
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం విదేశీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 26 వరకు ముఖ్యమంత్రి మూడు దేశాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, రాజధాని పరిపాలన నగరం ఆకృతుల ఖరారు చేయడమే లక్ష్యంగా అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లండ్‌లలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని వెల్లడించారు.
ఈనెల 18వ తేదీ నుంచి 20 వరకు 3 రోజులు అమెరికాలో, 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో, చివరిగా 24 నుంచి 26వ తేదీ వరకు 3 రోజులు యూకేలో పర్యటిస్తారన్నారు. ఈ పర్యటనలో భాంగా చంద్రబాబు నాయుడుకు యూకేలో గోల్డెన్ పీకాక్ అవార్డు బహుకరించనున్నట్లు పరకాల ప్రభాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment