Actor Amardeep Chowdary got Married to Tejaswini Gowda, Photos Viral - Sakshi
Sakshi News home page

Amardeep Chowdary - Tejaswini gowda: వివాహబంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర జంట.. ఫోటోలు వైరల్

Published Wed, Dec 14 2022 4:36 PM | Last Updated on Wed, Dec 14 2022 5:53 PM

TV Actors Amardeep Chowdary and Tejaswini gowda Got married Today - Sakshi

ఇటీవల సినీ ప్రముఖుల పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే పలువురు హీరోయిన్స్ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో సెలబ్రిటీ జంట వచ్చి చేరింది. తెలుగు బుల్లితెర నటుడు అమర్‌దీప్‌.. నటి తేజస్వినిని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.  ఈ సందర్భంగా కొత్త జంటకు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

ఆగస్టులో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట ఇవాళ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా అమర్‌ దీప్‌.. జానకి కలనగలేదులో హీరోగా నటిస్తుండగా తేజస్వి కేరాఫ్‌ అనసూయ సీరియల్‌ చేస్తోంది. అమర్‌దీప్‌ పలు ఓటీటీ సిరీస్‌ల్లోనూ నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement