Parakala Prabhakar
-
నిర్మలా సీతారామన్ అల్లుడు.. మోదీకి బాగా దగ్గర!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూతురు వాంగ్మయి వివాహం ఆడంబరాలకు దూరంగా జరిగింది. గురువారం బెంగళూరులో ఓ హోటల్లో వాంగ్మయి, ప్రతీక్ దోషీ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజకీయ ప్రముఖులెవరినీ నిర్మలా సీతారామన్ ఈ వివాహానికి ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ, నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో జర్నలిజం చదువుకున్న వాంగ్మయి.. మింట్ లాంజ్స్ బుక్స్ అండ్ కల్చర్ సెక్షన్లో ఫీచర్ రైటర్‌గా పని చేస్తున్నారు. ఇక గుజరాత్‌కు చెందిన ప్రతీక్ దోషి నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెల్లడైంది. నరేంద్ర మోదీకి ప్రతీక్ చాలా దగ్గర. అయితే అది చుట్టరికంగా కాదు.. మోదీతో సుదీర్ఘకాలంగానే ప్రతీక్ ప్రయాణం కొనసాగడం ద్వారా. ► గుజరాతీ అయిన ప్రతీక్ దోషి.. సింగపూర్ మేనేజ్మెంట్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయంలో(CMO)లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా ప్రతీక్ పని చేశాడు. ► అటుపై 2014 నుంచి ప్రధాని కార్యాలయం(PMO) అనుబంధంగా పని చేస్తున్నారు. 2019 జూన్‌లో దోషికి జాయింట్ సెక్రటరీ ర్యాంక్ దక్కింది. ► ప్రస్తుతం ఆయన పీఎంవోలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ-OSD)గా హోదాలో కొనసాగుతున్నారు. రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ వింగ్‌లో ఆయన పనిచేస్తున్నట్లు పీఎంవో వెబ్సైట్లో ఉంది. ► పరిశోధన & వ్యూహాలకు మాత్రమే పరిమితం కాకుండా.. భారత ప్రభుత్వ (వ్యాపార కేటాయింపు) నియమాలు, 1961 ప్రకారం.. ప్రధానమంత్రికి కార్యదర్శిగా సలహాలు ఇవ్వడమూ చేస్తున్నారు ప్రతీక్. ► ప్రతీక్.. పెద్దగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. అలాగే.. చెన్నైలో పుట్టి పెరిగిన వాంగ్మయి కూడా మీడియా కంట పెద్దగా పడింది లేదు. ► వాంగ్మయి-ప్రతీక్ల వివాహం బెంగళూరులోని టమరిండ్ ట్రీ హోటల్లో ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ::: సాక్షి వెబ్‌డెస్క్ -
న్యూ ఇండియాలోకి ‘పరకాల ప్రవేశం’!
‘క్రూకెడ్ టింబర్ ఆఫ్ హ్యుమానిటీ’ అనే పాశ్చాత్య భావన ఒకటి ఉంది. అందులోని ‘హ్యుమానిటీ’ స్థానంలో ‘న్యూ ఇండియా’ను చేర్చి రాసిన పుస్తకం ‘ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్’. ‘క్రూకెడ్ టింబర్ (వంకర వృక్షం) ఆఫ్ హ్యుమానిటీ’ అంటే మానవ జన్మలోని అపరిపక్వత. అదే విధంగా మోదీ భారత్‌లో ‘హిందూత్వ’ ఒక అపరిపక్వత అని ఈ పుస్తకం సంకేతపరచడం ఆసక్తికరం. యాదృచ్ఛికాలు అన్నవి వట్టి అర్థరహిత మైన సంభవాలేనా లేక వాటి వెనుక గొప్ప అంతరార్థం ఏదైనా ఉండి ఉంటుందా అని నేను తరచూ ఆలోచిస్తూ ఉంటాను. ఒకటేదైనా మనం అర్థం చేసుకోలేనిది, లేదా కనీసం గ్రహించలేనిది దీర్ఘకాలానంతరం దానికై అదే బహిర్గతం అవుతుంది. గతవారం జరిగింది అటువంటిదే అయివుండే అవకాశం ఉంది. చూద్దాం, ఈ మాటను మీరు ఒప్పుకుంటారేమో! ఇటీవల నేను పరకాల ప్రభాకర్‌ను ఆయన తాజా పుస్తకం ‘ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్’పై ఇంటర్వ్యూ చేశాను. ప్రధానమంత్రి మీద, భారతీయ జనతాపార్టీని ఆయన రూపాంతర పరచిన వైనం మీద చురుక్కుమనిపించే విమర్శ ఆ పుస్తకం. ప్రభాకర్ ఏమిటన్నది మీరు కనుగొన్నప్పుడు ఆ చురక మరింత స్పష్టంగా దృగ్గోచరం అవుతుంది. ఇంటర్వ్యూ చేసిన మరునాడే బీజేపీకి కర్ణాటకలో పరాభవం ఎదురైంది. దక్షిణాదిన ఆ పార్టీకి ఉన్న ఏకైక రాష్ట్రం హిందుత్వ ముఖం మీదే తలుపులు వేసేసింది. పోయిన ఆదివారం ‘విముక్త’ బెంగళూరులో ప్రభాకర్ పుస్తకానికి ఆవిష్కరణ జరిగింది. ప్రభాకర్ అనే వ్యక్తి ఇదీ అని చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. ఒక వ్యక్తిగా ఆయన గురించి ఆయననే మాట్లాడనివ్వడం మంచిది. మన ఆర్థిక వ్యవస్థ గురించి ఆయన ఇలా అంటారు: ‘‘దేశ ఆర్థిక యాతనలు మోదీ పాలనలోని విస్మయకరమైన అసమర్థతల వల్ల తలెత్తినవి. ఆయన పాలన చక్కటి ఆలోచనాపరత్వాన్ని, పొందిక గుణం కలిగిన ఆర్థిక తత్వాన్ని జతపరచలేకపోయింది.’’ ‘‘ఇష్టానుసారం అధికారాన్ని అపరిమితంగా ఉపయోగించడానికి అలవాటు పడింది. ప్రజాస్వా మ్యాన్ని సమస్యాత్మకం చేసింది.’’ ఫలితంగా, ‘‘1975–77 ఎమర్జెన్సీ తర్వాతెన్నడూ లేని భయం సమాజంలో నేడొక కఠినమైన ప్రత్యక్ష వాస్తవం అయింది’’ అని ప్రభాకర్ ఈ పుస్తకంలో రాశారు. ప్రభాకర్ నిక్కచ్చిగా, నిర్దయగా విషయాన్ని తేల్చేస్తారు. ‘‘మన ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉంది. మన సామాజిక నిర్మాణం బల హీనం అయింది. మన ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది. మనం చీకటి యుగాలకు తిరోముఖం పడుతున్నాం’’ అంటారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలలో హిందూత్వ – అలాగే హిందూత్వపై ప్రతిస్పందించడంలో విపక్షాల అసమర్థత, ప్రాసంగికతను కలిసి ఉన్నా యని ఆయన చెప్పారు. ‘‘దేశ రాజకీయ అగ్రగణ్యతల దిగు వన దాగి ఉన్నమూల ప్రవృత్తులు; సామాజిక, సాంస్కృతిక అభద్రతలను తారుమారు చేయగల నైపుణ్యంపై హిందూత్వ అభివృద్ధి చెందుతుందని అన్నారు. మన గుణగణాలలోని చీకటి కోణాలకు ఇది ఒక విజ్ఞప్తి అని ప్రభాకర్ ఈ పుస్తకం గురించి నాతో అన్నారు. మొన్నటి ఎన్నికల ప్రచారం ముగింపు రోజుల్లో ప్రధాని జై బజరంగబలీ అంటూ ఓటింగ్ మీటను నొక్కమని కర్ణాటక ప్రజల్ని కోరడం వెనుక ఆయన నేర్పు, నర్మగర్భత ఉన్నాయని అనేకమంది విశ్వసిస్తున్నారు. పనితీరులోని వైఫల్యం, అవినీతిలో గడించిన ఖ్యాతి కారణంగా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన ఘోర పరాజయం మీద ప్రభాకర్ తీర్మానాలు స్పష్టతను కలిగి ఉన్నాయి. ‘‘బీజేపీ ప్రస్తుత ఓటమి, తిరిగి అధికారాన్ని సాధించుకోలేక పోవడం అన్నవి పనితీరు వల్ల కాదు. హిందూత్వ గుర్తింపునకు ఆ పార్టీ దృఢ వైఖరిని కలిగి ఉండటం వల్ల, హిందూయేతరులను వేరుగా చూడటం వల్ల’’ అని ఆయన అన్నారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ జై బజరంగ బలీ అన్నదే తప్ప, మంచి పాలనను ఇస్తానని అనలేదు. మనమిప్పుడు ప్రతిపక్షాల గురించి ప్రభాకర్ రాసిన చోటుకు వద్దాం. ‘‘బీజేపీయేతర రాజకీయ వర్గ వైఫల్యమే నేడు మన దేశం సూత్రరహితమైన సౌధంగా మారడానికి ప్రధాన కారణం. బీజేపీనీ, ఆ పార్టీ పరివారాన్నీ సైద్ధాంతికంగా వ్యతిరేకించే రాజకీయ పార్టీలే అత్యంత ప్రభావవంతమైన ఈ సవాలును ఎదుర్కొని ఉండాల్సింది. కానీ వారు తమ దృష్టి, వ్యూహం, శక్తికి సంబంధించిన స్థిరమైన వైఫల్యాలతో మనల్ని ఓడిపోయేలా చేశారు’’ అన్నారాయన. ఆ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎలా అధిగమిస్తున్నాయనే దానికి కర్ణాటకలో మొన్నటి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారమే మొదటి నిదర్శ నమని నేను భావిస్తున్నాను. దృష్టిపరంగా ఆ పార్టీ... ఓటర్ల నిజమైన సమస్యలకు సంక్షేమాన్ని హామీని, సానుభూతితో కూడిన ప్రతిస్పంద నను అందించింది. వ్యూహాత్మకంగా... హిందూ వ్యతిరేకి అని ఆ పార్టీపై ప్రధాని చేసిన ఆరోపణలను తిప్పికొట్టకుండా దాట వేసింది. శక్తి పరంగా అక్షరాలా ఉత్తేజాన్ని నింపింది. దీనిని ప్రభాకర్ అంగీ కరిస్తారని చెప్పగలను. ప్రచారం చరమాంకానికి చేరుకోగానే కాంగ్రెస్ గంభీరంగా, దృఢ నిశ్చయంతో చెవిని నేలకు ఆన్చి (సమగ్ర విషయ సేకరణ జరిపి), ప్రజలపై దృష్టి సారించింది. బీజేపీ ఇందుకు విరుద్ధంగా ఉత్కంఠంగా, నిరాశాపూరితంగా, కొన్నిసార్లు ఉన్మాదంగా కనిపించింది. ఇందుకు కారణం హిందూత్వ వెనకంజ వేయడమేనా? ఉనికి కోసం పోరాడుతుండటమేనా? లేదంటే, ఓటర్లకు కావలసిందేమిటో కాంగ్రె స్కు తెలిసి ఉండటం వల్లనా? ఇప్పుడు నేను పేర్కొన్న సంఘటనల క్రమం, వాటి ఆసక్తికరమైన కాలానుక్రమణిక కేవలం యాదృచ్ఛికం అని అనిపిస్తున్నాయా? లేదా విధివశాత్తూ జరిగినవిగా తోస్తున్నాయా? నిజాయతీగా ఒప్పుకుంటు న్నాను. నేను చెప్పలేను. అయితే ప్రధానమంత్రి, ప్రతిపక్షాలు... ప్రభా కర్ రాసిన ఈ పుస్తకాన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్లకు ఈ పుస్తకం ఒక హెచ్చరిక... అలాగే పాఠం కూడా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి పరకాల గుడ్‌బై
-
పరకాల రాజీనామా
సాక్షి, అమరావతి: ఢిల్లీ కేంద్రంగా బీజేపీతో లాలూచీ వ్యవహారం బట్టబయలు కావడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ రాజీనామా పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో డ్రామాకు తెరతీశారు. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల వల్లే పరకాల రాజీనామా చేసినట్లు చెప్పుకోవడం ద్వారా బీజేపీ–టీడీపీ లాలూచీపై వ్యక్తమవుతున్న విమర్శల నుంచి కొంతవరకైనా తప్పించుకోవచ్చని, ప్రజల దృష్టిని కూడా మరల్చవచ్చనేది చంద్రబాబు వ్యూహమని తెలిసిపోతోంది. పరకాల ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించి రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపారు. ప్రతిపక్ష నాయకులు తనపై ఆరోపణలు చేస్తుండడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పరకాల పేర్కొన్నారు. ఒకపక్క రాష్ట్ర హక్కుల సాధన కోసం బీజేపీ, కేంద్రంతో పోరాడుతూ మరోవైపు తనను సలహాదారుగా కొనసాగించటంపై అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రెండు మూడు రోజులుగా కొందరు నేతలు దీని గురించి మాట్లాడినా తాను పట్టించుకోలేదని, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం తనను బాధించిందన్నారు. తన వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు రాజకీయ ప్రయోజనాలను ఆపాదించాలని ప్రయత్నించడం, తెరవెనుక మంతనాలు, బేరసారాలకు సీఎం వీటిని వినియోగిస్తున్నారని విపక్ష నేత ఆరోపించారన్నారు. మరోవైపు పరకాల రాజీనామాను ఆమోదించేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్షం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మిగిలింది మరో 15 రోజులే.... వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పరకాల పదవీకాలం జూలై 4నాటికి పూర్తి కానుంది. ఇంతలోనే ఆయన హఠాత్తుగా రాజీనామా నిర్ణయానికి రావటం వెనుక టీడీపీ–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలే కారణమని భావిస్తున్నారు. ఇక్కడ విమర్శలు.. అక్కడ వినయం కేంద్రంపై భీకరంగా పోరాడుతున్నట్లు రాష్ట్రంలో తొడగొట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్ర«ధాని మోదీ ఎదుట సాగిలపడడంతో వారి బంధం బట్టబయలైన విషయం తెలిసిందే. చంద్రబాబు దాగుడు మూతలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ధర్మ పోరాటం పేరుతో రాష్ట్రంలో సభలు, సమావేశాలు పెట్టి హడావుడి చేస్తూ మోదీని, కేంద్రాన్ని అదే పనిగా తిట్టడమే పనిగా పెట్టుకుని కొద్దిరోజులుగా చంద్రబాబు కాలం గడుపుతున్నారు. ఇప్పుడు బాబు ఢిల్లీ పర్యటనతో ఇదంతా ఉత్తదేనని తేలిపోయింది. పోరాటం పేరుతో డ్రామాలు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లి మోదీ ఎదుట వంగిపోయి కరచాలనం చేయడంతోనే కేంద్రంపై చంద్రబాబు వైఖరి ఏమిటనేది చెప్పకనే చెప్పినట్లయింది. కేంద్రాన్ని నిలదీస్తానని చెప్పి పాత విషయాలనే ప్రస్తావించడం, వాకౌట్ చేస్తానని మౌనం దాల్చడాన్ని ప్రజలంతా గమనించారు. చంద్రబాబు పైకి కేంద్రాన్ని విమర్శిస్తున్నా అంతర్గతంగా బీజేపీతో సంబంధాలు నెరపుతున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో పోరాటం పేరుతో డ్రామాలాడుతున్నారనే విషయం బహిర్గతమైంది. సోషల్ మీడియాలో కూడా బాబు గోడమీది పిల్లి వ్యవహారాన్ని నెటిజన్లు దుమ్ముదులిపేశారు. ఇది కాదా కుమ్మక్కు? సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పలుసార్లు తీవ్రంగా ఎండగట్టారు. బాబు ఇక్కడ పోరాటం చేస్తానని చెబుతూ ఢిల్లీలో మోదీ ఎదుట సాగిలపడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ సలహాదారుగా ఉంటారని, మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి భార్యను టీటీడీ బోర్డు మెంబర్‌గా నియమించారని ఇదంతా బీజేపీ–టీడీపీ లాలూచీ కాదా? అని నిలదీశారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఇది నిజమేనని తేలిపోవటంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఈ అంశాన్ని కప్పిపుచ్చుకునేందుకు పరకాల ప్రభాకర్‌తో వ్యూహాత్మకంగా రాజీనామా చేయించినట్లు భావిస్తున్నారు. -
ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల రాజీనామా
-
పరకాల ప్రభాకర్ రాజీనామా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంపారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరారు. ఎన్డీయే నుంచి వైదొలగినట్టు పైకి ప్రకటించినప్పటికీ అంతర్గతంగా బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న చంద్రబాబు తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలోనే త్వరలో పదవీ కాలం ముగుస్తున్న పరకాలతో రాజీనామా చేయించినట్టు చెబుతున్నారు. జూలై మొదటి వారంతో పరకాల పదవీ కాలం పూర్తి కానుంది. అయితే, ప్రతిపక్షం నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో తాను పదవికి రాజీనామా చేస్తున్నట్టు పరకాల తన లేఖలో పేర్కొన్నారు. తాను ప్రభుత్వంలో కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు భంగం వాటిల్లకూడదన్న ఉద్దేశంతో రాజీనామా చేసినట్టు పరకాల తెలిపారు. తన కుటుంబంలోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉండటం, అందులోనూ తనకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందున, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను రాజీపడతానని కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ ప్రచారం నేపథ్యంలోనే సలహాదారు పదవిని వదులుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. బాబు రాజకీయం? కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగినప్పటికీ తెరవెనుక బీజేపీ నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీ ప్రభుత్వంలోని ఇద్దరు బీజేపీ మంత్రులు చంద్రబాబు కేబినెట్ నుంచి వైదొలగినప్పటికీ పరకాలను చంద్రబాబు కొనసాగించారు. నాలుగేళ్ల పాటు పరకాల ప్రభుత్వంలో కొనసాగుతూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా కొనసాగుతున్న పరకాల టీడీపీలో చేరాలని కొంతమంది సూచించినప్పటికీ బీజేపీ నేతలతో ఉన్న సంబంధాల దృష్ట్యా ఆవిషయంపై చంద్రబాబు ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకాలం సాఫీగానే సాగినప్పటికీ పరకాల సతీమణి నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి పదవిలో ఉండటం, చంద్రబాబు తెరవెనుక కొందరు సీనియర్ బీజేపీ నేతలతో సంబంధాల కొనసాగించడం వంటి చర్యలపై విపక్షాలు వేలెత్తి చూపేలా చేసింది. ఆ కోణంలోనే, రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీపై యుద్ధం చేస్తామంటూనే చంద్రబాబు.. పరకాలను మీడియా సలహాదారుగా కొనసాగించడం, మహారాష్ట్ర బీజేపీ మంత్రి సతీమణిని టీటీడీ బోర్డులో సభ్యురాలిగా నియమించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విమర్శల నేపథ్యంలో పరస్పర అవగాహన మేరకు తాజా పరిణామం చోటుచేసుకున్నట్టుగానే టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొసమెరుపు: పదవీ కాలం పూర్తవడానికి 15 రోజుల ముందు పరకాల ప్రభాకర్ రాజీనామా చేయడం చేయడం విశేషం. జూలై 5తో ఆయన పదవీ కాలం పూర్తికానుంది. -
పొమ్మనలేక.. పరకాలకు బాబు పొగ!
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు హోదాలో నాలుగేళ్లపాటు కీలకంగా వ్యవహరించిన డాక్టర్ పరకాల ప్రభాకర్‌కు సీఎం చంద్రబాబు కార్యాలయం పొమ్మనకుండా పొగ బెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్రం నుంచి టీడీపీ వైదొలగిన అనంతరం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పరకాలను దూరం పెట్టినట్లు అధికార వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది. కొన్నాళ్లుగా పరకాల ప్రాధాన్యాన్ని తగ్గించిన చంద్రబాబు ముఖ్యమైన అంశాల్లో ఆయన్ను సంప్రదించడంలేదని తెలిసింది. ఇటీవల కలెక్టర్ల సదస్సు సందర్భంగా పరకాల అక్కడ ఉండగానే సీఎం చంద్రబాబు ‘ఎం’ గ్రూపునకు చెందిన సంజయ్ అరోరాను ప్రభుత్వ మీడియా సలహాదారుగా పరిచయం చేశారు. తద్వారా పరకాలను పక్కనపెట్టినట్లేనని భావిస్తున్నారు. తనంతట తానే వెళ్లిపోయే వ్యూహం ఇన్నాళ్లూ కీలకంగా ఉన్న పరకాల ప్రాధాన్యాన్ని చంద్రబాబు కొద్దిరోజుల నుంచి అనూహ్యంగా తగ్గించేశారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఇక ఆయనతో అవసరం లేదనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతుండడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. పరకాల ప్రభుత్వంలో ఉంటే తమకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, ఇతర వ్యవహారాలన్నీ కేంద్రానికి చేరిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఆయన్ను పక్కనపెడితే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో పొమ్మనకుండా పొగ బెడుతున్నట్లు చెబుతున్నారు. అందుకే ఆయన స్థానంలో సంజయ్ అరోరాను మీడియా సలహాదారుగా చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ఒకటికి రెండుసార్లు పరిచయం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రచారం, మీడియా మేనేజ్మెంట్ గురించి సంజయ్ ఆరోరాతో ప్రజెంటేషన్ ఇప్పించారు. మీడియా సలహాదారు, సమాచార శాఖ కమిషనర్‌ను కాదని కొద్దిరోజులుగా చంద్రబాబు ప్రచార వ్యవహారాలు చూస్తున్న సంజయ్‌తో ప్రజెంటేషన్ ఇప్పించడం, ఆయన్ను కమ్యూనికేషన్ సలహాదారుగా చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. పరకాల ప్రభాకర్‌ను 2014లో ప్రభుత్వ మీడియా సలహాదారుగా సీఎం చంద్రబాబు నియమించారు. పరకాల అప్పటి నుంచి మీడియా విషయాలే కాకుండా ప్రభుత్వ, టీడీపీ వ్యవహారాల్లోనూ కీలకంగా ఉంటూ వచ్చారు. -
ఏపీ మంత్రుల రాజీనామాలు ఆమోదం
సాక్షి, అమరావతి : ఏపీ కేబినెట్ నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు సమర్పించిన రాజీనామాలు ఆమోదం పొందాయి. బీజేపీ మంత్రుల రాజీనామాలు గవర్నర్ నరసింహన్ ఆమోదించినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. మంత్రుల రాజీనామాలు గవర్నర్ అంగీకరించినట్లు సీఎం కార్యాలయానికి సమాచారం అందింది. కాగా, టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిల రాజీనామాలు ఆమోదం పొందాయా.. లేదా అనేది తమకు తెలియదని పరకాల చెప్పారు. 'ప్రధాని మోదీతో ఫోన్ సంభాషణలో సీఎం చంద్రబాబు పూర్తి వివరాలు తెలిపారు. మా డిమాండ్లపై కేంద్రం అవమానకరంగా వ్యవహరించడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆంధ్రుల అందరి హక్కు. వీటిపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అవమానకరంగా వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ ప్రజలు అసహనంతో ఉన్నారని' పరకాల తెలిపారు. కాగా, నేటి ఉదయం కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులు ఏపీ కేబినెట్ నుంచి వైదొలగిని విషయం తెలిసిందే. ఆ మేరకు తమ రాజీనామా లేఖలను బీజేపీ నేతలు గురువారం ఉదయం అసెంబ్లీలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందచేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్టు వారు తెలిపారు. సీఎం ఛాంబర్లో కామినేని భేటీ అయి రాజీనామా లేఖ ఇచ్చారు. రాజీనామా లేఖ ఇచ్చిన మూడు నిమిషాల్లోనే మంత్రి మాణిక్యాలరావు వెనుదిరిగారు. బీజేపీ మంత్రులు తమ అధికారిక వాహనాలు, ఐడీ కార్డులను సంబంధిత అధికారులకు అప్పగించారు. -
ప్రజారోగ్యం కోసం ప్రపంచబ్యాంకు రుణం
-
ప్రజారోగ్యానికి ప్రపంచబ్యాంకు రుణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రపంచబ్యాంకు రుణం తీసుకోవాలని శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రి మండలి నిర్ణయాలను విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్లతో కలసి సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. - రాష్ట్రంలో ప్రాథమిక వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.4,807 కోట్లు అవసరమని, వాటిలో ప్రపంచబ్యాంకు నుంచి 70 శాతం (రూ.3,365 కోట్లు) రుణంగాను, మిగిలిన 30 శాతం (రూ.1,442కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. - టాటా ట్రస్ట్‌కు బాలామృతం కార్యక్రమంలో పౌష్టికాహారాన్ని అందించే బాధ్యత అప్పగింత. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ ట్రస్టు ద్వారా మహిళలకు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాల్సి ఉంటుంది. - రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో రూ. 38,265 కోట్లతో 5 లక్షల ఇళ్ల నిర్మాణం. ఈ హౌజింగ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,035 కోట్లు, కేంద్రం రూ.7,500 కోట్లు భరిస్తాయి. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు సమకూర్చుకుంటాడు. -
దావోస్‌లో 25 ద్వైపాక్షిక సమావేశాలు
సాక్షి, అమరావతి: ప్రపంచ ఆర్థిక వేదిక ప్రత్యేక ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు సోమవారం తెల్లవారుజామున దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన తాత్కాలిక సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. దావోస్ పర్యటనలో ఈసారి బాబు 25 ద్వైపాక్షిక సమావేశాలతో పాటు ఐదు సమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గాను మూడు ఒప్పందాలపై సంతకాలు చేస్తారన్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా ప్రారంభ ప్లీనరీలో పాల్గొంటారని వివరించారు. రెండో రోజు ఏపీ లాంజ్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని, అదేరోజు మధ్యాహ్నం నుంచి స్థానిక ప్రముఖులు, అంతర్జాతీయ సంస్థల సీఈవోతో సమావేశమవుతారని తెలిపారు. సీఐఐ రౌండ్‌టేబుల్ సమావేశంతో పాటు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారని చెప్పారు. ఈనెల 25 వరకు ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పారు. సీఎం వెంట తనతో పాటు మంత్రులు యనమల, లోకేశ్, వ్యవసాయ సలహాదారుడు విజయకుమార్, ఈడీబీ సీఈవో జె.కృష్ణ్ణకిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోఖ్యరాజ్ తదితరులుంటారని తెలిపారు. -
18 నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం విదేశీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 26 వరకు ముఖ్యమంత్రి మూడు దేశాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, రాజధాని పరిపాలన నగరం ఆకృతుల ఖరారు చేయడమే లక్ష్యంగా అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లండ్‌లలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని వెల్లడించారు. ఈనెల 18వ తేదీ నుంచి 20 వరకు 3 రోజులు అమెరికాలో, 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో, చివరిగా 24 నుంచి 26వ తేదీ వరకు 3 రోజులు యూకేలో పర్యటిస్తారన్నారు. ఈ పర్యటనలో భాంగా చంద్రబాబు నాయుడుకు యూకేలో గోల్డెన్ పీకాక్ అవార్డు బహుకరించనున్నట్లు పరకాల ప్రభాకర్ తెలిపారు. -
అంతర్గత విషయాలు బయటకు చెబుతారా?
కృష్ణారావుది విపరీత ధోరణి: పరకాల సాక్షి, హైదరాబాద్: ఐవైఆర్ కృష్ణారావు చాలా పెద్ద మనిషి అని, అయితే ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించక తప్పలేదని రాష్ట్ర ప్రభుత్వ కమ్యూనికేషన్ల సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. పరకాల హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ సర్వీసుల్లో 30 ఏళ్లకుపైగా ఐవైఆర్ అత్యుత్తమ సేవలందించారని, అలాంటి వ్యక్తి ప్రభుత్వంలో అంతర్గతంగా జరిగే విషయాలను బయటకు చెప్పరాదనే నియమాన్ని పాటించలేదన్నారు. ఆరు నెలలుగా సీఎం తనను కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ఐవైఆర్ విమర్శల్లో నిజం లేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన పెట్టిన పోస్టింగ్‌లు విపరీత ధోరణిని సూచిస్తున్నాయని, ఇలా వ్యవ హరించడాన్ని ప్రభుత్వం అత్యంత అభ్యంతరక రంగా భావించిందన్నారు. -
ఐవైఆర్ ఇలా చేస్తారనుకోలేదు: పరకాల
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ఐవైఆర్ కృష్ణారావుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. సీఎంను ఎప్పుడైనా కలిసే స్వేచ్ఛ ఆయనకు ఉందని, ఐవైఆర్ అలా మాట్లాడతారని తాము ఊహించలేదన్నారు. పరకాల ప్రభాకర్ మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ కృష్ణారావు అంటే మాకు చాలా గౌరవం. రాష్ట్రానికి మీ సేవలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆయనను పిలిచి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. మూడేళ్ల పదవీ కాలానికి ఆయనను చైర్మన్‌గా నియమించారు. చంద్రబాబుకు ఐవైఆర్‌పై చాలా నమ్మకం ఉంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చాలా పద్ధతిగా నడుస్తోంది. లోటు బడ్జెట్ ఉన్నా బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అధిక నిదులు కేటాయించాం. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు కొన్ని కట్టుబాట్లకు లోబడి ఉండాలి. వాటిని అనుసరించి మాట్లాడాలి, ప్రవర్తించాలి. ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించడం ఎంతవరకూ సమంజసం. పార్టీకి భజన చేయాలని ఎవరూ అడగలేదు. అడగరు కూడా. ప్రభుత్వ పథకాలను సమర్థంగా చేయాలనే అడుగుతారు. అయితే ప్రభుత్వానికి, శాసనసభ, శాసనమండలికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై అభ్యంతరం తెలిపాం. అంతేతప్ప కృష్ణారావుపై ప్రభుత్వపరంగా ఎలాంటి ఆంక్షలు లేవు. బ్రాహ్మణ కార్పొరేషన్లో ఎలాంటి రాజకీయాలు లేవు. ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వాన్ని విమర్శించారు. అందుకే ఆయనను పదవి నుంచి తొలగించాం. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసినవారిని ఐవైఆర్ సమర్థించడంలో ఔచిత్యం లేదు. గౌతమీపుత్ర శాతకర్ణి, బాహుబలి, సోషల్ మీడియా గురించి ఆయన అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఐవైఆర్ నిబద్ధత, నిజాయితీ పట్ల మాకు ఎలాంటి 'సందేహాలు లేదు. ఇప్పటికీ ఆయనపై అమితమైన గౌరవం ఉంది.’ అని అన్నారు. -
రాజధానిపై ఏప్రిల్‌లో నిష్ణాతుల కమిటీ నివేదిక
సాక్షి, అమరావతి: ఏపీ సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదలను రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో నిక్షిప్తం చేయడానికి ఏర్పాటైన ‘నిష్ణాతుల కమిటీ’ ఏప్రిల్ మొదటి వారంలోగా కసరత్తు పూర్తి చేయాలని నిర్ణయించింది. మలి విడత సమావేశాల్లో భాగంగా ఆదివారం సీఆర్డీఏ కార్యాలయంలో భేటీ అయిన ఈ కమిటీ పలు అంశాలపై చర్చించింది. ఎవరెవరు ఏయే బాధ్యతలను గడువులోగా పూర్తి చేయాలో కమిటీ నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు కుడ్యాలు, కూడళ్లు, భవంతులు, ప్రాకారాల నమూనాలను వేర్వేరుగా వర్గీకరించి తుది ఆకృతులకు దృశ్య రూపకల్పన చేసే బాధ్యతను ప్రముఖ సినీ ఆర్డ్ డైరెక్టర్ ఆనంద్‌సాయికి అప్పగించింది. కమిటీ చేసే సూచనలు, సలహాలను అమరావతి నగర రూపశిల్పిగా ఉన్న నార్మన్ పోస్టర్ సంస్థకు త్వరలో అందించాల్సి ఉందని కమిటీ సారథి పరకాల ప్రభాకర్ తెలిపారు. -
పెట్టుబడుల కోసమే సీఎం దుబాయ్ టూర్
తిరుపతి రూరల్: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నెల 11 నుంచి 14 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం దుబాయ్, అబుదాబిలో పర్యటించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ తెలిపారు. గురువారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటన వివరాలను తెలిపారు. ఈ బృందంలో తనతో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆరుగురు ఐఏఎస్ అధికారులు ఉంటారని పేర్కొన్నారు. 15న మంత్రివర్గ సమావేశం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 15న వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో జరగనుంది. -
రాష్ట్రాభివృద్ధిలో మీడియా పాత్ర కీలకం
తిరుపతి కల్చరల్ : మీడియా చాలా శక్తివంతమైందని, రాష్ట్ర వికాసానికి తన శక్తిని వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కోరారు. ఓ ప్రైవేటు హోటల్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్దిలో మీడియా పాత్ర అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఏపీజేఎఫ్ జర్నలిస్టుల సంక్షేమం కోసమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి ప్రజలను చైతన్యవంతులు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా ఏ జర్నలిస్టు సంఘం పని చేయని విధంగా రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. ఇందులో భాగంగా ఏపీజేఎఫ్ ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్ర విభజన అన్యాయంగా, అసంబంద్ధంగా జరిగిందన్నారు. తెలంగాణకు ఆస్తులు, అంధ్రకు అప్పులు ఇచ్చారని, రాష్ట్ర విభజన నాటికి 16 వేల కోట్లు లోటు బడ్జెట్‌ను మిగిల్చారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం అంచనాల ప్రకారం 2020 నాటికి కూడా రూ. 2500 కోట్లు లోటు బడ్జెట్లోనే మన రాష్ట్రం ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో పాలనాదక్షుడైన చంద్రబాబు సీఎం కావడంతో విభజన జరిగిన ఆరు నెలల్లోనే విభజన సమస్యలను మరిచిపోగలిగామన్నారు. 2050 నాటికి భావితరాలు గర్వించేలా గొప్ప రాష్ట్రం రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మీడియా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలని చెప్పారు. ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా కీలపాత్ర పోషిస్తోందన్నారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.గిరిధర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కృపవరం, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మోహన్‌ప్రసాద్ పాల్గొన్నారు. –––––––––– -
'కావాలనే మాపై బురద జల్లుతున్నారు'
హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్లైన్ అప్లికేషన్లను కాపీ కొట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. దీనిపై ఎలాంటి ఆధారాలు లేకుండా తెలంగాణ మంత్రి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బుధవారం విజయవాడలో పరకాల ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడుతూ.. కావాలనే మాపై బురద జల్లుతున్నారని తెలంగాణ మంత్రిపై ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పోర్టల్ ద్వారా ఇప్పటికే 9 వేల లావాదేవిలు జరిగాయని పరకాల ప్రభాకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మాపై ఆరోపణలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయో ముందు చెప్పాలని పరకాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
'హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలి'
ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే వస్తే సరిపోదు.... ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన పరకాల ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడారు. ఆగస్టు 25న ముఖ్యమంత్రి చంద్రబాబు.... ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఇన్నాళ్లు జనం మధ్యకు రావడానికే ఇబ్బంది పడిన నేతలు ఇప్పుడు టీడీపీని విమర్శించడం తగదంటూ కాంగ్రెస్ నేతలను పరోక్షంగా విమర్శించారు. అప్రజాస్వామిక పద్దతిలో రాష్ట్రాన్ని చీల్చినవారికి ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు లేదని పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. -
సీఎం నాలుగు రోజులు... మంత్రులు మూడు రోజులు
సాక్షి, విజయవాడ బ్యూరో: వారంలో నాలుగు రోజులు విజయవాడ నుంచే రాష్ట్ర పరిపాలన నిర్వహించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ రాష్ట్ర స్థాయి ప్రభుత్వ నిర్ణయాలకు సర్కారు కట్టుబడి ఉందన్నారు. ఇకపై మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు కూడా వారంలో మూడ్రోజులు విజయవాడలోనే ఉంటారన్నారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అందులోని ఆదాయ, వ్యయాలపై ఆర్థిక రంగ నిపుణులతో సమీక్షించారన్నారు. మూడో విడత రైతు రుణమాఫీ, అందులోని సమస్యలు, పరిష్కారాలపై కూడా అధికారులతో సమీక్షించారని తెలిపారు. -
ఆగస్టు 15న పట్టిసీమ ఫేజ్-1 ప్రారంభం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15వ తేదీ మధ్యాహ్నం పట్టిసీమ మొదటి దశను ప్రారంభిస్తారని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఈనెల 10వ తేదీన విశాఖపట్నంలో మీభూమి - మీ ఇంటి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారని చెప్పారు. అదే రోజున షియోమి ఫోన్ల కంపెనీ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారన్నారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత మూడు రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ, మరికొన్ని జిల్లాల్లో పర్యటిస్తారని పరకాల చెప్పారు. -
పాసు పుస్తకం లేకపోయినా బ్యాంకులో రుణాలు
హైదరాబాద్: ఇక మీద రైతులు పట్టాదారు పాసుపుస్తకం లేకపోయినా బ్యాంకులో రుణాలు పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులకు 13 వేల ట్యాబ్‌లు ఇస్తున్నామని తెలియజేశారు. వాటి ద్వారానే రైతుల భూములు అప్లోడ్ చేస్తామన్నారు. భూ యజమానుల వివరాలతో పాటు పంటల వివరాలు కూడా ఆన్లైన్లో ఉంచుతామని తెలిపారు. రైతుల భూమి రికార్డుల సమస్యలన్నింటినీ గ్రామసభల్లో పరిష్కరిస్తామన్నారు. అందుకోసం ఆగస్టు నెల 10 నుంచి 30 వరకు రాష్ట్రంలో రెవెన్యూ గ్రామసభలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ తెలిపారు. -
అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన
హైదరాబాద్: అక్టోబర్ 22న ఆంధ్రప్రదేశ్ రాజధానికి శంకుస్థాపన చేస్తామని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. సోమవారం ప్రభుత్వానికి రాజధాని సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ అందుతుందని చెప్పారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం సీఎం చంద్రబాబునాయుడికి ఆ ప్లాన్ అందజేస్తుందని చెప్పారు. ఆ ప్లాన్ వచ్చాక క్యాపిటల్ పనులు మరింత వేగం పుంజుకుంటాయని చెప్పారు. -
'బాబు గురించి మాట్లాడేందుకు పరకాల ఎవరు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేందుకు పరకాల ప్రభాకర్ ఎవరు అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఆధారాలను బయట పెట్టాలని తలసాని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసి నిప్పులాంటి వాడని నిరూపించుకోవాలని తలసాని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఎప్పడికి లోపలికి వెళ్తారా ? అని ఆ రాష్ట్ర మంత్రులు ఎదురు చూస్తున్నారన్నారు. ఏసీబీ వ్యవహారంలో తాము ఎక్కడా జోక్యం చేసుకోబోమని ఆయన తెలిపారు. -
మా సీఎం ఫోన్ ట్యాప్ చేశారా?
⇒ ఏపీ ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ ⇒ సాక్ష్యాధారాలన్నీ కోర్టుకు సమర్పించినప్పుడు ఈ ఆడియో రికార్డింగ్ ఎక్కడిది? ⇒ మమ్మల్ని అభాసుపాలు చేయడానికి, మా స్థ్యైరాన్ని దెబ్బతీయడానికి తెచ్చారా? ⇒ డీజీపీ, ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు సమాలోచనలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో జరిపిన ఫోన్ సంభాషణ రికార్డులు వెలుగు చూసిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఏపీ పోలీసు ఉన్నతాధికారులు, న్యాయవాదులు, పార్టీ సీనియర్ నేతలతో ఆదివారం తన నివాసంలో అర్ధరాత్రి వరకు సమాలోచనలు జరిపారు. అనంతరం ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు బయటకు పొక్కిన ఆడియోలోని సంభాషణలోనిది ఏపీ సీఎం గొంతు కాదని చెప్పారు. అది ఏపీ ముఖ్యమంత్రి సంభాషణ కాదన్నారు. ఈ కేసులో సేకరించిన సాక్ష్యాధారాలన్నీ కోర్టుకు సమర్పించినప్పుడు ఈ ఆడియో రికార్డింగ్ ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. సాక్ష్యాధారాల్లో సేకరించింది కాదా? మా ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేశారా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం ఫోన్ టాప్ చేశామని చెబుతారా? అసలు ఈ టేపులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. మీకున్న టెక్నాలజీతో గుదిగుచ్చి అభాసుపాలు చేయడానికి, అవమానించడానికి మా మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడానికి తెచ్చారా? చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఏసీబీ డీజీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇది ఫోన్‌ట్యాపింగ్ కాకుండా.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ తన ఫోన్లో ఆడియో రికార్డ్ చేసిందని అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా.. అలాంటివేమైనా ఉంటే కోర్టు సమక్షంలో ఉండాలి కదా అని పరకాల బదులిచ్చారు. దర్యాప్తు చేస్తున్నవారు ఆడియో, వీడియో టేపులు, ఇతర సాక్ష్యాధారాలు ఏమున్నా కోర్టు ముందుంచాలని, అలాకాకుంటే వీళ్లు రుజువులను తారుమారు చేస్తున్నట్టేనని చెప్పారు. ‘‘కోర్టులో ఉండాల్సినవి బయటకు వచ్చాయంటే మీరు కావాలని గుదిగుచ్చి అభాసుపాలు చేయడానికి చేస్తున్నట్టే. ఈ ఉదంతంపై ఊరుకునే ప్రసక్తే లేదు. అంతుచూస్తాం’’ అని ఆయన హెచ్చరించారు. ‘ఇదంతా తెలంగాణ సీఎం చేసిన పనికాదా? నాకు సంబంధం లేదని ఆయన్ను చెప్పమనండి? ఈ ఆడియో టేపులకు సోర్స్ ఏంటో చెప్పమనండి’ అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా పోరాటం చేస్తామన్నారు. ఏపీ సీఎం పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? విభజన చట్టంలోని సెక్షన్ 8లో ఉమ్మడి రాజధానిలో ఉమ్మడి గవర్నర్ భద్రత చర్యలు చేపట్టాల్సి ఉంటుందని, అయితే గవర్నర్ పాత్రేమిటో ఆలోచించుకోవాలని పరకాల అన్నారు. ఉమ్మడి రాజధానిలో ఏపీ సీఎం పట్ల మీరు వ్యవహరించే తీరు ఇదేనా? అని అన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో వారిని శిక్షించేవరకు, జైలుకు పంపించేవరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ కేసుకు సంబంధించి తమకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. మీరు సంబరాలు చేసుకుని రే పటిరోజున తాము ‘మహాసంకల్పం’ నిర్వహించుకునే దశలో ఇంతటి నీచమైన, క్షుద్రమైన, దారుణమైన పనికి ఒడిగడతారా? అని మండిపడ్డారు. దీనికి మూల్యం చెల్లించకతప్పదన్నారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ చివరివరకూ తీసుకెళ్తామని చెప్పారు. ఉలిక్కిపడిన బాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల లంచం ఎరవేసి రూ.50 లక్షలు ముట్టజెప్పిన సందర్భంగా అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి కేసులో చంద్రబాబు ప్రమేయమున్నట్టు ఆడియో టేపులద్వారా వెల్లడికావడం తెలుగుదేశం నేతలను కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు వ్యవహారంలో నేరుగా చంద్రబాబు ప్రమేయమున్నట్టు ఆడియో టేపులు టీవీల్లో ప్రసారం కావడం చూసి చంద్రబాబుతోపాటు మంత్రులు, సీనియర్ నేతలు ఉలిక్కిపడ్డారు. స్టీఫెన్‌సన్‌తో జరిపిన ఫోన్ సంభాషణ బయటకు పొక్కిన నేపథ్యంలో చంద్రబాబు ఆగమేఘాలపై ఏపీ పోలీసు ఉన్నతాధికారులు, పలువురు న్యాయవాదులను పిలిపించుకుని తన నివాసంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. అర్ధరాత్రి వరకు అధికారులు, పలువురు మంత్రులతో ఆయన సుదీర్ఘ మంతనాల్లో మునిగిపోయారు. తక్షణం ఎలా స్పందించాలన్న విషయంపై తర్జనభర్జన పడ్డారు. డీజీపీ రాముడుతోపాటు ఇంటెలిజెన్స్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశానంతరం ఆయన న్యాయవాదులు, పార్టీ సీనియర్లతో విడిగా సమాలోచనలు జరిపారు. నామినేటెడ్ ఎమ్మెల్యేతో జరిగిన సంభాషణకు సంబంధించి ఆడియో రికార్డులు ఎలా బయటపడ్డాయి? ఎవరిచ్చారు? తదుపరి చర్యలు ఎలా ఉంటాయి? ఈ మొత్తం వ్యవహారంపై ఎలా స్పందించాలి? వంటి అంశాలపై చంద్రబాబు లోతుగా చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సుదీర్ఘ మంతనాల అనంతరం పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. అయితే, పరకాల ప్రభాకర్ వివరణపై పెదవి విరిచిన పలువురు తమకు సూటిగా సమాధానం చెప్పాలంటూ పలు ప్రశ్నలు సందించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ? ► టేపుల్లో ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరం కాదంటారు... ఆ వెంటనే వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన చంద్రబాబు మాటలే అతికించారంటారు. ఇందులో ఏది నిజం? ► ఆ టేపుల్లో ఉన్నది తన స్వరం కాకపోతే చంద్రబాబు స్వయంగా ఎందుకు ఖండించలేదు? ► రేవంత్‌రెడ్డి వ్యవహారం బయటపడినప్పటినుంచీ చంద్రబాబు ఆ అంశంపై నోరెందుకు విప్పలేదు? ► రేవంత్ ఎపిసోడ్‌తో మాకు సంబంధం లేదని చెప్పే ధైర్యం ఇప్పటివరకూ టీడీపీకి ఎందుకు లేకపోయింది? ► యావత్ తెలుగుజాతి టీడీపీని ముద్దాయిగా చూస్తున్నా నిజమేంటో చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ► రేవంత్‌రెడ్డిపై కుట్రచేశారని బుకాయిస్తారే తప్ప... రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు ఇచ్చింది వాస్తవంకాదా? ‘బాస్’ చెప్తేనే వచ్చానని చెప్పలేదా? ► ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోతే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై కుట్ర జరిగిందంటారేం. ఏపీ సీఎంకు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏం అవసరం? ► మీ పార్టీ, మీ అధినేత తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చాలని చూస్తారేం? -
'ఆ సంభాషణ చంద్రబాబుది కాదు'
-
ఆ సంభాషణ చంద్రబాబుది కాదు: పరకాల
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు ముడుపుల వ్యవహారంలో తాజాగా బహిర్గతమైన ఆడియో టేపుల్లోని సంభాషణ తమ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాదని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. అసలు ఈ ఆడియో ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అక్కడక్కడ మాట్లాడిన మాటలన్నీ కలిపి టెక్నాలజీ సాయంతో ప్రజలను నమ్మించేందుకే సృష్టించారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ నేరం అని, కావాలనే ట్యాప్ చేశారేమో చెప్పాలని పరకాల డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టబోమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ప్రభాకర్ ప్రెస్ మీట్ లో ముఖ్యాంశాలు.. *ఆడియో టేపుల్లో ఉన్న సంభాషణలు చంద్రబాబువి కావు *ఈ సంభాషణ ఎక్కడ్నుంచి వచ్చింది.. టెలిఫోన్ ట్యాపింగ్ నేరం *అక్కడక్కడ మాట్లాడిన మాటలను పేర్చి ఆడియో టేపులను తయారు చేశారు *ఇది మామాలుగా విడిచిపెట్టే వ్యవహారం కాదు..దీని అంతు చూస్తాం. *మా సీఎంను అరెస్టు చేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు *మాకు నోటీసులు రాలేదు, పంపే ధైర్యం చేయరు *రేపు తాము నిర్వహించే మహాసంకల్ప దీక్షను ప్రజలు దిగ్విజయం చేయాలి * మా సభను రెట్టింపు ఉత్సాహంతో నిర్వహిస్తాం *మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే కుట్ర *తెలంగాణ హోంమంత్రి టేపులున్నాయని ముందే చెప్పారు *ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారా? *ఇదంతా తమపై కుట్ర కాదా? * మహాసంకల్ప దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర *రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బ తీస్తున్నారు *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన పని కాదా? *ఇది ఎలా తీసుకొచ్చారో చెప్పండి.. * ఏపీ సీఎం ఫోన్ ను ట్యాప్ చేశామని చెప్పగలరా? *దీనిపై అన్నిరకాలుగా ఫైట్ చేస్తాం *ఇది చాలా నీచమైన పని.. కుట్రపూరితమైన పని *బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పనికాదు *అన్నీ టేపులు కోర్టుకు సమర్పించామన్నప్పుడు మరి ఈ టేపులు ఎక్కడివి? -
'ప్రత్యేక హోదా సాధిస్తాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధిస్తామనే నమ్మకముందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రణాళిక మంత్రి ఇంద్రజిత్ సింగ్ ఎంపీలకు ఇచ్చిన సమాధానంలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదని పరకాల ప్రభాకర్ చెప్పారు. -
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణమాఫీ
-
పరపతే కొలమానం
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణమాఫీ: పరకాల జాబితాలో పేర్లు లేని రైతులు జనవరి 9వ తేదీ లోపు సవరణలు చేసుకోవాలి నేడు చిత్తూరులో సీఎం చేతుల మీదుగా రుణ విముక్తి సర్టిఫికెట్లు సాక్షి, హైదరాబాద్: ‘‘రైతులు తీసుకున్న రుణం అంతా మాఫీ చేయమంటే ఎలా సాధ్యం? బ్యాంకర్లు ఇష్టం వచ్చినట్లు రుణాలు ఇస్తే ప్రభుత్వానికి ఏమి సంబంధం? అందుకే ప్రభుత్వం రుణ మాఫీ పథకం అమలుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను కొలమానంగా తీసుకుంది’’ అని ప్రభుత్వ సమాచార సలహాదారుడు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన బుధవారం సచివాలయంలో విలేకరులతో మాటాడారు. రైతులను అయోమయానికి గురి చేసే విధంగా కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని ఆరోపించారు. వాటిని నమ్మి ఎవ్వరూ అపోహలకు గురి కావద్దన్నారు. ‘రుణ మాఫీ హామీ ప్రకటన చేసిన సమయంలో చంద్రబాబు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని రైతులకు చెప్పలేదు కదా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. నేరుగా సమాధానం చెప్పకుండా ‘‘ఒక రైతు కుటుంబం 15 ఖాతాల ద్వారా రూ. 70 లక్షల రుణం తీసుకుంది.. అదంతా మాఫీ చేయమంటారా?’’ అని పరకాల ఎదురు ప్రశ్న వేశారు. మొదటి విడతగా 22.79 లక్షల రైతు కుటుంబాలను రుణ విమోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 10 లక్షల మంది రైతులకు మొత్తం రుణం ఒకేసారి మాఫీ అవుతోందన్నారు. డేటా ఎంట్రీ సమయంలో కొన్ని తప్పులు దొర్లాయని వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. లోపాలున్న జాబితాను ఆన్లైన్లో ఉంచామని.. ఏ కారణం చేత తొలి జాబితాలో పేరు లేదో తెలుసుకొని సంబంధిత డాక్యుమెంట్లను జనవరి 9వ తేదీ లోపు ఆధారాలతో సహా ఇస్తే సరిచేసి రుణ మాఫీకి అర్హులుగా గుర్తిస్తామని చెప్పారు. రుణ మాఫీ పథకాన్ని సీఎం చంద్రబాబు గురువారం చిత్తూరు జిల్లాలో ప్రారంభిస్తారని.. ఈ సందర్భంగా రైతులకు వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను అందజేస్తారని ఆయన వివరించారు. తెలంగాణలో ఆధార్, రేషన్ కార్డు ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్‌లో పొలం ఉండటంతో పాటు అక్కడే రుణం తీసుకున్న వారి విషయంలో ఏమి చేయాలని ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా 2013 డిసెంబర్ 31వ తేదీ తర్వాత వచ్చే బీమా మొత్తం రైతుల ఖాతాకే జమ అవుతుందన్నారు. -
ఏపీ సీఎంతో నేడు సింగపూర్ మంత్రి భేటీ
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపకల్పన అంశంపై సింగపూర్ వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్, ఏపీ సీఎం చంద్రబాబుల మధ్య సోమవారం కీలక సమావేశం జరగనుంది. సింగపూర్ ప్రభుత్వాన్ని రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇవ్వాల్సిందిగా చంద్రబాబు గత నెల సింగపూర్ పర్యటనలో కోరారు. దీనిపై సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి కనబరచడమే కాకుండా ఈ నెల 4న ఒక ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్ పంపింది. ఇక్కడ అధికారులతో ఆ బృందం సమావేశమై రాజధాని ప్రాంతానికి సంబంధించిన వివరాలతో పాటు మ్యాప్‌లను కూడా తీసుకువెళ్లింది. మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సింగపూర్ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని అంశాల్లో వివరణ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని అంశాల్లో ఆ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ క్రమంలో సోమవారం చంద్రబాబుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే అవగాహన ఒప్పందం జరిగే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ ‘సాక్షి’కి తెలిపారు. సింగపూర్ మంత్రి వెంట రాజధాని నిర్మాణాల్లో నిష్ణాతులైన కంపెనీల ప్రతినిధులు కూడా రానున్నారని చెప్పారు. అలాగే సీఎం జపాన్ పర్యటన అనంతరం అక్కడి సంస్థలు రాజధాని నిర్మాణంలో సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. -
'కీలుబొమ్మలా మారిన చంద్రబాబు'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ లో సలహాదారుల పాలన కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ నాయకుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు. సలహాదారుల చేతిలో చంద్రబాబును కీలుబొమ్మలా మారారని ఆరోపించారు. పరకాల ప్రభాకర్ అండ్ కో చెప్పిన విధంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారని వ్యాఖ్యానించిన పరకాలపై చెవిరెడ్డి మండిపడ్డారు. పరకాల మాటలు దగా, వంచన అన్నారు. అన్ని శాఖల్లో ఆయన వేలు పెడుతున్నారని, ఇక మంత్రులు అనవసరం అని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. -
వ్యవసాయ రుణాలంటే పంట రుణాలే
చంద్రబాబు అదే అర్థంలో చెప్పారు: పరకాల భాష్యం ప్రతిపక్ష నేత జగన్‌కు స్పష్టత లేకపోవడం వల్లే ఆరోపణలు ఈ నెల 10వ తేదీ లోగా 71 శాతం మంది రైతులకు రుణ విముక్తి శనివారం రాత్రికి అర్హులైన రైతుల జాబితా ఆన్లైన్లో పెడతాం సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల పరిభాషలో.. సెరీకల్చర్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, గొర్రెల పెంపకం, ట్రాక్టర్లు, టిల్లర్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు ఇచ్చిన అన్ని రకాల రుణాలను వ్యవసాయ రుణాలుగా పేర్కొంటారని.. అయితే చంద్రబాబు మాత్రం పంట రుణాలనే అర్థంలో మాత్రమే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల హామీల్లో చెప్పారని.. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీకి కూడా ఇదే అర్థమని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ సరికొత్త భాష్యం చెప్పారు. బాబు వ్యవసాయ రుణాలని చెప్పినా ప్రజలు పంట రుణాలనే అర్థం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పరకాల శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రుణాలు రూ. 87,612 కోట్లని, దీనికి ఆధారంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) నివేదికను ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘అదే నివేదికలో ఏడో పేరాలో అన్ని రకాల వ్యవసాయ రుణాలు రూ. 87,612 కోట్లు ఉంటుంది. కానీ 10వ పేరా వరకు ప్రతిపక్ష నేత ఓపిగ్గా చదివితే వ్యవసాయ రుణాలు రూ. 49,774 కోట్లు కూడా కనిపించేది. ప్రతిపక్ష నేతకు సరైన సమాచారం లేక పొరపడ్డారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతు కుటుంబాలు 32 లక్షలే... 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో రైతు కుటుంబాలు 32 లక్షలే ఉన్నాయని పరకాల పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు మీరు (పరకాల ప్రభాకర్) టీడీపీతో లేరు కాబట్టి.. వ్యవసాయ రుణాలు, పంట రుణాలకు తేడా తెలియక, స్పష్టత లేకపోవడం వల్ల పంట రుణాలనే వ్యవసాయ రుణాలని బాబు పొరబడ్డారని మీరు భావిస్తున్నారా?’’ అని విలేకరులు అడిగినప్పుడు..ఆయనకు చాలా స్పష్టత ఉందని, వ్యవసాయ రుణాలంటే పంట రుణాలేనని ప్రజలూ అర్థం చేసుకున్నారని ఆయన సమాధానం చెప్పారు. తొలి దశలో 22.79 లక్షల (71 శాతం) మంది రైతులను రుణాల నుంచి విముక్తి చేయనున్నామని, ఈ నెల 10 లోగా వారి బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ చేస్తామని పరకాల చెప్పారు. శనివారం రాత్రికి రుణ విముక్తికి అర్హులైన రైతుల జాబితాను ఆన్లైన్లో ఉంచుతామని తెలిపారు. 22.79 లక్షల మంది రైతులకు ఉపశమనం కల్పించడానికి చెల్లిస్తున్న రుణాల మొత్తం ఎంత అనే విషయం మీద విలేకరులు గుచ్చిగుచ్చి ప్రశ్నించినా.. ఆయన సమాధానం చెప్పలేదు. ‘‘మీరు ప్రశ్నలు అడుగుతున్నట్లుగా లేదు. నన్ను పరీక్షిస్తున్నట్లుగా ఉంది’’ అని ఆయన ఒక దశలో అభ్యంతరం చెప్పారు. మరో 45 రోజుల్లో రెండో దశ రుణ విముక్తి కూడా పూర్తి చేస్తామని పరకాల పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని 100 సార్లు సవరించాం... రుణమాఫీకి సంబంధించి జారీ చేసిన జీఓలో 2014 మార్చి వరకు తీసుకున్న రుణాలను చెల్లిస్తామని ఉందని, కానీ తీరా అమలు చేస్తున్న సమయంలో 2013 డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలనే చెల్లిస్తున్నారని, ఇది మాట తప్పడం కాదా? అని విలేకరులు ప్రశ్నించినప్పుడు.. రాజ్యాంగాన్ని 100 సార్లు సవరించామనీ అంటే అన్ని సార్లు మాట తప్పినట్లా? అని ప్రశ్నించారు. -
నరసాపురానికి పోర్ట్ తీసుకువస్తాం: పరకాల
నరసాపురం పట్టణానికి పోర్ట్ తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పరకాల ప్రభాకర్ ఆయన భార్య ,కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నరసాపురం వచ్చారు. ఈ సందర్భంగా పరాకాల ప్రభాకర్, నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పేరుపాలెం బీచ్‌ను దేశంలో అతిపెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దుతామన్నారు. అలాగే తాము దత్తత తీసుకున్న తూర్పు తాళ్లు, పెదమైనివానిలంక గ్రామాలను రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామాలుగా తీర్చుదిద్దుతామని చెప్పారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నరసాపురం మండలంలోని పెదమైనివాని లంక గ్రామాన్ని, ఆమె భర్త పరకాల ప్రభాకర్ తూర్పు తాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సింగపూర్ వెళ్లిన చంద్రబాబు
-
సింగపూర్ వెళ్లిన చంద్రబాబు
* పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా.. * మూడు రోజుల పాటు సింగపూర్‌లో ముఖ్యమంత్రి బృందం పర్యటన * రాజధానికి సహకారం, పెట్టుబడుల ఆకర్షణ కోసమేనన్న మంత్రులు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సింగపూర్ వెళ్లారు. ఆయన వెంట మంత్రులు, టీడీపీ ఎంపీలు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన చంద్రబాబు రాత్రికి సింగపూర్ చేరుకున్నారు. జూన్ ఎనిమిదో తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు జరుపుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఆయన బుధ, గురు, శుక్రవారాల్లో సింగపూర్‌లో పర్యటించనున్నారు. చంద్రబాబు వెంట సింగపూర్ వెళ్లిన వారిలో మంత్రులు యనమల రామకృష్ణుడు, డాక్టర్ పి.నారాయణ, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, టీడీపీ ఎంపీ సి.ఎం.రమేష్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎ.ఆర్.అనూరాధ, సీఎం కార్యాలయ కార్యదర్శి ఎ.గిరిధర్, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి డి.సాంబశివరావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణ, సీఎం ముఖ్య భద్రతాధికారి నగేష్‌బాబు, వ్యక్తిగత సహాయకుడు బి.రాజగోపాల్ ఉన్నారు. సోమవారం సాధారణ పరిపాలన శాఖ సీఎం వెంట సింగపూర్ వెళ్లే వారి పేర్లతో ఒక జీవో జారీ చేసింది. అందులో సి.ఎం.రమేష్, అనూరాధల పేర్లు లేవు. మంగళవారం వారిద్దరు కూడా సీఎం వెంట వెళ్లే బృందంలో ఉన్నారంటూ మరో జీవోను సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసింది. తొలుత ఈ బృందంలో టీడీపీపీ నేత వై.సత్యనారాయణ (సుజనా)చౌదరి కూడా ఉండాలి. ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవటంతో ఆఖరు నిమిషంలో పర్యటన నుంచి తప్పుకున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన బృందంలో సభ్యులుగా ఉన్న మంత్రులు యనమల, నారాయణ, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు నూతన రాజధాని నిర్మాణంలో ఆ దేశ సాయం తీసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు పేర్కొన్నారు. సింగపూర్ నుంచి రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమల శాఖ అధికారులు అంతర్జాతీయ సంస్థ ద్వారా ఓ పవర్ పాయింట్ ప్రజంటేషన్ను రూపొందింపచేశారు. సింగపూర్ పర్యటనలో చంద్రబాబు అక్కడి పారిశ్రామకవేత్తలకు దీని ద్వారా వివరించనున్నారు. బాబు పర్యటనలో పారిశ్రామికవేత్తలు... సింగపూర్ పర్యటనకు బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబును భారీ సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు అనుసరించారు. సింగపూర్‌తో పాటు ఈ నెల 24 నుంచి జపాన్‌లో పర్యటనకు మొత్తం 46 మంది పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లను చంద్రబాబు ఆహ్వానించారు. ఇందులో భాగంగా చంద్రబాబు వెంట సింగపూర్ పర్యటనలో పాల్గొనేందుకు 18 మంది పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు మంగళవారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి మరో విమానంలో బయలుదేరి వెళ్లారు. సింగపూర్ వెళ్లిన వారిలో నవయుగ, జీఎంఆర్, ట్రాన్స్ట్రాయ్, కాకినాడ పోర్టు, శ్రీసిటీ, ఎల్ అండ్ టి, గంగవరం పోర్టు, మధుకాన్, అమర్ రాజా బ్యాటరీస్, రిత్విక్, జీవీకే తదితర సంస్థలకు చెందిన వారు ఉన్నట్లు పరిశ్రమలశాఖ వర్గాలు తెలిపాయి. -
'దొంగే దొంగన్నట్టుగా వ్యవహరిస్తోంది'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం దొంగే దొంగన్నట్టుగా వ్యవహరిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వమే ఎక్కువగా విద్యుత్ ను వినియోగించిందని ఆయన పేర్కొన్నారు. 364 మిలియన్ యూనిట్లు విద్యుత్ ను ఏపీ కంటే తెలంగాణ అదనంగా వాడుకుందన్నారు. కర్నూలు, అనంతలోని పవన విద్యుత్ తెలంగాణకు ఎలా వస్తుందని పరకాల ప్రశ్నించారు. జీవో 26, 53 ప్రకారం తెలంగాణకు ఆ విద్యుత్ పై ఎలాంటి హక్కు ఉండదని పరకాల తెలిపారు. జల విద్యుత్, థర్మల్ విద్యుత్ కలిపి.. 141 మిలియన్ యూనిట్ల అదనంగా తెలంగాణ పొందిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఉల్లంఘనపై తమ సీఎస్ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారన్నారు. టీ.ప్రభుత్వం అధికారులు, పోలీసుల వైఖరిపై నివేదిక అందించారన్నారు. అన్ని చోట్లా గొడవలు పడ్డ తెలంగాణ అధికారులు తిరిగి తమ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని పరకాల ఎద్దేవా చేశారు. -
నరసాపురం కోడలి నజరానా
* రెండు తీర గ్రామాలను దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి * పెదమైనివానిలంక, తూర్పుతాళ్లు * గ్రామాల్ని అభివృద్ధి చేస్తానన్న నిర్మలా సీతారామన్ నరసాపురం అర్బన్ : నరసాపురం మండలంలోని రెండు తీర గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన నరసాపురం ప్రాంత వాసులకు ఆనందం పంచింది. సముద్రాన్ని ఆనుకుని ఉన్న పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు గ్రామాలను దత్తత తీసుకుని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని విజయవాడలో శుక్రవారం జరిగిన ఏబీవీపీ రాష్ట్రస్థాయి విద్యార్థినుల సమ్మేళనంలో నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఈనెల 15, 16, 17 తేదీల్లో తాను ఆ గ్రామాల్లో పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని, అనంతరం దత్తతకు సంబంధించిన విధి విధానాలు, చేపట్టబోయే అభివృద్ధి పనులపై స్పష్టత ఇస్తానని మంత్రి పేర్కొన్నారు. నిర్మలాసీతారామన్ నరసాపురం కోడలు. కేబినెట్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వ మీడియా సల హాదారుగా పనిస్తున్న డాక్టర్ పరకాల ప్రభాకర్ భార్య. పట్టణానికి చెందిన ప్రభాకర్ తండ్రి దివంగత శేషావతారం కాంగ్రెస్ హయూంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రస్తుతం తమిళనాడు నుంచి రాజ్యసభకు నిర్మలాీ సతారామన్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఒక విధంగా తన మెట్టింటి గడ్డపై గల మమకారంతోనే గ్రామాల దత్తతనిర్ణయం తీసుకున్నారని బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీకి సన్నిహితురాలిగా పేరున్న నిర్మలా సీతారామన్ కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిధులు భారీగా వచ్చి తీరగ్రామాలు అభివృద్ధి చెందుతాయని, దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. ఆ గ్రామాల్లో ఎన్నో సమస్యలు మంత్రి దత్తత తీసుకుంటున్నట్టుగా ప్రకటించిన గ్రామాల్లో ఎన్నో సమస్యలు తిష్టవేసుకుని ఉన్నాయి. అవకాశాలు ఉన్నా.. అభివృద్ధి లేక రైతులు, ముఖ్యంగా మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రకృతి విపత్తుల బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా పెదమైనవానిలంక గ్రామం సముద్ర కోతకు గురవుతోంది. గడచిన పదేళ్లలో సముద్రం కిలోమీటరు వరకూ ముందుకు చొచ్చుకొచ్చింది. ప్రజలు చూస్తుండగానే పాత ఊరు సముద్ర గర్భంలో కలసిపోయింది. సముద్ర కోతను నివారించడానికి తీరం వెంబడి రక్షణ చర్యలు చేపడతామన్న నేతల హామీలు నెరవేరలేదు. ఈ గ్రామానికి వెళ్లాలంటే తూర్పుతాళ్లు నుంచి వెళ్లే దారిలో 70 తూముపై నిర్మించిన మట్టిరోడ్డే ఇప్పటికీ గతి. ఇది కూడా శిథిలమవుతోంది. గ్రామంలో 3 వేల జనాభా ఉండగా, అందరూ మత్స్యకారులే. వేటే ఆధారంగా జీవిస్తున్నారు. ఇక తూర్పుతాళ్లు గ్రామానిదీ అదే పరిస్థితి. ఈ గ్రామంలో ఉప్పు, కాయకూరల సాగు ఎక్కువ. దాదాపు 3 వేల ఎకరాల్లో ఉప్పు పంట సాగవుతోంది. ఉప్పు సాగు చేసేవారంతా మత్స్యకారులే. భూములు లీజుకు తీసుకుని ఉప్పు పండిస్తారు. ఉప్పును నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు, ఇతర సదుపాయాలు లేవు. అందువల్ల వర్షాలు పడతే పండించిన ఉప్పంతా కళ్లముందే కరిగిపోతుంది. సాగు నిమిత్తం చేసిన అప్పులు తీర్చలేక విలవిల్లాడుతుంటారు. రవాణా సౌకర్యాలు లేక ప్రమాదాలు ఈ గ్రామాల్లో సరైన రవాణా సౌకర్యాలు లేవు. ఇప్పటికీ పడవలపై, తెప్పలపై ప్రయాణాలు సాగుతాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. 2010 జనవరి 31న బియ్యపుతిప్ప గ్రామంలో నల్లీక్రీక్ వద్ద పడవబోల్తా పడి 11మంది ప్రాణాలు కోల్పోయారు. 1984లో బియ్యపుతిప్ప రేవుకు దగ్గరలోనే ఉన్న గుడిమూల రేవులో మర్రితిప్ప గ్రామానికి చెందిన పెళ్లిబృందం అంతర్వేదికి పడవ కట్టించుకుని వెళ్తుండగా.. బోల్తాపడి 18మంది మృతి చెందారు. ఇక ప్రకృతి విపత్తుల సంగతి సరేసరి. 2004 డిసెంబర్ 26న సునామీ ప్రళయానికి పెదమైనవానిలంక, చినమైనవానిలంక, సర్దుకొడప గ్రామాలకు చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. కేంద్ర మంత్రి ఈ గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా అయినా తీర గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాలి. -
అడ్డూ అదుపూ లేనిదెవరికి?
రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వాధినేతకు అడ్డూఅదుపూ లేదట. మరి ఏపీలో ప్రభుత్వ వ్యవహారాల్లో అడ్డూ అదుపూ ఉన్నాయా? ట్రావెల్ కంపెనీలు నిర్భయంగా నగరాల్లో కబ్జాలు చేసి దొరికిపోతున్నా ప్రభుత్వం చలించదు. టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు కార్ రేసులో ఓ నిండుప్రాణాన్ని బలిగొన్నా నామమాత్రపు అరెస్టుతో సరిపె ట్టారు. ఇంకో టీడీపీ నేత తనకు బదులు మరొకరిని పరీక్షకు కూర్చోబెట్టిన తతంగం దుమారం రేపినా ప్రభుత్వ పెద్దలు చలిం చరు. ఏ కేసులూ లేని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యకేసులేంటి? ఇంటిపై దాడులేంటి? పార్టీ కార్యకర్తలపై బెదిరింపులేమిటి? వరుస హత్యలేమిటి? పార్టీ కార్యకర్తలకు మేలుచేయాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రే కలెక్టర్ల సమా వేశాల్లో ప్రకటించినా ఎవరూ కిమ్మనరు. ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన బాసలు మాయమాటలుగా తేలి జనం తూర్పార పడుతు న్నా పరకాలకు చీమకుట్టినట్లు ఉండదు. పర రాష్ట్రంలో ప్రభు త్వానికి అడ్డూఅదుపూ లేకపోవడంపై వేలెత్తి చూపే ముందు మన బంగారం సంగతి కూడా పరకాల వారు పరిశీలించాలి. -డి.ఎం. రాజు, విజయవాడ -
కేసీఆర్ సర్కార్‌ను నిలదీయాలి: పరకాల
తెలంగాణలో విద్యుత్ కష్టాలకు టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమనడం దారుణమని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏపీకి రావాల్సిన 100 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను తెలంగాణ ప్రభుత్వం అదనంగా వాడుకుందని పరకాల చెప్పారు. తెలంగాణ ప్రాంత రైతులకు విద్యుత్ ఇవ్వలేకపోవడానికి చంద్రబాబే కారణమనడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం పరకాల విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీశైలంలో 1300 మెగావాట్ల విద్యుత్‌ను అక్రమంగా ఉత్పత్తి చేశారంటూ ఘాటుగా విమర్శించారు. ఆ విద్యుత్‌ను ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. హైదరాబాద్‌లో రోజుకు రెండున్నర గంటలు విద్యుత్ కోత విధిస్తే.. తెలంగాణలో రైతులందరికీ విద్యుత్ అందేదని ఎద్దేవా చేశారు. దీనిపై తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను నిలదీయాలన్నారు. తాము 900 మెగావాట్ల విద్యుత్‌ను అదనంగా కొనుగోలు చేశామని, రోజుకు రూ. 11.5 కోట్లు విద్యుత్ కొనుగోలుకు ఖర్చుచేశామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క యూనిట్‌ను కూడా అదనంగా కొనుగోలు చేయలేదని ఆయన అన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విద్యుత్‌ను కొనుగోలు చేయలేదో తెలంగాణ ప్రజలే నిలదీయాలన్నారు. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ పీపీఏ వ్యవహారం కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్ధ(సీఈఆర్సీ) పరిధిలో ఉందని పరకాల గుర్తు చేశారు. -
''ప్రణాళికబద్ధంగా వెళ్లి సమస్యను పరిష్కరించుకున్నాం''
-
ఏపీ సర్కారుపై తెలంగాణ దాడి: పరకాల
-
ఏపీ సర్కారుపై తెలంగాణ దాడి: పరకాల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ సర్కారు దాడి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ చేష్టలు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు. కార్మికశాఖ ఫైనాన్స్ మేనేజపర్ రామారావును గంట సేపటి పాటునిర్బంధించే అధికారం వాళ్లకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని బ్యాంకులకు లేఖలు రాసే అధికారాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎవరిచ్చారని అడిగారు. చెక్కులను ఆమోదించొద్దని చెప్పే అధికారం పోలీసులకు ఎక్కడిదని నిలదీశారు. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సర్కారు దాడి చేస్తోందని, ఈ అంశాలన్నింటినీ గవర్నర్‌కు కూడా ప్రతిసారీ వివరిస్తున్నామని పరకాల ప్రభాకర్ చెప్పారు. గవర్నర్ ఈ అంశంపై ఎన్నిరోజుల్లో స్పందిస్తారో చూస్తామని అన్నారు. రెండు మూడు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం పాల్పడుతున్న చట్ట ఉల్లంఘనలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ ఫిర్యాదు చేస్తారని కూడా ప్రభాకర్ వివరించారు. -
అడ్డూ అదుపూ లేని ఆగడాలు
టీ సర్కారుపై పరకాల మండిపాటు టీ పోలీసు అధికారులు గూండాల్లా ప్రవర్తించారు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ధ్వజమెత్తారు. వారికి చట్టం అంటే గౌరవం లేదని, సంప్రదాయాల్ని పాటించాలన్న స్పృహ కూడా లేదని విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని నీరు, విద్యుత్, సంస్థలు, నిధులు సంబంధిత అంశాల్లో చట్టాలను గౌరవించకుండా రోజు రోజుకూ యాగీ చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం సచివాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కార్మిక శాఖకు చెందిన భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల మండలి నిధుల అంశంలో తెలంగాణ పోలీసు అధికారుల ఆగడాలు, దౌర్జన్యాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు. 50 మంది తెలంగాణ పోలీసు అధికారులు గూండాల్లా వ్యవహరిస్తూ ఏపీ అధికారులపై దౌర్జన్యానికి తెగబడ్డారన్నారు. ఉన్నతాధికారులని కూడా చూడకుండా వారి ఇంటికి వెళ్ళి మరీ కుటుంబసభ్యుల్ని ఘెరావ్ పేరిట హింసిం చారని ఆరోపించారు. విచారణ పేరుతో తెలంగాణ పోలీసులు ఏ ఒక్క ప్రాతిపదిక పాటించలేదని, ఆ ప్రభుత్వం చెబుతున్న మాటలు, లెక్కల పై తెలుగు ప్రజల్లో చర్చ జరగాలన్నారు. తాను లెక్కలు మొత్తం తీసి తెలంగాణ ప్రభుత్వంతో నిజం కక్కించేవరకు విశ్రమించబోనన్నారు. ఈ సందర్భంగా పరకాల వివరాలను సోదాహర ణంగా చెప్పారు. పంపిణీ జరిగితే ఈ నిధులు ఏపీకి చెందుతాయన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తుంచుకోకుండా యాగీ చేసిందన్నారు. ఏపీ అధికారులపై ఈగ వాలినా సహిం చమన్నారు. ఆ అధికారులు, పోలీసులు పూనకాన్ని తగ్గించుకోవాలని హితవు పలికారు. తెలంగాణ భూ భాగంలోని బ్యాంకుల్లో వారికి దక్కాల్సిన వాటా కంటే అదనంగా రూ.76 కోట్లు జమయినా తాము పైసా తరలించలేదనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. నాక్, హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీ, ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ తదితర అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందని పరకాల ఆరోపించారు. ఉన్మాదంతో వ్యవహరిస్తున్న టీ ప్రభుత్వాన్ని తెలుగు ప్రజలు ప్రశ్నించాలని,కేంద్రం ఆరా తీయాలని అన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. -
'తెలంగాణ సర్కారుకు చట్టాలంటే గౌరవం లేదు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి చట్టాలంటే గౌరవం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్ విమర్శించారు. ప్రతి అంశంలోనూ తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కార్మిక శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, న్యాయంగా మా రాష్ట్రానికి రావాల్సిన వాటానే దక్కించుకున్నామని ఆయన తెలిపారు. మురళిసాగర్ అనే అధికారిపై దౌర్జన్యానికి దిగారని, ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టారని పరకాల మీడియాకు వెల్లడించారు. ప్రతి రూపాయి లెక్కను మేం తెలుస్తాం. మాకు రావాల్సిన హక్కులను సాధించుకుంటాం అని పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. -
ఇరు ప్రాంతాల ప్రజలకు చంద్రబాబు మోసం: హరీష్
హైదరాబాద్: ఇరు ప్రాంతాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గతంలో తాను ఇచ్చిన జీవోలనే ఇప్పడు చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్, మంత్రి దేవినేని ఉమలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హరీష్ సూచించారు. తెలంగాణలో విద్యుత్ సమస్య వల్లే శ్రీశైలంలో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నామని ఆయన మీడియాతో అన్నారు. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా జరుగుతున్న దోపిడిని బోర్డు చైర్మన్ కు వివరించామన్నారు. -
డైలీ సీరియల్లా టీ-మంత్రుల అబద్ధాలు: పరకాల
-
డైలీ సీరియల్లా టీ-మంత్రుల అబద్ధాలు: పరకాల
తెలంగాణ మంత్రులు అబద్ధాలను సీరియల్లా చెబుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ విమర్శించారు. 233 జీవోలో ఎక్కడా 834 అడుగుల వరకు నీరు వాడుకోవచ్చనే పదమే లేదని ఆయన అన్నారు. చెప్పిన అబద్ధాలనే వాళ్లు మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. 107 జీవోకు, 170 జీవోకు మధ్య తేడా ఏంటో హరీష్‌రావుకు తెలియదా అని ప్రశ్నించారు. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని, అబద్ధాల డైలీ సీరియల్‌ను ఇకనైనా ఆపాలని పరకాల ప్రభాకర్ అన్నారు. మీ నీటిని మీరు వాడుకుంటే తమకు అభ్యంతరం లేదని, అంతేతప్ప.. తమకు రావల్సిన న్యాయబద్ధమైన వాటాలో కూడా వేలు పెడితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఇక విద్యుత్తు విషయంలో కూడా.. తమకు వెయ్యి మెగావాట్లు రావాలని అడుగుతున్నారని, అవి ఎక్కడినుంచి రావాలని ప్రశ్నించారు. దానికి ఏమైనా లెక్క ఉందా.. ఎక్కడెక్కడ రావల్సిన దానికన్నా అదనంగా తీసుకుంటున్నారో కూడా లెక్కలు చెబుతానని అన్నారు. థర్మల్ విద్యుత్తులో ఏపీ ఉత్పత్తి చేసిన దాంట్లోంచి 769 మిలియన్ యూనిట్లు తెలంగాణకే ఇచ్చామని ఆయన చెప్పారు. జల విద్యుత్తులో కూడా ఆంధ్రా డిస్కంలు 1621, తెలంగాణ డిస్కంలు 2224 మిలియన్ యూనిట్ల చొప్పున వాడుకున్నాయన్నారు. ఇలా అన్నిచోట్లా ఎక్కువ వాడుకుంటూ.. తమ మీద తప్పునెట్టడం తెలంగాణ మంత్రులకు తగదని పరకాల ప్రభాకర్ చెప్పారు. -
కేసీఆర్ గారూ..ఆ జీఓను మీరే ఒప్పుకున్నారు
-
కేసీఆర్ విపరీత బుద్ధి ప్రదర్శించారు: పరకాల
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మితిమీరి మాట్లాడారని, విపరీత బుద్ధి ప్రదర్శించారని ఆంధ్రప్రదేశ్ సీఎం మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ విమర్శించారు. తాము కేసీఆర్ నోట్లో నోరు పెట్టదలచుకోలేదని ఆయన అన్నారు. కేసీఆర్ వాదన తెలుగు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని మండిపడ్డారు. రెండు ప్రభుత్వాల పనితీరు మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అంతా ఇటువైపే చూస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ కేవలం తనను తాను సమర్థించుకునేలాగే మాట్లాడుతున్నారని, అసలు శ్రీశైలం నీటి మట్టాలపై విడుదల చేసిన రెండు జీవోలను అర్థం చేసుకునే సమర్థత కేసీఆర్‌కు లేనట్లు ఉందని పరకాల ప్రభాకర్ విమర్శించారు. -
'విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తాం'
హైదరాబాద్:తుపాను ప్రాంతాల్లో ఆదివారం నాటికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ 65 శాతం మేర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. తుపాను సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇదిలా ఉండగా తుపానులో దెబ్బతిన్న ఉత్తరాంధ్ర బాధితులకు విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. టీడీపీని విమర్శించే అర్హత కాంగ్రెస్ కు లేదని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలో సాధారణ జనజీవన పరిస్థితులు వచ్చేంత వరకూ ఇక్కడ ఉండే పర్యవేక్షిస్తామని మరోమంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. -
బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు: పరకాల
విశాఖ: తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్ఓ లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ హెచ్చరించారు. విశాఖలో ఈ రోజు రాత్రికి కొంత మేరకు విద్యుత్ ను పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. తుఫాను నష్టంపై అంచనాకు ఇంకా రాలేదని ఆయన ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. తుఫాన్ లో మొత్తం 21 మంది చనిపోయారని, మృతుల్లో చాలా మంది వృక్షాలు విరిగి మీదపడటంతోనే మరణించారని ఆయన తెలిపారు. హుదూద్ తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో రేపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏరియల్ సర్వే నిర్వహిస్తారని, అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తారని పరకాల ప్రభాకర్ వెల్లడించారు. -
'ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి'
హైదరాబాద్: హుదూద్ తుపాన్ నేపథ్యంలో ఇప్పటివరకు లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తుపాను తీరాన్ని దాటే సమయంలో ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు. తుపాన్ తీరం దాటిన ఆరుగంటల తర్వాత ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని....ప్రభుత్వం సూచించిన తర్వాతే తమతమ నివాసాల నుంచి బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుపాన్ సహాయక చర్యల్లో త్రివిద దళాలకు చెందిన బలగాలు పాల్గొంటున్నాయని అన్నారు. తుపాన్ తీవ్రతపై ప్రజలకు ఎప్పటికప్పుడు రేడియో, మొబైల్ ద్వారా సమాచారం చేరవేస్తున్నట్లు తెలిపారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో హుదూద్ తీరం దాటుతుందన్ని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. -
దయచేసి ఎవ్వరూ బయటకు రావొద్దు!
-
దమ్ముంటే బహిరంగ చర్చకు రా
పరకాలకు చెవిరెడ్డి సవాల్ తిరుపతి: ‘‘తెలుగుదేశం పార్టీ శిఖండి పరకాల ప్రభాకర్.. నిజం తెలుసుకుని మాట్లాడు. మా తండ్రి వృద్ధాప్య పింఛను తీసుకున్నట్టు నిరూపించు.. పింఛను విషయంలో మా తండ్రికి గానీ, మా కుటుంబ సభ్యులకు గానీ సంబంధం లేదని సాక్షాత్తు అధికారులే చెబుతున్నా. మీ పచ్చకళ్లకు కనిపించడం లేదా. పింఛను జాబితాలో మా తండ్రి పేరు వెనుక మీ పార్టీ కుట్ర ఉంది. దమ్ముంటే బహిరంగ చర్చకు రా’’ అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సవాల్ విసిరారు. తిరుపతిలో గురువార ం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదవుల కోసం పూటకో పార్టీ, రోజుకో జెండా మార్చే పైరవీకారుడు పరకాల ప్రభాకర్ అని దుయ్యబట్టారు. చంద్రబాబు మెప్పుకోసం వైఎస్సార్సీపీ నాయకులపై బురద జల్లుతున్నారని అన్నారు. పదవీ వ్యామోహంతో సొంతమామ ఎన్టీఆర్‌ని చంపారని చంద్రబాబుపై విమర్శలు చేసిన పరకాలకు, పదవి రాగానే చంద్రబాబు మంచి మనిషిగా కనిపించడం ఏ నీతి అని ప్రశ్నించారు. డబ్బుల కోసం పాలకుల్లో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయించి జైలుకు వెళ్ళిన చరిత్ర నీది కాదా అని విరుచుకుపడ్డారు. పరకాలపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ‘‘మా తండ్రికి పింఛను అవసరమే లేదు. దరఖాస్తు కూడా చేసుకోలేదు. చంద్రబాబే పరకాలతో అసత్య ప్రేలాపనలు చేయిస్తున్నారు’’ అన్నారు. -
మీరు టీడీపీకి అధికార ప్రతినిధా?
పరకాల ప్రభాకర్‌పై తమ్మినేని ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘‘పరకాల ప్రభాకర్... మీరు ప్రభుత్వానికి కమ్యూనికేషన్ సలహాదారా? లేక టీడీపీకి అధికార ప్రతినిధా? ఏ హోదాలో మీరు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు?’’ అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. సామాజిక పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులు పెద్ద సంఖ్యలో ఉన్నారని కావాలనే ప్రచారం చేస్తున్నారని గురువారం మీడియా భేటీలో ఆయన ఆక్షేపించారు. మగవాళ్లు కూడా వితంతువులుగా పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభాకర్ మాట్లాడారని, ఆయనకు దమ్ముంటే వారి జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పింఛన్లలో సగానికిపైగా కోత విధించాలన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్లో కేటాయింపులను భారీగా తగ్గించారని, 43 లక్షలకు పైగా ఉన్న పింఛనుదారులకు 3,730 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో 1338 కోట్లు మాత్రమే కేటాయించారని గుర్తుచేశారు. ప్రభాకర్ మనస్సాక్షికి ఈ విషయం తె లిసి కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి పింఛన్ విషయమై... ఎద్దు ఈనిందంటే, దూడను కట్టేయండి అన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. మరోవైపు, అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు సొంత బలంతో గెలుస్తాననే ధైర్యం ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని వైఎస్సార్సీపీ నేత బొడ్డేడ ప్రసాద్ సవాలు విసిరారు. -
'ప్రధాన కుట్రదారుని పేరులేదు'
హైదరాబాద్: అలిపిరి ఘటన కేసులో ప్రధాన కుట్రదారుడు గంగిరెడ్డి అని, ఈ రోజు కోర్టు తీర్పులో అతని పేరు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారామ్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలకు కోర్టులు బ్రేకులు వేస్తున్నాయని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలకు కోర్టులలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన కమిటీలను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని కోర్టు నిలువరించిందన్నారు. సొంతవారికి పట్టం కట్టి, అందరినీ అందలం ఎక్కించాలన్న బాబు నిర్ణయానికి కోర్టు బ్రేకు వేసిందన్నారు. ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని తప్పుపట్టారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రభాకర రెడ్డి తండ్రి ఒక్క రూపాయి అయినా పెన్షన్ తీసుకున్నారా? ఈ అంశాన్ని పరకాల రుజువు చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు. టిడిపి హయాంలో పరకాలపై కిడ్నాప్ కేసు నమోదు కావడం వాస్తవం కాదా? అని అడిగారు. ఆ ప్రభుత్వానికే ఆయన సలహాదారుడా అని తమ్మినేని విస్మయం వ్యక్తం చేశారు. సామాజిక పెన్షన్లు మానివేసి, రాజకీయ పెన్షన్లు ఇవ్వడమే మీ ఉద్దేశమా? అని చంద్రబాబుని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో యధేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోరు? అని ప్రశ్నించారు. ** -
అర్హులను జాబితా నుంచి తొలగించలేదు
హైదరాబాద్: ఫించన్లకు అర్హులైన వారిని జాబితా నుంచి తొలగించలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. అర్హులైన వారు కొత్తగా దరఖాస్తు చేసుకున్నా పింఛన్లు ఇస్తామని శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాటైన కమిటీ ఏర్పాటులో ఎలాంటి రాజకీయ దురద్దేశం లేదని ఆయన తెలిపారు. పింఛన్ల మంజూరులో చాలా అక్రమాలు ఉంటాయని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని తెలిపారు. అందుకే అనర్హులను తొలగించేందుకు కసరత్తులు ఆరంభిచినట్లు పరకాల తెలిపారు. -
రాజకీయ దురుద్దేశంలేదు
-
రాజకీయ దురుద్దేశంలేదు
హైదరాబాద్: పింఛన్ విషయంలో కమిటీని ఏర్పాటు చేయడం వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశంలేదని ఏపి ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. అర్హులను పింఛన్ జాబితా నుంచి తొలగించం, వారు భయపడవలసిన అవసరం లేదన్నారు. కొత్తగా ఎంతమంది అర్హులు దరఖాస్తు చేసుకున్నా పింఛన్ ఇస్తారని చెప్పారు. పింఛన్ మంజూరులో చాలా అక్రమాలు జరిగే అవకాశం ఉందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక స్పష్టం చేసినట్లు చెప్పారు. అందుకే అనర్హులను తొలగిస్తామని పరకాల చెప్పారు. ** -
'లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి'
ఒంగోలు: ‘తెలుగు జాతిని అత్యంత అన్యాయంగా విభజించినవారు ముందుకు వచ్చి లెంపలు వేసుకుని తప్పు చేశామని క్షమాపణ చెప్పేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని’ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రకాశం భవనంలో శనివారం జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు 143వ జయంతి వేడుకల్లో ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రసంగించారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ కాదని ఆంధ్రప్రదేశ్ అన్నారు. రాజధాని లేదు, సచివాలయం లేదు, న్యాయస్థానం లేదు, ఎలాంటి మౌలిక వసతులు లేవన్నారు. ఇప్పటికీ సీఎం చంద్రబాబు ఒక చిన్న అతిథిగృహంలో పనిచేస్తున్నారని తెలిపారు. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, నాలుగు క్యాంపెయిన్లతో ఏపీ అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలుపుతామన్నారు. 2029 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవిస్తుందని పరకాల పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాను ఇండస్ట్రీయల్ హబ్‌గా మారుస్తామని, జిల్లాలో ఎయిర్‌పోర్ట్‌తో పాటు సీపోర్ట్‌ను ఏర్పాటుకు కృషి చేస్తామని పరకాల హామీ ఇచ్చారు. దొనకొండను ఇండస్ట్రియల్ హబ్‌గా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. -
ధైర్యానికి ప్రతీకప్రకాశం
‘టంగుటూరి ప్రకాశం పంతులు అంటే ఒక ధైర్యం... దేశభక్తి... పట్టుదల ... నిస్వార్థ ప్రజాసేవకుడు. చిన్ననాటి నుండే ఒక లక్ష్యాన్ని, ధ్యేయాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాలనుకునేవారికి ప్రకాశం పంతులు ఓ స్ఫూర్తి. - రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో నాగార్జునసాగర్, వెంకటేశ్వర యూనివర్శిటీలను స్థాపించారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో క్రమశిక్షణగా జీవించాలంటే ఇలాంటి పెద్దల జీవితాలను తెలుసుకోవాలి. - మంత్రి శిద్ధా రాఘవరావు నాటితరం నాయకులు ఎలాంటి స్వార్థం లేకుండా దేశం కోసం పని చేసి ప్రాణాలు అర్పించారు, ప్రస్తుతం ఎక్కువ మందిలో స్వార్థం పెరిగి పోయింది. మొదటితరం నాయకుల మంచి లక్షణాలను ఇప్పుడున్న తరం అలవర్చుకోవాలి. - కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఒంగోలు టౌన్ : ‘టంగుటూరి ప్రకాశం పంతులు అంటే ఒక ధైర్యం. ప్రకాశం పంతులు అంటే ఒక దేశభక్తి. ప్రకాశం పంతులు అంటే పట్టుదల. ప్రకాశం పంతులు అంటే నిస్వార్థ ప్రజాసేవకుడు’ అని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. స్థానిక ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో శనివారం జరిగిన ప్రకాశం పంతులు 143వ జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొని ప్రసంగించారు. ప్రకాశం పంతులు ఒక మహా మనీషి అని, ఆయన జన్మించిన ప్రాంతంలో పాదాభివందనంతోపాటు సాష్టాంగ నమస్కారం చేసేందుకు ఇక్కడకు వచ్చానని చెప్పారు. ప్రకాశం జీవన విధానం, నడవడిక, త్యాగనిరతి ప్రజలపై చెరగని ముద్ర వే శాయన్నారు. అన్ని వర్గాల బంధువుగా ఆయన నిలిచారని కొనియాడారు. ప్రకాశం పంతులు, ఎన్టీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతోందన్నారు. ప్రతి ఇంటికీ మంచినీరు, సదుపాయాలు, ఇంటర్నెట్, ప్రతి ఎకరాకు నాణ్యమైన విద్యుత్, ప్రతి గ్రామానికి రోడ్లు ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రకాశాన్ని ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి శిద్దా టంగుటూరి ప్రకాశం పంతులును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు కోరారు. పేదరికంలో పుట్టి మంచి నడవడికతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ముఖ్యమంత్రి అయ్యాక నాగార్జునసాగర్, వెంకటేశ్వర యూనివర్శిటీలను స్థాపించారన్నారు. ప్రకాశం బాటలో నడుద్దాం : కలెక్టర్ దేశ స్వాతంత్య్ర పోరాటంలో టంగుటూరి ప్రకాశం పంతులు ఘట్టం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ విజయకుమార్ చెప్పారు. ఆయన బాటలో నడిచేందుకు అందరూ ప్రయత్నించాలని కోరారు. నాటితరం నాయకుల్లో ఎలాంటి స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేసి ప్రాణాలు అర్పించారని, నేటి తరంలో స్వార్థ పెరిగిందని చెప్పారు. జిల్లాపరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ త్యాగానికి మారుపేరు ప్రకాశం పంతులు అని అన్నారు. ప్రకాశం పంతుల జీవిత చరిత్రను జిల్లాపరిషత్ నిధులతో సంక్షిప్తంగా ముద్రించి జిల్లాలోని అన్ని జెడ్పీ పాఠశాలలకు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్వీ శేషయ్య, జేసీ యాకూబ్ నాయక్, డీఆర్వో గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు. తొలుత ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు కరవది వెంకటేశ్వర్లు, అశ్వద్ధనారాయణలను సన్మానించారు. వర్ధమాన గాయకుడు నూకతోటి శరత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజు, డీఆర్డీఏ పీడీ పద్మజ బృందం ఆలపించిన ‘వందనం వందనం మాతృభూమి’ గీతం ఆకట్టుకుంది. మంత్రి శిద్దా, ప్రభుత్వ సలహాదారు పరకాల చేతుల మీదుగా ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన వివిధరకాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. డీఆర్డీఏ, మెప్మా ద్వారా పలు పొదుపు సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ప్లానింగ్ లేకపోవడంతో గందరగోళం మధ్య సాగింది. కార్యక్రమంలో ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్, ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నం నాగులుప్పలపాడు : దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. ప్రకాశం జయంతిని ప్రభుత్వం అధికారికంగా ఒక పండగలా జరపాలని సూచించిందన్నారు. అందులో భాగంగానే ప్రకాశం పుట్టిన ఊరు వినోదరాయునిపాలెం జెడ్పీ పాఠశాల ఆవరణలో ప్రభుత్వం తరఫున వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పరకాల మాట్లాడుతూ పేదరికంలో పుట్టి తన మేధాసంపత్తితో ఇంగ్లండ్‌లో బారిష్టర్ చదివి కోట్లు గడించాడని తెలిపారు. అప్పట్లో మద్రాసు హైకోర్టుకు 7 గుర్రాలపై వెళ్లిన జడ్జి కూడా లేరంటే అతిశయోక్తి కాదన్నారు. అలాంటి వ్యక్తి ఆ వృత్తికి సెలవుపెట్టి స్వాతంత్య్రం కోసం తెల్లదొరలపై పోరాడి తన ఆస్తినంతా దేశానికి పెట్టిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ప్రకాశం జీవిత విశేషాలను స్కూల్ విద్యార్థుల పాఠ్యాంశంగా చేర్చాలన్న ఎంపీపీ ముప్పవరపు వీరయ్య అభ్యర్థనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని పరకాల హామీ ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెడుతున్న రాజకీయ నాయకులు ప్రజలకు ఏమి చేస్తారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రకాశాన్ని ఆదర్శంగా తీసుకొని అలాంటి సంస్కృతికి సెలవు పలకాలని కోరారు. అనంతరం ప్రభాకర్, బాలాజీ, జెడ్పీ సీఈవో ప్రసాద్‌లు మొక్కలు నాటారు. తొలుత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకాశం విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థుల కళా నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లా రచయిత డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు రచించిన ప్రకాశం జిల్లా విశిష్ఠతను తెలియజేసే పాటకు వినోదరాయునిపాలెం విద్యార్థుల నృత్యం ఆకట్టుకుంది. నాగులుప్పలపాడు మండలం తక్కెళ్లపాడుకు చెందిన కరాటే కళాకారుడు హనుమంతరావు ఇనుప బండలను పగులకొట్టే ప్రదర్శన అబ్బురపరిచింది. ఎంపీడీఓ జాన్ శామ్యూల్, తహశీల్దార్ రమణయ్య, ఎంఈఓ ఈ.వి. రమణయ్య, వేటపాలెం సీడీపీఓ లిదియమ్మ, వినోదరాయునిపాలెం సర్పంచ్ ఉన్నం రవితో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. -
కేబినెట్ భేటీలో ఎంపీలు, సలహాదార్లా!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశ నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో మం త్రులు కాని వారు ఎవరూ కూర్చోకూడదు. అంశాల చర్చ సమయంలోనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సైతం మంత్రివర్గ సమావేశంలోకి వె ళ్తారు. ఆ అంశంపై చర్చ అయిపోగానే వారు కూడా మంత్రివర్గ సమావేశం నుంచి వెళ్లిపోతారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి మాత్రమే మంత్రివర్గ సమావేశంలో అజెండా పూర్తయ్యేవరకు ఉంటారు. అయితే సీఎం చంద్రబాబు మంత్రులు కాని వారిని మంత్రివర్గ సమావేశంలో కూర్చోపెట్టి చర్చలు సాగిస్తున్నారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌తో పాటు మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ను కూడా మంత్రివర్గ సమావేశంలో కూర్చోపెడుతున్నారు. ఏదైనా అంశం వచ్చినప్పుడు సంబంధిత సలహాదారులను పిలిచి మాట్లాడటంలో తప్పులేదని, అలా కాకుండా మంత్రివర్గ సమావేశం ముగిసేవరకు ఎంపీలు, సలహాదారులు కూర్చోవడంపట్ల సీనియర్ ఐఏఎస్ అధికారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఎంపీలు, సలహాదారు లు చర్చల్లో పాల్గొనడం, జోక్యం చేసుకోవటంపై సీనియర్ మంత్రులు నిర్ఘాంతపోతున్నారు. ఈ విషయమై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎంపీలను, సలహాదారులను మంత్రివర్గ సమావేశానికి అనుమతించలేదని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
రాష్ట్ర విభజనతో ఉనికి కోల్పోయిన ఏపీఈఆర్సీ
ఏపీ జెన్కోను ఎవరూ ఆదేశించజాలరు: పరకాల సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి ప్రస్తుతం ఎలాంటి అధికారాలు, గుర్తింపూ లేవని ఆ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఒప్పందాలను అమలు చేయాలని ఏపీ జెన్కోను ఎవరూ ఆదేశించజాలరని మంగళవారం ఆయన వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాలుగా వేరుపడిన తర్వాత ఎవరికి వారు ఈఆర్సీలు ఏర్పాటు చేసుకున్నారని.. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏర్పడిన ఏపీ ఈఆర్సీ ఇప్పుడు తన ఉనికిని కోల్పోయిందని పేర్కొన్నారు. విభజనకు ముందునాటి ఒప్పందాల్లో 31 పీపీఏలు ఉన్నాయని వాటిని గౌరవిస్తామన్నారు. -
ఆర్బీఐ అవాంతరాలు సృష్టిస్తోంది: పరకాల
హైదరాబాద్: సమైక్య ఉద్యమంలో కేసులన్నీ ఎత్తేస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. 952 కేసుల్లో 106 కేసులు ఇప్పటికే ఎత్తేశామని, 4482 మందికి ఊరట లభించిందని వెల్లడించారు. మిగిలినవి త్వరలో ఎత్తేస్తామని చెప్పారు. రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ అవాంతరాలు సృష్టిస్తోందని వాపోయారు. ఆర్బీఐ సహకరించకపోయినా రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణాలు రీషెడ్యూల్ జరగకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆర్బీఐకి కరువు, వరదలపై లేఖ రాయకుండా విస్మరించిందన్నారు. కొత్త రుణాలపై స్పష్టత ఇవ్వలేమని, నిధులు సమీకరణకు కొంత సమయం పడుతుందని పరకాల తెలిపారు. -
సమైక్య ఉద్యమ కేసులన్నీ ఎత్తేస్తున్నాం: పరకాల
హైదరాబాద్: సమైక్య ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులన్నీ ఎత్తేస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. 952 కేసుల్లో 106 కేసులు ఇప్పటికే ఎత్తేశామని ఆయన మీడియాకు వెల్లడించారు. కేసుల ఎత్తివేత వలన 4482 మందికి ఊరట లభించిందని ఆయన తెలిపారు. మిగిలిన కేసుల్ని పరిశీలించి త్వరలో ఎత్తివేస్తామన్నారు. రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ అవాంతరాలు సృష్టిస్తుందని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆర్బీఐ సహకరించకపోయినా రుణమాఫీ చేస్తామన్నారు. రుణాలు రీషెడ్యూల్ జరగకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. ఆర్బీఐకి కరువు, వరదలపై లేఖ రాయకుండా గత ప్రభుత్వం విస్మరించిందని, కొత్త రుణాలపై స్పష్టత ఇవ్వలేమని, నిధులు సమీకరణకు కొంత సమయం పడుతుందని పరకాల ప్రభాకర్ వెల్లడించారు. -
ఉభయ రాష్ట్రాల విద్యార్థులకు ఊరట
* సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏపీ మంత్రి హర్షం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్, అడ్మిషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉభయ రాష్ట్రాల విద్యార్థులకు ఊరట కల్గించే అంశమని.. కోర్టు నిర్ణయాన్ని తమ ప్రభుత్వం స్వాగతిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, నాయకత్వానికి ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సహకరించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. సెప్టెంబర్ 1 నుంచి కళాశాలలు: పరకాల ఈ నెలాఖరులోగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగుస్తుందని సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వృత్తి విద్యా కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. -
అన్ని రాష్ట్రాలూ సమానమే
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఏ ఒక్క రాష్ట్రానికీ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబోమని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉందని, దాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీతారామన్ శనివారం శాసన సభ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ నుంచి ధృవపత్రం అందుకున్నారు. సీతారామన్ భర్త, ఆంధ్రప్రదే శ్ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహదారుగా నియమితులైన పరకాల ప్రభాకర్, ఏపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు బద్దం బాల్‌రెడ్డి, యడ్లపాటి రఘునాధబాబు, ప్రేమేందర్‌రెడ్డి, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు వెంకట సురేష్ ఆమె వెంట ఉన్నారు. -
ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారుగా పరకాల
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క మ్యూనికేషన్ సలహాదారుగా డాక్టర్ పరకాల ప్రభాకర్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభాకర్‌కు క్యాబినెట్ హోదా క ల్పించారు. పరకాల నియామకానికి సంబంధించిన విధి విధానాలు త్వరలో వెల్లడిస్తారు. ప్రభాకర్ గతంలో బీజేపీ, పీఆర్పీల్లో పనిచేశారు. ప్రస్తుతం విశాలాంధ్ర మహాసభ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. ఆయన సతీమణి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం కేంద్ర వాణిజ్య మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. -
బాబు మీడియా సలహాదారుగా పరకాల!
* కేబినెట్ హోదాతో త్వరలో ఉత్తర్వులు * విస్మయం వ్యక్తం చేస్తున్న టీడీపీ వర్గాలు * కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త కనుకనే కీలక పదవి ఇచ్చారనే విమర్శలు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి మీడియా సలహాదారుగా విశాలాంధ్ర మహాసభ కన్వీనర్ పరకాల ప్రభాకర్ నియమితులు కానున్నారు. ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. కేబినెట్ హోదా కల్పించి ప్రభాకర్‌ను ఈ పదవిలోకి తీసుకోనున్నారని.. ఒకటి రెండు రోజుల్లోనే ఈ మేరకు ఉత్తర్వులు విడుదల కావచ్చని చెప్తున్నారు. ప్రభాకర్ బుధవారం సాయంత్రం చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అకస్మాత్తుగా ఇప్పుడు ఆయనను చంద్రబాబు మీడియా సలహాదారుగా తెరమీదకు తేవడం టీడీపీ నేతలను విస్మయానికి గురిచేసింది. కీలకమైన ఈ బాధ్యతలను ప్రభాకర్‌కు అప్పగించనుండడం పట్ల పార్టీ నేతలు పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మీడియా సలహాదారు అంటే ప్రభుత్వంలో కీలకమైనదిగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి పదవిని పార్టీలో సీనియర్ నేతలకో, అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉండేవారికో కట్టబెడతారని.. కానీ పార్టీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తికి కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించడమేమిటని టీడీపీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీనే నమ్ముకొని అనేక కష్టనష్టాలకోర్చి చిత్తశుద్ధితో పనిచేసిన నేతలను అధినేత విస్మరించడం ఎంతవరకు సబబంటున్నారు. చంద్రబాబు పార్టీ నేతల అంచనాలకు భిన్నంగా పరకాల ప్రభాకర్‌కు పదవిలోకి తీసుకోవడం వెనుక కారణాలేమై ఉంటాయన్న దానిపై పలురకాల విశ్లేషణలు సాగుతున్నాయి. కేవలం ఆయన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ భర్తకావడం, కొందరు ప్రముఖుల సూచనలతోనే ఈ నియామకానికి చంద్రబాబు నిర్ణయించి ఉండవచ్చని భావిస్తున్నారు. నిర్మలాసీతారామన్ కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో.. ఈ శాఖకు సంబంధించి రాష్ట్రానికి పలు వ్యవహారాల్లో ఆమె సహకారం అవసరమని అందువల్లే పరకాలకు ఈ పదవిని ఇచ్చి ఉంటారన్న చర్చ పార్టీలో సాగుతోంది. -
ఎంపీ కాకుండానే మంత్రి పదవి
ప్రస్తుతం లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ సభ్యురాలు కానప్పటికీ మోడీ మంత్రివర్గంలో చోటు సంపాదించడం బీజేపీలో నిర్మలా సీతారామన్ ప్రాధాన్యతను, ప్రత్యేకతను స్పష్టం చేస్తోంది. * నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు. ళీ 1980లో సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. * న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ (ఇంటర్నేషనల్ స్టడీస్) పట్టా పొందారు. * రాష్ట్రానికి చెందిన రాజకీయ, టీవీ వ్యాఖ్యాత డాక్టర్ పరకాల ప్రభాకర్ తో వివాహం. వీరికి ఒక కుమార్తె. ప్రభాకర్ కూడా జేఎన్యూలోనే చదివారు. * తొలినాళ్లలో ‘ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్’ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేశారు. * జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. అత్తమామలు కాంగ్రెస్‌కు చెందినవారైనప్పటికీ బీజేపీ వైపు ఆకర్షితురాలు కావడానికి ఇది దోహదపడింది. * 2003-05 మధ్యకాలంలో సభ్యురాలిగా ఉండగా, 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. * జాతీయ కార్యవర్గంలో చేరాల్సిందిగా ఆమెను పార్టీ ఆహ్వానించింది. 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించారు. * ప్రస్తుతం రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఆరుగురు బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఉన్నారు. -
‘పశ్చిమ’ కోడలికి కేంద్ర కేబినెట్లో స్థానం
డాక్టర్ పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్‌కు మంత్రి పదవి, నరసాపురంలో హర్షాతిరేకాలు నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్: జిల్లా కోడలికి కేంద్ర ప్రభుత్వ కేబినెట్లో స్థానం లభించింది. మాజీ మంత్రి పరకాల శేషావతారం కోడలు, విశాలాంధ్ర పరిరక్షణ వేదిక నాయకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ సతీమణి నిర్మల్ సీతారామన్‌కు ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా చోటు కల్పించారు. నిర్మల్ చాలాకాలంగా బీజేపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. భర్త పరకాల ప్రభాకర్‌తో పాటు నిర్మల బీజేపీలో పలు క్రీయాశీలక పదవుల్లో పనిచేశారు. అయితే ప్రభాకర్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన పీఆర్పీకి గుడ్‌బై చెప్పారు. ఆయన భార్య నిర్మల మాత్రం బీజేపీలో కొనసాగుతూ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ పార్టీలో మంచి గుర్తింపు పొందారు. పార్టీకి సంబంధించిన పలు విధాన నిర్ణయాలను సమర్థవంతంగా వ్యక్తీకరించడంలో ఆమె తనదైన ముద్రను వేసుకున్నారు. ఊహించని విధంగా నిర్మలకు నరేంద్ర మోడీ కేబినెట్లో చోటు దక్కింది. సోమవారం సాయంత్రం ఆమె కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఆమె పార్లమెంటు ఉభయ సభల్లో దేనిలో కూడా సభ్యురాలు కాకపోయినప్పటికీ ఆమెలో ఉన్న నైపుణ్యం, పార్ట్టీ పట్ల అంకితభావం నిర్మలకు మంత్రి పదవి దక్కడానికి ప్రధాన కారణ మైందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. రాజకీయంగా తెరమరుగైందనుకున్న పరకాల కుటుంబానికి మూడు దశాబ్దాల తర్వాత మంత్రి పదవి దక్కడంతో మరోసారి ఆ కుటుంబం రాజకీయంగా తెరపైకి వచ్చినట్లయ్యిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1986లో ప్రభాకర్‌తో వివాహం చెన్నైకు చెందిన నిర్మల సీతారామన్ 1986లో నరసాపురం కోడలయ్యింది. పట్టణానికి చెందిన మాజీ మంత్రి పరకాల శేషావతారం తనయుడు డాక్టర్ పరకాల ప్రభాకర్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడి కొంతకాలం ప్రణవ్ పబ్లిక్ స్కూల్‌ను నిర్వహించారు. తర్వాత బీజేపీలోకి చేరి పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. ఆమె గత మూడేళ్లుగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. 2003-05 లో జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలుగా కూడా సేవలందించారు. -
తెలంగాణలోనే విభజనకు వ్యతిరేకత
బెంగళూరు, న్యూస్‌లైన్ : ఆంధ్రుల దెబ్బ ఎలా ఉంటుందో వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలలో తెలుస్తుందని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఇక్కడి కనిష్క హోటల్లో కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి నాయకత్వంలో జరిగిన జై సమైక్యాంధ్ర చర్చాగోష్టి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొందరు స్వార్థ రాజకీయాల కోసం తెలుగు జాతిని విభజిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశంలోని 140 పార్లమెంట్ నియోజక వర్గాలలో తెలుగు వారి ఓట్లు ఉన్నాయని గుర్తు చేశారు. 1959, 1969లలో తెలంగాణ ఉద్యమం జరిగినా సమైక్య వాదమే గెలిచిందని అన్నారు. 1972లో మళ్లీ తలెత్తినా, సమైక్యాంధ్ర ఉద్యమం గెలిచిందని గుర్తు చేశారు. అనంతరం 2002 వరకు విభజన వాదం ఎప్పుడూ విన బడలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ మళ్లీ ఆ వాదనతో ఉద్యమాలు చేపట్టారని తెలిపారు. 2004లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ 53 స్థానాల్లో పోటీ చేసి కేవలం 26 స్థానాలు మాత్రమే సాధించిందని గుర్తు చేశారు. అప్పట్లో టీడీపీపై వ ్యతిరేకత, కాంగ్రెస్‌తో పొత్తు లాంటి అంశాలు టీఆర్ఎస్కు కలసి వచ్చాయని చె ప్పారు. అనంతరం కాంగ్రెస్‌తో పడక పోవ డంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సామూహికంగా రాజీనామా చేశారని తెలిపారు. 2008లో జరిగిన ఉప ఎన్నికలలో 18 స్థానాలలో పోటీ చేసిన టీఆర్ఎస్ కేవలం ఏడు స్థానాలలో గెలిచిందని తెలిపారు. 2009లో జరిగిన శాసన సభ ఎన్నికలలో టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి మహా కూటమిని ఏర్పాటు చేసుకున్నా, తెలంగాణలో 40 స్థానాలలో పోటీ చేసిన టీఆర్ఎస్కు కేవలం పదే స్థానాలు లభించాయని చెప్పారు. తెలంగాణ వాదానికి ఆ ప్రాంత ప్రజల మద్దతు లేదని చెప్పడానికే తాను గతాన్ని వివరించాల్సి వచ్చిందని అన్నారు. హైదరాబాద్ సమీపంలోని చిన్న గ్రామంలో నివాసం ఉంటున్న తన ఇంటి మీద తెలంగాణ న్యాయవాదులు దాడి చేసిన సమయంలో అదే గ్రామంలో ఉన్న తెలంగాణ ప్రజలు వారిని అడ్డుకున్నారని, తన తల్లి, కుమార్తెలను రక్షించారని ఆయన తెలిపారు. సీమాంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు పులిగొజ్జు సురేష్ మాట్లాడుతూ... 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడి క్రమంగా బలమైన రాష్ర్టంగా అవతరిస్తుండడంతో చాలా మందికి కన్ను కుట్టిందని ఆరోపించారు. తెలుగు జాతిని విడదీస్తే ప్రజలు మీకు సమాధి కడతారని రాజకీయ నాయకులను హెచ్చరించారు. బొందు రామస్వామి మాట్లాడుతూ ... మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రాన్ని విడదీస్తున్న నాయకులను భావి తరాలు క్షమించవని హెచ్చరించారు. ఎంగిలి మెతుకుల కోసం రాజకీయ నాయకులు కేంద్రం చేతిలో కీలు బొమ్మలుగా మారారని విమర్శించారు. -
'నకిలీ గాంధీ తెలుగు ప్రజలను విడగొడుతోంది'
సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లోని మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు ఆమోదింప జేసుకునే వరకు వెంటాడాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలోని కందుకూరులో వేలాది మందితో కందపురి సమైక్య గర్జన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా సరై సమైక్యాంధ్రను సాధించుకుందామని అన్నారు. గతంలో దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ తెలుగు ప్రజలను సమైక్యంగా ఉంచితే, నకిలీ గాంధీ అయిన సోనియా తెలుగు ప్రజలను విడగొడుతుందని ఆయన ఆరోపించారు. కందపురిలో ఏర్పాటు చేసిన సమైక్య గర్జన సభ సమైక్య నినాదాలతో దద్దరిల్లింది. పలు జిల్లాల నుంచి అసంఖ్యాకంగా ప్రజలు ఆ సభకు విచ్చేశారు. -
రేపటి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ నిలిపివేస్తాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా రేపటి నుంచి సీమాంధ్రలో ప్ర్రైవేట్ ట్రావెల్ బస్సు సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ శనివారం విశాఖపట్నంలో వెల్లడించారు. సమైక్యాంధ్ర ఉద్యమం పాలపొంగు కాకూడదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తేనే రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కారం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌కు, అసెంబ్లీలకు తాళాలు వేసి తెలుగువారి వాడి ఏంటో చూపించాలని సీమాంధ్ర ప్రజలకు, నాయకులుకు పరకాల ప్రభాకర్ సూచించారు. -
సీమాంధ్ర నేతలు చేతకాని దద్దమ్మలు: పరకాల
రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలే కారణమని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్ ఆరోపించారు. సీమాంధ్ర నేతలు ఢిల్లీలో చేతకాని దద్దమ్మల్లా వ్యహరించారని ఆయన విమర్శించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తన ఎడమకాలి బూటు దుమ్ముతో సమానమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ(ఎస్కేయూ)లో విద్యార్థులు చేపట్టిన దీక్షలకు పరకాల ప్రభాకర్ మద్దతు పలికారు. రాష్ట్ర విభజన రెండు ప్రాంతాల మధ్య జరుగుతున్న పంచాయతీ కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో విభజనవాదులు, సమైక్యవాదుల మధ్య జరుగుతున్న ఉద్యమమని పేర్కొన్నారు. తుది విజయం సమైక్యవాదానిదే అని పరకాల ప్రభాకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
'కెసిఆర్‌పై హత్యాయత్న ఆరోపణలు హాస్యాస్పదం'
-
'కేసీఆర్‌పై హత్యాయాత్నమా, హాస్యాస్పదం'
చిత్తూరు : కెసిఆర్‌ను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందంటూ టిఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు హాస్యాస్పదమైనవని విశాలాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ అన్నారు. తమ దగ్గర ఆధారాలున్నాయని చెబుతున్న టిఆర్ఎస్ నేతలు ఆ ఆధారాల్ని పోలీసులకు సమర్పించి కేసు పెట్టడంలేదెందుకని ఆయన ప్రశ్నించారు. తెలుగువారి సమైక్యతను కోరుకుంటూ మహాసభ నిర్వహించి ఆరు నెలలు కాకముందే రాష్ట్ర విభజన చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేయడం దారుణమని పరకాల ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తిరుపతి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన పరకాల చిత్తూరులో ఆగి నిరాహారదీక్ష విరమించిన ఎమ్మెల్యే సికె బాబును పరామర్శించారు. -
‘కేసీఆర్ మీడియా దృష్టిని మరలిస్తున్నారు’
చిత్తూరు: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మీడియా దృష్టిని మరలిస్తున్నారని పరకాల ప్రభాకర్ విమర్శించారు. ప్రస్తుతం కేసీఆర్‌పై హత్యాయత్నం ఆరోపణలు చోటు చేసుకున్న నేపథ్యంలో పరకాల మండిపడ్డారు. కేసీఆర్ మీడియా దృష్టిని మరల్చేందుకే ఈ కొత్త ఎత్తగడకు తెరలేపారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనకూలంగా నిర్ణయం తీసుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని పరకాల ప్రశ్నించారు. తెలుగు మహసభలు జరిగే ఆరు నెలలు కాకుండానే రాష్ట్ర విభజన చేయడం న్యాయమా? అని నిలదీశారు. కేసీఆర్‌పై హత్యాయత్నం కుట్రలు జరుగుతున్నాయని ఆపార్టీ నేతలు మంగళవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కుట్రలపై పూర్తిస్థాయిలో విచారణ జరించాలని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. -
తెలంగాణాలోను సమైక్యవాదులు ఉన్నారు