
జైపూర్ : భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలతో ఉదయ్‌పూర్ కళకళలాడుతోంది. ఇందులో భాగంగా అంబానీ దంపతులు ఇస్తున్న పార్టీకి అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఉదయ్‌పూర్‌కు చేరుకుంటున్నారు. దీంతో ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టు వద్ద సందడి నెలకొంది. ప్రియానిక్ దంపతులు, ఆమిర్ ఖాన్- కిరణ్‌రావు, అమితాబ్ బచ్చన్ కుటుంబం, సల్మాన్ ఖాన్, విద్యాబాలన్ దంపతులు, బోనీ కపూర్, జాన్వీ, ఖుషీ కపూర్, వరుణ్ ధావన్, మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ దంపతులు సహా పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నారు.
కాగా ఈనెల 12న ఇషా- ఆనంద్ పిరమాల్‌ల వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచే ఉదయ్‌పూర్‌లో సంబరాలు మొదలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 7 నుంచి డిసెంబరు 10 వరకు నాలుగు రోజుల పాటు నిత్యాన్నదానం నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment