అనంత్‌-రాధికల ప్రీవెడ్డింగ్‌ వేడుకలో కాటిపెర్రీ పెర్ఫార్మెన్స్ | Katy Perry delivering a mesmerizing performance at the pre wedding celebrations | Sakshi
Sakshi News home page

అనంత్‌-రాధికల ప్రీవెడ్డింగ్‌ వేడుకలో కాటిపెర్రీ పెర్ఫార్మెన్స్

Published Sat, Jun 1 2024 12:48 PM | Last Updated on Sat, Jun 1 2024 1:20 PM

Katy Perry delivering a mesmerizing performance at the pre wedding celebrations

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాప్ సెన్సేషన్ కాటి పెర్రీ చేసిన లైవ్ పెర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పెర్రీ సిల్వర్‌కలర్‌లో శరీరాన్ని హత్తుకుని ఉండే దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకుంది. తనతోపాటు ఈ ఈవెంట్‌లో పాల్గొన్న తన ట్రూప్‌ తెల్లటి దుస్తులు ధరించి వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలను అలరించారు.

ముఖేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌-రాధికల రెండో ప్రీవెడ్డింగ్‌ వేడుకలు మే 29న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. క్రూయిజ్‌షిప్‌లో జరిగే ఈ వేడుకలో దాదాపు 900 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్‌కు సుమారు 4,380 కిలోమీటర్లమేర క్రూయిజ్‌ ప్రయాణం సాగుతుంది.

అనంత్‌ అంబానీ-రాధిక మొదటి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఈ ఏడాది మార్చినెలలో ఘనంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో మెటా ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న వంటి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ముకేశ్ అంబానీ తన కుమారుడు, కోడలు ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు ఫోర్బ్స్ గతంలోనే నివేదించింది.

ఇదీ చదవండి: భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్‌ వాహన ధరలు.. ఎంతంటే..

సంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం ఈ జంట ముంబైలో జులై 12న వివాహం చేసుకోనుంది. జులై 12 శుక్రవారం రోజున శుభ వివాహ వేడుకతో పెళ్లి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14 ఆదివారం రోజు జరిగే మంగళ్ ఉత్సవ్, వివాహ రిసెప్షన్‌తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement