నరసాపురం రూరల్: నైపుణ్యంతో దేశం నవనిర్మాణ కల్పన జరుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని పెదమైనవానిలంక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చేతి వృత్తిదారులకు ఆర్థిక భరోసా, భవిష్యత్తును కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన పథకమే పీఎం విశ్వకర్మ యోజన అని నిర్మలాసీతారామన్ చెప్పారు.
ఈ పథకం రిజిస్ట్రేన్‌లలో ఏపీ దేశంలో మొదటి స్థానంలోను, పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలోను నిలిచిందన్నారు. తాను ‘సన్‌సద్ ఆదర్శ గ్రామ యోజన’లో భాగంగా పీఎం లంక గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. మూడేళ్లుగా గ్రామాభివృద్ధికోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. గ్రామంలో డిజిటల్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందులో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ గ్రామంలోని డిజిటల్ భవనంలో వేలాది మందికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించడం మంచి పరిణామం అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఈ గ్రామాభివృద్దికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఎంతగానో సహకరించారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, ఆరి్ధకశాఖ కార్యదర్శి సత్యనారాయణ, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యదర్శి సురే‹Ùకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment