
పెళ్లి తరువాత అమ్మాయిలకు అత్తింటి పేరు వచ్చి చేరడం సాధారణం. అయితే ఇది వారి వ్యక్తిగత ఇష్లాలు, ఆచారాలను బట్టి కూడా ఉంటుంది. తాజాగా రిలయన్స్ సామ్రాజ్యాన్ని సృష్టించిన అంబానీ ఇంటి కోడలు రాధికా మర్చంట్ పేరు మార్చుకుంది. పెళ్లి తర్వాత, రాధిక మర్చంట్ తన పేరులో 'అంబానీ'ని అధికారికంగా చేర్చుకుంది. రాధికా మర్చంట్ తన భర్త అనంత్ అంబానీ ఇంటిపేరును తన పేరులో చేర్చుకోవడంతో ‘రాధిక అంబానీ’గా అవతరించింది.
వ్యాపారవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికా మర్చంట్ తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ అనంత్ అంబానీని ఈ ఏడాది జూలైలో పెళ్లాడింది. రాధిక తన తండ్రి వ్యాపారమైన ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌కు డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంది. ఇటీవల ఎంటర్‌ప్రెన్యూర్ ఇండియాతో మాట్లాడిన ఆమె తన భవిష్యత్ కెరీర్ ప్లాన్‌లను కూడా వివరించింది. ముఖ్యంగా దక్షిణాది మార్కెట్లలో తమ వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించినట్లు రాధిక వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తీసుకురావాలని ఆమె భావిస్తున్నట్టు తెలిపింది.
ఇదీ చదవండి : Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా?
Comments
Please login to add a commentAdd a comment