ఆర్బీఐ అవాంతరాలు సృష్టిస్తోంది: పరకాల | RBI move to stop Crop Loan Waiver, says Parakala Prabhakar | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ అవాంతరాలు సృష్టిస్తోంది: పరకాల

Published Fri, Aug 8 2014 8:59 PM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

ఆర్బీఐ అవాంతరాలు సృష్టిస్తోంది: పరకాల

ఆర్బీఐ అవాంతరాలు సృష్టిస్తోంది: పరకాల

హైదరాబాద్: సమైక్య ఉద్యమంలో కేసులన్నీ ఎత్తేస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. 952 కేసుల్లో 106 కేసులు ఇప్పటికే ఎత్తేశామని, 4482 మందికి ఊరట లభించిందని వెల్లడించారు. మిగిలినవి త్వరలో ఎత్తేస్తామని చెప్పారు.

రుణాల రీషెడ్యూల్‌కు ఆర్బీఐ అవాంతరాలు సృష్టిస్తోందని వాపోయారు. ఆర్బీఐ సహకరించకపోయినా రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణాలు రీషెడ్యూల్ జరగకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆర్బీఐకి కరువు, వరదలపై లేఖ రాయకుండా విస్మరించిందన్నారు. కొత్త రుణాలపై స్పష్టత ఇవ్వలేమని, నిధులు సమీకరణకు కొంత సమయం పడుతుందని పరకాల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement