'కీలుబొమ్మలా మారిన చంద్రబాబు'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ లో సలహాదారుల పాలన కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ నాయకుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు. సలహాదారుల చేతిలో చంద్రబాబును కీలుబొమ్మలా మారారని ఆరోపించారు. పరకాల ప్రభాకర్ అండ్ కో చెప్పిన విధంగా పనులు జరుగుతున్నాయని అన్నారు.
పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారని వ్యాఖ్యానించిన పరకాలపై చెవిరెడ్డి మండిపడ్డారు. పరకాల మాటలు దగా, వంచన అన్నారు. అన్ని శాఖల్లో ఆయన వేలు పెడుతున్నారని, ఇక మంత్రులు అనవసరం అని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు.