కేసీఆర్ విపరీత బుద్ధి ప్రదర్శించారు: పరకాల | kcr is being out of limits, says parakala prabhakar | Sakshi
Sakshi News home page

కేసీఆర్ విపరీత బుద్ధి ప్రదర్శించారు: పరకాల

Published Sat, Oct 25 2014 5:00 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

కేసీఆర్ విపరీత బుద్ధి ప్రదర్శించారు: పరకాల - Sakshi

కేసీఆర్ విపరీత బుద్ధి ప్రదర్శించారు: పరకాల

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మితిమీరి మాట్లాడారని, విపరీత బుద్ధి ప్రదర్శించారని ఆంధ్రప్రదేశ్ సీఎం మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ విమర్శించారు. తాము కేసీఆర్ నోట్లో నోరు పెట్టదలచుకోలేదని ఆయన అన్నారు. కేసీఆర్ వాదన తెలుగు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని మండిపడ్డారు.

రెండు ప్రభుత్వాల పనితీరు మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అంతా ఇటువైపే చూస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ కేవలం తనను తాను సమర్థించుకునేలాగే మాట్లాడుతున్నారని, అసలు శ్రీశైలం నీటి మట్టాలపై విడుదల చేసిన రెండు జీవోలను అర్థం చేసుకునే సమర్థత కేసీఆర్కు లేనట్లు ఉందని పరకాల ప్రభాకర్ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement