ఎంపీ కాకుండానే మంత్రి పదవి
ప్రస్తుతం లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ సభ్యురాలు కానప్పటికీ మోడీ మంత్రివర్గంలో చోటు సంపాదించడం బీజేపీలో నిర్మలా సీతారామన్ ప్రాధాన్యతను, ప్రత్యేకతను స్పష్టం చేస్తోంది.
* నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు. ళీ 1980లో సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
* న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ (ఇంటర్నేషనల్ స్టడీస్) పట్టా పొందారు.
* రాష్ట్రానికి చెందిన రాజకీయ, టీవీ వ్యాఖ్యాత డాక్టర్ పరకాల ప్రభాకర్ తో వివాహం. వీరికి ఒక కుమార్తె. ప్రభాకర్ కూడా జేఎన్‌యూలోనే చదివారు.
* తొలినాళ్లలో ‘ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్’ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేశారు.
* జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. అత్తమామలు కాంగ్రెస్‌కు చెందినవారైనప్పటికీ బీజేపీ వైపు ఆకర్షితురాలు కావడానికి ఇది దోహదపడింది.
* 2003-05 మధ్యకాలంలో సభ్యురాలిగా ఉండగా, 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది.
* జాతీయ కార్యవర్గంలో చేరాల్సిందిగా ఆమెను పార్టీ ఆహ్వానించింది. 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించారు.
* ప్రస్తుతం రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఆరుగురు బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఉన్నారు.