
బాలీవుడ్‌లో సోనమ్ కపూర్ ఆనంద్ అహుజాల పెళ్లి ఘనంగా జరిగింది. బాలీవుడ్‌లో ఎక్కడ చూసినా... మొత్తం ఈ పెళ్లికి సంబంధించిన ముచ్చట్లే వినబడుతున్నాయి. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లికి స్టార్స్ అందరూ హాజరయ్యారు. మెహెందీ, సంగీత్ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం పెళ్లి వేడుకలో ఖాన్ ద్వయం వేసిన స్టెప్స్‌లు వైరల్‌గా మారాయి. షారుఖ్, సల్మాన్, రణవీర్, అనిల్‌కపూర్ వేసిన డ్యాన్సులు ప్రోగ్రామ్‌కే హైలెట్‌గా నిలిచాయి. వీరి స్టెప్పులతో, డీజేలతో ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. రణవీర్‌సింగ్, పెళ్లి కొడుకు ఆనంద్‌ను ఎత్తుకుని డ్యాన్స్ చేయడం, షారుఖ్ సోనమ్‌ను డ్యాన్స్ చేయడానికి ఆహ్వానించడం, తను కూడా నృత్యం చేయడం ఇవన్నీ హైలెట్‌గా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment