సినీతారలు పబ్లిసిటీ కోసం పాకులాడటం అందరికీ తెలిసిందే. ఆ కోవలో ఉండేవారిలో రాఖీ సావంత్ దే ఫస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అయితే ఆ బాలీవుడ్ హాట్ గాల్ అమెరికాలో జరిగిన ఓ పార్టీలో అందర్నీ ఆకట్టుకోవడంలో భాగంగా ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీనే టార్గెట్ చేసింది. ఆయన చిత్రాలతో రూపొందించిన అభ్యంతరకర డ్రెస్ వేసుకొని మోదీ పరువు తీసింది.
అమెరికా చికాగోలో జరిగిన ప్రీ ఇండిపెండెన్స్ పార్టీలో రాఖీ సావంత్ డ్రెస్.. చూపరులకు తీవ్ర ఇబ్బందిని కలిగించింది. నరేంద్ర మోదీ అభిమానులకు ఒకింత ఆగ్రహం కూడా తెప్పించింది. పార్టీకి ఓ కురచ గౌను వేసుకొచ్చిన రాఖీ.. ఆ డ్రెస్ పై నరేంద్ర మోదీ బొమ్మలను అతికించుకోవడం సంచలనంగా మారింది. రాఖీ డ్రెస్ ను చూసేందుకు అక్కడి జనం ఎంతో ఇబ్బంది పడ్డా.. ఆమె విషయాన్ని ఏమాత్రం పట్టించుకోపోవడం విశేషం. ఇలా ఓ దేశ ప్రధాని ఫోటోలను డ్రెస్ పై అతికించుకోవడమే కాక పబ్లిక్ గా ప్రదర్శన ఇవ్వడం.. మోదీనే కాక, ఏకంగా దేశాన్నే అవమానించినట్లని కొందరు రాఖీ సావంత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీకోసమేనా అని అడిగిన అక్కడి జర్నలిస్టుపైకూడా ఆమె తిట్లపురాణం విప్పడం.. చూపరులను షాక్ కు గురి చేసింది.
సిగ్గుమాలిన చర్యలకు పూనుకోవడమే కాక, దాన్ని ప్రచారం చేసుకోడానికి వాడుకోవాలనుకోవడం రాఖీకే సొంతం. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తలకెక్కే రాఖీ సావంత్.. ఇప్పుడు అభిమానుల రెస్పాన్స్ కోసం మోదీ చిత్రాల డ్రెస్ తో దిగిన ఫోటోలను ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ ల్లో కూడా పోస్ట్ చేసింది. ఒక్క అభిమానులే కాదు.. రాఖీ ప్రయత్నం ఏకంగా మోదీ అటెన్షన్ కోసం కూడా అన్నట్లు దీన్నిబట్టి తెలుస్తోంది.
ఆ డ్రెస్ తో మోదీ పరువు తీసింది..!
Published Thu, Aug 11 2016 12:15 PM | Last Updated on Tue, Aug 21 2018 9:36 PM
Advertisement
Advertisement