
సాక్షి, రాజమండ్రి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం కాగడాల ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేని బీజేపీ, టీడీపీలను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ను కలుస్తామని తెలిపారు. ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు.
సాక్షాత్తు పార్లమెంటులో అయిన చట్టాలు, ప్రధాన మంత్రి హామీలు, కెబినెట్ నిర్ణయాలకు దిక్కు లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రతీ ఆంధ్రుడి గుండె లబ్ డబ్‌కు బదులు ప్రత్యేక హోదా అని కొట్టుకుంటుందన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రన్న పార్టీగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. కాగా, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై కట్ మోషన్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment