Case Lift
-
స్వాతి, షబ్బీర్‌లపై కేసుల్ని ఎత్తివేయాలి
హైదరాబాద్: కఠువా, ఉన్నావ్ ఘటనలకు నిరససగా కార్టూన్ వేసిన సీనియర్ జర్నలిస్ట్ స్వాతి వడ్లమూడిపై కేసు నమోదుచేయడాన్ని ఖండిస్తున్నట్లు ‘ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్’ సభ్యులు తెలిపారు. సమాజంలో జరిగే దారుణాలను వెలుగులోకి తీసుకొచ్చేవారిపై కేసులు బనాయించడం భావప్రకటనా స్వేచ్ఛపై దాడిచేయడమేనని విమర్శించారు. ప్రస్తుతం ఈ రకమైన ప్రమాదకర ధోరణి దేశమంతా కొనసాగుతోందన్నారు. కఠువా, ఉన్నావ్ ఘటనలపై స్వాతి తన ఫేస్బుక్లో పోస్ట్చేసిన ఓ కార్టూన్‌పై హిందూ సంఘటన్ అనే సంస్థ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. స్వాతితో పాటు టైమ్స్ నౌ జర్నలిస్ట్ షబ్బీర్ అహ్మద్‌లపై నమోదైన కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని నర్సిం, శంకర్, మృత్యుంజయ, సుభానీ తదితర కార్టూనిస్టులు డిమాండ్ చేశారు. -
ఆర్బీఐ అవాంతరాలు సృష్టిస్తోంది: పరకాల
హైదరాబాద్: సమైక్య ఉద్యమంలో కేసులన్నీ ఎత్తేస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. 952 కేసుల్లో 106 కేసులు ఇప్పటికే ఎత్తేశామని, 4482 మందికి ఊరట లభించిందని వెల్లడించారు. మిగిలినవి త్వరలో ఎత్తేస్తామని చెప్పారు. రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ అవాంతరాలు సృష్టిస్తోందని వాపోయారు. ఆర్బీఐ సహకరించకపోయినా రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణాలు రీషెడ్యూల్ జరగకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆర్బీఐకి కరువు, వరదలపై లేఖ రాయకుండా విస్మరించిందన్నారు. కొత్త రుణాలపై స్పష్టత ఇవ్వలేమని, నిధులు సమీకరణకు కొంత సమయం పడుతుందని పరకాల తెలిపారు.