Who Is FM Nirmala Sitharaman Son In Law Prathik Doshi Who Had Connection With PM Modi - Sakshi
Sakshi News home page

నిర్మలా సీతారామన్‌ అల్లుడి బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే.. మోదీకి బాగా దగ్గర!

Published Fri, Jun 9 2023 11:55 AM | Last Updated on Fri, Jun 9 2023 12:25 PM

Meet Prathik Doshi FM Son in Law Who Had Connection With PM Modi - Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూతురు వాంగ్మయి వివాహం ఆడంబరాలకు దూరంగా జరిగింది. గురువారం బెంగళూరులో ఓ హోటల్‌లో వాంగ్మయి, ప్రతీక్‌ దోషీ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజకీయ ప్రముఖులెవరినీ నిర్మలా సీతారామన్‌ ఈ వివాహానికి ఆహ్వానించలేదని తెలుస్తోంది. 

ఢిల్లీ యూనివర్సిటీ, నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్సిటీలో జర్నలిజం చదువుకున్న వాంగ్మయి.. మింట్‌ లాంజ్స్‌ బుక్స్‌ అండ్‌ కల్చర్‌ సెక్షన్‌లో ఫీచర్‌ రైటర్‌గా పని చేస్తున్నారు.  ఇక గుజరాత్‌కు చెందిన  ప్రతీక్‌ దోషి నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెల్లడైంది. నరేంద్ర మోదీకి ప్రతీక్‌ చాలా దగ్గర. అయితే అది చుట్టరికంగా కాదు.. మోదీతో సుదీర్ఘకాలంగానే ప్రతీక్‌ ప్రయాణం కొనసాగడం ద్వారా.

గుజరాతీ అయిన ప్రతీక్‌ దోషి.. సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి కార్యాలయంలో(CMO)లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌గా ప్రతీక్‌ పని చేశాడు.

► అటుపై  2014 నుంచి ప్రధాని కార్యాలయం(PMO) అనుబంధంగా పని చేస్తున్నారు. 2019 జూన్‌లో దోషికి జాయింట్‌ సెక్రటరీ ర్యాంక్‌ దక్కింది.  

► ప్రస్తుతం ఆయన పీఎంవోలో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్డీ-OSD)గా హోదాలో కొనసాగుతున్నారు. రీసెర్చ్‌ అండ్‌ స్ట్రాటజీ వింగ్‌లో ఆయన పనిచేస్తున్నట్లు పీఎంవో వెబ్‌సైట్‌లో ఉంది. 

► పరిశోధన & వ్యూహాలకు మాత్రమే పరిమితం కాకుండా.. భారత ప్రభుత్వ (వ్యాపార కేటాయింపు) నియమాలు, 1961 ప్రకారం.. ప్రధానమంత్రికి కార్యదర్శిగా సలహాలు ఇవ్వడమూ చేస్తున్నారు ప్రతీక్‌. 

► ప్రతీక్‌.. పెద్దగా సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. అలాగే.. చెన్నైలో పుట్టి పెరిగిన వాంగ్మయి కూడా మీడియా కంట పెద్దగా పడింది లేదు. 

వాంగ్మయి-ప్రతీక్‌ల వివాహం బెంగళూరులోని టమరిండ్‌ ట్రీ హోటల్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

::: సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement