స్వాతి, షబ్బీర్‌లపై కేసుల్ని ఎత్తివేయాలి | CP of India, Withdraw the cases against Swathi Vadlamudi, Shabir Ahmed & Satish Acharya, cartoonists & journalists | Sakshi
Sakshi News home page

స్వాతి, షబ్బీర్‌లపై కేసుల్ని ఎత్తివేయాలి

Published Thu, Apr 19 2018 3:37 AM | Last Updated on Mon, Sep 17 2018 4:52 PM

CP of India, Withdraw the cases against Swathi Vadlamudi, Shabir Ahmed & Satish Acharya, cartoonists & journalists - Sakshi

హైదరాబాద్‌: కఠువా, ఉన్నావ్‌ ఘటనలకు నిరససగా కార్టూన్‌ వేసిన సీనియర్‌ జర్నలిస్ట్‌ స్వాతి వడ్లమూడిపై కేసు నమోదుచేయడాన్ని ఖండిస్తున్నట్లు ‘ఫోరం ఫర్‌ పొలిటికల్‌ కార్టూనిస్ట్స్‌’ సభ్యులు తెలిపారు. సమాజంలో జరిగే దారుణాలను వెలుగులోకి తీసుకొచ్చేవారిపై కేసులు బనాయించడం భావప్రకటనా స్వేచ్ఛపై దాడిచేయడమేనని విమర్శించారు.

ప్రస్తుతం ఈ రకమైన ప్రమాదకర ధోరణి దేశమంతా కొనసాగుతోందన్నారు. కఠువా, ఉన్నావ్‌ ఘటనలపై స్వాతి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసిన ఓ కార్టూన్‌పై హిందూ సంఘటన్‌ అనే సంస్థ సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. స్వాతితో పాటు టైమ్స్‌ నౌ జర్నలిస్ట్‌ షబ్బీర్‌ అహ్మద్‌లపై నమోదైన కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని నర్సిం, శంకర్, మృత్యుంజయ, సుభానీ తదితర కార్టూనిస్టులు డిమాండ్‌ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement