చిత్తూరు: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మీడియా దృష్టిని మరలిస్తున్నారని పరకాల ప్రభాకర్ విమర్శించారు. ప్రస్తుతం కేసీఆర్‌పై హత్యాయత్నం ఆరోపణలు చోటు చేసుకున్న నేపథ్యంలో పరకాల మండిపడ్డారు. కేసీఆర్ మీడియా దృష్టిని మరల్చేందుకే ఈ కొత్త ఎత్తగడకు తెరలేపారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనకూలంగా నిర్ణయం తీసుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని పరకాల ప్రశ్నించారు. తెలుగు మహసభలు జరిగే ఆరు నెలలు కాకుండానే రాష్ట్ర విభజన చేయడం న్యాయమా? అని నిలదీశారు.
కేసీఆర్పై హత్యాయత్నం కుట్రలు జరుగుతున్నాయని ఆపార్టీ నేతలు మంగళవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కుట్రలపై పూర్తిస్థాయిలో విచారణ జరించాలని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు.