
మెగా కపుల్ చెర్రీ ఉపాసన ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ కోసం అక్కడికి వెళ్లలేదు. ఓ పెళ్లి వేడుకుకు హాజరయ్యారు. జీవీకే, అపోలో ఫ్యామిలీకి సంబంధించిన ఈ వివాహ వేడుకలు ఘనంగా జరిగినట్టు సమాచారం. ఈపాటికే ఈ పెళ్లి ఎవరిదనే విషయం అర్థమైపోయిందనుకుంటా. ఈ పెళ్లి మరెవరిదో కాదు శ్రియా భూపాల్‌ది.
శ్రియా భూపాల్ ఈ పేరు గుర్తుండే ఉంటుంది అందరికి. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె...అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్ మిస్ అయిన విషయం తెలిసిందే. అఖిల్, శ్రియా భూపాల్‌కు నిశ్చితార్థం జరిగిన తర్వాత చివరి నిమిషంలో వారిద్దరి పెళ్లి రద్దవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. పెళ్లి క్యాన్సిల్‌పై ఇటు నాగార్జున కుటుంబం కానీ, అటు జీవీకే కుటుంబం కానీ పెద్దగా స్పందించలేదు.
ఈ సంఘటన తరువాత శ్రియా భూపాల్ వివాహం హీరో రాం చరణ్ భార్య ఉపాసన కజిన్‌తో నిశ్చయించారు. తాజాగా ఈ పెళ్లి ప్యారిస్ సమీపంలోని ఓ సిటీలో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి రాంచరణ్, ఉపాసన హాజరు అయ్యారు. వీరిద్దరు అక్కడ దిగిన ఫోటోను ఉపాసన తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. వీరిద్దరు కొత్త జంటలా కనిపిస్తున్నారంటూ అభిమానుల కామెంట్స్‌తో ఆ ఫోటో వైరల్‌గా మారింది.
❤️ #familywedding #ramcharan pic.twitter.com/pA5juGLv1a
— Upasana Kamineni (@upasanakonidela) May 27, 2018
Comments
Please login to add a commentAdd a comment