Wedding celebrations
-
India Wedding Industry: పెళ్లి.. యమా కాస్ట్లీ!
అంబానీల పెళ్లిసందడి దేశంతో పాటు ప్రపంచమంతటి దృష్టినీ తెగ ఆకర్షిస్తోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలు, అందుకు జరుగుతున్న ఖర్చు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఈ సంరంభానికి అంబానీలు దాదాపు రూ.5,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారన్న వార్తలతో అంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అయితే పెళ్లి ఖర్చు విషయంలో భారతీయులెవరూ తక్కువ తినలేదు. మన దేశంలో పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే కాదు. బోలెడంత ఖర్చు కూడా. ప్రపంచంలో మరే ఇతర దేశంతో పోల్చినా భారత్‌లో పెళ్లి బాగా ఖరీదైన వ్యవహారం. పిల్లల మొత్తం చదువు ఖర్చుతో పోలిస్తే పెళ్లికి హీనపక్షం నాలుగు రెట్లు ఎక్కువ వెచ్చించాల్సిన పరిస్థితి. సగటు కుటుంబంలో పెళ్లి ఖర్చు వార్షికాదాయం కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువగా ఉంటోంది. అందులో ఎక్కువ మొత్తం నగానట్రాకే అవుతుండటం మరో విశేషం. పెళ్లి దెబ్బకు చాలా కుటుంబాలు ఆర్థికంగా తలకిందులవుతున్న ఉదంతాలెన్నో. అయినా సరే, పెళ్లి ఖర్చు విషయంలో మాత్రం మనోళ్లు తగ్గేదే లేదంటున్నారు...! భారత రిటైల్ మార్కెట్ పరిమాణం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.94.3 లక్ష కోట్లకు చేరింది. అంటే 1.1 ట్రిలియన్ డాలర్లన్నమాట! ఇందులో రూ.56.9 లక్షల కోట్లతో ఫుడ్ అండ్ గ్రోసరీస్ విభాగం తొలి స్థానంలో ఉంటే రెండో స్థానం పెళ్లిళ్లదే కావడం విశేషం. భారత వెడ్డింగ్ మార్కెట్ విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 10.9 లక్షల కోట్ల రూపాయలు! ఇందులో దాదాపు మూడో వంతు వాటా, అంటే రూ.3.1 లక్షల కోట్లు ఆభరణాల ఖర్చుదే కావడం విశేషం! తర్వాత విందు భోజనాలపై రూ.2.1 లక్షల కోట్లు వెచి్చస్తున్నారు. సంగీత్, హల్దీ వంటి పెళ్లి వేడుకలకు రూ.1.6 లక్షల కోట్లు ఖర్చవుతోంది. ఇక పెళ్లి ఫొటోగ్రఫీ వాటా 0.9 లక్షల కోట్లు. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు దుస్తులకు, పెళ్లి డెకరేషన్‌కు చెరో రూ.0.8 లక్షల కోట్ల చొప్పున ఖర్చవుతోంది. మద్యం, కానుకలు, ఇతర పెళ్లి ఖర్చులు కలిపి రూ.1.9 లక్షల కోట్ల దాకా అవుతున్నాయి.చదువును మించి... భారత్‌లో చదువుకు, పెళ్లికి అయ్యే ఖర్చుల మధ్య ఆశ్చర్యకరమైన తేడా కనిపిస్తోంది. సాదాసీదా కుటుంబం ఒక్క సంతానం చదువుకు కేజీ నుంచి పీజీ దాకా పెట్టే మొత్తం ఖర్చు సగటున రూ.3.3 లక్షలు. కాగా అదే కుటుంబం ఒక్క పెళ్లిపై వెచ్చిస్తున్నదేమో ఏకంగా రూ.12.5 లక్షలు! ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారనుకున్నా వారి చదువు ఖర్చుకు రెట్టింపు మొత్తం ఒక్క పెళ్లిపై పెట్టాల్సి వస్తోంది. భారతీయుల తలసరి జీడీపీ (రూ.2.4 లక్షల)తో పోలిస్తే పెళ్లి ఖర్చు ఏకంగా ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి ఏ సంపన్న దేశంలో చూసినా పెళ్లి ఖర్చు పౌరుల తలసరి జీడీపీతో పోలిస్తే సగం కంటే తక్కువ (0.4 రెట్లు)గానే ఉంది. మరో విషయం. మన దగ్గర ఒక కుటుంబం పెళ్లి కోసం తమ సగటు వార్షికాదాయానికి కనీసం మూడు రెట్లు వెచి్చస్తోంది!మన దేశంలో పెళ్లి ఖర్చు కుటుంబం ఖర్చు పేద రూ.3 లక్షలు దిగువ మధ్య తరగతి రూ.6 లక్షలు మధ్య తరగతి రూ.10–25 లక్షలు ఓ మాదిరి సంపన్నులు రూ.50 లక్షలు సంపన్నులు రూ.కోటి, ఆ పైన – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల పెళ్లి వేడుకను పురస్కరించుకుని ముంబయిలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముందస్తు ప్రకటన విడుదల చేశారు. జులై 12 నుంచి 15 వరకు అనంత్-రాధికల వివాహ వేడుక జరిగే బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో కన్వెన్షన్ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజన్ ‘అంబానీ పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని కామెంట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారుతుంది.ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా..! ఇప్పటికే అంగరంగ వైభవంగా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ను జరుపుకున్నారు. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు వందల సంఖ్యలో హాజరయ్యారు. మరి పెళ్లికి ఇంకెందరు వస్తారోననే చర్చ జరుగుతోంది. అయితే అలా వస్తున్న వారికి ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా ముంబయి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.ముంబయి ట్రాఫిక్ పోలీసులు ‘ఎక్స్’ ప్లాట్ఫామ్లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2024 జులై 12-15 వరకు ముంబయిలోని బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు, వీఐపీలు వస్తున్నారు. దాంతో భద్రతా కారణాల వల్ల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వైపునకు వెళ్లే వాహనాలను వేరే మార్గానికి మళ్లిస్తున్నామని తెలిపారు.పోలీసుల ప్రకటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘అనంత్ అంబానీ పెళ్లి ఈవెంట్ పబ్లిక్ ఈవెంట్ ఎలా అవుతుంది?’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘హత్రాస్ భోలేబాబా వ్యవహారం కంటే అంబానీ పెళ్లికి ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది.. కారణం ఏంటో..’ అని ఒకరు, ‘అంబానీ పెళ్లి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.Due to a public event at the Jio World Convention Centre in Bandra Kurla Complex on July 5th & from July 12th to 15th, 2024, the following traffic arrangements will be in place for the smooth flow of traffic.#MTPTrafficUpdates pic.twitter.com/KeERCC3ikw— Mumbai Traffic Police (@MTPHereToHelp) July 5, 2024ఇదీ చదవండి: సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబంఅనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు శుక్రవారం(జులై 12)న శుభ వివాహ్‌తో ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలతో ముగుస్తాయి. -
సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబం
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుకల్లో భాగంగా ఇటీవల అంబానీ కుటుంబం ఘనంగా సంగీత్ జరుపుకుంది. ఈ సందర్భంగా ఇంటిల్లిపాది సభ్యులు డ్యాన్స్‌తో సందడి చేశారు. ఈ మేరకు విడుదలైన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.అనంత్-రాధికల వివాహం జులై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమంతో వేడుకలు ముగియనున్నాయి. త్వరలో పెళ్లి పీటలెక్కే జంట ఇప్పటికే రెండుసార్లు అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్‌నగర్‌లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు. ఇటీవల అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను కూడా జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది.ఇదీ చదవండి: దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రిలయన్స్ సిద్ధం..? -
కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు కోరిన అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆదివారం ముంబయిలోని ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియాలో ఏర్పాటు చేసిన విందుకు మోహన్ భగవత్ హాజరయ్యారు. కార్యక్రమానికి పాల్గొన్న ఆయన్ను ముఖేశ్ అంబానీ, అనంత్ అంబానీ కలిసి లోపలికి ఆహ్వానించారు. ఈ క్రమంలో కారులో నుంచి దిగిన మోహన్ భగవత్ కాళ్లకు నమస్కరించి అనంత్ ఆశీర్వాదాలు కోరారు. తన పెళ్లికి తప్పకుండా హాజరుకావాలని తెలిపారు.అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహాం జూలై 12న జరుగుతున్న నేపథ్యంలో ముఖేష్-నీతా అంబానీ దంపతులు కొందరు ప్రముఖులకు ఆదివారం ముంబయిలోని తమ నివాసం యాంటిలియాలో విందు ఏర్పాటు చేశారు. ఈ ఆతిధ్యానికి హాజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాదాలకు అనంత్ సమస్కరిస్తున్నపుడు తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది.జులై 12న అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుక ‘శుభ్ వివాహ్’తో ప్రారంభం కానుంది. జులై 13న 'శుభ్ ఆశీర్వాద్', జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమాలతో వేడుకలు ముగియనున్నాయి. ఇటీవల ఈ జంట ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్‌నగర్‌లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను అంగరంగవైభవంగా జరుపుకున్నారు. -
Anchor Ravi Latest Photos: గోవాలో భార్యతో యాంకర్ రవి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
వెడ్డింగ్‌లో విచిత్రం.. కోపంతో ఊగిపోయిన వధువు ఏం చేసిందంటే..
సోషల్ మీడియా అనగానే ఎన్నో విచిత్రమైన వీడియోలు, ఫొటోలు, విశేషాలు ఉంటాయి కదా. తాజాగా సోషల్ మీడియాలో కొత్తగా పెళ్లైన జంటకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. ఇంతకీ పెళ్లి వేడుకలో ఏం జరిగిందంటే.. వీడియో ప్రకారం.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఓ జంటకు వివాహం జరిగింది. పెళ్లి వేడుకలో వేదికపైనే వధువరులిద్దరూ నిలుచున్నారు. ఇంతలో ఏమైంది ఏమో తెలియదు కానీ.. ఉన్నట్టుండి వధువు సీరియస్ అయ్యింది. ఆమెకు వరుడు స్వీట్ తినిపించే ప్రయత్నం చేయగా స్వీట్ ముక్కను వధువు విసిరిపడేసింది. అనంతరం.. వరుడికి వధువు పాయసం తాగించే ప్రయత్నం చేయగా ఆయన దాన్ని కింద పారబోశాడు. దీంతో, మరోసారి ఆవేశానికి లోనైన వధువు.. గ్లాస్‌ను విసిరిపడేసింది. దీంతో, అక్కడున్న వారంతా కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో అన్నది మాత్రం తెలియరాలేదు. -
కోనసీమ: నూతన వధువరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, కత్తిమండ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్తిమండ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు శ్రీతన్మయి, వెంకట్రామ్లను ఆశీర్వదించిన సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. -
చెల్లి హల్దీ ఫంక్షన్లో యంగ్ హీరో అడివి శేష్ సందడి.. ఫోటోలు వైరల్
-
చెల్లి హల్దీ ఫంక్షన్లో యంగ్ హీరో అడివి శేష్ సందడి.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల హిట్-2 సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శేష్ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి -2’లో అడివి శేష్ కనిపించనున్నారు. (ఇది చదవండి: మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్) అయితే తాజాగా చెల్లి హల్దీ వేడుకలో సందడి చేశారు యంగ్ హీరో. తన చెల్లెలు షిర్లీ అడివి హల్దీ వేడుకలో పాల్గొన్న అడివి శేష్ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు. తన బేబీ చెల్లి హల్దీ ఫంక్షన్ ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్‌గా మారాయి. అడివి శేష్ తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ..'అమ్మ, నేను, సోదరి హల్దీ ఫంక్షన్లో సరదాగా కలిసి సందడి చేశాం. ఈ రోజు బావ డేవిన్‌ను మా కుటుంబంలోకి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో అడివి శేష్‌ను చూసిన అభిమానులు అన్నా.. నీ పెళ్లేప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా హీరో చెల్లెలికి శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
జోష్‌తో డ్యాన్స్.. విధి విచిత్రంగా ప్రాణం తీసింది
వైరల్: ఏ నిమిషానినో ఏమి జరుగునో ఎవరూహించెదరు?.. మనిషి జీవం విషయంలో ఇప్పుడు ఇలాగే జరుగుతోంది. నిన్న కళ్లెదురుగా నవ్వుతూ హుషారుగా కనిపించిన మనిషి.. ఇవాళ బతికి లేడు అని వినాల్సి వస్తున్న రోజులువి. కన్నవాళ్లను, భార్యాబిడ్డలను, అయినవాళ్లను ఉన్నట్లుండి శోకంలో ముంచెత్తి వెళ్లిపోతున్నారు. పైగా ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు..అందునా పాతిక నుంచి నలభై ఐదేళ్లలోపు వాళ్ల మరణాలే అత్యధికంగా నమోదు అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. తాజాగా.. మధ్యప్రదేశ్‌లో ఓ పెళ్లింట నెలకొన్న విషాదం తాలుకా ఘటన వీడియో తెగ వైరల్ అవుతోంది. యూపీ కాన్పూర్‌కు చెందిన 32 ఏళ్ల అభయ్ సచాన్ను విధి విచిత్రంగా మరణంతో చుట్టుకెళ్లిపోయింది. అభయ్.. సోమవారం దగ్గరి బంధువుల వివాహం కోసం మధ్యప్రదేశ్ రేవాకు వచ్చాడు. మంగళవారం రాత్రి వివాహ వేడుకలో హుషారుగా డ్యాన్స్‌లు చేశాడు. అలా గంతులేస్తూనే ఉన్నట్లుండి.. నెమ్మదిగా కిందకు వాలిపోయాడతను. అది గమనించిన బంధువుల దగ్గరికి వెళ్లి చూసేసరికి.. అతనిలో ఎలాంటి చలనం లేదు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా.. కార్డియాక్ అరెస్ట్‌తో అప్పటికే కన్నుమూశాడని వైద్యులు ప్రకటించారు. పైగా షాకింగ్ విషయం ఏంటంటే.. అతను మద్యం మత్తులో లేడట. అతను పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని వైద్యులు ప్రకటించడం. దీంతో ఆ యువకుడి మరణాన్ని ఎవరూ తట్టుకోలేకపోయారు. అలా పెళ్లింటి విషాదం నెలకొని.. అతని సంతాప సభను నిర్వహించాల్సి వచ్చింది. సెలబ్రిటీలే కాదు.. ఇలాంటి మరణాలకు ఎవరూ అతీతులు కావడం లేదు. పదుల వయసున్న పిల్లల దగ్గరి నుంచి యుక్త వయసు కుర్రకారు కూడా ఇలాంటి మరణాల బారినపడుతోంది. వైద్య నిపుణులు సైతం ఇలాంటి మరణాలకు ఒక స్పష్టత అంటూ ఇవ్వలేకపోతుండగా.. అధ్యయనాలు మాత్రం రకరకాల నివేదికలను ఇస్తూ పోతోంది. 18 Jan 2023 : 🇮🇳 : On Camera, Abhay Sachan(32) dancing at Wedding collapses and Dies due to 🫀arrest💉... He is a resident of Uttar Pradesh's Kanpur districts, had come to Rewa for the wedding.#heartattack2023 #heartattack #cardiacarrest pic.twitter.com/FQFeZA3ZNa — Anand Panna (@AnandPanna1) January 18, 2023 -
వివాహబంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర జంట.. ఫోటోలు వైరల్
ఇటీవల సినీ ప్రముఖుల పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే పలువురు హీరోయిన్స్ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో సెలబ్రిటీ జంట వచ్చి చేరింది. తెలుగు బుల్లితెర నటుడు అమర్దీప్.. నటి తేజస్వినిని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా కొత్త జంటకు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఇవాళ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా అమర్ దీప్.. జానకి కలనగలేదులో హీరోగా నటిస్తుండగా తేజస్వి కేరాఫ్ అనసూయ సీరియల్ చేస్తోంది. అమర్దీప్ పలు ఓటీటీ సిరీస్‌ల్లోనూ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) -
ఫైవ్ స్టార్ హోటల్లో గ్రాండ్‌గా నాగశౌర్య వివాహం
-
దావత్, బారాత్‌లు బంద్.. ఇక సాదాసీదాగానే పెళ్లిళ్లు!!
జోధ్‌పూర్: భారీగా విందు భోజనాలు, తాహతుకు మించి ఆడంబరాలు, అలంకరణలకు స్వస్తి చెప్పాలని రాజస్తాన్‌లోని పాలికి చెందిన రెండు వర్గాల వారు నిర్ణయించుకున్నారు. డీజేలు ఉపయోగించవద్దని, టపాసులను కాల్చరాదని, పెళ్లి కొడుకు గుర్రంపై ఊరేగుతూ రాకూడదని కట్టుబాటు విధించారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. కుమావట్, జాట్ కులాలకు చెందిన 19 గ్రామాలకు చెందిన నేతలు ఈనెల 16వ తేదీన ఈ మేరకు అంగీకారానికి వచ్చారు. అంతేకాదు.. వధూవరులకు బంధువులు కానుకగా ఇచ్చే నగలు, దుస్తులు, నగలు తదితరాలపైనా పరిమితి పెట్టారు. ఇక పవిత్ర కార్యంగా భావించే పెళ్లిలో వరుడు గడ్డం పెంచుకుని ఉండరాదని రూల్ విధించారు. వివాహ వేడుకల్లో అలంకరణలు, సంగీత కార్యక్రమాలు, ఇతర సంప్రదాయాల పేరిట అనవసరంగా ఖర్చు చేసి, అప్పుల పాలు కారాదన్నదే తమ ఉద్దేశమన్నారు. వీటిని అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందే. అతిక్రమించే వారిపై జరిమానా ఇతర శిక్షలు విధిస్తాంమని హెచ్చరించారు. అదేవిధంగా, పాలిలోని రోహెత్ సబ్‌డివిజన్‌లోని ఐదు గ్రామాలకు చెందిన జాట్ కమ్యూనిటీ కూడా వివాహ కార్యక్రమాలను హుందాగా చేయడానికి నిబంధనలను రూపొందిందించాయి. బారాత్‌లు బంద్ చేశాయ్. -
పెళ్లి ఊరేగింపు: దోస్తును కాల్చి చంపిన పెళ్లికొడుకు
మన పెళ్లిళ్లకు హడావిడి మామూలుగా ఉండదు. అయితే.. ఆర్భాటాలు, దర్పం ప్రకటించుకునే క్రమంలో అతిపోకడలకు పోతుండడంతో.. అనర్థాలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వివాహ వేడుకలో విషాదం నింపింది. తన స్నేహితుడినే కాల్చి చంపేశాడు ఓ పెళ్లి కొడుకు. పెళ్లి ఊరేగింపులో తన చిన్ననాటి స్నేహితుడినే కాల్చి చంపేశాడు పెళ్లి కొడుకు. అయితే అది పొరపాటుగానే జరిగింది. ఉత్తర ప్రదేశ్ సోన్‌భద్ర జిల్లా బ్రహ్మనగర్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఘటనలో టైంలో కొందరు వీడియోలు తీయగా.. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మనీష్ మదేషియా అనే వ్యక్తి వివాహంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. మనీష్ స్నేహితుడు బాబూ లాల్ యాదవ్ ఆర్మీలో జవాన్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి కొడుకు రథంపై ఊరేగింపు టైంలో.. తన దగ్గరి గన్నే మనీష్ చేతిలో పెట్టి గాల్లోకి కాల్పులు జరపమన్నాడు బాబూ లాల్. అయితే.. గాల్లోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన మనీష్.. గన్ను కిందకు దించగానే ట్రిగ్గర్ నొక్కుకుపోయి బుల్లెట్ బాబూ లాల్ శరీరంలోకి దూసుకుపోయింది. బాధితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఘటనకు సంబంధించి మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త పెళ్లి కొడుకు మనీష్ మేదషియాను అరెస్ట్ చేశారు. అలాగే మరో ఐదుగురిపైనా అభియోగాలు నమోదు అయ్యాయి. నేరం రుజువైతే మనీష్‌కు రెండు నుంచి ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. మన దేశంలో వివాహ తదితర వేడుకలు, ప్రార్థన స్థలాలు సహా బహిరంగ ప్రాంతాల్లో లైసెన్స్ తుపాకులతో కాల్పులు జరిపినా.. చట్టరీత్యా నేరం. दूल्हे ने की हर्ष फायरिंग, आर्मी के जवान की हुई मौत। यूपी के @sonbhadrapolice राबर्ट्सगंज का #ViralVideo #earthquake #breastislife #fearwomen #Afghanistan pic.twitter.com/7laX9OUIqD — RAHUL PANDEY (@BhokaalRahul) June 23, 2022 थाना रॉबर्ट्सगंज पुलिस द्वारा हर्ष फायरिंग में हुई हत्या से सम्बन्धित 01 नफर अभियुक्त को किया गिरफ्तार, कब्जे से आलाकत्ल 01 अदद पिस्टल मय 04 अदद जिन्दा व 01 अदद फायरशुदा कारतूस बरामद । pic.twitter.com/8gfevb7r96 — Sonbhadra Police (@sonbhadrapolice) June 22, 2022 -
కత్రీనా పెళ్లి వేడుకలు.. ఎన్ని కిలోల మెహందీ వాడారంటే ?
To Katrina Kaif Wedding Nearly 20 Kg Of Organic Mehndi Powder Sent: బీటౌన్‌లో హాట్ టాపిక్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ప్రేమ వివాహం. 38 ఏళ్ల కత్రీనా కైఫ్, 33 సంవత్సరాల విక్కీ కౌశల్ ఒక ఏడాదికిపైగా డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. విక్ట్రీనా (విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్‌లను అభిమానులు ప్రేమగా పిలుచుకునే పేరు) వివాహ వేడుకలు మంగళవారం (డిసెంబర్ 7) నుంచి ప్రారంభమయ్యాయి. కత్రీనా కైఫ్, కౌశల్ ఇద్దరూ తమ కుటుంబ సభ్యులతో సోమవారం సాయంత్రం ముంబై నుంచి జైపూర్‌కు వెళ్లారు. రెండు కుటుంబాలు 15 కంటే ఎక్కువ కార్లతో కూడిన కాన్వాయ్‌లో నేరుగా జైపూర్ నుంచి సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా హోటల్‌కు చేరుకున్నారు. సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ హోటల్లో జరుగుతున్న ఈ వేడుకలకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కత్రీనాకు సన్నిహితుడు చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్, అతని భార్య మినీ మాథూర్, దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార, నేహా ధూపియా-అంగద్ బేడీ దంపతులు, తదితరులు జైపూర్‌కు చేరుకున్నారని సమాచారం. మంగళవారం ఉదయం విక్కీ తమ్ముడు సన్నీ కౌశల్ స్నేహితుడు శర్వారీ వాఘ్, రాధిక మదన్ కూడా హాజరయ్యారు. జైపూర్‌కు నుంచి సుమారు 120 కిలో మీటర్లు దూరం ఉన్న ఈ హోటల్‌కు ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఎహసాన్ నూరానీ, పంజాబీ గాయకుడు గురుదాస్ మాన్ కూడా బుధవారం ఉదయం చేరుకున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకల్లో భాగమైన మెహందీ ఫంక్షన్‌కు సుమారు 20 కిలోల ఆర్గానిక్ మెహందీ పౌడర్ సరఫరా చేశారట. ఈ మెహందీని రాజస్థాన్‌లోని పాలి జిల్లా సోజత్ పట్టణం నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు సమాచారం. అలాగే సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో జరగనున్న విక్ట్రీనా పెళ్లికి మెహందీ పౌడర్‌తో పాటు 400 మెహందీ కోన్లు పంపించారట. అయితే ఈ సోజత్ పట్టణం మెహందీ సాగుకు ప్రసిద్ధి. ఈ వివాహ కార్యక్రమం కోసం ఈ ఆర్గానిక్ మెహందీ ప్రాసెస్ చేయడానికి సుమారు 20 రోజులు పట్టిందని సోజత్‌లో మెహందీ తయారీ కంపెనీ అయినా 'నెచురల్ హెర్బల్' యజమాని నితేష్ అగర్వాల్ తెలిపారు. ఇదీ చదవండి: పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ? -
మహిళా వెడ్డింగ్ ప్లానర్స్ ఆకాశమే హద్దు...
తమ వివాహ వేడుక నూరేళ్లు గుర్తుండిపోయేలా ఆకాశమే హద్దుగా.. భూదేవంత కళగా వైభవంగా.. వినూత్నంగా .. కనివిని ఎరగని విధంగా జరుపుకోవాలంటే డబ్బొక్కటే ఉంటే సరిపోదు... సరైన ప్లానింగ్ కూడా ఉండాలి. పట్టుచీరలు, నగలు అలంకరించుకుని మండపానికి వచ్చే మగువలే కాదు.. తమ చేతులతో పెళ్లిళ్లను అర్ధవంతంగా జరిపించి, అంతటా పేరు తెచ్చుకుంటున్న అతివలు మన దేశాన అగ్రశ్రేణిలో ఉన్నారు. వివాహ వేడుకను అత్యంత ఘనంగా జరుపుకోవాలనే ఆలోచన మెజారిటీ ప్రజల్లో ఉండటం కారణంగా వెడ్డింగ్ ప్లానర్ల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఖర్చుతో బాటు సరైన ప్లానింగ్‌తో జరగాలన్న ఒత్తిడితో కూడుకున్న ఈ వేడుక ప్లానర్‌ని నియమించేలా చేస్తుంది. ఇండియా టాప్ వెడ్డింగ్ ప్లానర్ల జాబితాలో ఉన్న వందనామోహన్, దివ్యావితిక, టీనా తర్వాణి, దేవికా సఖుజ, ప్రీతీ సిద్వానీలు పెళ్లి పెద్దలుగా ప్లానింగ్ చేసే అవకాశాన్ని ఏళ్ల తరబడి అందిపుచ్చుకుంటున్నారు. వందనా మోహన్ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పొలిటికల్సైన్ విభాగం నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న వందన ఐక్యరాజ్యసమితిలో పనిచేయాలనుకుంది. రూట్ మార్చుకుని భారతదేశపు అగ్రశ్రేణి వెడ్డింగ్ ప్లానర్‌లో ఒకరుగా పేరొందారు. ‘ది వెడ్డింగ్ డిజైన్’ కంపెనీ పేరుతో 28 ఏళ్లుగా వందనా మోహన్ దేశవ్యాప్తంగా సెలబ్రిటీల పెళ్లి కళ బాధ్యతను తీసుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ఇటలీలోని లేక్ కోమోలో బాలీవుడ్ అగ్రనటులు దీపికాపదుకొనే, రణ్‌వీర్‌సింగ్‌ల పెళ్లి కలను నిజం చేసిన ప్లానర్ వందనామోహన్. అద్భుతమైన కథలా కళ్లకు కట్టే సెట్టింగ్, సమ్మోహనపరిచే డిజైన్స్, ఎక్కడా దేనికీ తడుముకోవాల్సిన అవసరం లేకుండా వివాహతంతును పూర్తి చేయడంలో వందనది అందె వేసిన చేయి. ‘ఒకప్పటి ప్రఖ్యాత ప్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్, బిజినెస్ ఉమెన్ కోకో చానెల్ నుండి ప్రేరణ పొందుతాను. మూస విధానాలను దాటి ఆలోచించడమే నా విజయం’ అనేది ఈ ఫస్ట్ ఇండియన్ ఉమన్ వెడ్డింగ్ ప్లానర్ మాట. ఇప్పటికి 500 పెళ్లిళ్ళను అద్భుతంగా చేసిందన్న ఘనత వందన ఖాతాలో జమ అయ్యింది. దివ్య – వితిక బెంగుళూరు వెడ్డింగ్ ప్లానర్స్ దివ్య–వితిక లు ప్రారంభించిన సంస్థ. వీరి సోషల్ మీడియా అకౌంట్ చూస్తే చాలు ఆ పెళ్లిళ్లు ఎంత గ్రాండ్‌గా ఉంటాయో కళ్లకు కడతాయి. గతంలో మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్న ఈ ఇద్దరు దివ్యా చౌహాన్, వితికా అగర్వాల్ స్నేహితులయ్యారు. ‘దివ్య వితిక’ అని తమ పేరుతోనే 2009లో వెడ్డింగ్ ప్లానర్ కంపెనీని ప్రారంభించారు. తమ ప్లానింగ్‌లో భాగంగా ఎక్కడా ఆనందాన్ని మిస్ కానివ్వదు. వచ్చే అతిథులు చూపులకు పూర్తిగా ఓ కళారూపంగా, వినోద భరితంగా వీరి ఈవెంట్ డిజైనింగ్ ఉంటుంది. ఒక బలమైన థీమ్, కలర్ డిజైన్, అద్భుతమైన అలంకరణ కావాలనుకుంటే దివ్య వితికను కలవాల్సిందే అనేలా వీరి ప్లానింగ్ ఉంటుంది. టీనా థర్వాణి వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ‘షాదీ స్క్వాడ్’ సహ వ్యవస్థాపకురాలు టీనా థర్వాణి. ఈ కంపెనీలో కొనసాగాలని నిర్ణయించుకోవడానికి ముందు టీనా చిత్ర నిర్మాణంలో పనిచేసింది. ఇటలీలోని టుస్కానీలో బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరొందిన అనుష్క–విరాట్‌కోహ్లి (విరుష్క)ల అందమైన పెళ్లి వేడుకను టీనా ప్లాన్ చేసింది. ఈ జంట వారి ప్రత్యేక రోజును వారి ఊహలను, గ్రాండ్‌నెస్‌ను కలిపి ఆవిష్కరించింది. టీనా చేసే థీమ్ బేస్డ్ ప్లానింగ్‌లో ఒక ప్రత్యేకమైన రిచ్‌నెస్‌తో పాటు యువజంట కలలను కళ్లముందు నిలుపుతుంది. దేవికా సఖుజా ఢిల్లీలో ఉంటున్న ఈ వెడ్డింగ్ ప్లానర్ తన పేరుతో స్థాపించిన సొంత కంపెనీకి ఈవెంట్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. గతం నుంచి తీసుకున్న థీమ్‌ను ప్రస్తుత కాలానికి తగినట్టుగా వినూత్నంగా నవీకరిస్తుంది. ఈ రకమైన థీమ్‌లను రూపొందించడంలో దేవికకు ప్రత్యేకమైన పేరుంది. సన్నిహితుల మధ్య జరిగే చిన్న సమావేశమైనా, పెళ్లి వంటి పెద్ద వేడుకలైనా ప్రతీ క్షణం ఆహూతులు ఆస్వాదించే విధంగా జంటకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఈవెంట్‌ను ప్లాన్ చేయాలన్నదే దేవిక అభిమతం. సందర్భానికి తగిన విధంగా సరైన వాతావరణాన్ని తనదైన కోణంలో సృష్టించకపోతే వేడుక సంపూర్ణం కాదనేది దేవికా సఖుజా అభిప్రాయం. వేడుక సందర్భాన్ని బట్టి ఎలాంటి డిజైన్లనైనా ఏ బడ్జెట్లోనైనా పూర్తి చేయడంలో దేవిక సఖుజ దిట్ట. ప్రీతి సిధ్వాని రెండు దశాబ్దాలుగా వెడ్డింగ్ ప్లానింగ్‌లో తీరికలేకుండా ఉంటున్నారు ప్రీతి సిధ్వాని. ‘డ్రీమ్జ్ క్రాఫ్ట్’ పేరుతో 2002లో ప్రారంభించిన వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ నిర్వహణతో పాటు సినిమా సెట్టింగ్ డిజైన్లలోనూ బిజీగా ఉంటారు ప్రీతి. సినిమా సెట్టింగ్స్ నుంచి పెళ్లి వేడుకల సెట్టింగ్స్‌తో ఆమె ఈ మార్కెట్లోకి ప్రవేశించింది. దేశ నలుమూలల నుండి వెడ్డింగ్ ప్లానింగ్‌కు సంబంధించిన సృజనాత్మక ఐడియాల కోసం ప్రీతిని సోషల్‌మీడియా ద్వారా కాంటాక్ట్ చేస్తూనే ఉంటారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగు వేసి ఎంతో వైభవంగా జరుపుకోవాలనే ఆలోచన ఒక్క పెళ్లి విషయంలోనే చేస్తారు. వధువు, వరుడి వైపు కుటుంబాలు ప్రశాంతంగా, సంబరంగా జరుపుకునే ఈ వేడుక అన్నీ పద్ధతి ప్రకారం జరగాలంటే ఓ పెద్ద సవాల్. రకరకాల అంశాలతో కూడి ఉండే ఈ వేడుక బాధ్యతను సవాల్‌గా తీసుకొని తమ సమర్థతను చాటుతున్నారు ఈ మహిళామణులు. -
పెళ్లి కూతురుతో పూల ‘బామ్మలు’
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు సినిమాల్లో యువ రాణులు తమ చెలికత్తెలతో కలిసి పూల బుట్టలు పట్టుకొని పూదోటలకు వెళ్లి రావడం, గుళ్లూ గోపురాలు చుట్టి రావడం మనలో ఎక్కువ మంది చూసే ఉంటారు. మరి ఇలాంటి అనుభవం అమెరికాకు చెందిన లిండ్సే రాబీకి ఎక్కడ ఎదురయిందో తెలియదు గానీ, తన పెళ్లికి మాత్రం పూల బామలు కాకుండా పూల బామ్మలు కావాలని పంతం పట్టింది. అంటే తన నలుగురు బామ్మలు పూల బుట్టలు పట్టుకొని తన ముందు పూలు చల్లుకుంటూ నడుస్తుంటే పెళ్లి కూతురు దుస్తుల్లో ముస్తాబై తాను పెళ్లి పీటలపైకి నడిచి వస్తానంటూ తన మనోగతాన్ని పెళ్లి ఏర్పాట్లు చూసే పెద్దలకు చెప్పింది. అంతే లిండ్సే నలుగురు బామ్మలకు ఒకే నీలి రంగుపై నీలి, తెలుపు, కాస్త నలుపు రంగు చుక్కలు కలిగిన దుస్తులను ఆగ మేఘాల మీద వెళ్లి కుట్టి తెప్పించారు. లిండ్సే ముత్తవ్వ (తల్లి తల్లికి తల్లీ) కథ్లీన్ బ్రౌన్, 72 ఏళ్ల బెట్టీ బ్రౌన్, 76 ఏళ్ల వాండా గ్రాంట్ (వారిలో ఒకరు తన తల్లికి తల్లి కాగా, మరొకరు తన తండ్రికి తండ్రి), ఇక పెళ్లి కుమారుడు ట్యానర్ రాబీ తల్లి జాయ్ రాబీలు ఆ ఒకే తీరు దుస్తులను ధరించి అట్టలతో చేసిన పూల బుట్టలను పట్టుకొని పెళ్లి కూతురు కోరిక మేరకు ఆమె ముందు నడుస్తూ, దారంటూ పూల చల్లుతూ పెళ్లి కూతరును పీటలపైకి ఆహ్వానించారు. బామ్మలకు కూడా మనుమరాలిని అలా ఆహ్వానించడం తెగ ముచ్చటేసింది. బామ్మల పట్ల మనమరాలికున్న అనుబంధానికి ఈ వెంట్ నిదర్శనమని పెళ్లికి హాజరైన బంధువులు, మిత్రులు వేనోళ్ల ప్రశంసలు కురిపించారు. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలోని బెంటాన్ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ముచ్చటైన సంఘటనను ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ నటాలీ కాహో వాటిని ‘ఇన్స్టాగ్రామ్’ బిజినెస్ పేజీలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. వాటిని చూస్తున్న యూజర్లు ఎవరికి వారు, ఇలాంటి పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని కలలుగంటున్నారు. -
జూపల్లి సోదరుడు కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్
-
అంబానీ ఇంట.. బాలీవుడ్ తారల ధూమ్‌ధామ్!
బాలీవుడ్ తారలు అందరూ ధూమ్‌ధామ్ కార్యక్రమాలతో అదరగొట్టారు. ఇషా అంబానీ పెళ్లి వేడుకల్లో భాగంగా బాలీవుడ్ మొత్తం ఉదయ్‌పూర్‌కు తరలిపోయింది. బాలీవుడ్ స్టార్లు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, కరణ్ జోహర్, కరీనా కపూర్, సోనమ్ కపూర్, జాన్వీ కపూర్ తదితరులు హాజరయ్యారు. ముకేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ, పిరమాల్ వ్యాపారదిగ్గజ వారసుడు ఆనంద్ పిరమాల్ పెళ్లి వేడుకలు ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 12న వీరిద్దరు ఒక్కటవ్వనున్నారు. ఆదివారం జరిగిన సంగీత్ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు చిందులేశారు. కత్రినా, ప్రియాంక వేసిన స్టెప్పులు అదుర్స్ అనిపించాయి. అన్నింటికంటే ముఖ్యంగా షారుక్ తన భార్య గౌరీ ఖాన్‌తో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ కార్యక్రమానికి కరణ్ జోహర్ హోస్ట్ చేస్తూ.. తన టైమింగ్‌తో అందరికి వినోదాన్ని పంచారు. ముకేష్ అంబానీతో చేసిన ర్యాపిడ్ ఫైర్ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది. ఆమిర్ దంపతుల డ్యాన్స్, సల్మాన్ ఖాన్-కత్రినాల ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ నుంచి ప్రభాస్ హాజరయ్యాడు. -
ఇషా అంబానీ సంగీత్ వేడుక
-
అంబానీల పార్టీకి తరలివెళ్తోన్న తారగణం
జైపూర్ : భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలతో ఉదయ్‌పూర్ కళకళలాడుతోంది. ఇందులో భాగంగా అంబానీ దంపతులు ఇస్తున్న పార్టీకి అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఉదయ్‌పూర్‌కు చేరుకుంటున్నారు. దీంతో ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టు వద్ద సందడి నెలకొంది. ప్రియానిక్ దంపతులు, ఆమిర్ ఖాన్- కిరణ్‌రావు, అమితాబ్ బచ్చన్ కుటుంబం, సల్మాన్ ఖాన్, విద్యాబాలన్ దంపతులు, బోనీ కపూర్, జాన్వీ, ఖుషీ కపూర్, వరుణ్ ధావన్, మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ దంపతులు సహా పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. కాగా ఈనెల 12న ఇషా- ఆనంద్ పిరమాల్‌ల వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచే ఉదయ్‌పూర్‌లో సంబరాలు మొదలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 7 నుంచి డిసెంబరు 10 వరకు నాలుగు రోజుల పాటు నిత్యాన్నదానం నిర్వహిస్తోంది. -
కొసరి కొసరి వడ్డిస్తున్న అంబానీ కుటుంబం!
అన్నదాత సుఖీభవ, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అనేవి మనం వింటూ ఉంటాం. మనం ఏం పని చేసినా.. జానెడు పొట్ట నిండటం కోసమే కదా. అలా పక్కవారి కడుపునిండా అన్నం పెట్టడంలో ఉండే సంతృప్తి ఎందులోనూ ఉండదు. ఇలాంటి గొప్పకార్యక్రమంతో అంబానీ ఇంట వివాహ మహోత్సవం ఘనంగా మొదలైంది. ఉదయ్‌పూర్‌లో అంబానీ కుటుంబసభ్యులు శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరిపించారు. అంబానీ కుటుంబ సభ్యులు ముకేశ్ అంబానీ, నీతా అంబానీ, అజయ్, స్వాతి పిరమాల్, ఇషా, ఆనంద్ పాల్గొని.. 5,100 మందికి ఆహార పదార్ధాలను వడ్డించారు. ఇషా అంబానీ-ఆనంద్ పిరమాల్‌ల వివాహం డిసెంబర్ 12న ముంబయిలో ఘనంగా జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి నెలకొంది. ఉదయ్‌పూర్ (రాజస్థాన్)లో ఈషా అంబానీ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచే అక్కడ సంబరాలు మొదలయ్యాయి. ఉదయ్‌పూర్ వాసుల ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది అంబానీ కుటుంబం. పెళ్లి వేడుకల్లో భాగంగా డిసెంబర్ 7 నుంచి డిసెంబరు 10 వరకు నాలుగు రోజుల పాటు నిత్యాన్నదానం చేస్తున్నారు. అందులో దివ్యాంగులే ఎక్కువగా ఉన్నారు. ఇలా నాలుగు రోజులు మూడు పూటలా వారికి భోజనం పెట్టనున్నారు. అన్నదానంతో పాటు భారతీయ వస్తు కళలను ప్రమోట్ చేసేందుకు స్వదేశీ బజార్ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తోంది. దేశీయ కళా ఉత్పత్తులను అందులో ప్రదర్శిస్తారు. దీని ద్వారా స్థానిక వ్యాపారులకు లాభం చేకూరనుంది. ఈ ఎగ్జిబిషన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు, అంతర్జాతీయ అతిథులు తరలిరానున్నారు. కాగా, డిసెంబరు 8, 9న ఈషా-ఆనంద్ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. డిసెంబరు 12న అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరగనుంది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వివాదంలో దీప్‌వీర్‌ల వివాహం
బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు దీపికా పదుకోన్ - రణ్వీర్ సింగ్. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమ పక్షులుగా విహరించిన వీరు చివరకూ ఈ ఏడాది నవంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో దీప్‌వీర్‌ల వివాహం అంగరంగా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు ఈ జంట. ఇంత అట్టహసంగా జరిగిన వీరి వివాహంపై వచ్చిన ఓ వివాదం ఇప్పుడు నూతన దంపతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. విషయం ఏంటంటే.. కొంకణీ సంప్రదాయం ప్రకారం నవంబర్ 14న వివాహం చేసుకున్న దీప్‌వీర్‌లు ఆ తర్వాత నిర్వహించిన ‘ఆనంద్ కరాజ్’ అనే కార్యక్రమాన్ని మాత్రం సరిగా జరపలేదని ఇటాలియన్ సిక్ ఆర్గనైజేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సిక్కుల కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి మరీ ఈ వేడుకను నిర్వహించారని పేర్కొంది. సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘గురు గ్రంథ్ సాహిబ్’ను గురుద్వారాలో తప్ప మరెక్కడా తీసుకోకూడదని, కాని వారు ఆ నియమాన్ని ఉల్లంఘించారని ఆరోపించింది. ఈ విషయాన్ని ‘అకల్ తఖ్త్ జతేదార్’ దృష్టికి తీసుకెళ్లినట్టు సంస్థ అధ్యక్షుడు తెలిపారు. జీవితాంతం గుర్తిండిపోయే ఈ వేడుక ఇలా వివాదాల పాలు కావడం నూతన దంపతులను కాస్తా ఇబ్బందికర అంశమే అంటున్నారు సన్నిహితులు. వివాహానంతరం ఈ ఆదివారం ముంబై చేరుకున్న దీప్‌వీర్ జంట బాలీవుడ్ ప్రముఖుల కోసం నెల 21న బెంగళూరులో, 28న ముంబయిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
తిరిగొచ్చేశారు
ఇటలీలో పెళ్లి సంబరాలు ముగించుకొని ఆదివారం ముంబైకి తిరిగొచ్చారు కొత్త దంపతులు దీప్‌వీర్ (దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్). ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఈ నూతన జంటను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. అక్కడి నుంచి నేరుగా రణ్‌వీర్‌సింగ్ ఇంటికి చేరుకొని, గృహప్రవేశ కార్యక్రమం చేసినట్టు సమాచారం. క్రీమ్ కలర్ మ్యాచింగ్ డ్రెసుల్లో ‘దీప్‌వీర్’ కనిపించేసరికి అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు. అక్కడితో ఆగకుండా రణ్వీర్ చేతికున్న మెహందీలో దీపం డిజైన్ చూసి దీపం అంటే హిందీలో దీప్ (దీపికా) అని ఊహించేసుకుని తెగ సంబరపడిపోతున్నారు. ఈ నెల 21న బెంగళూర్‌లో, 28న ముంబైలో వీరి పెళ్లి రిసెప్షన్ జరగనుంది. -
శ్రియా భూపాల్ పెళ్లిలో మెగా కపుల్
మెగా కపుల్ చెర్రీ ఉపాసన ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ కోసం అక్కడికి వెళ్లలేదు. ఓ పెళ్లి వేడుకుకు హాజరయ్యారు. జీవీకే, అపోలో ఫ్యామిలీకి సంబంధించిన ఈ వివాహ వేడుకలు ఘనంగా జరిగినట్టు సమాచారం. ఈపాటికే ఈ పెళ్లి ఎవరిదనే విషయం అర్థమైపోయిందనుకుంటా. ఈ పెళ్లి మరెవరిదో కాదు శ్రియా భూపాల్‌ది. శ్రియా భూపాల్ ఈ పేరు గుర్తుండే ఉంటుంది అందరికి. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె...అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్ మిస్ అయిన విషయం తెలిసిందే. అఖిల్, శ్రియా భూపాల్‌కు నిశ్చితార్థం జరిగిన తర్వాత చివరి నిమిషంలో వారిద్దరి పెళ్లి రద్దవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. పెళ్లి క్యాన్సిల్‌పై ఇటు నాగార్జున కుటుంబం కానీ, అటు జీవీకే కుటుంబం కానీ పెద్దగా స్పందించలేదు. ఈ సంఘటన తరువాత శ్రియా భూపాల్ వివాహం హీరో రాం చరణ్ భార్య ఉపాసన కజిన్‌తో నిశ్చయించారు. తాజాగా ఈ పెళ్లి ప్యారిస్ సమీపంలోని ఓ సిటీలో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి రాంచరణ్, ఉపాసన హాజరు అయ్యారు. వీరిద్దరు అక్కడ దిగిన ఫోటోను ఉపాసన తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వీరిద్దరు కొత్త జంటలా కనిపిస్తున్నారంటూ అభిమానుల కామెంట్స్‌తో ఆ ఫోటో వైరల్‌గా మారింది. ❤️ #familywedding #ramcharan pic.twitter.com/pA5juGLv1a — Upasana Kamineni (@upasanakonidela) May 27, 2018