రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు, కోడలు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పారిస్ ఒలింపిక్స్‌లో సందడి చేశారు. భారత క్రీడాకారుల మ్యాచ్‌లు వీక్షించిన అనంతరం ఈ నవ దంపతులు మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు మరిన్ని పథకాలు సాధిస్తారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ..‘దేవుడి దయతో భారత క్రీడాకారులు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇండియా చాలా పతకాలు సాధిస్తుందని అనుకుంటున్నాను. భారత అథ్లెట్లు ప్రతి ఇండియన్ గర్వపడేలా చేస్తారని విశ్వసిస్తున్నాను’ అన్నారు. అనంత్ భార్య రాధిక మర్చంట్ మాట్లాడుతూ..‘పారిస్ ఒలింపిక్స్‌లో మొదటి ఇండియా మ్యాచ్‌ని వీక్షించినందుకు చాలా సంతోషంగా ఉంది. భారత్ ఆటగాళ్ల తీరు అద్భుతంగా ఉంది. మరింత ఉత్సాహంతో పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధిస్తారని నమ్ముతున్నాను. ఈ క్రీడల వల్ల చాలామంది యువకులు స్ఫూర్తి పొందుతున్నారు’ అని చెప్పారు.
ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్ దాడి!
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అక్కడ రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఇండియా హౌజ్’ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా దాన్ని రూపొందించారు. రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఐవోఏ సభ్యురాలు నీతా అంబానీ ఇటీవల ఇండియా హౌజ్‌లో భారతీయ క్రీడాకారుల విజయాలను సెలబ్రేట్ చేశారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే రెండు పతకాలతో స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్ పారిస్‌లో విజయఢంకా మోగించారు.
#WATCH | #ParisOlympics2024 | Reliance Industries Chairman Mukesh Ambani's son Anant Ambani says, "I am sure that with god's grace, the Indian team will perform very well and we will win many medals. I am sure the Indian team will make every Indian like me proud."
Anant Ambani's… pic.twitter.com/HzDwTwNsKn— ANI (@ANI) July 31, 2024
Comments
Please login to add a commentAdd a comment