ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేందుకు పరకాల ప్రభాకర్ ఎవరు అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రశ్నించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేందుకు పరకాల ప్రభాకర్ ఎవరు అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఆధారాలను బయట పెట్టాలని తలసాని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం పదవికి రాజీనామా చేసి నిప్పులాంటి వాడని నిరూపించుకోవాలని తలసాని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఎప్పడికి లోపలికి వెళ్తారా ? అని ఆ రాష్ట్ర మంత్రులు ఎదురు చూస్తున్నారన్నారు. ఏసీబీ వ్యవహారంలో తాము ఎక్కడా జోక్యం చేసుకోబోమని ఆయన తెలిపారు.