
రాష్ట్ర విభజనతో ఉనికి కోల్పోయిన ఏపీఈఆర్‌సీ
ఏపీ జెన్‌కోను ఎవరూ ఆదేశించజాలరు: పరకాల
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి ప్రస్తుతం ఎలాంటి అధికారాలు, గుర్తింపూ లేవని ఆ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఒప్పందాలను అమలు చేయాలని ఏపీ జెన్‌కోను ఎవరూ ఆదేశించజాలరని మంగళవారం ఆయన వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాలుగా వేరుపడిన తర్వాత ఎవరికి వారు ఈఆర్‌సీలు ఏర్పాటు చేసుకున్నారని.. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏర్పడిన ఏపీ ఈఆర్‌సీ ఇప్పుడు తన ఉనికిని కోల్పోయిందని పేర్కొన్నారు. విభజనకు ముందునాటి ఒప్పందాల్లో 31 పీపీఏలు ఉన్నాయని వాటిని గౌరవిస్తామన్నారు.