అంబానీ చెల్లి.. భర్త చనిపోయినా కోట్ల కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా.. | Mukesh Ambani's sister Nina built own empire worth of Rs 450 crs | Sakshi
Sakshi News home page

అంబానీ చెల్లి.. భర్త చనిపోయినా కోట్ల కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా..

Published Fri, Jul 12 2024 10:24 AM | Last Updated on Fri, Jul 12 2024 10:52 AM

Mukesh Ambani's sister Nina built own empire worth of Rs 450 crs

ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న ముఖేశ్‌ అంబానీ కుంటుంబం గురించి తెలుసా అంటే.. ఆయన గురించి తెలియని వారుంటారా..? ముఖేశ్‌ భార్య నీతా, పిల్లలు ఆకాశ్‌, అనంత్‌, ఇషా అని చెబుతారు కదూ. కానీ ముఖేశ్‌ చెల్లెళ్ల గురించి ఎంతమందికి తెలుసు.. అందులో ఒకరి భర్త మరణించినా తన కంపెనీలను సమర్థంగా నిర్వహిస్తూ కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇంతకీ ఆమె ఎవరు..తాను చేస్తున్న వ్యాపారం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ధీరూభాయ్‌ అంబానీకి ముఖేష్, అనిల్‌లతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి పేర్లు నీనా కొఠారి, దీప్తి సల్గోకర్‌. నీనా కొఠారి 1986లో కొఠారి షుగర్స్ అండ్‌ కెమికల్స్ ఛైర్మన్‌ భద్రశ్యామ్ కొఠారిని వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అర్జున్ కొఠారి, కుమార్తె నయనతార కొఠారి ఉన్నారు. నీనా భర్త శ్యామ్ కొఠారి 2015లో క్యాన్సర్‌తో మరణించారు. ఆ తర్వాత నీనా వారి కుటుంబ వ్యాపారమైన కొఠారి షుగర్స్ అండ్‌ కెమికల్స్ బాధ్యతలను చేపట్టారు. ఏప్రిల్‌ 8, 2015లో ఆమె కంపెనీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

ఆమె భర్త మరణానంతరం కంపెనీ లాభాలను పెంచేందుకు చాలా కృషి చేశారు. ప్రస్తుతం కొఠారీ షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.450 కోట్లుగా ఉంది. కార్పొరేట్ షేర్‌హోల్డింగ్స్‌ ప్రకారం.. నీనా భద్రశ్యామ్ కొఠారి రెండు స్టాక్‌లను కలిగి ఉన్నారు. వాటి నికర విలువ రూ.54 కోట్లకు పైగానే ఉంది. కార్పొరేట్ పరిశ్రమలో నీనా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆమె 2003లో జావగ్రీన్ అనే కాఫీ అండ్‌ ఫుడ్ చైన్‌ని ప్రారంభించారు.

ఆమె పెద్ద కుమారుడు అర్జున్ కొఠారి..కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కుటుంబ వ్యాపారాన్ని విస్తరించేందుకు తల్లి నీనాతో కలిసి పని చేస్తున్నారు. కాగా, నీనా కుమార్తె నయనతార కెకె బిర్లా మనవడు షమిత్ భారతియాను వివాహం చేసుకున్నారు.

ఇదీ చదవండి: అతిథుల కోసం 3 ఫాల్కన్‌ జెట్‌లు, 100 విమానాలు

ముఖేశ్‌ అంబానీ రెండో చెల్లి దీప్తి సల్గోకర్‌. ఈమె వీ.ఎం.సల్గోకర్‌ అండ్‌ బ్రో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎండీ దత్తరాజ్‌ సల్గోకర్‌ భార్య. ఈ దంపతులు గోవాలో ‘సునపరంతా గోవా సెంటర్‌’లో ప్రదర్శనశాలను నిర్వహిస్తున్నారు. దీప్తి సల్గ్కోకర్‌ వీ.ఎం.సగోన్కర్‌ అండ్‌ బ్రో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో కార్పొరేట్‌ కమ్యునికేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.

ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహా వేడుకకు సర్వం సిద్ధమైంది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ సెంటర్‌లో జులై 12న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటవ్వనుంది. వీరి వివాహానికి దేశీయ ప్రముఖులతోపాటు విదేశాల్లోని దిగ్గజ సంస్థల సీఈఓలు హాజరవుతున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement