దమ్ముంటే బహిరంగ చర్చకు రా | chevireddy bhaskar reddy challenges parakala prabhakar | Sakshi
Sakshi News home page

దమ్ముంటే బహిరంగ చర్చకు రా

Published Fri, Sep 26 2014 1:58 AM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM

chevireddy bhaskar reddy challenges parakala prabhakar

పరకాలకు  చెవిరెడ్డి సవాల్

తిరుపతి: ‘‘తెలుగుదేశం పార్టీ శిఖండి పరకాల ప్రభాకర్.. నిజం తెలుసుకుని మాట్లాడు. మా తండ్రి వృద్ధాప్య పింఛను తీసుకున్నట్టు నిరూపించు.. పింఛను విషయంలో మా తండ్రికి గానీ, మా కుటుంబ సభ్యులకు గానీ సంబంధం లేదని సాక్షాత్తు అధికారులే చెబుతున్నా. మీ పచ్చకళ్లకు కనిపించడం లేదా. పింఛను జాబితాలో మా తండ్రి పేరు వెనుక మీ పార్టీ కుట్ర ఉంది. దమ్ముంటే బహిరంగ చర్చకు రా’’ అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సవాల్ విసిరారు. తిరుపతిలో గురువార ం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
పదవుల కోసం పూటకో పార్టీ, రోజుకో జెండా మార్చే పైరవీకారుడు పరకాల ప్రభాకర్ అని దుయ్యబట్టారు. చంద్రబాబు మెప్పుకోసం వైఎస్సార్‌సీపీ నాయకులపై బురద జల్లుతున్నారని అన్నారు. పదవీ వ్యామోహంతో సొంతమామ ఎన్‌టీఆర్‌ని చంపారని చంద్రబాబుపై విమర్శలు చేసిన పరకాలకు,  పదవి రాగానే చంద్రబాబు మంచి మనిషిగా కనిపించడం ఏ నీతి అని ప్రశ్నించారు. డబ్బుల కోసం పాలకుల్లో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయించి జైలుకు వెళ్ళిన చరిత్ర నీది కాదా అని విరుచుకుపడ్డారు. పరకాలపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ‘‘మా తండ్రికి  పింఛను అవసరమే లేదు. దరఖాస్తు కూడా చేసుకోలేదు. చంద్రబాబే పరకాలతో అసత్య ప్రేలాపనలు చేయిస్తున్నారు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement