
సోషల్ మీడియా అనగానే ఎన్నో విచిత్రమైన వీడియోలు, ఫొటోలు, విశేషాలు ఉంటాయి కదా. తాజాగా సోషల్ మీడియాలో కొత్తగా పెళ్లైన జంటకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. ఇంతకీ పెళ్లి వేడుకలో ఏం జరిగిందంటే..
వీడియో ప్రకారం.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఓ జంటకు వివాహం జరిగింది. పెళ్లి వేడుకలో వేదికపైనే వధువరులిద్దరూ నిలుచున్నారు. ఇంతలో ఏమైంది ఏమో తెలియదు కానీ.. ఉన్నట్టుండి వధువు సీరియస్ అయ్యింది. ఆమెకు వరుడు స్వీట్ తినిపించే ప్రయత్నం చేయగా స్వీట్ ముక్కను వధువు విసిరిపడేసింది. అనంతరం.. వరుడికి వధువు పాయసం తాగించే ప్రయత్నం చేయగా ఆయన దాన్ని కింద పారబోశాడు. దీంతో, మరోసారి ఆవేశానికి లోనైన వధువు.. గ్లాస్‌ను విసిరిపడేసింది. దీంతో, అక్కడున్న వారంతా కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో అన్నది మాత్రం తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment