అన్ని రాష్ట్రాలూ సమానమే | All State Equal for Union Government, says Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

అన్ని రాష్ట్రాలూ సమానమే

Published Sun, Jul 6 2014 10:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

అన్ని రాష్ట్రాలూ సమానమే

అన్ని రాష్ట్రాలూ సమానమే

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఏ ఒక్క రాష్ట్రానికీ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబోమని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉందని, దాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీతారామన్ శనివారం శాసన సభ ఇన్‌చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ నుంచి ధృవపత్రం అందుకున్నారు.

సీతారామన్ భర్త, ఆంధ్రప్రదే శ్ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహదారుగా నియమితులైన పరకాల ప్రభాకర్, ఏపీ, తెలంగాణ రాష్ట్ర  బీజేపీ నేతలు బద్దం బాల్‌రెడ్డి, యడ్లపాటి రఘునాధబాబు, ప్రేమేందర్‌రెడ్డి, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు వెంకట సురేష్ ఆమె వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement