ముంబయిలో ట్రాఫిక్ ఆంక్షలు
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుకను పురస్కరించుకుని ముంబయిలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముందస్తు ప్రకటన విడుదల చేశారు. జులై 12 నుంచి 15 వరకు అనంత్-రాధికల వివాహ వేడుక జరిగే బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో కన్వెన్షన్ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజన్ ‘అంబానీ పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని కామెంట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారుతుంది.
ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా..! ఇప్పటికే అంగరంగ వైభవంగా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ను జరుపుకున్నారు. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు వందల సంఖ్యలో హాజరయ్యారు. మరి పెళ్లికి ఇంకెందరు వస్తారోననే చర్చ జరుగుతోంది. అయితే అలా వస్తున్న వారికి ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా ముంబయి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.
ముంబయి ట్రాఫిక్ పోలీసులు ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2024 జులై 12-15 వరకు ముంబయిలోని బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు, వీఐపీలు వస్తున్నారు. దాంతో భద్రతా కారణాల వల్ల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వైపునకు వెళ్లే వాహనాలను వేరే మార్గానికి మళ్లిస్తున్నామని తెలిపారు.
పోలీసుల ప్రకటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘అనంత్ అంబానీ పెళ్లి ఈవెంట్ పబ్లిక్ ఈవెంట్ ఎలా అవుతుంది?’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘హత్రాస్ భోలేబాబా వ్యవహారం కంటే అంబానీ పెళ్లికి ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది.. కారణం ఏంటో..’ అని ఒకరు, ‘అంబానీ పెళ్లి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.
Due to a public event at the Jio World Convention Centre in Bandra Kurla Complex on July 5th & from July 12th to 15th, 2024, the following traffic arrangements will be in place for the smooth flow of traffic.#MTPTrafficUpdates pic.twitter.com/KeERCC3ikw
— Mumbai Traffic Police (@MTPHereToHelp) July 5, 2024
ఇదీ చదవండి: సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబం
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు శుక్రవారం(జులై 12)న శుభ వివాహ్‌తో ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలతో ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment