హైదరాబాద్ : రైతుల రుణమాఫీ సమస్యకు రీ షెడ్యూల్ పరిష్కారం కాదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. షరతులు లేకుండా రుణాలు మాఫీ చేయాలని ఆయన బుధవారమిక్కడ డిమాండ్ చేశారు. రీషెడ్యూల్ వల్ల రైతులందరికీ తిరిగి రుణాలిచ్చేందుకు బ్యాంకుల వద్ద నిధులు ఉన్నాయా అని రఘువీరా ప్రశ్నించారు. రీ షెడ్యూల్ వల్ల రైతులకు అదనంగా రూ.6వేల కోట్ల వడ్డీ భారం పడుతుందని ఆయన అన్నారు.
రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ ఇప్పుడు మాఫీని అటకెక్కించేందుకు యత్నిస్తోంది. రుణాలు రీ షెడ్యూల్ అంటూ తెరమీదకు తెస్తోంది. ఇదే విషయాన్ని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. వ్యవసాయ రుణాల రీషెడ్యూల్ కు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెప్పుకొచ్చారు.
రుణాలిచ్చేందుకు బ్యాంకుల వద్ద డబ్బులేవి?
Published Wed, Jul 9 2014 2:29 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement