
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్
ఇటలీలో పెళ్లి సంబరాలు ముగించుకొని ఆదివారం ముంబైకి తిరిగొచ్చారు కొత్త దంపతులు దీప్‌వీర్ (దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్). ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఈ నూతన జంటను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. అక్కడి నుంచి నేరుగా రణ్‌వీర్‌సింగ్ ఇంటికి చేరుకొని, గృహప్రవేశ కార్యక్రమం చేసినట్టు సమాచారం. క్రీమ్ కలర్ మ్యాచింగ్ డ్రెసుల్లో ‘దీప్‌వీర్’ కనిపించేసరికి అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు. అక్కడితో ఆగకుండా రణ్‌వీర్ చేతికున్న మెహందీలో దీపం డిజైన్ చూసి దీపం అంటే హిందీలో దీప్ (దీపికా) అని ఊహించేసుకుని తెగ సంబరపడిపోతున్నారు. ఈ నెల 21న బెంగళూర్‌లో, 28న ముంబైలో వీరి పెళ్లి రిసెప్షన్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment