ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశ నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో మంత్రులు కాని వారు ఎవరూ కూర్చోకూడదు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశ నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో మం త్రులు కాని వారు ఎవరూ కూర్చోకూడదు. అంశాల చర్చ సమయంలోనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సైతం మంత్రివర్గ సమావేశంలోకి వె ళ్తారు. ఆ అంశంపై చర్చ అయిపోగానే వారు కూడా మంత్రివర్గ సమావేశం నుంచి వెళ్లిపోతారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి మాత్రమే మంత్రివర్గ సమావేశంలో అజెండా పూర్తయ్యేవరకు ఉంటారు. అయితే సీఎం చంద్రబాబు మంత్రులు కాని వారిని మంత్రివర్గ సమావేశంలో కూర్చోపెట్టి చర్చలు సాగిస్తున్నారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌తో పాటు మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ను కూడా మంత్రివర్గ సమావేశంలో కూర్చోపెడుతున్నారు.
ఏదైనా అంశం వచ్చినప్పుడు సంబంధిత సలహాదారులను పిలిచి మాట్లాడటంలో తప్పులేదని, అలా కాకుండా మంత్రివర్గ సమావేశం ముగిసేవరకు ఎంపీలు, సలహాదారులు కూర్చోవడంపట్ల సీనియర్ ఐఏఎస్ అధికారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఎంపీలు, సలహాదారు లు చర్చల్లో పాల్గొనడం, జోక్యం చేసుకోవటంపై సీనియర్ మంత్రులు నిర్ఘాంతపోతున్నారు. ఈ విషయమై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎంపీలను, సలహాదారులను మంత్రివర్గ సమావేశానికి అనుమతించలేదని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.