బళ్లారి అర్బన్, న్యూస్‌లైన్ : శ్రావణ మాసం పంచమి సందర్భంగా ఆదివారం బళ్లారిలోని కల్యాణ మంటపాలు పెళ్లిళ్ల సందడితో కళకళలాడాయి. ఆషాడం తదితర కారణాలతో రెండు నెలలుగా కళావిహీనమైన కల్యాణ మంటపాలు సందడి సందడిగా కనిపించాయి. నగరంలోని ప్రధాన కళ్యాణ మంటపాలన్నింటిలో కూడా పంచమి ముహూర్తాన పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సత్యనారాయణపేట్ రాఘవేంద్రస్వామి కల్యాణమంటపం, కోర్టు రోడ్ కమ్మ సంఘం కల్యాణ మంటపం, రాజ్‌కుమార్ రోడ్ సెంటినరీ హాల్, బెంగళూరు రోడ్డులోని కన్యకాపరమేశ్వరి కళ్యాణమంటపం, పటేల్‌నగర్ ఉమామహేశ్వరి కల్యాణ మంటపం, సిరుగుప్ప, హొస్పేట రోడ్లలోని ఏసీ ఫంక్షన్‌హాల్, కొట్టూరు స్వామి కల్యాణ మంటపం, పార్వతినగర్ కల్యాణ మంటపం, బసవభవన్‌లలో పెళ్లి బాజాలు మోగాయి.
సీమాంధ్రలో బంద్ కారణంగా అట్టుడికి పోతున్న నేపథ్యంలో బస్సులు తిరగకపోవడంతో వివాహానికి హాజరు కావాల్సిన బంధుమిత్రులు చాలా ఇబ్బందులు బడ్డారు. కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వచ్చిన వారు ఇక్కడికి వచ్చి, తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెద్ద కళ్యాణ మంటపాలు కిటకిటలాడాయి. మరికొన్ని కల్యాణ మంటపాలలో పెళ్లిళ్లు జరిగిన ఛాయలు కనిపించలేదు. రాఘవేంద్రస్వామి కల్యాణ మంటపంలో జనగణమన ఫెడరేషన్ సంస్థాపకులు, సమాజ సేవకులు ఎన్.గంగిరెడ్డి,రాజమ్మల కుమారుడు ఉమాకాంతరెడ్డి, హేమలతల పెళ్లి వైభవంగా జరిపించారు.
వీరి పెళ్లికి మాజీ మంత్రి ముండ్లూరు దివాకర్‌బాబు, ఉరవకొండ ఎమ్మెల్సీ కే.శివరామిరెడ్డి, నారా ప్రతాప్‌రెడ్డి, భరత్‌రెడ్డి, అజయ్, గోవర్దన్, కార్పొరేటర్ మోత్కర్ శ్రీనివాస్, గోపాలరెడ్డి, వీరశేఖర్‌రెడ్డి, ఫణీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ మంటపాలు కళకళ
Published Mon, Aug 12 2013 3:32 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement