 1:41 PM

Anant Ambani welcomed Bhagwat warmly as they prepared for the wedding celebration

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆదివారం ముంబయిలోని ముఖేష్‌ అంబానీ నివాసం యాంటిలియాలో ఏర్పాటు చేసిన విందుకు మోహన్‌ భగవత్‌ హాజరయ్యారు. కార్యక్రమానికి పాల్గొన్న ఆయన్ను ముఖేశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీ కలిసి లోపలికి ఆహ్వానించారు. ఈ క్రమంలో కారులో నుంచి దిగిన మోహన్‌ భగవత్‌ కాళ్లకు నమస్కరించి అనంత్‌ ఆశీర్వాదాలు కోరారు. తన పెళ్లికి తప్పకుండా హాజరుకావాలని తెలిపారు.

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహాం జూలై 12న జరుగుతున్న నేపథ్యంలో ముఖేష్-నీతా అంబానీ దంపతులు కొందరు ప్రముఖులకు ఆదివారం ముంబయిలోని తమ నివాసం యాంటిలియాలో విందు ఏర్పాటు చేశారు. ఈ ఆతిధ్యానికి హాజరైన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పాదాలకు అనంత్‌ సమస్కరిస్తున్నపుడు తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

జులై 12న అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహ వేడుక ‘శుభ్‌ వివాహ్‌’తో ప్రారంభం కానుంది. జులై 13న 'శుభ్ ఆశీర్వాద్', జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమాలతో వేడుకలు ముగియనున్నాయి. ఇటీవల ఈ జంట ఇటలీ నుంచి ఫ్రాన్స్‌ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్‌నగర్‌లో తమ మొదటి ప్రీవెడ్డింగ్‌ వేడుకలను అంగరంగవైభవంగా జరుపుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement