న్యూఢిల్లీ:దేశ ప్రజలకు రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం వెనుక అసలు కారణాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. మంళవారం(ఫిబ్రవరి4) ఓ టీవీ ఛానల్‌తో ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై మాట్లాడారు. ‘గత మూడు నాలుగేళ్ల నుంచి మేం ట్యాక్స్ పేయర్స్‌తో మాట్లాడుతున్నాం. పన్ను చెల్లించే విషయంలో వారు ప్రభుత్వాన్ని పూర్తిగా నమ్ముతున్నారు.
వారంతా క్రమం తప్పకుండా పన్ను కడుతూ దేశానికి చేస్తున్న సేవను గౌరవించేందుకే ప్రధాని మోదీ పన్ను మినహాయింపు ఇచ్చారు. పాత పన్ను విధానంలో మినహాయింపులు కావాల్సిన వాళ్ల కోసం దానిని కూడా అందుబాటులోనే ఉంచాం.
కొత్త ఆదాయపన్ను చట్టం మొత్తం పన్ను ప్రక్రియను సులభతరం చేస్తుంది. 1961 పన్ను చట్టం చాలా క్లిష్టతరంగా ఉండడంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’అని నిర్మల తెలిపారు.
కాగా, ఇటీవలి బడ్జెట్‌లో రూ.12 లక్షల దాకా ఆదాయం ఉన్న వేతన జీవులకు పూర్తిగా పన్ను మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మినహాయింపుతో పాటు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ వెసులుబాటు కూడా లభించనుంది. కొత్త పన్ను విధానంలో ఆదాయ పన్ను శ్లాబులను కూడా తగ్గించారు.
Comments
Please login to add a commentAdd a comment