నరసాపురానికి పోర్ట్ తీసుకువస్తాం: పరకాల
నరసాపురం పట్టణానికి పోర్ట్ తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పరకాల ప్రభాకర్ ఆయన భార్య ,కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నరసాపురం వచ్చారు. ఈ సందర్భంగా పరాకాల ప్రభాకర్, నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పేరుపాలెం బీచ్ను దేశంలో అతిపెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దుతామన్నారు.
అలాగే తాము దత్తత తీసుకున్న తూర్పు తాళ్లు, పెదమైనివానిలంక గ్రామాలను రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామాలుగా తీర్చుదిద్దుతామని చెప్పారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నరసాపురం మండలంలోని పెదమైనివాని లంక గ్రామాన్ని, ఆమె భర్త పరకాల ప్రభాకర్ తూర్పు తాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే.