Cartoonist
-
పవన్ నవ్వుల పాలు!
సాక్షి ఇంటర్నెట్ డెస్క్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సెప్టెంబర్ 18వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. లడ్డూలో ఉపయోగించిన నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని చెబుతూ.. ‘కొవ్వు’ కామెంట్లు చేశారాయన. దానికి కొనసాగింపుగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత టీటీడీ బోర్డు చైర్మన్లతోపాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. పనిలో పనిగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు.ఏపీలో లడ్డూ రాజకీయంపై హైడ్రామా కొనసాగుతున్న తరుణంలోనే.. సుప్రీం కోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై స్వతంత్ర దరాప్తు జరిపించాలని కోరారు పిటిషనర్లు. వీటన్నింటిని కామన్‌గా విచారణకు స్వీకరించింది ద్విసభ్య ధర్మాసనం. తొలిరోజు విచారణలో చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: దేవుడికే ఆగ్రహం తెప్పించిన ప్రభుత్వమిది! తిరుపతి లడ్డూ ప్రచారంలో తొలుత జాతీయ మీడియా ఛానెల్స్ సైతం చంద్రబాబు వ్యాఖ్యలనే ప్రముఖంగా ప్రస్తావించాయి. ఆనక.. ఆ వ్యాఖ్యలను నిపుణులతో విశ్లేషించి.. బాబు రాజకీయాల్ని గ్రహించి.. దిద్దుబాటు కథనాలు ఇచ్చాయి. మరోవైపు ప్రముఖ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య లడ్డూ వ్యవహారంపై తన బ్రష్‌కు పని చెప్పారు. తొలి నుంచి జరుగుతున్న పరిణామాలను.. చంద్రబాబు, పవన్‌లకు ఎదురవుతున్న అనుభవాలను ఆయన తన కార్టూన్లలో భలేగా చూపించారు. అందులో కొన్నింటిని ఫస్ట్‌పోస్ట్ పబ్లిష్ చేయగా.. మరికొన్నింటిని ఆయన ఓన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేశారు. మొత్తంగా.. ఈ లడ్డూ రాజకీయంలో చంద్రబాబు తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుంటే, నవ్వులపాలైంది పవనే అనే కామెంట్ ఎక్కడ చూసినా కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Satish Acharya (@cartoonistsatish) View this post on Instagram A post shared by Satish Acharya (@cartoonistsatish) Images Courtesy: Satish Acharya -
హ్యాపీ న్యూ ఇయర్!
హ్యాపీ న్యూ ఇయర్! -
ఒక పుస్తకం-ఒక మోహన్-ఒక ఆర్కే!
జ్ఞానోదయంనాడు ఈ పుస్తకాన్ని చూశాను. జ్ఞానము ఫటాపంచలయింది. సంవత్సరాలు పూర్తి మీద పూర్తి సంపూర్తి అయిపోతూనే ఉన్నాయి. ఒక్క బొమ్మ పూర్తి కాలేదు, అసలు మొదలు పెడితే కదా, పూర్తవడానికి! అసలే జీవితము బరువైంది, ఆపై ఈ పుస్తకం వచ్చి సిందుబాదు భుజాలమీద కూచున్నట్టుగా వచ్చి కూర్చుంది. ఎంతకూ దిగనంటుంది. అది దిగనంటుందా? దించుకోవడానికి నాకే ఇష్టం లేదా. ఏమో! తెల్లవారివారంగానే ప్రేమగా మా మొహాలను అద్దంలో చూసుకుని వాటి పై ఖాండ్రించి ఉమ్మేసి, మురిపెంగా మా కళాఖండాలను ముట్టుకుని నుసి మసి బారేంత కాల్చెయ్య గలిగిన దమ్మునిచ్చింది ఈ పుస్తకం. ఈ ముండమోపి బతుకులో కాస్తొ కూస్తొ అందం కనపడిదంటే వొక బాపు, వొక పతంజలి, వొక మోహన్, లాంటి మరి కొందరు ఒకే ఒకరులు అనే వాళ్ళ సాంగత్యమే, పొగురే, బలుపే. ఒకే ఒక కార్టూన్ కబుర్లు పుస్తకంతో స్నేహిత్యమే. 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ పుస్తకం రాబోతుందని అంధ్రజ్యోతి ఆదివారపు చాట పత్రికలో చాటింపు పడింది. ఆ తరువాత మాఊరికి వచ్చిన విశాలాంద్ర పుస్తకాల బండిలో ఈ పుస్తకం కంటపడింది. నా దురదృష్టవశాత్తు నేను కొనుక్కున్న పుస్తకంలో 90 వ నెంబరు పేజీ మిస్సు కాలేదు. అయి ఉంటే బావుణ్ణు. ఆ పేజిలో పైనుండి కిందికి రెండవ పేరాలో మోహన్ గారు ఇలా అంటాడు కదా " ఇలాంటి ప్రాజెక్ట్ మీద ఆసక్తి గల ఆర్టిస్టులెవరన్నా రావచ్చు. నాతో పాటు యానిమేషన్ చేసే అసిస్టెంట్స్ అందరితో కలిసి కూచుని బొమ్మలేసి, చూసి ఆనందం పొందవచ్చు. మరి జీతము, తిండి, బతుకూ ఎలా అనే తుఛ్చమైన ఐహికమైన ప్రశ్నలుంటే అవి గూడా పర్సనల్‌గా మాట్లాడుకుందాం. ఇలా పబ్లిగ్గా ఎందుకు. నేను 316243 అనే ఫోన్ నెంబర్ లో టెన్ టు సిక్స్ మాత్రమే కాకుండా ఆ తర్వాత గూడా గుమాస్తాగారికంటే హీనంగా పనిచేస్తూఉంటా. రండి ఇది మాయా యానిమేషన్స్, రెడ్ హిల్స్, హైదరాబాద్" ఈ మాటలు చదవడానికి ముందు నాకెప్పుడూ హైదరాబాదుకు వెళ్ళాలని కాని, మోహన్ గారిని కలవాలని గాని కోరికేమి ఉన్నది కాదు. నాకు ఆ సమయంలో ఒక ఉద్యోగం కావాలి. నేను బొమ్మలేస్తానని నాపై నాకు నమ్మకం ఉన్నది. మోహన్ గారి ఆ ఉద్యోగ ప్రకటన చూసిన తరువాత ఆయనని కలిసింది తొలుత నేను కాదు నా ప్రెండ్ కిశోర్, ఆ తరువాత లావణ్య. అదంతా చెప్పాల్సిన వేరే ముచ్చట. నాకు ఆయన ఉద్యోగం ఇచ్చాడా లేదా? జీతం, తిండి, బతుకూ కల్పించాడా లేదా వంటి తుఛ్చమైన ఐహికమైన ప్రశ్నలకు జవాబు మరో భాగంలో , మరెప్పుడయినా. నేను విశాలాంద్ర పుస్తకాల బండిలో కార్టూన్ కబుర్లు పుస్తకం కొనుక్కున్నా. హైద్రాబాదుకి చేరిన తరువాత ఆ పుస్తకానికి నల్లని చమన్ లాల్ బోర్డ్ తో అట్టవేసుకుని దానిపై తెల్లని జిరాక్స్ ముద్రణ గల లోత్రెక్ ఫోటో అతికించుకుని, పొస్టర్ కలర్‌తో నాదైన అక్షరాల్లో "కార్టూన్ కబుర్లు" అని రాసుకున్నాను. ఆ పుస్తకం చూసి మోహన్ గారు ముచ్చట పడ్డారు. అరే భలే ఉందబ్బా ఈ కవర్, నెక్స్ట్ ఎడిషన్‌కి ఇలా కవర్ వేద్దాము అని కూడా అన్నాడు. ( చాలా సంవత్సరాల తరువాత కొత్త కార్టూన్ కబుర్లు పుస్తకానికి నాతో డిజైన్ంగ్, లే అవుట్ చేయించుకుందామని ఆశ కూడా పడ్డారు) ఆ తరువాత, ఆ నా పుస్తకాన్ని పట్టుకుని అలానే అందరమూ కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉండే హార్ట్ ఆనిమేషన్ స్టూడియోకి చేరి అక్కడ ప్రిన్సిపాల్ గారు శ్రీ జయదేవ్ గారిని కలిసి నమస్కరించాము. ఆ తదుపరి నా నల్లని కార్టూన్ కబుర్ల పుస్తకం కవరు తెరిచి లోపల తెల్లని పేజీ పై "జయదేవ్ గారికి ప్రేమతో మోహన్" అని వ్రాసి సంతకం చేసి ఇచ్చాడు. అలా ఇవ్వడానికి మీకు ఏ అధికారం లేదు మొర్రో, అది నా పుస్తకం కుయ్యో, దానిని మా ఊర్లో మా నాయన జేబులో డబ్బులు కొట్టేసి కొనుక్కున్నా అయ్యో అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోవడానికి ఎవరికీ ఆసక్తి లేదు. అందరూ చిరునవ్వుతో గ్రూప్ ఫోటో దిగే మూడ్ లో ఉన్నారు. ఆ తరువాత నేను చాలా అనే అయిదారు కార్టూన్ కబుర్లు పుస్తకాలు కొనుక్కున్నా. ప్రతి పుస్తకం పై మోహన్ గారు టు అన్వర్ విత్ లవ్ మోహన్ అని సంతకం చేసి ఇచ్చేవాడు. అప్పుడప్పుడూ నా ప్రియతములకి నేను ఆ పుస్తకాలు పంచుకునే పని పెట్టుకున్నా. అ మధ్య కూడా డాక్టరమ్మ ఒక భార్గవి గారి ఇంట్లో కార్టూన్ కబుర్లు రెండు కనపడితే నీకు రెండు పుస్తకాలు ఎందుకమ్మా అని దబాయించి , ఒక పుస్తకాన్ని నా కొత్తవకాయ ప్రెండ్ సుస్మిత చేతిలో పెట్టాను. ఈ మధ్య మా అమ్మ సత్యవతి భారతదేశాన్ని, నిషా బార్ గల్లీని ఖాలీ చెసి వెడుతూ "పుత్తర్ నీకేమైనా పుస్తకాలు కావాలా తేల్చుకో" అంది. ఆవిడ పుస్తకాల బీరువాలోంచి కార్టూన్ కబుర్లు తీసుకుని గుండెలకు హత్తుకున్నా. ఈ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివి ఉంటానో లెక్కే లేదు. చదివిన ప్రతిసారి రూపాయి కాయిన్ టెలిఫోన్ బాక్స్ లోంచి మోహన్ గారికి ఫోన్ చేసేవాడిని. అప్పుడు మొబైళ్ళు లేని కాలమది. హైద్రాబాద్ బ్రతుకు మీద చిరాకు, దుఖం, బాధ, పగ కలిగినప్పుడల్లా ఇంటి గోడమీద రక్తపు చూపుడు వేలుతో రెండు పేర్లు రాసేవాణ్ణి. నా హిట్ లిస్ట్ అది. ఒకటి మోహన్ రెండు ఆర్కే. వీళ్ళు ఇద్దరూ కలిసి ఈ పుస్తకాన్ని వేయకుండా ఉండి ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు కదా. ఎప్పటికయినా ఆ పేర్ల మీద ఇంటూ మార్క్ వేసి వికట్టాటహాసం చేయాలని ఎనభైల సినిమా నాతెలుగు నరనరనా నింపుకున్న కొరిక అది. రెఢ్ హిల్స్ లో మేడమీద గదిలో బుద్దిగా బొమ్మలేసుకుంటున్న సమయాన మధ్యాహ్నపు కిటికి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ "మోహనా ఓ మోహనా" అని పిలుపు వినపడేది. కిటికిలోంచి తొంగి చూస్తే బొద్దుగా ఉండే స్కూటర్ మీద , స్కూటర్ లా బొద్దుగా ఉండే ఆర్కే గారు ఒంటికాలి మీద వాలి, చిరునవ్వుతో కిటికి వంక నవ్వుతూ చూస్తూ కనపడేవాడు. అప్పుడు వయసు నలభయ్లలో ఉన్న మానవులు వీరు. కుర్చీలోంచి లేచి ప్యాంట్‌ని పొట్టమీదకు లాక్కుని, ఎదురు టేబుల్ మీద పెన్నుల పెట్టుకునే డబ్బాలోని దువ్వెనతో తల దువ్వుకుని మోహన్ గారు మెట్లు దిగేవాడు. చాయ్, సిగరెట్, మీనాక్షి సాదా, ఆర్కే అనేవి అప్పటి ఆయన అలవాట్లు. ఆర్కే గారు పని చేసే బ్యాంకు మోహన్ గారి ఆఫీసుకు దగ్గరే. అప్పుడప్పుడూ , ఎప్పుడూ మోహన్ గారు తన టేబుల్ సొరుగులోనుండి విత్ డ్రాయల్ ఫాం తీసి అందులో తనకు కావలసిన అమౌంట్ నెంబరు రాసి, ఫామ్ వెనుక డియర్ ఆర్కే, అన్వర్ నో, శంకర్ నో పంపిస్తున్నాను మర్యాదగా ఒక రెండు వందలు నా అకవుంట్ నుండి ఇవ్వగలవు. అసలు మోహన్ గారి అకవుంట్ లో డబ్బులే ఉండవు. పట్టుకు వెల్లిన కాగితాన్ని చదివి ఆర్కెగారు తన జేబులోంచి డబ్బులు తీసి మాకు ఇచ్చేవాడు. ఇలా డబ్బులు కలెక్ట్ చేసే పని మోహన్ గారు ప్రకాష్ అనే తన తమ్ముడికి గానీ, శంకర్ కి కానీ, నాకు కానీ అప్పగించేవాడు కాని. అక్కడే ఉండే మరో గొప్ప కళాకారుడు శ్రీరాం కి మాత్రం చచ్చినా ఇచ్చేవాడు. శ్రీరాం చాలా ఉన్నత శ్రేణికి చెందిన ఆర్టిస్ట్ అనే భయంతో కాదు, ఆ డబ్బులు తీసుకుని మోహన్ గారి స్నేహానికి ఎక్కడ రాజీనామా చేసి పోతాడేమోననే భరించలేని గౌరవం కొద్ది. ఒకానొక సమయంలో తెలుగులో గొప్ప పుస్తకాలు అనే లిస్ట్, తెలుగు పుస్తకాల్లో ఆకర్షణీయమైన తీరుతెన్నులు అనే లిస్ట్ తో రెండు ఆదివారపు పత్రికలు తమతమ ఉద్దేశాల కథనాలు ప్రకటించాయి . ఆ రెండిటి ఉద్దేశాల ప్రకారము ఆ జాబితాలో ఎక్కడానూ "కార్టూన్ కబుర్లు" లేదు. కార్టూన్ కబుర్లు చదివి, దానిని బుర్రకు ఎక్కించుకోవాలంటే ముందు అటువంటి లిస్ట్ తయారు చేసేవారికి ఒక బుర్ర ఉండాలి కదా, పోనీలే అని సమాథాన్ పడ్డాను. తెలుగులో గొప్ప వందపుస్తకాలు జాబితా అనేది ఒకటి ఉంటే అందులో కార్టూన్ కబుర్లు ఉంటుంది. తెలుగులో పది గొప్ప పుస్తకాలు అని ఒక వరుస వేసినా అందులో కార్టూన్ కబుర్లు చేరుతుంది. తెలుగులో రెండే గొప్ప పుస్తకాలు అని లెక్క తేలినపుడు కూడా అందులో ఒక పుస్తకం పేరు కార్టూన్ కబుర్లు అయి తీరుతుంది. మామూలుగానే తెలుగులో బొమ్మలు చూడటమూ, బొమ్మలు చదవడమూ అంటేనే అది అంధులు చదవవలసిన లిపి, బధిరులు వినదగ్గ సంగీతము అనే స్థాయికి చేర్చిన రచనల మధ్య, రచయితల మధ్య కార్టూన్ కబుర్లు కానీ కార్టూనిస్ట్ మోహన్ కానీ ఆతని వచన విన్యాసం కానీ మరియొక్కటి ఎప్పటికీ పుట్టనిది, మరియొక్కడు చేయలేనిది. మోహన్ గారి వచనం అనేది, బాపు గీత అనేది తయరయితే వచ్చేది కాదు. సమస్త జీవులకు ఒక సూర్యుండు వలె. అవి ఒకసారి మాత్రమే పుడతాయి దానిని చూసి , చదివి ఆనందించగల హృదయ సౌందర్యం అనేది మన సంస్కారం పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రతి చిత్రకారుడి దగ్గర ఉండవలసిన పుస్తకం కార్టూన్ కబుర్లు, కార్టూన్ కబుర్లు చదవడం కొరకైనా ప్రతి చిత్రకారుడు నేర్చుకోదగ్గ భాష తెలుగు. ఏ రచయిత చదువుకొనంత, ఏ కవి వినలేనంత, ఏ చిత్రకారుడు గీయలేనంత ఏ జర్నలిస్ట్ చూడలేనంతటి ఒకడే మోహన్, ఒకే కార్టూన్ కబుర్లు పుస్తకం. వాస్తవానికి ఒక కార్టూన్ కబుర్లు పుస్తకం మరో రెండు కార్టూన్ కబుర్లుగా రావలసినది, రాలేదు. రాదు కూడా. ఎందుకని సమగ్ర బాపు బొమ్మల కళ. ఎందుకని బొమ్మల్లో చంద్ర మరియూ అతని గొప్ప డిజైనింగ్, ఎందుకని బొమ్మల బాలి-బాలి బొమ్మలు, ఎందుకని కరుణాకర్ ఒక మానవ శరీరసౌదర్య మూర్తి చిత్రణ, ఎందుకని గోవర్ధన గిరిని కుంచె చివరి గీతతో పైకెత్త గల గోపి బొమ్మల పూల మాల, ఎందుకని ఎందుకని ఎందుకని చాలా చాలా గొప్ప పనులు పుస్తకాలుగా రావో అందుకే ఇదీనూ రాదు . అంతవరకూ ఒక కార్టూన్ కబుర్లు ప్రస్తుతానికైతే ఉంది. అందుకని ఆ పుస్తకానికి జిందాబాద్. ఆర్కే గారికి జిందాబాద్ . నాకు మీ నమస్కారాలు. మోహన్ గారికి హేపీ బర్త్ డేలు. (చదవండి: అత్యంత ఖరీదైన పుస్తకం: విశ్వ జనుల విశ్వశాంతి గీతమే ‘An Invaluable Invocation’) -
మంత్రి పదవి ఇవ్వకుంటే ధర్నాచౌక్‌లో ధర్నా చేస్తారట సార్!
మంత్రి పదవి ఇవ్వకుంటే ధర్నాచౌక్‌లో ధర్నా చేస్తారట సార్! -
ఐడియా సార్.. మీరు బర్రెలన్నగా పేరు మార్చుకుంటే?
ఐడియా సార్.. మీరు బర్రెలన్నగా పేరు మార్చుకుంటే? -
పర్యావరణ సంరక్షణ.. అందరికీ అర్థమయ్యేలా ఇమోజీ, కార్టూన్లతో
‘కళ కళ కోసమే కాదు... పర్యావరణ సంరక్షణ కోసం కూడా’ అంటోంది యువతరం. సంక్లిష్టమైన పర్యావరణ అంశాలను సులభంగా అర్థం చేయించడానికి, పర్యావరణ స్పృహను రేకెత్తించడానికి గ్రాఫిటీ వర్క్, ఇల్లస్ట్రేషన్, ఇమోజీ, కార్టూన్లను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటుంది. ఆర్ట్, హ్యూమర్‌లను కలిపి తన ఇలస్ట్రేషన్లతో పర్యావరణ సంరక్షణకు సంబంధించిన అంశాలను ప్రచారం చేస్తున్నాడు రోహన్ చక్రవర్తి. కామిక్స్, కార్టూన్లు, ఇలస్ట్రేషన్ సిరీస్‌లతో ‘గ్రీన్ హ్యూమర్’ సృష్టించాడు. రెండు జాతీయ పత్రికల్లో వచ్చిన ఈ సిరీస్‌ను పుస్తకంగా ప్రచురించాడు. తన కృషికి ఎన్నో అవార్ట్లు వచ్చాయి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు రోహన్ చక్రవర్తి కార్టూన్లను పర్యావరణ పరిరక్షణ ప్రచారానికి వినియోగించుకుంటున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన రోహన్ పదహారు సంవత్సరాల వయసు నుంచే కార్టూన్లు వేయడం మొదలుపెట్టాడు.‘పర్యావరణ సంక్షోభ తీవ్రతను కామిక్స్‌తో బలంగా చెప్పవచ్చు. శాస్త్రీయ విషయాలపై ఆసక్తి ఉన్న వారినే కాదు, వాటిపై అవగాహన లేని వారిని కూడా ఆకట్టుకొని మనం చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సులభంగా చెప్పవచ్చు’ అంటున్నాడు రోహన్ చక్రవర్తి. కార్టూనిస్ట్, గ్రాఫిక్ స్టోరీ టెల్లర్ పూర్వ గోయెల్ తన కళను పర్యావరణ సంబంధిత అంశాల ప్రచారానికి ఉద్యమస్థాయిలో ఉపయోగిస్తోంది. పర్యావరణ నిపుణులు, పరిశోధకులు, పర్యావరణ ఉద్యమ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ‘అన్ని వయసుల వారిని ఆకట్టుకొని, అర్థం చేయించే శక్తి కార్టూన్లకు ఉంది’ అంటోంది 26 సంవత్సరాల పూర్వ గోయెల్.పశ్చిమ కనుమల జీవవైవిధ్యానికి వాటిల్లుతున్న ముప్పు నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని దిబంగ్ లోయలోని మిష్మి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల వరకు పూర్వ గోయెల్ తన కళ ద్వారా ఆవిష్కరించింది. అభివృద్ధిగా కనిపించే దానిలోని అసమానతను ఎత్తి చూపింది. డెహ్రడూన్‌కు చెందిన పూర్వ గోయెల్ నదులు, అడవులు ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్యను దగ్గరి నుంచి చూసింది. బెల్జియంలో గ్రాఫిక్ స్టోరీ టెల్లింగ్‌లో మాస్టర్స్ చేసింది. ఐక్యరాజ్య సమితి జీవవైవిధ్యం అంశంపై కెనడాలో నిర్వహించిన సదస్సుకు హాజరైంది.‘ఆ సదస్సులో వక్తలు పర్యావరణ విధానాల గురించి సంక్లిష్టంగా మాట్లాడారు. సామాన్యులు ఆ ప్రసంగ సారాన్ని అర్థం చేసుకోవడం కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థమయ్యేలా పర్యావరణ విషయాలను చె΄్పాలనుకున్నాను. దీనికి నా కుంచె ఎంతో ఉపయోగపడింది. నన్ను నేను కమ్యూనికేటర్‌గా భావించుకుంటాను’ అంటుంది పూర్వ గోయెల్. ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా కామిక్ బుక్ తయారుచేసింది గోయెల్. ఈ కామిక్ బుక్కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘మేము ఎన్నో రిపోర్ట్లు విడుదల చేశాం. కాని ఒక్క రిపోర్ట్ చదవడానికి కూడా మా ఎకౌంటెంట్ ఆసక్తి చూపించలేదు. కామిక్స్ రూపంలో ఉన్న రిపోర్ట్ ఆమెకు బాగా నచ్చింది. కామిక్స్ ద్వారా తెలుసుకున్న విషయాలను ఇతరులకు చెప్పడం మొదలు పెట్టింది’ అని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పినప్పుడు ఉత్సాహం రూపంలో గోయెల్‌కు ఎంతో శక్తి వచ్చి చేరింది. ‘గ్రాఫిక్ డిజైన్‌లో భాగంగా బ్రాండ్ డిజైన్ నుంచి పబ్లికేషన్ డిజైన్ వరకు ఎన్నో చేయవచ్చు. కాని నాకు కామిక్ స్ట్రిప్స్ అంటేనే ఇష్టం. ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్‌ను సంక్షిప్తంగానే కాదు అర్థమయ్యేలా చెప్పవచ్చు. ఒకటి లేదా రెండు వాక్యాలు, ఇమేజ్‌లతో పెద్ద స్టోరీని కూడా చెప్పవచ్చు’ అంటున్న అశ్విని మేనన్ గ్రాఫిక్ డిజైన్‌ను పర్యావరణ అంశాల ప్రచారానికి బలమైన మాధ్యమంగా చేసుకుంది.బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)లో చదువుకున్న అశ్విని కళకు సామాజిక ప్రభావం కలిగించే శక్తి ఉందని గ్రహించింది. తన కళను సమాజ హితానికి ఉపయోగించాలనుకుంది. రిచీ లైనల్ ప్రారంభించిన డాటా స్టోరీ టెల్లింగ్ సంస్థ ‘బెజలెల్ డాటా’ అసాధారణ ఉష్ణోగ్రతలకు సంబంధించిన సంక్లిష్టమైన సమాచారం అందరికీ సులభంగా, వేగంగా అర్థమయ్యేలా యానిమేటెట్ ఇమోజీలను క్రియేట్ చేస్తోంది.‘సంప్రదాయ రిపోర్ట్ స్ట్రక్చర్స్ ప్రకారం వెళితే అందరికీ చేరువ కాకపోవచ్చు. రిపోర్ట్ సారాంశాన్ని సులభంగా అర్థం చేసుకునేలా డాటా కామిక్స్ ఉపయోగపడతాయి. పెద్ద వ్యాసం చదువుతున్నట్లుగా కాకుండా ఇతరులతో సంభాషించినట్లు ఉంటుంది’ అంటున్న రిచీ లైనల్ ఎన్నో స్టోరీ టెల్లింగ్ వర్క్‌షాప్‌లు నిర్వహించాడు క్లైమెట్ డాటాపై అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీతో కలిసి పనిచేశాడు. సంక్లిష్టమైన విషయాలను సంక్షిప్తంగా, సులభంగా అర్థమయ్యేలా చేయడానికి రిచీ లైనల్ అనుసరిస్తున్న మార్గంపై యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. మెరైన్ బ్లాగిస్ట్, నేచర్ ఫొటోగ్రాఫర్ గౌరవ్ పాటిల్ రాతలతోనే కాదు ఇలస్ట్రేషన్స్, ఫొటోలతో పర్యావరణ సంబంధిత అంశాలను ప్రచారం చేస్తున్నాడు. సముద్ర కాలుష్యం నుంచి కాంక్రీట్ జంగిల్స్ వరకు ఎన్నో అంశాల గురించి తన ఇల్లస్ట్రేషన్ల ద్వారా చెబుతున్నాడు.బెంగళూరుకు చెందిన అక్షయ జకారియ వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీలు చూస్తూ పెరిగింది. పర్యావరణంపై ఆసక్తి పెంచుకోవడానికి అది కారణం అయింది. పర్యావరణ సంరక్షణపై అవగాహనకు ఇలస్ట్రేషన్, డిజైన్లను ఉపయోగిస్తోంది. రోహన్ చక్రవర్తి నుంచి అక్షయ వరకు పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే అందరినీ ప్రకృతి ప్రపంచంలోకి తీసుకువచ్చింది అనురక్తి మాత్రమే కాదు అంతకంటే ఎక్కువైన అంకితభావం కూడా. -
రాష్ట్రంలోకి ఇంకా ప్రవేశించని రుతుపవనాలు
రాష్ట్రంలోకి ఇంకా ప్రవేశించని రుతుపవనాలు -
బొమ్మల చొక్కా, పూల చీర కార్టూన్లు మరి కనిపించవు..
గత వారం రవీంద్ర భారతిలో నిర్వహించిన చలం గారి సభకు వెళ్ళి వస్తుండగా మా అబ్బాయి మోహన్ నీలోఫర్ కేఫ్ మీదుగా వెడదాం, పని ఉంది అన్నాడు. ఆ నీలోఫర్ రోడ్డు, రెడ్ హిల్స్ తోవ వెంట నాకు అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ హైద్రాబాద్ నగరంలో నా బ్రతుకు ప్రారంభమయ్యింది ఇక్కడే . ఈ ప్రాంతాల్లోనే తొలిసారిగా తెలుగు సాహిత్యంలో మహామహులను చూశాను, కలిశాను, కొన్ని వందల రోజులు, గంటలు, రాత్రింబవళ్ళు వారితో కలిసి ఉన్నాను. అమాయకంగా, బ్రతుకు భాగ్యంగా ఎన్ని మంచి అనుభవాలు జ్ఞాపకాలను ఇక్కడ సంపాదించుకుని మూట గట్టుకున్నానో! ఎపుడు ఆ స్మృతుల దస్తీ విప్పినా గుప్పుమని జాజుల పరిమళమే, మిగల మగ్గిన నేరేడు పళ్ల తీపి వగరు వాసనే. ఇక్కడి హనుమాన్ టెంపుల్ పక్కనే సత్యసాయి డిజైనింగ్ స్టూడియోలో నా తొలి ఉద్యోగం మొదలయ్యింది. సత్యసాయి డిజైనింగ్ స్టూడియో యజమాని ప్రముఖ కార్టూనిస్ట్ సత్యమూర్తి గారు. నేను చేరినప్పుడు అక్కడ ఉన్నది నలుగురం. సత్యమూర్తి గారు, వారి అబ్బాయి సాయి భాస్కర్, నేను, అఫీస్ అసిస్టెంట్ రామకృష్ణ. అది పంతొమ్మిది వందల తొంభై ఏడు. ఆయన దగ్గర నేను ఒక నెల మాత్రమే ఉద్యోగం చేశాను. ఈ రోజుకు అది ఇరవై ఆరు సంవత్సరాల కాలంగా గతించి పోయినప్పటికీ, నేను ప్రతి రోజూ సత్యమూర్తి గారిని తలుచుకుంటాను. ఎలా అంటే ఇదిగో ఇక్కడ నా ఎడమ పక్కన తల తిప్పి చూస్తే గోడ వైపుగా పెలికాన్ రంగు ఇంకు సీసాల మీదు గా నేను నిత్యం వాడే క్రొక్విల్ నిబ్ ఒకటి ఉంటుంది. దాని హేండిల్ చూశారూ, అది అల్లాటప్పా, అణాకాని రకమో, ఎక్కడ పడితే అక్కడ దొరికేదో కాదు, ఆర్డర్ చెయ్యగానే పొస్ట్ లో వచ్చిపడే కంపేనీ తయారి రకం ది అసలే కాదు. అదే పనిగా కొలతలు ఇచ్చి మరీ తయారు చూపించిన హేండిల్ అది. ఎబోనైట్ మిశ్రమంతో తయారు చేయించింది. సత్యమూర్తి గారు ఒక పెన్నుల కంపెనీలో ఫలానా రకంగా కావాలి అని కోరి చేపించిన హేండిళ్లు నాలుగో ఐదో ఉన్నాయి. అందులో ఒకటి ఆయన మహా చిత్రకారులు చంద్ర గారికి ఇచ్చారు , ఒకటి నాకు ఇచ్చారు. మిగతావి ఆయన వద్దే ఉన్నాయి. చంద్ర గారికి నేనంటే ఎంత వాత్సల్యం ఉండేది అంటే ఆయన దగ్గరికి వెళ్లిన ప్రతి సారి ఏదోఒక వస్తువు నా చేతిలో పెట్టేవారు. నా జేబులో ఉంచేవారు. సత్యమూర్తి గారు కాదు నాకు మొదట ఆ హేండిల్ ఇచ్చింది. చంద్ర గారే. ఈ తయారి వెనుక కథ కూడా ఆయనే చెప్పారు. చాలా అందంగా ఉంటుంది ఆ నిబ్బు హేండిల్. దాని పై నుండి నా కన్ను తిప్పుకోలేకపోతుంటే దానిని నా చేతిలో పెట్టి ఉంచుకో అని చల్లని వెన్నెల నవ్వు నవ్వారు. అ జరిగిన కొద్ది కాలానికి పత్రికల్లో నా బొమ్మలు చూసి నన్ను తెగ ప్రేమించిన సత్య మూర్తి గారు మరో రెండు హేండిళ్ళు, కొన్ని డిప్పింగ్ నిబ్బులు చేతిలో పెట్టి ఆయనా నవ్వారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను వేస్తున్న ప్రతి బొమ్మ వెనుక నిబ్బులా నిలబడి సత్యమూర్తి గారు గుర్తు ఉండనే ఉంటారు. కథంతా ఇక్కడ మొదలు కాలేదు. అంతకు ముందే, నేను బడిలో , జూనియర్ కాలేజీలో చదువుతున్న రొజుల్లోనే మొదలయ్యింది. బొమ్మలంటే ఇష్టం. బొమ్మలు వేయడం ఎలాగో తెలీదు. అలాంటప్పుడు విశాలాంద్ర వారి పుస్తకాల వ్యానులో పుస్తక్ మహల్ వారి ప్రచురణ, సత్యమూర్తి గారి రచన "హౌ టు డ్రా కార్టూన్స్" పుస్తకంలో ఔత్సాహికులకు స్టెప్ బై స్టెప్ పాఠాలు ఉన్నాయి. సత్యమూర్తి గారి పేరు ఆ పుస్తకం లో చూడ్డం అంతకన్నా కన్నా ముందే నాకు తెలుసుగా. పత్రికల్లో కార్టూన్లు, కాలెండర్ల మీద గోడకెక్కిన బొమ్మలు, పుస్తకాల ముఖచిత్రాలు మాతరానికి పరిచయమే గా. బొమ్మల పరిచయం వేరు, బొమ్మలు ఎలా వెయ్యాలో చెప్పే మాష్టారుగా తెలుసుకోవడం వేరు. ఆయన రచించిన ఆ పుస్తకం ఒళ్ళో ఉంచుకుని నేను బొమ్మల సాధన చేసాను. ఆ పుస్తకం దయ వల్లనే నేను రోటరింగ్ అనే పెన్నును, బౌ పెన్ అనే సాధనాన్ని, నల్లని ఇండియన్ ఇంకు ను, తెల్లని పోస్టర్ వైట్ ని ... ఇట్లా అవసరమైన సాంకేతిక వ్యవహార జ్ఞానాన్ని తెలుసుకున్నాను. నేల మీద పడుకుని చూస్తే మనిషి ఎట్లా కనపడతాడు? ఫ్యాను రెక్క ఎక్కి చూస్తే మనిషి ఏమని తెలుస్తాడు అనే వివరాలు నేర్చుకున్నాను. నాకు ఊహ తెలిసీ తెలియగానే మారియో మిరండా బొమ్మలు ప్రాణమై కూచున్నాయి. మనుషుల ఆ ఆకారాలు, డ్రాయింగ్ లో ఆ రిచ్ నెస్. పూలు, తీగలు, ఎగబాకిన కొమ్మలు, నిలువుగా నిలబడ్డ చెట్లు, వెనుక భవనాల సముదాయాలు, ఆ గోడకు లతల డిజైన్లు, కిటికీల మీద షోకు వంపులు. బ్రైట్ గా కనపడే ఇంకు రంగులు, గట్టి నిబ్బు పనితనం. అవంటే నాకు బాగా ఆకర్షణ. ఆ రకంగా సత్యమూర్తి గారిని తెలుగు వారి మారియో గా భావిస్తాను నేను. ఆయన రేఖ చాలా తీరుగా ఉంటుంది. కాంపొజిషన్ బాలెన్స్ గా , అక్షరాలు తీర్చి దిద్దినట్లుగా కుదురుతాయి. జస్ట్ చిక్కని నలుపుతో అలా ప్రింట్ అయిన స్టికర్ తీరుగా ఉంటుంది ఆయన చిత్ర రచన. చాలా మట్టమైన పని కనబరుస్తారు ఆయన తన బొమ్మల్లో. మనుషుల వ్యవహారం, ఆ నవ్వు, ఆ భంగిమలు, వారు తొడుక్కున్న చొక్కాలపై, కట్టుకున్న చీరల మీద, కూచున్న సోఫాల మీద పొందికైన పూలు, బొమ్మలు, నిలువు, అడ్డం చారలు, కాళ్లకు తొడుక్కున్న బూట్ల మీద వెలుతురు తళుకు. పిక్చర్ పెర్ఫేక్ట్. మనిషి గా కూడా ఆయన పెర్ఫెక్ట్ గా ఉండే వారు. తిన్నని సఫారీ సూటు, తీర్చి దువ్విన క్రాపింగ్, గట్టి కళ్ళజోడు. నేను ఆయన్ని చూసే సరికి యాభైలు దాటేసారు. యవ్వనపు రోజుల్లో ఆయన అద్భుతమైన అందగాడని, అలా ఆయన నడిచి వస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవని ఆయన రోజుల ఆర్టిస్ట్ లంతా చెప్పేవారు. ఆయన గురించి చంద్ర గారు చెప్పే ఒక సరదా ముచ్చట వినతగ్గది. చాలా చాలా ఏళ్ల క్రితం అప్పటికీ చంద్ర గారు ఇంకా బొమ్మల్లోకి అడుగు పెట్టని సమయంలో హైద్రాబాద్ లో సెవెన్ స్టార్ సిండికేషన్ వారు తొలిసారిగా బాపు గారి బొమ్మల కొలువు ఏర్పాటు చేసారుట. ఆ రోజుల్లో తెలుగు పత్రికల్లో బొమ్మల పాపులర్ ఫిగర్స్ ఇద్దరే. ఒకరు బాపు, మరొకరు "చదువుల్రావు" అనే కార్టూన్ స్ట్రిప్ వేసే సత్యమూర్తిగారు. ఆ చదువుల్రావు క్యారెక్టర్ సత్యమూర్తి గారి స్వంత బొమ్మేనని నా అనుమానం. ఆ పక్కనే జయశ్రీ అనే పెద్ద కళ్ల చిత్రసుందరి భలే ఉంటుంది . సరే! చంద్రగారు ఎక్జిబిషన్ హాల్ లో అడుగు పెట్టి బొమ్మలన్ని చూసేసి ఈ బొమ్మలేసినాయన ఎక్కడున్నాడా అని వెదుక్కుంటూ వెడితే ఒక చోట అల్లా కోలాహలంట . ఎంచక్కని చుక్కలు బొలెడు మంది ఒక పురుషుణ్ణి చుట్టు ముట్టి ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ అని అటో పక్కా ఇటో పక్క తనుకులాడుతున్నారుట. అంతా చేస్తే ఆయన బాపుగారు కాదు, చదువుల్రావుట. సత్యమూర్తి గారి బొమ్మకు, ఆయన హీరో పర్సనాలిటికీ అంత క్రేజ్ ఉండేదిట ఆ రోజుల్లో. బాపు ఎక్కడా అని చూస్తే ఒక చెట్టు కింద నిలబడి వంటరిగా తనమానాన ఒక సిగరెట్ కాల్చుకుంటున్నాట్ట మహానుబావుడు. సత్యమూర్తి గారి స్టూడియో లో నేను కొంత కాలం పని చేసాను కదా. భలే ప్రొఫెషనల్ గా ఉండేది ఆయన సెటప్, బొమ్మలు గీసే పద్దతి, ఆ స్టూడియో. అచ్చం అమెరికన్ చిత్రకారుల మాదిరి డ్రాఫ్టింగ్ టేబుల్, పక్కన బొమ్మల సరంజామా, ఇంకులు, రంగులు. కాసింత దూరంలో అరలు అరలు గా తెరుచుకునే ఒక పెద్ద టేబుల్, అందులో సైజుల వారిగా, మందం వారిగా అద్భుతమైన డ్రాయింగ్ షీట్లు. చమన్ లాల్ కాగితాలు. బొమ్మలని చాలా పద్దతిగా గా వేసే వారు ఆయన , ఒక బొమ్మ మీద రకరకాల పెన్నులు వాడేవారు. చాలా వెడల్పైన ఫ్లాట్ నిబ్స్ తో రేఖలు గీసేవారు. సాలిడ్ బ్లాక్ ఫిల్లింగ్. బొమ్మల కథలు, అడ్వర్టైజ్మెంట్ కార్టూన్లు, పెద్ద పెద్ద కంపెనీల లోగొలు, మోనోగ్రామ్ లు. తీరైన పుస్తకాల కలెక్షన్, ఎన్నో విధాలైన టైపోగ్రాఫ్స్, ఫాంట్ ల పుస్తకాలు, కలర్ స్కీం గైడ్లు. అప్పుడు ఇంకా కంప్యూటర్ ఇంకా రాలేదు. ఈ రోజు మీరు చూసే పాల ప్యాకెట్ దగ్గరి నుండి, అగ్గిపెట్టె దగ్గరి నుండి, తలకాయ నొప్పి మందు, తిన్నది సరిగా జీర్ణంకావడానికి సిరప్... అవీ ఇవని కాదు వ్యాపార ప్రపంచంలోని సమస్త వస్తోత్పత్తికి సంబంధించిన బొమ్మలు, ఎంబ్లంలు, అక్షరాలు స్వయంగా, తీరొక్క రీతిగా అన్నీ చేత్తోనే వ్రాసేవారు, చిత్రించేవారు అప్పటి చిత్రకారులు . ఇప్పుడు ఆ రోజులు, అటువంటి పనిమంతులు కరువై పోయారు. ప్రతీదీ కాపీ పేస్ట్. స్వంత బుర్ర పెట్టి ఏదీ రావడం లేదు. అన్నీ కంప్యూటరే, అన్నీ ప్రింట్ కాగితాలే, అంతా ప్లాస్టిక్ ప్రచారమే, అన్నీ కాపీ ఈజ్ రైటే. అడ్వర్టైజింగ్ రంగానికి సంబంధించిన రూపూ, రంగూ, రేఖ మీద, ఆ జీవితం మీద ఒక పుస్తకం తెలుగు సాహిత్యానికి , జీవితానికి మనం బాకీ ఉన్నాము. నిజానికి దానిని మనకు అందించి ఉండవలసినది సత్యమూర్తి గారు. తెలుగు పొస్టర్ డిజైన్ కు సంబంధించి చాలా విషయజ్ఞానం ఉన్న మరో వ్యక్తి శ్రీ గీతా సుబ్బారావు గారు. ఆయన ఎలా ఉన్నారో! ఏం చేస్తున్నారో తెలీదు. ముందు మనం ఏదయినా పుచ్చుకొవాలనే తపన ఉంటే కదా ఇచ్చేవారికి ఇవ్వాలి అనిపించేది. గీతాసుబ్బారావు గారి అన్నగారు శ్రీ వీరాజీ గారూ ఆయన ఒక తరం తెలుగు పత్రికా జీవితాన్ని తన ఆత్మకథ గా అద్భుతంగా చెప్పుకున్నారు. అది ఏవయిందో తెలీదు. అవన్నీ పుస్తకాలు గా రావలసినది. ఏదీ రాదు. ప్రెస్ అకాడమిలు ఎందుకు ఉన్నవో నాకైతే నిజంగా తెలీదు. నేను ఆయన వద్ద ఉద్యోగం చేసింది నెల మాత్రమే . చిన్న ఊరినుండి వచ్చిన వాడిని .ఏమీ తెలీదు. స్కేలు పట్టుకోవడం, సెట్ స్క్వయర్ ఉపయోగించడం, ప్రెంచ్ కర్వ్స్ వాడి లోగో డిజైన్ లు చేయడం, అక్షరాలూ వ్రాయడం, తొంబై డిగ్రీల్లో టెక్నీకల్ పెన్ను వాడటం అన్ని ఆయన దగ్గరే తొలిసారి చూసాను, తెలుసుకున్నాను. ఆయన నా గురువు. చాలా కాలం విరామం తరువాత ఒకసారి ఆయన్ని ఒక కార్టూన్ షోలో చూశాను. నన్ను చూసి ఎంతో సంతోషించారు. ఇంటికి రమ్మన్నారు, ఇంటికి వెలితే గుప్పెట నిండా గుప్పెడు నిబ్బులు పెట్టారు. ఒక మంచి డ్రాఫ్టింగ్ టేబులు వాళ్ల అబ్బాయి తో ఇప్పించారు. ఇపుడు ఏది తలుచుకున్నా గతం. ఒకానొక కాలంలో ,ఒకే కాలంలో బాపు, జయదేవ్, సత్యమూర్తి, బాలి, చంద్ర, గోపి, మోహన్, రాజు, బాబూ, కరుణాకర్... గార్ల వంటి అత్యంత అరుదైన చిత్రకారులు ఇక్కడ ఉండేవారు, మాతో మాట్లాడేవారు, అభిమానించేవారు, తప్పులు దిద్దేవారు ఒప్పులుగా మిగలడానికి తమదైన ప్రయత్నం చేసేవారు అని అనుకోవడం తప్పా మరేం మిగల్లేదు. ఇప్పుడు గురువులు ఎవరూ లేరు. శిష్యులుగా మిగలడానికి ఎవరికీ రానిదీ, తెలియనిదీ ఈరోజుల్లో ఏదీ లేదు. తెలుగులో బొమ్మలకు, కార్టూన్ కళకు, మనకు ఒకప్పుడు ఉండిన ఒక కళకు, నల్లని సిరాకు, పదునైన పాళికి చివరి రోజులివి. సత్యమూర్తిగారికి కూడా శ్రద్దాంజలి (ప్రముఖ కార్టూనిస్ట్, ఒక తరం గురువు సత్యమూర్తి గారు 83 ఏళ్ళ వయసులో 25-05-23 న మననుండి దూరమయ్యారు, తెలుగు కార్టూన్ లో చివరగా మిగిలిన బొమ్మల చొక్కాలు, పూల చీరలు, నిలువు చారల, అడ్డ గీతల ఫర్నీచర్ కూడా మాయమయ్యింది. అన్వర్ అర్టిస్ట్, సాక్షి -
ప్రగతిని పరుగులు పెట్టిస్తాం!
కర్ణాటకలో ప్రగతిని పరుగులు పెట్టిస్తాం- ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు! -
నాకే మీ ఓటు!
కర్ణాటక ఎన్నికలు -
కర్ణాటకలో 20 ప్రాంతాల్లో మోదీ ప్రచారం
పరిస్థితులు బాగోలేవట! అలాగే రోడ్ షోల్లో, ర్యాలీల్లో, సభల్లో సుడిగాలి పర్యటనల్లో పాల్గొంటూ గెలిపించాలట సార్! -
ఆ క్షణం నాకు వెన్ను నుంచి వణుకు పుట్టుకువచ్చింది..
ఇండియన్ పొలిటికల్ కార్టూన్ అంటే ప్రపంచం తల తిప్పి ఆర్కే లక్ష్మణ్ అనే సంతకం వైపు చూస్తుంది . అటువంటి మహా చిత్రకారుడు ఆర్కే లక్ష్మణ్ కథ బొమ్మలనే సాధనగా, సాధనే జీవితంగా సాగిన లక్ష్మణ్ జీవితంలో లైఫ్ స్కెచింగ్ చోటు చేసుకున్నంతగా మరే భారతీయ వ్యంగ చిత్రకారుడి జీవితంలో ఈ సాధన రక్తంలో రక్తంగా కలిసిపోవడాన్ని విని ఉండలేదు. లక్ష్మణ్ పార్లమెంట్‌ని ఫొటోల్లో చూసి తన బొమ్మల్లోకి దింపలేదు. పార్లమెంట్ ఎదురుగా కూచుని దానిని అన్ని కోణాల్లో బొమ్మగా మార్చుకున్నాడు. రాజకీయనాయకులని, బ్యాంక్ ఉద్యోగస్తులని, చెట్టు కింద చిలుక జ్యోతిష్కుడిని, మెరైన్ డ్రైవ్ రహదారి అంచున కూర్చున్న మనుషులని ఎవరిని కూడా ఊహించుకుని వేసిన బొమ్మలు కావవి. అందరిని చూసాడు, తనలో ఇంకించుకున్నాడు. బొంబాయి నగరాన్నంతా కట్టల కొద్దీ స్కెచ్ పుస్తకాల్లో నమోదు చేసుకున్నాడు . జీవిత నిరంతరం సాధన చేస్తూనే ఉన్నాడు. అందుకే తనది ఇక మరెవరూ దాటలేని నల్లని ఇంకు గీతల లక్ష్మణరేఖ ఐయింది. ఇరవైల ప్రాయంలో లక్ష్మణ్ జీవితంలోని కొన్నిపేరాల సంఘటనలు ఇక్కడ.. అప్పటికప్పుడు పత్రిక సంపాదకుడ్ని కలిసి నా గురించి ఆయనకు చెప్పుకున్నాను . అంతా విని ఆయన మరో మాట ఏమీ లేకుండా వెంటనే ‘కల్బాదేవి కాల్పులపై’ ఒక కార్టూన్ స్ట్రిప్ చిత్రించమని పని నాకు ఇచ్చాడు. కల్బాదేవి అనేది బొంబాయిలో బాగా పేరున్న ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగిన అతి పెద్ద ఉగ్రవాద దాడికి, మారణకాండకు ఈ ప్రాంతమే కేంద్రం. 14 సెప్టెంబర్ 1946న ఇండియన్ ఆర్మీ క్యాంపునకు సంబంధించిన ఇద్దరు సైనికులు సైనిక లారీలో తమ యూనిట్ నుండి ఆయుధాలతో సహా తప్పించుకుని బైకుల్లా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక టాక్సీని కిరాయికి తీసుకుని కల్బాదేవి వైపు వెళ్ళమన్నారు. ఆ టాక్సీ నారిమన్ అనే పార్సీ వ్యక్తికి చెందింది. ఆ సమయంలో ఆ టాక్సీలో అతనితో పాటు యుక్తవయస్కుడైన అతని కొడుకు కూడా ఉన్నాడు. హంతకులు నేరుగా టాక్సీని కల్బాదేవి వేపు తీసుకెళ్ళి, టాక్సీ నుండి దిగీ దిగగానే ఇద్దరూ తమ చేతిలో ఉన్న మెషిన్ గన్లతో రహదారిపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఇటువంటి దారుణాన్ని ఊహించని డ్రైవర్, అతని కొడుకు ఇద్దరూ భయాందోళనలకు గురై టాక్సీని వదిలి పారిపోజూశారు. ఆ హంతకులు ఈ తండ్రీ కొడుకులు ఇరువురిని కూడా చంపేశారు. ఈ దారుణకాండలో దుకాణంలో కూచుని ఉన్న ఒక నగల వ్యాపారి, ఉదయాన్నే బడికి బయలుదేరిన ఒక చిన్న పిల్లవాడు, రోడ్డు మీద కూరగాయలు అమ్మే ఒక మనిషి, టీ దుకాణంలో కూచుని టీ తాగుతున్న ఒక వ్యక్తి ఇంకా కొంతమంది పాదచారులతో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇరవైమంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితులను బాంబే పోలీసులు సంఘటన జరిగిన రెండు నెలల్లో అరెస్టు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్ని రోజుల ముందు కోర్టు వారిని విచారించి మరణశిక్ష విధించింది. ఇదంతా నేను బొంబాయి చేరుకునే సమయం ముందుగా జరిగింది. ఆ సమయంలో ఇది దేశ వ్యాప్తంగా చాలా పెద్ద సంచలన వార్త. బ్లిట్జ్ ఎడిటర్ నాకు ఈ కథను క్లుప్తంగా చెప్పాడు. ఈ సంఘటన విచారణకు సంబంధించిన కోర్ట్ కాగితాల ప్రతులను కూడా నాకు అందచేశాడు. ఈ ఇతివృత్తాన్ని ఒక బొమ్మల కథగా తయారు చేయాలని, ఆ కథ ప్రతీ వారం తమ పత్రికలో రావాలని, ఇందుకు గానూ ఆయన నాకు వెయ్యి రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు. పంతొమ్మిది వందల నలభైలలో వేయి రూపాయలంటే చాలా పెద్ద డబ్బు. ప్రస్తుతం నేను మద్రాసు నుండి వెలువడే స్వరాజ్య పత్రికవాళ్ళు నా కార్టూన్లకు పంపుతున్న డబ్బుతో బొంబాయిలో కాలం నెట్టుకొస్తున్నాను. ఇప్పుడు రాబోతున్న బ్లిట్జ్ డబ్బులు ఇవన్నీ కలుపుకుని బొంబాయిలో ఇంకొంత కాలం గడపవచ్చు కదా అని సంబరపడ్డాను. బొమ్మల కథకు అవసరమైన నేపథ్యాన్ని అధ్యయనం చేయడానికి కాల్పులు జరిగిన కల్బాదేవి ప్రాంతం గుండా నన్ను తీసుకెళ్లడానికి, కాల్పులు జరిగినపుడు అక్కడే ఉన్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులను, బాధితులను నేను కలుసుకుని మాట్లాడ్డానికి , వారి ద్వారా జరిగిన సంఘటన తబ్సీలు ఎక్కించుకోవటానికి గాను నా కోసం ఆ ప్రాంతపు ఆనుపానులు తెలిసిన వారిని కొంతమందిని సహాయంగా కల్బాదేవి ప్రాంతానికి పంపించాడు బ్లిట్జ్ ఎడిటర్. కల్బాదేవి అనేది దాదాపు అరకిలోమీటరు పొడవునా రద్దీగా ఉన్న రహదారి మార్గం. రోడ్డుపై బస్సులు, కార్లు, సైకిళ్లు, తోపుడు బళ్ళు, మనుష్యులు అనేకులు బిలబిలమని కదులుతూనే ఉన్నారు. వీధికి రెండు వైపులా పుస్తకాలు అమ్మేవాళ్ళు, గడియారాలు రిపేర్లు చేసే చిన్న చిన్న కొట్లవాళ్ళు, మంగలి షాపులు, టీ షాపులు, వెండిపని చేసే కంసాలి దుకాణాలు, బట్టలు అమ్మే వ్యాపారులు, ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు బారులు బారులుగా నడుస్తున్నాయి . వీధిలో అటూ ఇటూ చూసుకుంటూ నేను అక్కడ జరిగిన నరమేధం గురించి ఆలోచిస్తున్నాను. ముందస్తుగా ఎటువంటి ఘోరాన్ని ఊహించని ఒక ఉదయాన వీధి నడి బొడ్డున వచ్చి ఆగిన ఒక టాక్సీ నుండి నిప్పులు కక్కుతూ తుపాకులు సృష్టించిన భీకర మారణకాండని తలుచుకుంటే ఆ క్షణం నాకు వెన్ను నుండి వణుకు పుట్టుకువచ్చింది. కల్బాదేవి దారుణ సంఘటనను బొమ్మల కథగా మలచడానికి ఆ రహదారిలో నిలబడి నేనొక భ్రమను నా చుట్టూ అల్లుకున్నాను. ఆ సంఘటన జరిగిన రోజున ఆ నేరగాళ్ళు ప్రయాణించిన కారులో నేనూ అదృశ్యంగా ఉన్నట్టు, వారి సంభాషణ మొత్తం నా సమక్షంలోనే జరుగుతున్నట్టు, వారి తుపాకి నుండి వెలువడిన ప్రతి తూటా నా కళ్ళ ముందే దూసుకుపోయినట్టు – రవ్వలు కక్కే ఆ అంగుళమంత నిప్పుముక్క ఏ దుకాణపు తలుపును ఛేదించుకుంటూ పోయిందో! ఏ మనిషి కడుపును కుళ్ళపొడుస్తూ తన రక్తదాహం తీర్చుకుందో! మనుషులు ఆర్తనాదాలు చేస్తూ ఎలా కకావికలమయ్యారో, ఎలా కుప్పకూలిపోయారో! – అశరీరంగా నేను చూస్తున్నట్లు బొమ్మలు వేసేందుకు అనువయిన ప్రతి సన్నివేశాన్ని అనేకానేక కోణాల నుండి గమనించినట్లు ఒక అవాస్తవ భ్రాంతిని సృష్టించుకున్నాను . ఆ సమయంలో నేను మొదటి సారిగా కల్బాదేవి వీధిలో నడుస్తూ నిలువెల్లా వణికిపోయినవాడిని కాను. నా ఎరుక లేకుండా జరిగిపోయిన దానిని కూడా అవసరమైనపుడు ఊహాపోహలుపోయి కళ్ళముందుకు తెచ్చుకుని దానిని నల్లని గీతలతో పునఃప్రతిష్ట చేయగలిగిన చిత్రకారుడిని నేను. నేను లక్ష్మణ్‌ని. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి. -
గేర్‌బాక్స్ మీ చేతుల్లోనే ఉంది సార్!
గేర్‌బాక్స్ మీ చేతుల్లోనే ఉంది.. మీ ఇష్టం సార్! -
మిమ్మల్ని మర్చిపోయే సమయానికి మళ్లీ ఎందుకుసార్!
ప్రపంచం ఆల్రెడీ మిమ్మల్ని గుర్తించి, మర్చిపోయే సమయానికి మళ్లీ ఎందుకుసార్! -
కంగ్రాట్స్ సార్.. మీ మనసులోని మాటను ఆయనతో చెప్పించారు!
కంగ్రాట్స్! మీ మనసులోని మాటను మీరు చెప్పకుండా ఆయనతో చెప్పించారు! -
‘తానా’ అంతర్జాతీయ కార్టూన్ పోటీ.. విజేతలకు రూ. లక్ష నగదు
సాక్షి, అమరావతి: తెలుగు భాష, తెలుగు కార్టూన్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు అంతర్జాతీయ కార్టూన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకుడు ప్రసాద్ తోటకూర తెలిపారు. మంగళవారం విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయం ఆడిటోరియంలో కార్టూన్ పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తొలిసారిగా తానా అంతర్జాతీయ తెలుగు కార్టూన్ పోటీలు–2023ను ఏర్పాటు చేసిందన్నారు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటేలా కార్టూన్లు పంపాలని తెలిపారు. పోటీల్లోని ఎంట్రీల నుంచి 12 అత్యుత్తమ కార్టూన్లను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.5,000, మరో 13 ఉత్తమ కార్టూన్లకు గాను ఒక్కొక్కరికీ రూ.3,000 చొప్పున మొత్తం 25 మందికి నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు కార్టూనిస్టులు పోటీల్లో పాల్గొనవచ్చని, ఒక్కొక్కరి నుంచి మూడు కార్టూన్లను స్వీకరిస్తామని తెలిపారు. ఎంట్రీలను 300 రిజల్యూషన్ జేపీఈజీ ఫార్మేట్లో tanacartooncontest23@gmail.comకు ఈ నెల 26లోగా పంపాలన్నారు. ఫలితాలను జనవరి 15న సంక్రాంతి రోజు ప్రకటిస్తామని చెప్పారు. వివరాల కోసం 9154555675, 9885289995 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యనిర్వాహక సభ్యులు కళాసాగర్, కలిమిశ్రీ, జాకీర్ పాల్గొన్నారు. (క్లిక్: బెజవాడను కప్పేసిన మంచు దుప్పటి) -
అయ్య బాబోయ్ ఇలా అయిపోతామా!మండే మోటివేషన్: ఆనంద్ మహీంద్ర ట్వీట్స్ వైరల్
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తరచుగా 'మండే మోటివేషన్' కోట్స్, వీడియోలను ట్విటర్లో షేర్ చేయడం అలవాటు. తాజాగా మండే బ్లూస్ అంటూ అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ కోట్‌ను ట్వీట్ చేశారు. "మనందరికీ పిచ్చి అని గ్రహించిన క్షణంలో మాత్రమే జీవితం పూర్తిగా అర్థమవుతుంది." అనే కోట్‌ను అభిమానులతో షేర్ చేశారు. ప్రపంచమే ఒక పచ్చి వలయం. అందులో మనం కూడా కొంచెం వెర్రి వాళ్లమనే సత్యాన్ని గ్రహించగలిగితే చక్కని చిరునవ్వుతో సోమవారం పనిలోకి దిగుతాం. మీరు చేసే పనిలో 'క్రేజీ గుడ్'గా ఉండటానికి ప్రయత్నించండి అంటూ సూచించారు. దీంతోపాటు ఆనంద్ మహీంద్ర మరో ట్వీట్ కూడా ఆలోచనాత్మంగా మారింది. “నర్సింగ్ హోమ్ ఇన్ ఏ పోస్ట్ టెక్ట్సింగ్ వరల్డ్” అనే టైటిల్‌తో ఉన్న ఒక కార్టూన్‌ను షేర్ చేశారు. వేలం వెర్రిగా పెరిగి పోతున్న స్మార్ట్ ఫోన్ వినియోగంపై బాధాకరమైన కార్టూన్‌ను ఆయన ట్వీట్ చేశారు. ఈ కార్టూన్ చూస్తేనే భయంగా ఉందనీ, తనను ఇది ఫోన్ పక్కన పెట్టేలా చేసిందన్నారు. “ తీవ్రంగా బాధ కలిగించే కార్టూన్ ఇది. నా ఫోన్‌ను పక్కన పెట్టేలా చేసింది (ఈ ట్వీట్ చేసిన తర్వాత!). మెడను నిటారుగా ఉంచుకొని, తల ఎత్తుకొని నా ఆదివారాన్ని గడిపేలా చేసింది” అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. కాగా చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా పొద్దున్న లేచింది మొదలు, స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయిపోతున్నారు. అలా విచక్షణ లేకుండా నిరంతరం మొబైల్‌ను చెక్ చేస్తూ, దానికి బానిసలై పోతున్న వారి పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో కళ్ళకు కట్టినట్టుగా ఉంది ఈ కార్టూన్. రోగులుగా మనం నర్సింగ్ హోంలో ఎలా ఉండబోతున్నామో అనడానికి పూర్తి నిదర్శనంగా నిలుస్తోంది ఈ కార్టూన్. You may be able to go in to work on Mondays with a smile on your face if you acknowledge inside yourself that the world’s a madhouse & we’re all a bit crazy. Just make sure you try to be ‘crazy good’ at what you do…! pic.twitter.com/kyw8YRLzxH — anand mahindra (@anandmahindra) November 28, 2022 That’s a seriously depressing cartoon. But it’s made me decide to put down the phone (after tweeting this!) and ensure that my Sunday is spent with my neck straight and my head up… pic.twitter.com/seEdiAhQAC — anand mahindra (@anandmahindra) November 27, 2022 -
నిజమే.. ఓడించమని ముందే చెప్పారు!
నిజమే.. ఓడించమని ముందే చెప్పారు! -
మనకు గొడవలొద్దు! గొడవలు పెడదాం!!
మనకు గొడవలొద్దు! గొడవలు పెడదాం!! -
ఎలుక అనుకొని మౌస్ మింగేసింది!
రష్యన్ కార్టూనిస్ట్ ఆండ్రూ కిల్మోవ్ గీసిన కార్టూన్ ఇది. వేడి వేడి రాజకీయ కార్టూన్లు గీయడంలో ప్రసిద్ధుడైన కిల్మోవ్ అప్పుడప్పుడూ ఇలాంటి రాజకీయేతర కార్టూన్లు కూడా గీసి నవ్విస్తుంటాడు. ‘అజర్కాంట్’ పేరుతో సైన్స్–ఫిక్షన్ షార్ట్ యానిమెటెడ్ ఫిల్మ్ తీసి శభాష్ అనిపించుకున్నాడు. ‘మీకు ఐడియాలు ఎలా వస్తుంటాయి?’ అని కుర్రకారు కిల్మోవ్ను అడుగుతుంటారు. ‘ఐడియా కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. టైమ్ వస్తే అదే మనల్ని వెదుక్కుంటూ వస్తుంది’ అని హాయిగా నవ్వుతాడు మోవ్. అంతేకదా మరి! చదవండి: Cyber Security Tips: పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? డిజిటల్ రాక్షసులుగా మారకుండా.. International Safe Abortion Day: ఈ దేహం నాది ఈ గర్భసంచి నాది -
Cartoonist Mohan: బొమ్మలు చెక్కిన శిల్పం
బొమ్మలు కూడా మాట్లాడతాయి. మాట్లాడ్డమే కాదు జనం తరఫున పోట్లాడతాయి. కత్తులు దూస్తూ ముందుకు ఉరుకుతాయి. కదం తొక్కుతూ పరుగులు తీస్తాయి. రాజుగారి దురహంకారాన్ని ఎడంకాలితో తన్ని పారేస్తాయి. అయితే అన్ని బొమ్మలూ అలా చేయవు. బొమ్మకు ప్రాణం పోసే చేయిని బట్టి, ఆ చేతిని కదిపే కళాకారుడి మనసును బట్టి, ఆ మనసులో రెపరెపలాడే ఎర్ర జెండా పొగరును బట్టి బొమ్మలు కాలర్లు ఎగరేస్తాయి. అలాంటి బొమ్మల తాలూకు ఓనర్లలో ముఖ్యులు ఆర్టిస్ట్ మోహన్. తాడి మోహన్ రావు అంటే ఎవ్వరికీ తెలీకపోవచ్చు. కానీ కార్టూనిస్ట్ మోహన్ అంటే మాత్రం తెలీని వాళ్లు ఉండరు. మోహన్ అంటే సకల కళా వల్లభుడు. కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు, కేరికేచర్లు, కవర్ పేజీ బొమ్మలు, ఉద్యమాలకు కదం తొక్కండర్రా అని కుర్రకారు గుండెల్లో పౌరుషాగ్ని రగిలించే పోస్టర్లు, రాజ్యాధి కారపు దురహంకారాన్ని కాలరు పట్టు కుని నిలదీసి తిరుగుబాటు చేసే జెండా లపై బొమ్మలు, బిగించిన పిడికిళ్లు, కస్సుమని దూసుకుపోయే కొడవళ్లు, యుద్ధభూమికి కదం తొక్కించే లాంగ్ మార్చ్ కాన్వాస్‌లు! మోహన్ అంటే యుద్ధం. అధర్మంపై అన్యాయంపై చిరు నవ్వుతోనే కత్తులు దూసే యుద్ధమే మోహన్! ఎక్కడో ఏలూరులో పుట్టి, అక్కడెక్కడో పశ్చిమబెంగాల్లో జ్ఞానానికి సానపట్టి, విజయవాడ ‘విశాలాంధ్ర’ మీదుగా హైదరాబాద్‌కు తరలి అదే రాజధానిగా కళాకారుల సామ్రా జ్యాన్ని స్థాపించాడు మోహన్. తెలుగునాట పొలిటికల్ కార్టూన్ అంటే ఇలా ఉండాలిరా నాయనా అన్నట్లు వందల వేల కార్టూన్లతో రాజకీయ నేతల గుండెల్లో అణుబాంబులు పేల్చిన ఉగ్రవాది మోహన్. ఎంత పెద్ద నాయకుడైనా సరే భయం లేదు. ఎంత దుర్మార్గపు నాయకుడైనా సరే ఖాతరే లేదు. తిట్టాలనుకుంటే తిట్టేయడమే. కోపం పెద్దదైతే లాగి లెంప కాయలు కొట్టేయడమే. ఎన్టీఆర్ నుండి నేటి కేసీయార్ వరకు మోహన్ కార్టూన్ బారిన పడని నేత లేరు. మోహన్ తండ్రి తాడి అప్పలస్వామి కమ్యూనిస్టు నాయ కులు. నాన్న నీడలో మండుటెండపు ఉద్యమాలు మోహన్ లోని కళాకారుడికి చిన్నప్పుడే ఓ కర్తవ్య బోధ చేసేశాయి. అదే 5 దశాబ్దాల పాటు తెలుగు నాట ఉద్యమ పోస్టర్లపైనా, తిరుగుబాటు జెండాలపైనా పిడికిళ్లు బిగించిన యోధుల విప్లవ నినాదాలు, కసి ఎక్కిన కొడవళ్ల బెదిరింపులు వగైరాల ఎర్రెర్రటి బొమ్మల రూపంలో మోహన్ సంతకం మెరుస్తూనే ఉంది. (క్లిక్: ఆ రాచరికంలో ఎందుకింత ఆకర్షణ?) ప్రభువెక్కిన పల్లకీలు మోసి, వారి అంతఃపుర రాణుల అందాలు పొగిడి వారిచ్చే చిల్లర బహుమతులు మూట కట్టుకుని మురిసిపోయే కళాకారులు కాలగర్భంలో కలిసి పోతారు. ఎవరికీ గుర్తుకు కూడా రారు. పల్లకి నెక్కిన ప్రభువును కాలర్ పట్టుకుని నీ రాజ్యం చాలా అన్యాయంగా ఉంది గురూ అని అనగలిగిన వాడే నిఖార్సయిన వీరుడు. అసలు సిసలు యోధుడు. అలాంటి వారినే తరతరాలుగా జనం గుర్తు పెట్టుకుంటారు. గుర్తుపెట్టు కోవడమేం ఖర్మ గుండెల్లో గుడి కట్టేసి ఆ గుడిలో ఏనిమేషన్ సినిమాలతో పూజలు చేసేస్తారు. అటువంటి అరుదైన యోధుడూ, కళాకారుడూ మన మోహన్! – సీఎన్ఎస్ యాజులు (సెప్టెంబర్ 21న చిత్రకారుడు మోహన్ వర్ధంతి) -
అవధుల్లేని కళ
గోవిందుని అరవిందన్ సినిమాల్లోకి రాకముందు కార్టూనిస్టుగా పనిచేశారు. ఆయన కార్టూన్ స్ట్రిప్ ‘చెరియ మనుష్యారుమ్ వలియ లోకవుమ్’ (చిన్న మనుషులు పెద్ద ప్రపంచం) దశాబ్దానికి పైగా మలయాళ వారపత్రిక మాతభూమిలో వచ్చింది. దీన్ని ఆధారం చేసుకొనే తన మొదటి సినిమా ‘ఉత్తరాయణం’కు(1974) శ్రీకారం చుట్టారు. అప్పటికే నాటకరంగంలో కూడా చేస్తున్న కషి ఆయన్ని చిత్రసీమలోకి అడుగుపెట్టేలా పురిగొల్పింది. స్వాతంత్య్ర సమర కాలంలో ఒక సాధారణ యువకుడి ద్వైదీ భావాలనూ, వేర్వేరు పోరాట మార్గాలనూ, కొందరు మనుషుల అవకాశవాదాన్నీ అతిసహజంగా చిత్రించిన ఈ సినిమా మలయాళ పరిశ్రమలో కొత్తగాలిలా వీచింది. అప్పుడప్పుడే మలయాళ పరిశ్రమ ఉత్తరాదిన వీస్తున్న సమాంతర సినిమా పవనాలకు పరిచయం అవుతోంది. మున్ముందు జి.అరవిందన్‌గా సుప్రసిద్ధం కాబోతున్న గోవిందుని అరవిందన్(1935–1991) తర్వాతి సినిమాగా ‘కాంచనసీత’ ప్రారంభించారు. 1977లో వచ్చిన ఈ సినిమా చూస్తే గుప్పెడు మందితో, ఏ ఆర్భాటమూ హడావుడీ లేకుండా కూడా రామాయణాన్ని తెరకెక్కించవచ్చా అన్న సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాటలు, శక్తిమంతమైన ప్రతీకలు, దశ్యబలంతో ఉత్తర రామాయణాన్ని ఒక వ్యక్తిగత కవితా అభివ్యక్తిగా మలిచారు. ఇంకా దీని విశేషం ఏమిటంటే– తారలనూ, అలవాటుగా చూస్తున్న నునుపైన తెలుపు శరీరాలనూ పక్కనపెట్టి రాముడితో దగ్గరి సంబంధం ఉందని చెప్పుకొనే ‘రామచెంచు’ తెగవాళ్లతోనే ప్రధాన పాత్రలను పోషింపజేయడం! దీనివల్ల ఛాందసవాదుల నుంచి దైవదూషణ స్థాయి వ్యతిరేకతనూ ఎదుర్కొన్నారు. కానీ వెనక్కి తగ్గ లేదు. సినిమా పట్ల ఆయన దక్పథం అంత బలమైనది. అందువల్లే మలయాళంలో సమాంతర సినిమాకు దారిచూపిన మొదటి వరుస చిత్రంగా కాంచనసీత చరిత్ర కెక్కింది. ఈ సినిమా షూటింగ్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో జరగడంతో తెలుగువారికి కూడా దీంతో మరింత సంబంధం ఏర్పడింది. అరవిందన్ తర్వాతి సినిమా 1978లో వచ్చిన ‘థంపు’. అంటే సర్కస్ డేరా. దీన్ని బ్లాక్ అండ్ వైట్‌లో తీయాలని పూనుకోవడానికి బహుశా జీవితపు నలుపూ తెలుపుల్నీ అత్యంత గాఢంగా చూపాలని కావొచ్చు. ఒక ఊరికి సర్కస్ వాళ్లు రావడంతో మొదలై, కొన్ని రోజులు చుట్టుపక్కల వాళ్లని ఊరించి, ఊగించి, తిరిగి ఏ ఆదరణా లేని దశకు చేరుకుని కొత్త ఊరిని వెతుక్కుంటూ పోయేదాకా కథ సాగుతుంది. ఏ కళకైనా అవధులు ఉన్నాయనీ, ఆకర్షణ ఎల్లవేళలా నిలిచేది కాదనీ చాటినట్టుగా ఉంటుంది. ఒక గొప్ప కళాకారుడు మాత్రమే కళకు పరిమితులు ఉన్నాయని గుర్తించగలడు. జీవిత రంగం నుంచి అందరమూ ఎప్పుడో ఒకప్పుడు నిష్క్రమించాల్సిన వాళ్లమేనన్న కఠోర సత్యాన్ని కూడా ఇది గుర్తు చేయొచ్చు. దాదాపుగా డాక్యుమెంటరీలా సాగే ఈ సినిమా సర్కస్ చూస్తున్న ప్రతి ఒక్కరి, ప్రతి ఒక్క హావభావాలను పట్టుకుంటుంది. మనుషుల మీద ఎంతో ప్రేమ ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి సినిమాలు తీయగలరు. ఒక మనిషి మానసికంగా కుప్పగూలే పరిస్థితులు ఎలా వస్తాయన్నది చూపిన చిత్రం ‘పోక్కు వెయిల్’(సాయంసంధ్య–1981). చాలా నెమ్మదైన కథనం. కానీ ‘తీవ్రమైన నెమ్మదితనం’ అది. అందులోంచే ఉద్వేగాన్ని ఉచ్చస్థాయికి తీసుకెళ్తారు. సినిమా అనేది గిమ్మిక్కు కాదంటారు అరవిందన్. దీనితో ఏకీభావం ఉన్నవాళ్లకు ఇది గొప్ప అనుభవాన్ని ఇవ్వగలుగుతుంది. స్త్రీ పురుష సంబంధాలూ, ఆకర్షణల్లోని సంక్లిష్టతనూ, తదుపరి పర్యవసనాలూ, పశ్చాత్తాపాలనూ ఎంతో సున్నితంగా ఆవిష్కరించిన ‘చిదంబరం’(1985) ఆయన మాస్టర్‌పీస్. మొదటి సినిమా మినహా ఈ అన్నింటికీ మున్ముందు మలయాళంలో మరో ప్రసిద్ధ దర్శకుడిగా అవతరించనున్న షాజీ ఎన్.కరుణ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడం గమనార్హం. 56 ఏళ్ల వయసులోనే అర్ధాంతరంగా కన్నుమూసిన అరవిందన్ ఉన్ని, కుమ్మట్టి, ఎస్తప్పన్, వస్తుహార లాంటి సినిమాలు తీయడంతోపాటు ఆరో ఓరల్, పిరవి లాంటి చిత్రాలకు సంగీత దర్శకత్వమూ వహించారు. ప్రతి సినిమాకూ ఎప్పటికప్పుడు నెరేటివ్ శైలిని మార్చుకుంటూ ప్రతిదాన్నీ ఒక కొత్త ప్రయోగంగా చేయడం ఆయన ప్రత్యేకత. ‘పాన్ ఇండియా’, ‘పాన్ వరల్డ్’ లాంటి మాటలు కేవలం వ్యాపార లెక్కలు. నిలిచిపోయే సినిమాలకు అవి కొలమానం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు దేశంలో సినిమా ప్రేమికులు అత్యంత ఆసక్తి ప్రదర్శిస్తున్న సినీ పరిశ్రమ ఏదైనా ఉందంటే, అది మలయాళ చిత్రసీమే. ఒక నిబద్ధతతో వచ్చిన చిత్రాల ఒరవడిని అద్దుకున్న జీవితపు వాస్తవికతా, కథను చూడబుద్ధేసేట్టుగా చెప్పడంలో కమర్షియల్ సినిమా సాధించిన ఒక వేగపు లయా... ఈ రెండింటినీ మేళవించుకొని ఇండియా మొత్తాన్నీ తమవైపు తిప్పుకొంటోంది. దాని వెనక అరవిందన్ లాంటి వారి స్ఫూర్తి విస్మరించలేనిది. ప్రతి ఏడాదీ ప్రపంచ సినిమా జీవులు ఎంతో ఆసక్తి కనబరిచే ప్రతిష్ఠాత్మక కాన్ ఫిలిం ఫెస్టివల్ ఫ్రాన్స్‌లో ముగిసింది. మే 17 నుంచి 28 వరకు జరిగిన 2022 సంవత్సరపు ఈ ఉత్సవం మిరుమిట్లు గొలిపే తారల మధ్య ఎంతో వైభవోపేతంగా జరిగింది. భారతదేశం తరఫున క్లాసిక్ విభాగంలో అక్కడ ప్రదర్శనకు నోచుకున్న సినిమాలు రెండే రెండు. ఒకటి, సత్యజిత్ రే ‘ప్రతిద్వంది’ కాగా, రెండవది జి. అరవిందన్ ‘థంప్’. (కొత్త వెర్షన్లో థంపును థంప్‌గా మార్చారు.) రెండు నిరాడంబర సినిమాలు ఆ ఆర్భాటపు పండుగలో ప్రదర్శన జరగడం విరోధాభాసే కావొచ్చుగానీ అదే జీవితపు తమాషా కూడా! -
ఆ శక్తి నీలోనే ఉంది!
కొన్ని జీవితాలు కల్పన కంటే ‘చిత్ర’ంగా ఉంటాయి. ఇరాన్ కార్టూనిస్ట్ అలీ దురాని జీవితం కూడా అంతే. 21 సంవత్సరాల వయసులో దేశం దాటిన అలీ అనుకోని పరిస్థితులలో ఆస్ట్రేలియాలోని ఒక దీవిలో చిక్కుకుపోయాడు. అది మామూలు దీవి కాదు. ఖైదీలను నిర్బంధించే దీవి. నరకానికి నకలుగా నిలిచే దీవి. ఏ స్వేచ్ఛ కోసం అయితే తాను దేశం దాటాడో ఆ స్వేచ్ఛ అణువంత కూడా లేని చీకటి దీవిలో నాలుగు సంవత్సరాల పాటు చిక్కుకుపోయాడు. తన మానసిక పరిస్థితి అదుపు తప్పుతున్న పరిస్థితులలో ‘నన్ను నేను మళ్లీ వెలిగించుకోవాలి’ అనుకున్నాడు. అలా జరగాలంటే ప్రతి వ్యక్తి తనలోని శక్తులను వెదుక్కోవాలి. అలీ దురానీలో ఉన్న శక్తి ఏమిటి? బొమ్మలు వేయడం. తన వైట్ టీషర్ట్‌పై ఆస్ట్రేలియా పటం వేసి అందులో రెండు కన్నీటిచుక్కలు చిత్రించాడు. ‘ఐయామ్ వోన్లీ ఏ రెఫ్యూజీ’ అని రాశాడు. అలా మొదలైంది బొమ్మల ప్రయాణం. కొందరు అధికారులు కరుకుగా వ్యవహరించినా, కొందరు అధికారులు మాత్రం అలీపై సానుభూతి చూపేవారు. ‘బాధ పడకు. నీకు అంతా మంచే జరుగుతుంది’ అని ధైర్యం ఇచ్చేవారు. నరకప్రాయమైన తన జీవితంలో ఇంటర్నెట్ అనే అరుదైన అదృష్టం దూసుకువచ్చింది. ప్రతి ఖైదీ వారానికి ఒకసారి నలభై అయిదు నిమిషాల పాటు ఇంటర్నెట్ను ఉపయోగించుకునేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం దయ తలిచింది. అక్కడ బలహీనమైన ఇంటర్నెట్...అయినప్పటికీ అది అతడికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. తాను గీసిన బొమ్మలను ఫేస్బుక్లాంటివాటిలో పోస్ట్ చేయడం మొదలుపెట్డాడు. సరిౖయెన సాంకేతిక సదుపాయాలు లేక ఈ పని కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో! స్వేచ్ఛ కోసం తపించే అలీ బొమ్మలు నార్వేకు చెందిన ఇంటర్నేషనల్ సిటీస్ ఆఫ్ రెఫ్యూజీ నెట్వర్క్(ఐకార్న్) దృష్టిలో పడ్డాయి. ఆ సంస్థ చొరవతో ఎట్టకేలకు స్వేచ్ఛాప్రపంచంలోకి వచ్చాడు. వ్యక్తిత్వవికాస తరగతుల్లో అలీ దురాని జీవితం పాఠం అయింది. ప్రసంగం అయింది. ‘నువ్వు అత్యంత బలహీనంగా మారిన పరిస్థితులలో కూడా, నిన్ను బలవంతుడిని చేసే బలం ఎక్కడో కాదు నీలోనే ఉంటుంది. అది నిన్ను చిగురించేలా చేస్తుంది. శక్తిమంతుడిలా మారుస్తుంది’ అనే సందేశాన్ని అలీ జీవితం ఇస్తుంది. -
మాస్కా మజాకా.. ఈ కార్టూన్ చూడండి.. భాష అక్కర్లేదు..
ఇరాన్ కార్టూనిస్ట్ ఆయత్ నదేరి యానిమేటర్, యానిమేషన్ డైరెక్టర్ కూడా. ఇదంతా ఒక ఎత్తయితే టీచర్‌గా ఆయత్‌కు మంచి పేరు ఉంది. ఇస్ఫాహన్ యూనివర్శిటీ ఆఫ్ ది ఆర్ట్స్‌లో ఆయన చెప్పే పాఠాలు ఎన్నో కుంచెలకు పదును పెట్టాయి. క్యారికేచర్ గ్రామ్, తాష్ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకుడైన ఆయత్‌కు కార్టూన్ ఐడియాలు ఎలా వస్తాయి? చదవండి: ఇదో చెత్త ప్రశ్న.. ఇంటర్వ్యూలో యువతి షాకింగ్ రిప్లై.. వీడియో వైరల్ ‘ప్రయాణంలో’ అని చెబుతారు ఆయన. ఆయత్‌కు నచ్చిన ఇరాన్ కార్టూనిస్ట్ మాసూద్. ఏడు సోలో ఎగ్జిబిషన్స్ చేసిన ఆయత్ ఎన్నో అవార్డ్లు అందుకున్నాడు. తన తొలి కార్టూన్ ‘పర్యావరణం’ అనే అంశంపై వేశాడు. అది తనకు బాగా గుర్తింపు తీసుకొచ్చింది. తాజాగా వేసిన ఈ కార్టూన్ చూడండి. భాష అక్కర్లేదు. ప్రపంచంలో ఏ మూలకు తీసుకువెళ్లినా అర్ధమవుతుంది. కరోనాకు మాస్కే మందు, మాస్కే తిరుగులేని ఆయుధం. -
సాక్షి కార్టూన్ 29-01-2022
-
అలతి రేఖల బుజ్జాయి
ఈ మధ్యే ‘బుజ్జాయి’ గారిని తలుచుకున్నాను. టెలిగ్రామ్ అనే యాప్‌లో ఎవరో షేర్ చేయగా చిరంజీవి అనే బొమ్మల కథ అందులో చేరింది. సినిమా నటులు చిరంజీవిని ప్రధానపాత్రను చేసి చిత్రించిన కామిక్ అది. బొమ్మల కథలను, అందు లోని పాత్రలను, ఆ సన్నివేశాలను, ఆ ముచ్చటైన అరేంజ్‌మెంట్‌ను ఈ రోజు కొత్తగా తెలుసుకున్న వాళ్ళం కాదు కదా! కానీ నన్ను ఈ కొత్తగా చూస్తున్న ‘చిరంజీవి’ మంత్రముగ్ధుణ్ణి చేసింది. చిత్రకారుడికి కాల్పనికమైన పాత్రలను సృష్టిం చడం పెద్ద గొప్ప విషయం కాదు. అలా అని మన మధ్య ప్రాణం పోసుకుని తిరుగుతున్న మనకు బాగా తెలిసి ఉన్నవారిని బొమ్మల్లో ప్రాణప్రతిష్ట చేయడం అతి కష్టమైనదా? అని అడిగితే... ఒక బొమ్మను మాత్రమే చిత్రించడం అయితే పెద్ద కష్టమూ, గొప్పా కాదు. కానీ కామిక్స్‌లో కొన్ని వందల సార్లు ఒక పాత్రని, అందునా మనకు బాగా తెలిసి ఉన్న ఒక ప్రముఖుణ్ణి ఏ వైపు నుంచి చూసినా అరచేయి కొలత నుండి అగ్గిపుల్ల మొనంత కనబడే ఆ క్యారెక్టర్ని గీయడమనేది అంతగా క్రాఫ్ట్ నైపుణ్యం లేని తెలుగు చిత్రకళా రంగంలో ఒక అసాధ్యమే. నాకు తెలిసి ఈ పనే అంతర్జాతీయ స్థాయిలో అమెరికన్ చిత్రకారులు ‘మార్ట్ డ్రకర్’ చేయగలి గారు. అయితే బొమ్మల్లో తెగ డిటైల్ ఉంటుంది. బుజ్జాయి గారు అలా కాదు, మహామహా కార్య శీలులు మాత్రమే సాధించగలిగిన అమిత సింప్లి సిటీ ఆయన బొమ్మల బ్యూటీ. బుజ్జాయి బొమ్మలతో పోల్చుకోదగిన అలతి రేఖల ఆర్టిస్ట్ అంత సులువుగా మరెవరూ కాన రారు. ఏం రేఖ, ఎంత చక్కని కూర్పు! తొలి ఉదయపు లేత ఎండ కాంతివంటి ఆయన రంగులు బొమ్మల మీద జిగేలు మనేవి. ఆయన బొమ్మలో రంగుని రేఖ తినేది కాదు, రేఖని రంగు మింగేది కాదు. సమన్వయం– సంతులత తెలిసిన ఒబ్బిడి రకం చిత్రకారులు ఆయన. మనిషీనూ అంతే. ఏళ్ళ క్రితం పనిగట్టుకుని మదరాసు వెళ్లి, ఒక రోజు ఆయనతో గడిపాము నేనూ, మా ఫ్రెండ్ విజయ్‌వర్ధన్. ఆ రోజు ఆయన చిన్నతనపు కబుర్లు, ఆ బొమ్మల ముచ్చట్లు, యవ్వనపు రోజుల్లో బాపు గారు స్కూటర్ ఎక్కి వారి ఇంటి వద్దకు వచ్చి హారన్ మ్రోగించడం, ఈయన వచ్చి బండెక్కడం, అవన్నీ చెబుతుంటే కళ్లముందు ఒక చక్కని నలుపు తెలుపు రంగు సినిమా కదలాడినట్లు ఉంది. గొప్ప తపన, పనితనం తెలిసిన చిత్రకారులంతా తమ బొమ్మలతో దేశాన్ని ఉర్రూతలూగించిన సమయ మది. మన వేపు బాపు, వపా, బుజ్జాయి, చిత్ర, శంకర్ దాదాపు ఆ మదరాసు వీధుల్లో నడకలుగా, తెలుగు పత్రిక పేజీల్లో రేఖలను పరుగులుగా సాగిన కాలమది. బుజ్జాయి బొమ్మలని ఆనిమేషన్ చిత్రాలుగా, చరిత్రలోని గొప్ప గాథలని బొమ్మల కథల్లో నిలుపు కుని ఉండాల్సిన పని. ఆయన బొమ్మలు చూసిన ప్రతిసారీ నా మనసుకు అనిపించేది ఒకటే. బ్బా! ఎంత అలవోకగా ఈయన కాగితంపై బొమ్మని మిగులుస్తారు. నిజానికి ఎంత పనిని మనం ఈయన వద్దనుండి రాబట్టుకోవలసింది! యురోపి యన్ దేశాల్లో ఆస్టెరిక్స్, టిన్ టిన్ వంటి వాటికి రెండింతల బొమ్మల సంపద మిగిలి ఉండాలి కదా. ఎంతో కథా సాహిత్యం మన దగ్గర ఉన్నది, లేని దల్లా బుజ్జాయి వంటి చిత్రకారులే కదా. పడమట వాలిన సూర్యుడు తెలవారగానే తూరుపున వచ్చే స్తారు. కానీ జాతి సాంస్కృతిక జీవనంలో ఒకరే బుజ్జాయి, ఒకరే బాపు, ఒకరే వడ్డాది పాపయ్య వంటి వారు ఒకరే ఉంటారు. వారు సశరీరంగా శాశ్వతులు కారు గానీ వారి స్ఫూర్తి మాత్రం తర తరాలుగా శాశ్వతంగా ఉండవలసినది. వారు జీవించి ఉన్నప్పుడే వారితో, వారి స్ఫూర్తితో వర్క్ షాపులు నడిపించి ఎందరో కొత్త తరం బుజ్జాయి లని తయారు చేసుకోవాల్సి ఉండింది! ఈరోజు బుజ్జాయి లేరు. ఆయన రచించిన పుస్తకాలు మాత్రం ఒక వరుసలో మిగిలాయి. ఏదో ఒక రోజున ఒక చిన్న హస్తం వచ్చి ఆ పుస్తకపు పేజీలు తెరిచి అందులోని బొమ్మలని చూసి వెలిగిన కన్నులతో బుజ్జాయి అంతటి చిత్రకారుడ వ్వాలనే కలలు కంటాయని కలగంటూ బుజ్జాయి అని మనకు తెలిసిన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి గారికి నివాళి. – అన్వర్ -
‘బుజ్జాయి’ కన్నుమూత
సాక్షి ప్రతినిధి, చెన్నై: చిట్టిపొట్టి బొమ్మలు, బాలల కథల సంపుటితో బుజ్జాయిగా బహుళ ప్రాచుర్యం పొందిన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో ప్రముఖ రచయిత, కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు 1931 సెప్టెంబర్ 11న ఆయన జన్మించారు. బుజ్జాయి అనే కలంపేరుతో ఫ్రీలాన్స్ కార్టూనిస్టుగా, చిన్నపిల్లల కథారచయితగా ప్రసిద్ధి చెందారు. ఆయన బొమ్మల కథల్లో ‘డుంబు’ చిన్నారులను బాగా అలరించింది. అలాగే ‘పంచతంత్ర’ ధారావాహిక కథలు ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ’లో 1963–68 వరకు ప్రచురితమయ్యాయి. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం కథానికను బొమ్మలద్వారా పాఠకులకు పరిచయం చేశారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పలు రచనలకు అవార్డులు అందించాయి. -
భయపడితే... చూపుడువేలైనా బెదిరిస్తుంది!
1975 జూన్ రోజులు. ఆనాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఎమ ర్జెన్సీలో భాగంగా పత్రికా వార్తలపై సెన్సార్షిప్ మొదలైంది. వాటితో పాటే నా కార్టూన్లూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ పర్యవేక్షణ క్రింద ఉంచబడ్డాయి. నేను నా తెలివి తేటలు ఉపయోగించి అరటి తొక్క మీద కాలు వేసి జారిపోయే ముతక హాస్యము, చీరల కొట్టులో మహిళామణుల బేరసారాల వెకిలి హాస్యాల కార్టూన్లు కొన్ని పట్టుకుని సరాసరి ప్రధా నిని కలిశా. ఈ సెన్సార్షిప్ నుంచి నాకు మినహా యింపు ఇవ్వమని కోరుకున్నాను. ఆవిడ చాలా ఓపిగ్గా ఈ అప్పడాల కర్ర కార్టూన్లు అన్ని పరిశీ లించి నా కార్టూన్లు బొత్తిగా నిరపాయకరమనీ, నేను కార్టూన్లను పత్రికలో నిరభ్యంతరంగా ప్రచు రించుకోవచ్చనీ అభయం ఇచ్చారు. ఢిల్లీ నుండి బొంబాయికి తిరిగి రాగానే నేను ప్రధానమంత్రి ముందు ఒలకబోసిన దొంగ వేషం కట్టిపెట్టి ఒకటీ రెండు రోజులు అప్పడాల కార్టూన్లు వంటివి వేసినా, 3వ రోజునుండి నా అసలు రంగు చూపిం చడం మొదలు పెట్టాను. మొదట కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే కార్టూనులు, ఆ పై ఎమర్జెన్సీని తూర్పారపట్టే కార్టూనులు... ఒకదాని తరువాత మరొకటిగా నిప్పు రగిలిస్తున్నా. చండీగఢ్‌లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెషన్ ప్రారంభమైన రోజున టైమ్స్ మొదటి పేజీలో కాంగ్రెస్ అధ్యక్షుడు దేబ్ కాంత్ బరూవా – ఎమర్జెన్సీలను కలిపి కార్టూన్ అచ్చయింది. బరువాకు కార్టూన్ సెగ బాగా తగిలింది. వీసీ శుక్లా అప్పుడు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. బరువా, శుక్లాని తన దగ్గరికి పిలిపించుకుని నా కార్టూన్ చూపించి నానా చీవాట్లు పెట్టారు. శుక్లా సరాసరి ఢిల్లీ నుండి బొంబాయి వచ్చారు నా సంగతి కనుక్కోడానికి! కట్ చేస్తే శుక్లా బసచేసిన తాజ్ హోటల్ సూట్లో నేను ఉన్నాను. హలో, హాయ్, నమస్తే వంటి పరామర్శ ఏమీ లేదు. కనీసం నన్ను కూచో మని అన్నది కూడా లేదు. ఒకే మాట ‘ఇంకోసారి ఇటువంటి పిచ్చి గీతలు గీస్తే నిన్ను అత్తారింటికి పంపిస్తా ఏమనుకుంటున్నావో... గెటవుట్’ చూపుడు వేలు ఆడిస్తూ శుక్లా పరమక్రూరంగా! నా కాళ్ళు గజగజ వణికిపోయాయి. నాకు భయం వేసింది, దుఃఖం అనిపించింది, అవమానంగా ఉంది, కడుపు రగిలిపోతోంది. ఇంటికి తిరిగి రాగానే నా భార్య కమలని పిలిచి విషయం చెప్పాను: ‘ఈ పొలిటికల్ కార్టూనింగ్ పనంటూ చేస్తే వెన్నెముక విరుచుకుని పనిచేయాలి, లేదా అసలు ఈ పనే చేయకూడదు, ఇప్పుడు అదే దశ వచ్చింది. నేను ఇక ఈ ఉద్యోగం చేయను, రాజీనామా ఇచ్చేస్తాను’. మా ఆవిడ తెగ సంతోష పడింది. ‘ఎందుకులెద్దూ వెధవ లంపటమూ, ముప్ఫయ్ ఏళ్ళు చేశారు. ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. హమ్మయ్య!’ సాయంకాలం ఆఫీస్‌కు వెళ్ళి దీర్ఘకాలిక సెల వుకు దరఖాస్తు చేశాను. అక్కడి నుండి సరాసరి ఒక ట్రావెల్ ఏజన్సీకి వెళ్ళి మా దంపతులిరువురి పేరిట మారిషస్‌కు టిక్కెట్లు కొన్నాము. మూడు వారాల పాటు అక్కడ ఉండాలనేది మా ఆలోచన. ఆ దీవిలో ఆ సముద్ర తీరాన బేఫికర్‌గా జీవితాన్ని అస్వాదిం చాము. అక్కడి విదేశీయులు నా భార్య కమల చీర కట్టు గురించీ, నుదుటన దాల్చిన సిందూరం గురించీ ప్రశ్నలు అడగడమే తరువాయి ‘మా దేశం, మా ప్రాచీన సంస్కృతి, మా సంప్రదాయం’ అంటూ రొమ్ము విరుచుకుని వాళ్ళకు జవాబు ఇవ్వ డంలో గొప్ప ఆనందాన్ని పొందేవాణ్ణి. ఒకరోజు మా సాయంకాలపు వాహ్యాళి ముగించుకుని ఇసుక తీరంలోని ఒక కాటేజ్‌లో విశ్రాంతిగా కూర్చు న్నాము. మాకు సమీపంలో ఒక నల్లజాతీయుడు కూచుని ఉన్నాడు. మాకు మాటా మాటా కలిసింది. అతనికి లెబనాన్‌లో ఏదో ఎగుమతి చేసే వ్యాపారం ఉంది. ఆయన నన్ను అడిగాడు: ‘ఇంతకూ మీరేం పని చేస్తారో చెప్పనే లేదు?’ ‘నేనా? వార్తా పత్రికలో పని చేస్తా, పాత్రికే యుణ్ణి.’ ‘ఓ పత్రికా పనా! గుడ్. అది చాలా గొప్ప వృత్తి, సంపాదకీయాలు అవీ రాస్తారా మీరు?’ ‘రాస్తాను.’ ‘మరి మీరిక్కడ సెలవులో ఉంటే అక్కడ మీ పత్రికలో సంపాదకీయాలు ఎలా రాస్తారు? అది చాలా ముఖ్యమైన పని కదా?’ ‘మహాశయా! నేను వ్రాయను, నేను కార్టూన్లు గీస్తాను.’ ‘కార్టూన్లా! అంటే వ్యంగ్య చిత్రాలు! అబ్బో, అది చాలా అద్భుతమైన కళ, ఇంతకు మీరు ఏ పత్రికలో పని చేస్తారో?’ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా.’ ‘నాకు తెలుసుగా ఆ పత్రిక! మీ పేరు?’ ‘లక్ష్మణ్’ ‘వావ్! యూ సెడ్ ఇటా?’ నేను అదిరి పోయాను. భారత దేశానికి అయిదు వేల మైళ్ల దూరంలోని ఒక ప్రదేశంలో, అటు ఆ దేశానికీ, ఇటు ఈ దేశానికీ చెందని ఒక వ్యక్తి నోటి నుండి నేను రోజూ వేసే కార్టూన్ శీర్షిక, అతని యాసలో! ‘మీకు ఎలా తెలుసు?’ ‘లెబనాన్‌లో మీ దేశపు రాయబారి ఎల్కే సింగ్ ఉంటారు. అతనికి, నాకు పరిచయం. నేను అతని వద్దకు వెళ్లినప్పుడల్లా మీ కార్టూన్లు చూపిస్తారు. చూపిస్తూ ఇలా అంటారు: ‘‘చూశావా! మా ప్రజా స్వామ్యం గొప్పతనం! మా దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ, పత్రికా స్వేచ్ఛకు మాత్రం అడ్డం లేదు. అక్కడ మా కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ ఎమర్జెన్సీలో కూడా అక్కడి రాజకీయ నాయకుల డొక్క చింపుతున్నాడు. ఆ నాయకులు కూడా ప్రజా స్వామ్యాన్ని గౌరవిస్తూ ఆ కార్టూన్లని ప్రచురించ డానికి తల ఒగ్గి ఉన్నారు. అదీ మా దేశ మంటే! సారే జహా సే అచ్ఛా’. దేవుడా! బహుశా ఆ కార్టూన్లు నేను దేశం వదిలి వచ్చేముందు గీసినవి అయి ఉంటాయి. వాటి ఆధారంగా పరాయి దేశంలో మా పత్రికా స్వేచ్ఛని, మా కార్టూనిస్టుల పదును నైజాన్ని, నా దేశపు ప్రజాస్వామ్యపు స్వేచ్ఛని నిరూపించడానికి దేశం కాని దేశంలో వాటిని భద్రంగా ఉపయోగి స్తున్నారు. ఇక్కడ ఒక విదేశీయుడు వాటి ఆధా రంగా మమ్మల్ని, మా ధైర్యాన్ని గానం చేస్తున్నాడు. నేనేం చేస్తున్నాను? ఒక చూపుడు వేలు బెదిరింపు నకు వణికిపోయి ఇక్కడికి వచ్చి కూచున్నాను. లేచి నిలబడి బట్టలకంటిన ఇసుక దులుపుకొన్నాను. కమల అడిగింది: ‘ఎక్కడికి, హోటల్ రూం కా?’ ‘కాదు, సెలవు ముగిసింది, వెళ్ళి ఇక కార్టూన్లు వేయాలి.’ – ఆర్కే లక్ష్మణ్ అంతరంగ కథనం: అన్వర్ (ఇండియన్ పొలిటికల్ కార్టూన్ అంటే ప్రపంచమంతా తలతిప్పి ఆర్ కే లక్ష్మణ్ అనే సంతకం వైపు చూస్తుంది. అక్టోబర్ 24న రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్ శతజయంతి) -
ప్రముఖ కార్టూనిస్ట్ కన్నుమూత, సీఎం సంతాపం
తిరువనంతపురం : ప్రముఖ కార్టూనిస్ట్, కేరళ కార్టూన్ అకాడమీ చైర్మన్ సీజే ఏసుదాసన్ (83) బుధవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ పోస్ట్ కరోనా సంబంధిత సమస్యల కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు రేపు జరగ నున్నాయని, ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని గురువారం ఉదయం కలమస్సేరి, మున్సిపల్ టౌన్ హాల్లో ఉంచుతామని తెలిపారు. ఏసుదాసన్ అకాలమరణంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. కార్టూన్ల రంగం ప్రతిభావంతుడైన ఆర్టిస్టును కోల్పోయిందంటూ నివాళులర్పించారు. ఏసుదాసన్ తన కార్టూన్ల ద్వారా, ఒక కాలంలోని రాజకీయ పరిణామాలను ప్రతిబింబించడమే కాకుండా, ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తం పరిచేవారని, ఆయన పనిని పరిశీలించే ఎవరైనా కేరళ రాజకీయ చరిత్రను చూడొచ్చని సీఎం అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, వీడీ సతీసన్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారన్నారు. ఇంకా సీనియర్ కార్టూనిస్టులు, పలువురు జర్నలిస్టులు కూడా ఏసుదాసన్ మృతికి సంతాపం తెలిపారు. కేరళ కార్టూన్ అకాడమీకి ఏసుదాసన్ తొలి చైర్మన్ మృతికి కొచ్చిలోని సీనియర్ జర్నలిస్ట్ యూనియన్ సంతాపం ప్రకటించింది. ఏసుదాసన్ ఎంతో సౌమ్యమైన వ్యక్తి అని, ప్రతి ఒక్కరిని గౌరవించేవారని ఢిల్లీలోని ప్రముఖ కార్టూనిస్ట్ సుధీర్‌నాథ్ పేర్కొన్నారు. కాగా రాజకీయ కార్టూన్లకు ప్రసిద్ధి చెందిన ఏసుదాసన్ అనేకసార్లు కేరళ ప్రభుత్వ ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డును అందుకున్నారు. స్వదేశాభిమాని అవార్డు, బీఎం గఫూర్ అవార్డు, వి సాంబశివన్ మెమోరియల్ అవార్డు, పీకే మంత్రి స్మారక పురస్కారం, ఎన్ వి పైలీ అవార్డులను స్వీకరించారు. 1938లో అలప్పు జిల్లాలోని భారైకావులో జన్మించిన ఏసుదాసన్ మలయాళ మనోరమకు కార్టూనిస్ట్‌గా సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. ఏసుదాసన్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు -
సీరియస్ మీటింగ్స్ కాస్తా ఎంటర్టైన్ చేస్తున్నాయే
వార్ రూమ్ తరహాలో సీరియస్‌గా సాగే జూమ్ మీటింగ్స్ ఇకపై ఈ స్నాప్ కెమెరా ఆప్షన్ తో మరింత ఎంటర్ టైన్మెంట్గా మారనున్నాయి. కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసుల నుంచి ఆఫీస్ మీటింగ్స్ వరకు అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి.అయితే ఆయా టెక్ దిగ్గజాలు సరికొత్త ఫీచర్లతో ఆన్లైన్ మీటింగ్స్ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా వీడియో కమ్యూనికేషన్ 'జూమ్'లో స్నాప్ చాట్ కు చెందిన స్నాప్ కెమెరా ఫిల్టర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను వినియోగించి ఆన్ లైన్లో కుటుంబ సభ్యులతో,స్నేహితులతో కలిసి ఫన్ జనరేట్ చేసుకోవచ్చు. జూమ్ మీటింగ్‌లో ఫిల్టర్ ఫీచర్‌ను వినియోగించి మన ఫేస్ కంప్లీట్‌గా జనరిక్ ఫిక్సార్, డ్రీమ్ వర్క్స్ కార్టూన్ క్యారక్టర్ లోకి ట్రాన్స్ ఫామ్ అయ్యేలా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ స్నాప్ కెమెరా v1.14.0 , విండోస్ 10, మాక్ 10.13 ఓఎస్, ఇంటెల్ కోర్ ఐ 3 2.5 జీహెచ్‌జెడ్, ఎఎమ్డి ఎఫ్ఎక్స్ 4300 2.6 జీహెచ్‌జెడ్, ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ 4000 లేదంటే ఎన్విడియా జిఫోర్స్ 710, ఎఎమ్డి రేడియన్ హెచ్డి 6450 ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో మాత్రమే పనిచేస్తుంది. ఈ కార్టూన్ ఫిల్టర్ కావాలనుకుంటే అఫీషియల్ వెబ్ సైట్ స్నాప్ ఐఎన్‌సీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి జూమ్ ఓపెన్ చేసిన తరువాత రైట్ సైడ్ కార్నర్లో వీడియో గేర్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూ బార్ లో వీడియో క్లిక్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది కెమెరా ఆన్ చేస్తే స్నాప్ కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది. ఆ స్నాప్ కెమెరా ఆప్షన్‌లోకి వెళ్లితే మీకు కావాల్సినట్లు మీ ఫేస్ కార్టూన్ కేరక్టర్‌లోకి ట్రాన్స్ ఫార్మ్ అవుతుంది. -
కార్టూనిస్టు మంజుల్‌కు ట్విట్టర్ నోటీసు
న్యూఢిల్లీ: భారత ఐటీ చట్టాలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో ప్రముఖ కార్టూనిస్టు మంజుల్, అల్ట్ న్యూస్ వెబ్సైట్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి సూర్యప్రతాప్ సింగ్‌కు ట్విట్టర్ యాజమాన్యం నోటీసు జారీ చేసింది. కొన్ని దర్యాప్తు సంస్థల ఆదేశాల మేరకు ఈ నోటీసు ఇచ్చినట్లు తెలిసింది. వారు చేసిన కొన్ని ట్వీట్లను ఖాతాల నుంచి తొలగించాలని దర్యాప్తు సంస్థలు సూచించినట్లు సమాచారం. తమకు అందిన నోటీసు స్క్రీన్షాట్లను మంజుల్, జుబైర్, సూర్యప్రతాప్ సింగ్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ ముగ్గురికి నోటీసు ఇవ్వాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ సూచించలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఏయే ట్వీట్లపై ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది... సదరు ట్వీట్లను తొలగించమని కోరిన చట్ట సంస్థలు ఏవి అనే విషయాలు తెలియరాలేదు. సదరు ట్వీట్లపై ప్రస్తుతానికి చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. ట్విట్టర్‌కు ఇండియాలో 1.75 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. చదవండి: కరీనా ఖాన్.. శూర్పణక రోలే కరెక్ట్ నీకు! -
Sameera Maruvada: నవ్వు బొమ్మల అమ్మాయి
‘మీ సాల్ట్కూ సాంబార్కూ ద్రోహం చేయలేను బాబుగారూ’ అని ‘అహ నా పెళ్లంట’ సినిమాలో డైలాగ్. సమీర మరువాడ తన ఇన్‌స్టా పేజీకి అదే పేరు పెట్టుకుంది ‘సాల్ట్ అండ్ సాంబార్’ అని. ఫుల్‌గా ఫాలోయెర్స్ ఉన్నారు. ఉప్పు లేని కూర, హాస్యం లేని జీవితం చప్పగా ఉంటాయి. తన బొమ్మ నవ్వించి జీవితంలో రుచి తెస్తుందని సమీర మరువాడ నమ్ముతుంది. ఈ వైజాగ్ అమ్మాయి హైదరాబాద్ చేరి ఫ్రీలాన్సర్‌గా మనుగడ కోసం కృషి చేస్తోంది. తెలుగులో ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ అందునా మహిళా ఆర్టిస్ట్ స్ట్రగుల్ నవ్వినంత ఈజీ కాదు.. నవ్వులాటా కాదు. కాని సమీర విజయం వైపు అడుగులు వేస్తోంది. ఆమె పరిచయం. తెలుగులో మిడిల్ క్లాస్ జీవనాన్ని హాస్యానికి ఉపయోగించిన వారంతా సక్సెస్ అయ్యారు. కార్టూన్లలో బాపూ, ఈ కాలంలో సరసి ఇంకా చాలామంది మధ్యతరగతి జీవనాన్ని హాస్యగీతలలో కామెంట్ చేసి గుర్తింపు పొందారు. అయితే ఈ రంగంలో స్త్రీల ప్రాతినిధ్యం తక్కువ. తెలుగులో మహిళా కార్టూనిస్టులు చాలా తక్కువ. ఒక కాలంలో ‘రాగతి పండరి’ మహిళా కార్టూనిస్టుగా గుర్తింపు పొందారు. కాని ఆ తర్వాత ఆ రంగంలో కృషి చేసినవారు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మందే ఉన్నారు. ఇప్పుడు ఒక తెలుగు అమ్మాయి ఈ రంగంలో తన పేరు వినిపించేలా చేస్తోంది. ఆ పేరు సమీర మరువాడ. గీతలే జీవితం వైజాగ్‌కు చెందిన సమీరకు చిన్నప్పటి నుంచి బొమ్మలంటే ఇష్టం. ఎక్కడ బొమ్మల పోటీ పెట్టినా వెళ్లి ప్రైజ్ కొట్టుకొచ్చేది. చదువులో భాగంగా ఇంజనీరింగ్ చేసినా ఆ తర్వాత ఇంటిరియర్ డిజైనింగ్ చేసినా ఆ తర్వాత ఎం.ఏ ఇంగ్లిష్ చేసినా ఒకరి కింద పని చేసే ఉద్యోగం మీద మనసు పోలేదు. ‘నా చేతిలో గీతలున్నాయి. నేను వాటి మీద బతకాలనుకున్నాను’ అంటుందామె. వెంటనే ‘శామ్ ఇన్‌స్పయిర్’ పేరుతో యూ ట్యూబ్ చానల్ మొదలెట్టి దాదాపు 100కు పైగా బొమ్మలు నేర్పించే వీడియోలు చేసింది. ఈ చానల్‌కు 30 వేల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. ఆ సమయంలోనే తన జీవితంలో, చుట్టుపక్కలవారి జీవితంలో రోజు వారీ వ్యవహారాల మీద ఆమెకు కామిక్స్ వేయాలనిపించింది. ‘అప్పటివరకూ నేను ఆ పని చేయగలనని తెలియదు. కాని మొదలెట్టేశాను’ అంటుంది సమీర. అనుకున్నదే తడవు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సాల్ట్ అండ్ సాంబార్’ అనే పేజీ మొదలెట్టింది. అందులో తన కార్టూన్లు కూడా. మధ్యతరగతి మందహాసం సమీర చేసిన మొదటిపని తన కార్టూన్లకు మధ్యతరగతిని నేపథ్యంగా తీసుకోవడం. మధ్యతరగతి, పై తరగతి పాఠకులను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లిష్ అక్షరాలలో తెలుగు వ్యాఖ్యను రాయడం. తను అమ్మాయి కనుక అమ్మాయిలపై ఎటువంటి సగటు అభిప్రాయాలు ఉంటాయో వాటిమీద వ్యాఖ్యలు చేస్తూ సమీర కార్టూన్లు వేస్తుంది. అలాగే అబ్బాయిలందరూ చచ్చినట్టు ఐఐటి చేయాల్సిందేనన్నట్టు ఉండే వొత్తిడిని కూడా వెక్కిరిస్తుంది. ‘అమ్మాయికి పెళ్లి చేసి పంపడం’ తన విధ్యుక్త ధర్మంగా హైరానా పడే తల్లిదండ్రులపై సమీర పుంఖాను పుంఖాలు గా కార్టూన్లు వేసింది. బొమ్మలే బువ్వ పెట్టాలి బొమ్మల మీద ఆధారపడి జీవించడం అందరికీ సాధ్యం కాదు. అయినప్పటికీ సమీర ఫుల్‌టైమ్ ఫ్రీలాన్సర్ అయ్యింది. ‘నేను నా బొమ్మలను అమ్ముకోగలను అని కాన్ఫిడెంట్‌గా ఉన్నాను’ అంటుందామె. ఇన్‌స్టాలో తనకొచ్చిన పేరు వల్ల సమీర కస్టమైజ్డ్ బొమ్మలు వేసి ఇస్తుంది. బర్త్‌డే కార్డులు, పండగ కార్టూన్లు, మదర్స్ డే లాంటి సందర్భాలలో విషెస్ చెప్పడానికి మనం చెప్పినట్టుగా లేదా కోరిన వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని కార్టూన్లు, కార్డులు తయారు చేయమంటే చేసి ఇస్తుంది. గత సంవత్సరం ‘రాఖీ’ పండగ కోసం సమీర దగ్గర చాలామంది కస్టమైజ్డ్ కార్డ్‌లు చేయించుకున్నారు. అలాగే 2021 సంవత్సరానికి గాను కార్టూన్ క్యాలెండర్ కూడా ఆర్డర్ వచ్చింది. ఈ క్యాలండర్ కోసం ‘పక్కింటి ఆంటీ’ని సబ్జెక్ట్ గా తీసుకుందామె. ఈ పక్కింటి ఆంటీకి వేరే పని ఉండదు. పొరుగింటి అమ్మాయి కి పెళ్లిచూపులు వెతకడమే పని. ఈ క్యాలెండర్ హిట్ అయ్యింది. ‘ఆర్టిస్టులు తమ సొంత కాళ్లపై బతకాలంటే సాయం చేసే క్రౌండ్ ఫండింగ్ వేదికలు ఉన్నాయి. ‘పాట్రియాన్స్’ క్రౌండ్ ఫండింగ్ ద్వారా నేను సపోర్ట్ పొందుతున్నాను’ అంటుంది సమీర. ఏటి కొప్పాకలో సమీర వైజాగ్‌కు దగ్గరగా ఉండే ఏటికొప్పాక కొయ్యబొమ్మల తయారీదార్లతో కలిసి ‘తల్లీకూతురు’ అనే కీచైన్ బొమ్మను గీసి ఇచ్చింది. ఆ బొమ్మ ఆధారంగా ఏటికొప్పాకలో తయారవుతున్న తల్లీకూతురు కీచైన్ అందరినీ ఆకట్టుకుంటోంది. సారా ఆండర్సన్, మార్లొస్డెవీ వంటి చిత్రకారుల బొమ్మలతో ఇన్‌స్పయిర్ అయ్యే సమీరా త్వరలో తను కూడా అంత పెద్ద రేఖా చిత్రకారిణి అవుతుందని గుర్తింపు పొందుతుందని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
కోవిడ్‌తో చిత్రకారుడు గోపి కన్నుమూత
సాక్షి,హైదరాబాద్: నాలుగు దశాబ్దాలకు పైగా కాన్వాస్‌పై తన బొమ్మలతో తెలుగు సాహిత్య, చిత్ర సీమను హోయలు పలికించి తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ చిత్రకారుడు గోపి (లూసగాని గోపాల్‌గౌడ్ 69) శుక్రవారం కోవిడ్‌తో కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత సమస్యలతో పాటు మధుమేహంతో బాధపడుతున్న ఆయన ఇటీవల కోవిడ్ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో గోపి అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు భార్య,ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి... ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ చెందిన గోపి 1952లో జన్మించారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన అంచలంచెలుగా ఎదిగి నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అభినందనలను అందుకున్నారు. 1975లో జేఎన్టీయూ నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసి అన్ని తెలుగు వార,మాస పత్రికల్లో అనేక కథలు, నవలలకు ఆయన అద్భుతమైన బొమ్మలు గీశారు. అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో సమాచార, ప్రజాసంబంధాల విభాగంలో ఫ్రీలాన్స్ ఆర్టిస్టుగా 10 ఏళ్ల పాటు పనిచేశారు. పలు తెలుగు దినపత్రికలకు గోపి లోగోలను రూపొందించారు. సినీ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలకు తన కళాత్మకతను అద్దారు. మా భూమి, రంగుల కల, దొంగల దోపిడి వంటి చిత్రాలకు పోస్టర్లు, టైటిల్స్ రూపకల్పన చేశారు. ప్రఖ్యాత చిత్రకారుడు బాపు తన తరువాత గోపితో బొమ్మలు వేయించుకోవాలని స్వయంగా చెప్పడం విశేషం. ఆయన మృతి పట్ల పలువురు చిత్రకారులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. చదవండి: కరోనా సోకిన వారిలో ఆకస్మిక మరణాలకు కారణాలెన్నో.. -
ప్రఖ్యాత చిత్రకారుడు చంద్ర కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/హన్మకొండ కల్చరల్: ప్రఖ్యాత చిత్రకారుడు, కథా రచయిత, కార్టూనిస్టు, ఇలస్ట్రేషనిస్టు చంద్ర (75) ఇక లేరు. ఆయన అసలు పేరు మైదం చంద్రశేఖర్. కరోనా బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆర్.కె. మదర్ థెరెసా రిహాబిలిటేషన్ సెంటర్లో బుధవారం అర్ధరాత్రి 1:40 గంటలకు కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు. మూడేళ్ల క్రితం బాత్రూంలో కాలు జారిపడటంతో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఆయన అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. కొద్దిరోజుల క్రితం కరోనా సోకడం, కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో ఆయన మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య విజయభార్గవి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం జరిగాయి. చిన్ననాటి నుంచే చిత్రకళపై అభిరుచి... పూర్వ వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ధన్నసరి గ్రామానికి చెందిన మైదం రంగయ్య, సోమలక్ష్మి దంపతులకు 1946 ఆగస్టు 28న చంద్ర జన్మించారు. తల్లి ఎడ్లబండిలో వెళ్తున్న క్రమంలో నిండు పున్నమి రోజున జన్మించడంతో ఆయనకు చంద్రశేఖర్‌గా పేరు పెట్టారు. స్కూల్లో చదివే రోజుల్లో ప్రతి ఆదివారం ఖిలా వరంగల్ వెళ్లి అక్కడి శిల్పాలను చూస్తూ వాటి బొమ్మలు వేయడానికి ప్రయత్నించేవారు. వరంగల్‌లోని అజంజాహి మిల్లులో తొలుత పనిచేసిన ఆయన తండ్రి ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆప్కోలో చేరడంతో కుటుంబం హైదరాబాద్‌కు మారింది. హైదరాబాద్‌లో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పల్లా దుర్గయ్య ఇంట్లో వారు ఉండే సమయంలో వట్టికోట ఆళ్వార్‌స్వామి, దాశరథి కృష్ణమాచార్య తదితర సాహితీవేత్తలతో చంద్రకు పరిచయం ఏర్పడింది. అలాగే సుల్తాన్ బజార్‌లోని లైబ్రరీ చంద్ర వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. డాక్టర్ వద్దనుకొని చిత్రకారుడిగా.. బాపు బొమ్మలను చూస్తూ చిత్రాలను వేయడం మొదలుపెట్టిన చంద్ర.. పీయూసీ చదివే రోజుల్లోనే సిటీ ఇన్ ద లైట్ చిత్రం వేసి ఉపాధ్యాయులను ఆశ్చర్యపర్చారు. పీయూసీ పరీక్షల్లో పాసైతే తండ్రి తనను మెడిసిన్ చదివించే అవకాశం ఉండటంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా రాయకుండా వచ్చేశారు. చిత్రకారుడిగా కావాలనే కృతనిశ్చయంతో హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో బీఏ పూర్తి చేశాక విజయభార్గవిని ప్రేమ వివాహం చేసుకున్నారు. సినీరంగంతోనూ అనుబంధం... చంద్ర పలు నాటకాల్లో నటించారు. చిల్లర దేవుళ్లు చిత్రంతోపాటు మరో బెంగాల్ చిత్రంలోనూ హీరోగా నటించే అవకాశం వచ్చినా నటించలేదు. చిల్లర దేవుళ్లు, చలిచీమలు, తరం మారింది, మంచు పల్లకి, డిటెక్టివ్ నారద తదితర 20 చిత్రాలు, 6 లఘుచిత్రాలకు కళాదర్శకుడిగా పనిచేశారు. అలాగే రచయితగా, సాహితీవేత్తగా 150 కథలు, అనేక కవితలు రాశారు. యర్రంశెట్టి సాయి, పమ్మి వీరభద్రరావులతో కలసి గొలుసు నవల కూడా రాశారు. మల్లాది, సూర్యదేవర, యండమూరి వీరేంద్రనాథ్ వంటి రచయితల నవలలు చంద్ర ముఖచిత్రాలతో ఆకట్టుకొనేవి. స్వాతి, ఆంధ్రభూమి వంటి వారపత్రికలకు ఆయన క్రమం తప్పకుండా బొమ్మలు గీసేవారు. ప్రఖ్యాత చిత్రకారుడు బాపు ప్రశంసలను అందుకున్నారు. దాశరథి కృష్ణమాచార్య, పల్లా దుర్గయ్య, కాళోజీలకు అత్యంత సన్నిహితంగా మెలిగారు. సీఎం కేసీఆర్ సంతాపం... ప్రముఖ చిత్రకారుడు, ఇల్లస్ట్రేటర్ చంద్రశేఖర్ (చంద్ర) మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్ర మృతికి ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, డాక్టర్ తిరుక్కోవలూరు శ్రీరంగస్వామి, ఆర్టిస్ట్ మల్లిక్ తదితరులు సైతం సంతాపం తెలిపారు. ముఖ చిత్రాలు..వ్యంగ్య చిత్రాలకు పెట్టింది పేరు చంద్ర అనేక దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలలో వ్యంగ్య చిత్రాలు, కథలకు బొమ్మలు వేసేవారు. ప్రముఖుల రేఖా చిత్రాలు గీసి ప్రత్యేకత చాటుకున్నారు. నవలలు, పుస్తకాలకు ఆయన వేసిన ముఖ చిత్రాలు ప్రధాన ఆకర్షణగా ఉండేవి. 1970 నుంచి 2010 వరకు చంద్ర వేసిన ముఖచిత్రాలతో కొన్ని వేల పుస్తకాలు వెలు వడ్డాయి. మనుషుల మానసిక ప్రపంచాన్ని, స్త్రీ పురుషుల్లోని ఆంగిక సౌందర్యాన్ని ఎంతో కళాత్మకంగా చిత్రించిన ప్రత్యేక శైలి ఆయనది. ప్రపంచంలో విప్లవాల దశ కొనసాగిన సమయాన తన కళను ఆయుధంగా చేయాలనుకొని విరసం కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్ష కూడా అనుభవించారు. -
సాక్షి కార్టూన్ 04-12-2020
-
‘టామ్ అండ్ జెర్రీ’ దర్శకుడి కన్నుమూత
ప్రేగ్: చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ దశాబ్దాలుగా అలరిస్తున్న కార్టూన్ సీరియల్ టామ్ అండ్ జెర్రీ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత జీన్ డీచ్ మరణించారు. 95 ఏళ్ల వయసున్న ఆయన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలోని తన అపార్టుమెంట్లో గురువారం రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు యూజీన్ మెరిల్ డీచ్. టామ్ అండ్ జెర్రీ 13 ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. పొపెయి అనే సీరయల్ సైతం రూపొందించారు. జీన్ డీజ్ మొదట ఉత్తర అమెరికా వైమానిక దశంలో పనిచేశారు. అనంతరం పైలెట్ ట్రైనింగ్ పూర్తిచేశారు. తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలతో సైన్యం నుంచి బయటకు వచ్చారు. 1959లో ప్రేగ్‌కు చేరుకున్నారు. చిత్రకళలో గట్టి పట్టున్న ఆయన కార్టూన్లు గీయడంపై దృష్టి పెట్టారు. డీచ్ దర్శకత్వం వహించిన మన్రో అనే చిత్రం 1960లో బెస్టు యానిమేటెడ్ షార్టుఫిలింగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. జీన్ డీచ్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారంతా కార్టూనిస్టులే. -
మహ్మద్ ప్రవక్తపై కార్టూన్ పోటీలు!
అమ్‌స్టర్‌డామ్ : ఇస్లాం దైవ ప్రవక్త మహమ్మద్‌పై వ్యంగ్య కార్టూన్ చిత్రాల పోటీని నిర్వహిస్తున్నట్టు నెదర్లాండ్ ప్రజా ప్రతినిధి గ్రీట్ విల్డర్స్ శనివారం ట్విటర్లో ప్రకటించారు. ఔత్సాహికులు తమ కార్టూన్ చిత్రాలను పంపాల్సిందిగా ఆయన కోరారు. నెదర్లాండ్‌లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన గ్రీట్ విల్డర్స్ ఇస్లాం వ్యతిరేకులుగా పేరుగాంచారు. హింస, ఇస్లామిక్ ఫత్వాల మీద భావ ప్రకటనా స్వేచ్ఛది ఎప్పుడూ పైచేయి కావాలని విల్డర్స్ పేర్కొన్నారు. విల్డర్స్ ఈ పోటీని గతేడాది ఆగస్టులోనే నిర్వహించాలనుకున్నారు. కానీ, ఆయనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడంతో తన ప్రయత్నాన్ని మానుకున్నారు. అంతేకాక, కార్టూన్ పోటీలను రద్దు చేయాలంటూ పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ పార్టీ తెహ్రీక్ ఎ లబ్బైక్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలన్నీ కూడా నెదర్లాండ్తో తమ దౌత్య సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో విల్డర్స్ గతేడాది పోటీలను రద్దు చేసి ఇప్పుడు నిర్వహిస్తున్నారు. మహ్మద్ ప్రవక్త వ్యంగ్య చిత్రాలను చాలా మంది ముస్లింలు అభ్యంతరకరంగా భావిస్తారు. గతంలో చూస్తే 2005లో ఓ పత్రికలో మహ్మద్ ప్రవక్తపై వ్యంగ్య కార్టూన్ చిత్రాన్ని ప్రచురించినందుకు గాను కార్టూనిస్టు లేదా ఆ పత్రిక ఎడిటర్‌ను చంపాలని తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. తర్వాత పదేళ్లకు ప్యారిస్‌లో ఇద్దరు ముస్లిం గన్మెన్లు మహ్మద్ ప్రవక్తపై వ్యంగ్య చిత్రాలను ప్రచురించినందుకు చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంలో 12 మందిని కాల్చి చంపారు. -
కార్టూనిస్ట్, ఫుడ్ బ్లాగర్ ఆత్మహత్య
మంగళూరు: ప్రముఖ కార్టూనిస్ట్, ప్రముఖ పాపులర్ ఫుడ్ బ్లాగర్ నిఖిల్ పాయ్ (29) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ‘ది త్రి హంగ్రీ మెన్’ అనే ఫుడ్ బ్లాగ్‌తో పాపులర్ అయిన నిఖిల్ ఆత్మహత్య ఫుడ్ లవర్స్‌ను, వ్యాపార వర్గాలను విస్మయపర్చింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన ఆత్మహత్యకు పాల్పడి వుంటారని భావిస్తున్నారు. తల్లితో గొడవ పడిన నిఖిల్ బయటకు వెళ్లారు. ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబం మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మంగుళూరు మలెమార్నగరంలోని ఆయన నివాసంలో మృతదేహాన్నిఆదివారం కనుగొన్నారు. నిఖిల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కాగా, ముగ్గురు స్నేహితులతో కలిసి ‘ది త్రీ హంగ్రీ మెన్’ అనే ఫుడ్ బ్లాగ్‌ను 29మే 2009లో ప్రారంభించారు నిఖిల్. దీంతోపాటు తండ్రి మరణానంతరం కుటుంబ వ్యాపారాలను కూడా నిఖిల్ చూసుకుంటున్నారు. యూట్యూబ్‌లో కార్టూన్ కళపై ఆయన వీడియోలు పాపులర్ అయ్యాయి. అలాగే వివిధ ప్రదేశాల్లో దొరికే విలక్షణ ఆహార పదార్థాలు, వంటకాలపై ఆయన నిర్వహించే రివ్యూలు బహుళ ప్రజాదరణ పొందాయి. నిఖిల్‌కు భార్య, తల్లి , సోదరి ఉన్నారు. త్వరలో ‘ది త్రీ హంగ్రీ మెన్’ పదేళ్ల వార్షికోత్సవం నిర్వహించుకోనున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. -
ఈయన ప్రాణాన్ని గీసి, బొమ్మను పోస్తాడు!
శంకర్ గీతకు కంట్రోల్ ఉండదు. కంట్రోల్ తప్పడం కాదది.. కంట్రోల్లో పెట్టడం! అది కార్టూనింగ్. వంకరగా అతడు ఒక్క గీత గీశాడంటే.. ఎవరు ఏమిటో చక్కగా దిగిపోద్ది. అది క్యారికేచరింగ్. పైనున్నాయన బొమ్మను చేసి ప్రాణం పోస్తే.. ఈయన ప్రాణాన్ని గీసి, బొమ్మను పోస్తాడు. అదొక తాండవం. శంకర తాండవం. భుజానికో గుడ్డ సంచీ తగిలించుకుని అందులో తన ఆశల గీతలను దాచుకుని ఎన్ని మెట్లెక్కాడో తెలియదు కానీ, హృదయాన్ని ముంచెత్తుతోన్న రంగురంగుల స్వప్నాలను ఎక్కడైనా ఒలకబోసుకుందామని ఎన్నిసార్లో ప్రయత్నించారు పామర్తి శంకర్. ఆ తపనతోనే వృత్తిరీత్యా కార్టూనిస్టు, ప్రవృత్తిరీత్యా క్యారికేచరిస్ట్ అయిన శంకర్ అనతి కాలంలోనే అంతర్జాతీయ గుర్తింపుని తెచ్చుకోగలిగారు. అలా రెండు దశాబ్దాల పాటు తను వేసిన ప్రతి పెన్సిల్ గీతా, ప్రతి సిరాచుక్కనీ ఒకచోటకు చేర్చి హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆర్ట్ గ్యాలరీలో ‘ది ఇంక్డ్ ఇమేజ్’ పేరుతో ప్రదర్శనకు ఉంచారు శంకర్. నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలాను తలచుకున్నప్పుడల్లా జాతి వివక్షకు వ్యతిరేకపోరాట చిహ్నంగా అంతర్జాతీయ బహుమతి గెలుచుకున్న శంకర్ గీసిన మండేలా బిగిపిడికిలి గుర్తురావాల్సిందే ఎవ్వరికైనా. ఎంఎస్ సుబ్బులక్ష్మి గానామృతం రుచిమరిగిన కోయిలమ్మ సహా సుబ్బులక్ష్మి బొమ్మ శంకర్ క్యారికేచర్ దాహార్తికో మచ్చుతునక. ప్రాణాలన్నీ ఉగ్గదీసుకుని షెహనాయ్లోకి ఊదుతున్నట్టున్న బిస్మిల్లాఖాన్ షెహనాయ్ మన చెవుల్లో రింగుమంటూంటుంది. కారల్ మార్క్స్ గడ్డం, ఎంఎఫ్ హుస్సేన్ ఆర్టు, కేసీఆర్ సిగలో తురిమిన తెలంగాణ, పాటల జలపాతాల్లా తోచే గోరటి వెంకన్న కళ్లు, అరుంధతీరాయ్ సిగలో పుష్పంగా మారిన సాహిత్యం, పీవీనరసింహారావు మూతి ముడుపు, రజనీకాంత్ స్టైలూ, మైకేల్ జాక్సన్ వొంటి విరుపూ ఇలా చెప్పుకుంటూ పోతే శంకర్ క్యారికేచర్ల ప్రత్యేకతలు శంకర్‌లోని రాజకీయ, సామాజిక, ఆర్థికావగాహనని సాక్షాత్కరిస్తాయి. ‘‘ఈనెల 21న ముగియనున్న ఈ ఎగ్జిబిషన్ ఏ ఒక్క కార్టూనిస్టుని తయారుచేసినా నాకదే సంతృప్తి’’ అంటోన్న శంకర్ సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న కొన్ని అనుభూతులు. మీ మదిలో మెదిలిన తొలి పెన్సిల్ గీత? నిజం చెప్పాలంటే మట్టిబొమ్మలతో నా ప్రయాణం మొదలైంది. స్కూల్ డేస్‌లోనే రంగులతో స్నేహం ఏర్పడింది. చిన్నప్పుడే సైన్‌బోర్డు ఆర్టిస్టుగా చేరాను. ఆ తరువాత స్కూల్లో పిల్లలకు డ్రాయింగ్ నేర్పే టీచర్ వృత్తిలోకి మారాను. మూడు పీరియడ్స్ మినహా మిగిలిన సమయమంతా లైబ్రరీలో గడిపేవాడిని. ప్రకాష్ షెట్టీ, అజిత్ నారాయణ్ క్యారికేచర్లు చూసేవాడిని. ఏదో వెలితి నన్ను వెంటాడుతూ ఉండేది. నాక్కావాల్సింది ఇది కాదు అన్న భావన నాలో అశాంతిని రేపేది. అప్పటికే నల్లగొండ గోడలపై వెలిసే ఆర్టిస్ట్ మోహన్ ఉద్యమపొలికేకల పోస్టర్లు నన్ను అమితంగా ఆకర్షించేవి. ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్‌కి ప్రయాణమయ్యేవాడిని. ఆర్ట్ ఎగ్జిబిషన్స్, సండేమార్కెట్‌లో పుస్తకాలు కొనుక్కోవడం, ఎంఏడి (మాడ్) కార్టూన్ మాగజైన్స్ చూడటం, మోర్ట్ డ్రక్కర్ క్యారికేచర్స్, సెర్జో ఆర్గాన్స్, డాన్ మార్టిన్, పాల్కోకర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కార్టూనిస్టులను చూస్తూండేవాడిని. ఆ స్ఫూర్తితోనే వారపత్రికల్లో అప్పుడప్పుడూ సోషల్ కార్టూన్స్‌ని పంపేవాణ్ణి. అలా అలా డైలీ పాకెట్ కార్టూన్‌కి ఫిదా అయిపోయాను. పత్రికారంగంలోకి ఎలా వచ్చారు? అమెచ్యూర్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో కార్యకర్తగా ఉన్నప్పుడు పూర్వపు ఆంధ్రజ్యోతిలో తిరుపతి, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ కార్టూనిస్ట్ కాంపిటీషన్స్‌లో నేను సెలక్ట్ అయ్యాను. అయితే ఇంటి దగ్గర్నుంచి చేస్తానన్నాను. కానీ పొలిటికల్ కార్టూన్లు ఇంటినుంచి వేయడం కుదరదన్నారు. మీ రంగుల కల రాజధానికెలా చేరింది? అయితే సీజనల్‌గా కాదు పూర్తికాలం కార్టూనిస్టుగా ఉండాలన్న తపన, జిజ్ఞాస ఎలాగైనా హైదరాబాద్‌కి వెళ్లిపోవాలన్న కోర్కెకు బలంచేకూర్చింది. అదే నాన్నకి చెప్పాను. మహా మహా ఆర్టిస్టులే రోడ్ల మీద క్రీస్తు బొమ్మలూ, ఆంజనేయస్వామి బొమ్మలూ వేసుకుని అడుక్కుతింటూంటే హైదరాబాద్ వెళ్లి నువ్వేం చేస్తావురా? నువ్వింకా హైదరాబాద్‌కి వెళ్లదల్చుకుంటే నా శవంపై నుంచి దాటి వెళ్లు అన్న నాన్న కరెంటు నర్సయ్య మాటలకు కట్టుబడి, నల్లగొండ మట్టిపై మమకారాన్ని వదులుకోలేక చాలా ఏళ్లు నన్ను కనిపెంచిన ఆ నల్లనిరాళ్లలో ఉండిపోయా ను. ఉద్యోగంలో తృప్తిలేదు. కార్టూన్ల దాహం తీరలేదు. ఇక లాభంలేదనుకుని ఒకానొక రోజు భుజానికి గుడ్డసంచీ తగిలించుకుని, దాని నిండా నేను గీసిన కార్టూన్లు నింపుకుని ఆర్టిస్టు మోహన్‌గారిని వెతుక్కుంటూ హైదరాబాద్ చేరాను. నా గీతను ఇష్టపడిన మోహన్‌గారు నన్ను అక్కున చేర్చుకున్నారు. క్యారికేచర్లలోకి ఎలా అడుగుపెట్టారు? తెలుగు మహాసభల కోసం ప్రత్యేక సంచిక వేస్తూ మోహన్‌గారు నాకోసం ప్రత్యేకించి శంకర భాష్యం పేరుతో ఒక పేజీని కేటాయించారు. భానుమతి, బాల్‌థాకరే, రాజేంద్రప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యంల క్యారికేచర్లు అందులో పబ్లిష్ అవడం నా జ్ఞాపకాల్లో ఎప్పుడూ మెదిలే తొలి అనుభవం. చెదిరిన జుట్టుతో అత్యంత సహజంగా వేసిన బాలగోపాల్ క్యారికేచర్, రైతు భుజంపై చేయివేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యారికేచర్, ఎంఎఫ్ హుస్సేన్, విన్నీ మండేలా, రావు బాల సరస్వతి, కిషోర్ కుమార్, ఆరుద్రల క్యారికేచర్లు నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ∙కార్టూనిస్టుగా తొలి అనుభూతి? ఉద్యోగం కోసం కార్టూన్లతోనే మూడు పేజీల బయోడేటా తయారుచేసుకుని నా కార్టూన్లన్నింటినీ సంచిలో పెట్టుకుని మళ్లీ కార్టూనిస్ట్ ఉద్యోగ వేటలో పడ్డాను. వార్తాపత్రికలో రామచంద్రమూర్తిగారికి నా కార్టూన్లిచ్చి వచ్చాను. నల్లకుంటలో బస్‌కోసం ఎదురుచూస్తుంటే అనుకోకుండా పాన్‌డబ్బా ముందు వేళ్లాడదీసిన నా కార్టూన్... ఒకటి కాదు వరసగా పది పేపర్లు. ఆశ్చర్యపోయాను. నా కార్టూన్ ఫ్రంట్ పేజ్‌లో. ఆనందానికి అవధుల్లేవు. అలా మొదలై ఇప్పుడు ప్రముఖ దినపత్రిక ‘సాక్షి’లో కార్టూనిస్టు స్థాయికి చేరాను. ఓసారి రాజకీయవేత్తలందరితో వేసిన ఓ క్యారికేచర్ తెల్లారి ఫ్రంట్ పేజ్ బ్యానర్‌గా మార్చిన సాక్షి ఎడిటర్ మురళిగారిని ఆశ్చర్యంగా అడిగాను సర్ ఇది లోపలి పేజీ కోసం వేసిందని. ‘‘అది బ్యానర్లో ఉండాల్సిన క్యారికేచర్లే మాకు తెలుసు’’ అని మురళిగారు అన్న మాట వృత్తిపరంగా నాకెంతో సంతృప్తినిచ్చిన మరో సందర్భం. అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి -
కార్టూనిస్ట్ శంకర్ "ది ఇంక్డ్ ఇమేజ్"
-
సాక్షి’ కార్టూనిస్ట్ శంకర్‌కు అంతర్జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’కార్టూనిస్ట్ పామర్తి శంకర్‌ను మరో అంతర్జాతీయ పురస్కారం వరించింది. ‘ఎండ్ ఆఫ్ టెర్రరిజం’ పేరిట ఇరాన్లో జరిగిన కార్టూన్ల పోటీలో ద్వితీయ బహుమతి లభించింది. ఈ పోటీలో 65 దేశాలకు చెందిన వ్యంగ్య చిత్రకారులు పాల్గొన్నారు. మన దేశం నుంచి 18 మంది తమ ఎంట్రీలను పంపారు. మయన్మార్‌లో రోహింగ్యాలపై జరిగిన దాడిని ఉద్దేశించి ఆయన గీసిన ఆంగ్‌సాన్ సూకీ క్యారికేచర్ పురస్కారం గెలుచుకుంది. బహుమతిగా 1,500 డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు జ్ఞాపిక, సర్టిఫికేట్, పబ్లిష్‌డే ఆల్బంను అందజేస్తారు. ఇప్పటికే ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ అవార్డు(2015)తోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలను శంకర్ అందుకున్నారు -
స్వాతి, షబ్బీర్‌లపై కేసుల్ని ఎత్తివేయాలి
హైదరాబాద్: కఠువా, ఉన్నావ్ ఘటనలకు నిరససగా కార్టూన్ వేసిన సీనియర్ జర్నలిస్ట్ స్వాతి వడ్లమూడిపై కేసు నమోదుచేయడాన్ని ఖండిస్తున్నట్లు ‘ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్’ సభ్యులు తెలిపారు. సమాజంలో జరిగే దారుణాలను వెలుగులోకి తీసుకొచ్చేవారిపై కేసులు బనాయించడం భావప్రకటనా స్వేచ్ఛపై దాడిచేయడమేనని విమర్శించారు. ప్రస్తుతం ఈ రకమైన ప్రమాదకర ధోరణి దేశమంతా కొనసాగుతోందన్నారు. కఠువా, ఉన్నావ్ ఘటనలపై స్వాతి తన ఫేస్బుక్లో పోస్ట్చేసిన ఓ కార్టూన్‌పై హిందూ సంఘటన్ అనే సంస్థ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. స్వాతితో పాటు టైమ్స్ నౌ జర్నలిస్ట్ షబ్బీర్ అహ్మద్‌లపై నమోదైన కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని నర్సిం, శంకర్, మృత్యుంజయ, సుభానీ తదితర కార్టూనిస్టులు డిమాండ్ చేశారు. -
శ్రీదేవి సైకత శిల్పంతో నివాళి!
-
కథగా..కల్పనగా తరలిపోయిన తారకు నివాళి!
సాక్షి, ముంబై: అభిమాన అందాల నటి శ్రీదేవి ఇకలేరన్న (ఫిబ్రవరి 24) పిడుగులాంటి వార్తతో యావత్తు సినీ జగత్తు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఆమె అభిమానులు తీరని విషాదంలో మునిగిపోయారు. సినీ ప్రపంచంలో ధృవతారలా వెలిగిన మెగాస్టార్ శ్రీదేవి హఠాన్మరణంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. వీరితోపాటు వివిధ రంగాలకు చెందిన కళాకారులు, కార్టూనిస్టులు, ఇతర ప్రముఖులు కూడా ఆమె మరణం పట్ల అంతులేని ఆవేదన ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిషాలోని పూరీ బీచ్‌లో ఆర్ఐపీ శ్రీదేవి అంటూ సైకత శిల్పంతో ప్రత్యేక నివాళులర్పించారు ప్రఖ్యాత సంపాదకీయ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య కూడా భావోద్వేగాన్ని తన ఆర్ట్ ద్వారా ప్రకటించారు. దేవుని ఒడిలో శ్రీదేవి నిద్రపోతున్నట్టుగా ఒక స్కెచ్‌ను వేశారు. 'రా రె రారామ్, ఓ రా రీ రమ్' (సద్మా, తెలుగులో వసంతకోకిల మూవీలోని పాట) రూపొందించిన కార్టూన్ ఆమె అభిమానుల్లో కంట నీరు పెట్టిస్తోంది. కాగా సమీప బంధువు వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిని శ్రీదేవి తీవ్రమైన గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం సోమవారం ముంబై జుహూలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రిలయన్స్ క్యాపిటల్ అధినేత అనిల్ అంబానీకి చెందిన ప్రత్యేక విమానంలో శ్రీదేవి భౌతికకాయం ముంబైలోని ఆమె నివాసానికి చేరనుంది. Tribute to one of the brightest star of Indian cinema #Sridevi . My SandArt at Puri beach in Odisha with message "We will miss you" . #RIPSridevi pic.twitter.com/NuMYnKWnO7 — Sudarsan Pattnaik (@sudarsansand) February 25, 2018 Chandni! @mail_today cartoon #Sridevi #Chandni pic.twitter.com/I6ZrPDQ06n — Satish Acharya (@satishacharya) February 26, 2018 Tribute to one of the brightest star of Indian cinema #Sridevi . My SandArt at Puri beach in Odisha with message "We will miss you" . #RIPSridevi pic.twitter.com/NuMYnKWnO7 — Sudarsan Pattnaik (@sudarsansand) February 25, 2018 -
‘సాక్షి’ కార్టూనిస్ట్ శంకర్‌కు ప్రత్యేక ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఇరాన్లో జరుగుతున్న అంతర్జాతీయ కార్టూన్ క్యారికేచర్ పోటీల్లో ‘సాక్షి’ కార్టూనిస్ట్ పామర్తి శంకర్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నారు. మొత్తం 64 దేశాల కార్టూనిస్టులు పాల్గొంటున్న 11వ టెహ్రాన్ అంతర్జాతీయ ద్వైవార్షిక కార్టూన్ పోటీల్లో శంకర్‌తోపాటు గ్రీస్, పోర్చుగల్‌కు చెందిన ఇద్దరు కార్టూనిస్టులను అంతర్జాతీయ జ్యూరీకి ఎంపిక చేశారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు శంకర్ మంగళవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ బయలుదేరారు. ఈ నెల 15న అవార్డుల ప్రదానం జరగనుంది. ఆ తర్వాత జరిగే వర్క్‌షాప్‌లోనూ ఆయన పాల్గొంటారు. గతంలోనూ శంకర్ పలు అంతర్జాతీయ కార్టూన్ పోటీల్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. -
కార్టూనిస్ట్ బాలా ఎఫ్ఐఆర్పై స్టే
మదురై: కార్టూనిస్ట్ బాలాపై దాఖలైన ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోకుండా మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. తనపై విచారణను రద్దుచేయాలని కోరుతూ బాలా వేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం ఈ మేరకు మధ్యంతర ఆదేశాలిస్తూ దీనికి కౌంటర్ దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు అనుమతి లేకుండా విచారణ జరిపే అధికారం పోలీసులకు లేదని బాలా తన పిటిషన్లో పేర్కొన్నారు. తానేం క్రిమినల్ నేరానికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో లేదని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా తాజా ఎఫ్ఐఆర్ ఉందని ఆరోపించారు. -
భావప్రకటనా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యాలను తన కుంచె ద్వారా ఎత్తిచూపిన కార్టూనిస్టు బాలాను తమిళనాడు సర్కార్ అరెస్టు చేయడాన్ని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు గొడ్డలిపెట్టని ఐజేయూ అధ్యక్షుడు ఎస్.ఎన్.సిన్హా, సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారి బెదిరింపులు తాళలేక ఒక వ్యక్తి, భార్య, ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి తరునెల్వేలి కలెక్టరేట్ వద్ద నిప్పు అంటించుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై తమిళనాడు సీఎం, తిరునెల్వేలి కలెక్టర్, ఇతర పోలీసులపై బాలా వేసిన వ్యంగ్య కార్టూన్ ఫేస్బుక్లో వైరల్ అయింది. వైఫల్యాల్ని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కలెక్టర్ ఫిర్యాదు మేరకు బాలాపై కేసు పెట్టి జైలుపాలు చేయడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే అవుతుందని పేర్కొన్నారు. -
కార్టూనిస్ట్ బాలకు బెయిల్ మంజూరు
తిరువొత్తియూరు: తమిళనాడు సీఎం పళనిస్వామితో పాటు తిరునల్వేలి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లపై వ్యంగ్య చిత్రం గీసిన కేసులో అరెస్టయిన కార్టూనిస్టు జి.బాల అలియాస్ బాలక్రిష్ణన్(36) సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. తిరునల్వేలి జిల్లాకు చెందిన ఇసక్కిముత్తు వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక జిల్లా కలెక్టరేట్లో కుటుంబంతో సహా నిప్పు అంటించుకుని ఆత్మాహతి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వ్యంగ్య కార్టూన్ గీయడంతో జిల్లా కలెక్టర్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో బాలను అరెస్టుచేసి చెన్నైలో కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్.. బాలకు బెయిల్ జారీచేస్తూ నవంబర్ 9న కోర్టుకు హాజరు కావాలని నిబంధన విధించారు. కాగా, బాల గీసిన వ్యంగ్య కార్టూన్లను సామాజిక మాధ్యమాల్లో 25 లక్షల మంది చూసినట్టు తెలిసింది. -
ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపటం ఆపను
సాక్షి, చెన్నై : తమిళనాడు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వ్యంగ్య కార్టూన్ వేసి అరెస్టయిన కార్టూనిస్ట్ బాలక్రిష్ణన్(36)కు ఊరట లభించింది. తిరువనేలి జిల్లా కోర్టు సోమవారం మధ్యాహ్నం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేనేం ఘోర హత్యలు చేయలేదు. కాబట్టి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కేసులతో నన్నేం చేయలేరు. ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టడం నేను ఆపను. నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ అని కోర్టు వెలుపల బాల ప్రకటించారు. తిరునల్వేలి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం సజీవంగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా.. వడ్డీ వ్యాపారుల ఆగడాలను అడ్డుకోవటంలో ప్రభుత్వం, అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కార్టూనిస్ట్, లయన్స్ మీడియా వెబ్ సైట్ నిర్వాహకుడు అయిన బాల వ్యంగ్య కార్టూన్ వేసి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. కలెక్టర్ ఫిర్యాదుతో ఆదివారం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయగా.. దేశ వ్యాప్తంగా పాత్రికేయులు ఆయనకు మద్దతు ప్రకటించారు. -
కార్టూనిస్టు బాల అరెస్టు
-
కార్టూనిస్టు బాల అరెస్టు
సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం, తిరునల్వేలి కలెక్టర్, ఎస్పీలపై వ్యంగ్య కార్టూన్ వేసిన జి.బాల అలియాస్ బాలక్రిష్ణన్‌ను పోలీసులు అరెస్టుచేశారు. తిరునల్వేలి కలెక్టర్ చేసిన ఫిర్యాదు మేరకు క్రైమ్ బ్రాంచి పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులకు తాళలేక గత నెల 23న ఇసక్కి ముత్తు అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి తిరునల్వేలి కలెక్టరేట్లో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ‘లయన్స్ మీడియా’ వెబ్‌సైట్‌ను నడుపుతున్న బాల ఓ వ్యంగ్య కార్టూన్ వేశారు. అందులో అగ్నికి ఆహుతువున్న వ్యక్తి దగ్గర సీఎం పళనిస్వామి, తిరునల్వేలి జిల్లా కలెక్టర్ సందీప్, పోలీసు కమిషనర్లు నగ్నంగా ఉన్నట్లు వేశారు. ఈ కార్టూన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా, బాల అరెస్టును కార్టూనిస్టు, పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బాలను బలంతంగా లాక్కెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. -
ప్రముఖ కార్టూనిస్టు కన్నుమూత..
ముంబయి : ప్రఖ్యాత కార్టూనిస్టు మంగేష్ టెండూల్కర్(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణెలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. టెండూల్కర్ మూడేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జూలై 9న రూబీ హాల్ క్లినిక్‌లో చేర్పించారు. ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోవడంతో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో టెండూల్కర్ కన్నుమూసినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తుది శ్వాస విడిచేవరకు ఆయన ఉత్సాహంగా ఉండేవారని, గత నెలలో ఆయన కార్టూన్ల ప్రదర్శనను నిర్వహించినట్లు కుటుంబీకులు తెలిపారు. నాటక రచయిత దివంగత విజయ్ టెండూల్కర్‌కు సోదరుడు. దైనందిన జీవితానికి సంబంధించిన ఎన్నో కార్టూన్లు వేశారు. అనేక మ్యాగజిన్లకు, పత్రికలకు ఆయన కార్టూన్లు వేస్తుండేవారు. తన కార్టూన్లు, కారికేచర్లలో ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేవి కూడా ఉన్నాయి. వీటిలో చాలా వాటిని ట్రాఫిక్ విభాగం వినియోగించుకుంటోంది. తరచూ ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర ఉండి ట్రాఫిక్ రూల్స్ పాటించడంపై కరపత్రాలు కూడా పంచుతుండేవారు. అంతేగాక భూచక్ర, సండే మూడ్ వంటి పుస్తకాలు కూడా రచించారు. -
ప్రముఖ కార్టూనిస్టు సుధీర్ తైలాంగ్ కన్నుమూత
ముంబై: ప్రముఖ కార్టూనిస్టు సుధీర్ తైలాంగ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన గుర్గావ్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. పలు ఆంగ్ల దినపత్రికల్లో చిత్రకారుడిగా ఆయన పనిచేశారు. 1982లో కార్టూనిస్టుగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన సుధీర్ తైలాంగ్ వ్యంగ్య చిత్రకారుడిగా రాణించారు. ఆయన చూపించిన విశేష ప్రతిభకుగాను 2004లో పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. కాగా తన అద్భుతమైన కార్టూన్లతో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికని సుసంపన్నం చేసిన సుధీర్ తైలాంగ్ పూర్వీకులు తెలంగాణా ప్రాంతీయులు. అవినీతి, నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఆకలి తదితర అంశాలపై ఆయన గీసిన కార్టూన్లు సుధీర్ తైలాంగ్ పొందాయి. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై ఆయన వేసిన వ్యంగ్య చిత్రాలు, పుస్తకాన్ని ప్రచురించి వార్తల్లో నిలిచారు. కాగా సుధీర తైలంగ్ మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రతికా ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు. -
కొంటె బొమ్మల 'బాపు'.. గుండె ఊయలలూపు
కొంటెబొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయలలూపు ఓ కూనలమ్మా..! తెలుగు వెండితెర మీద తెలుగు దనాన్ని ఒలికించిన దిగ్దర్శకుడు బాపు గురించి ఆరుద్ర చెప్పిన మాటలివి. వెండితెరకు వయ్యారాన్ని నేర్పిన బాపు భౌతికంగా దూరమైనా.. ఆయన గీసిన బొమ్మలు, తీసిన సినిమాలు ఎప్పటికీ ఆయన్ని మనతోనే ఉండేలా చేశాయి. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఒక్కసారి ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం. బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. ఆయన 1933 డిసెంబర్ 15న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పుట్టారు. ఆంద్ర పత్రికలో కార్టూనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన బాపు తరువాత దర్శకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. రామాయణసారం లేకుండా బాపు సినిమాలే లేవు. రామాయణ, మహాభారతాల్ని ఆధునీకరించి తెరకెక్కించారు బాపు. ఆ రెండు మహాకావ్యాల్ని అణువణువునా జీర్ణించుకుని.. ప్రతి కథనీ ఆ కోణం నుంచే చూశారు.. తీశారు. అందుకే రామాయణంలోని ఘట్టాలను సినిమాలుగా తెరకెక్కించిన బాపు. ఆయన తెరకెక్కించిన సాంఘిక చిత్రాల్లోనూ రామాయణ సారాన్నే చూపించారు. తనని తాను రాముని బంటుగా చిత్రీకరించుకున్నారు కూడా. అది రాముడిపై బాపు భక్తి. కళాత్మక దర్శకుడు బాపుని ఎన్నో అవార్డులు వరించాయి. మదర్ థెరిసా చేతులమీదుగా రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. ఆరు నంది అవార్డులతో పాటు, ఎన్నో గౌరవ సత్కారాల్ని పొందారు. సినిమాలోనే కాదు, భక్తిరసం తొణికిసలాడే అనేక బొమ్మలు బాపు చేతిలో ఊపిరిపోసుకున్నాయి. స్క్రిప్ట్ తోపాటే అన్ని ఫ్రేముల్నీ బొమ్మలుగా గీసుకుంటారు బాపు. అందుకే ప్రతి షాట్ సెల్యులాయిడ్‌పై బొమ్మగీసినట్టు అందంగా ఒదిగిపోతుంది. ఆణిముత్యాల్లాంటి సినిమాలను తీసిన బాపు.. ఎవరి దగ్గరా పనిచేయలేదు. కేవలం కథా బలమే ఆయన సినిమాలను విజయపథంలో నడిపించింది. బాపు గురించి మాట్లాడుకుంటూ రమణ గురించి చెప్పకపోతే అది పూర్తవదు. వారిద్దరూ ఒకే ఆత్మకు రెండు రూపాలు, ఒకే భావాన్ని పలికే రెండు పదాలు. బాపు దృష్టి అయితే రమణ దాని భావం. బాపు చిత్రం అయితే రమణ దాని పలుకు. అందుకే వీరిద్దరి వెండితెర ప్రయాణమే కాదు.. జీవనయానం కూడా కలిసికట్టుగానే సాగింది. అందుకేనేమో.. రమణ మరణించిన తరువాత ఎక్కువ కాలం బాపు మనలేకపోయాడు. ఆత్మ లేని దేహంగా ఉండలేక రమణను కలుసుకోవడానికి 2013 ఆగస్టు 31న శాశ్వతంగా వెళ్లిపోయారు. -
ఉతికి ఆరేసినచో...
కొందరు నవ్వించడానికి రకరకాల ప్రయత్నిస్తారు. వారి వీర ప్రయత్నాలను చూసి మనకు నీరసం వస్తుంది తప్ప నవ్వు మాత్రం రాదు. అయితే కొందరు పెద్దగా ఏ ప్రయత్నమూ చేసినట్లు కనిపించరు. మౌనంగా నవ్వుల మంత్రదండాన్ని తిప్పుతారు. అంతే! మనకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది. ఈ రెండో కోవకు చెందినవాడు ఇరాన్ కార్టూనిస్ట్ మెహదీ అలిబెజీ. ఆయన వర్ణరేఖలు ఎలాంటి శబ్దాడంబరం లేకుండానే గిలిగింతలు పెడతాయి. ఇరాన్లో అడుగు పెట్టగానే కళా హృదయులకు ‘కార్టూన్ల దేశం’లో అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. అంతటా మహామహులు కనిపిస్తూనే ఉంటారు. ఒకరిని చూసి ‘మహాను భావా మీ కార్టూన్ ఉంది చూశారూ’ అనేలోపే అభిమాన కార్టూనిస్ట్ మరెవరో కనిపిస్తూనే ఉంటారు. ఆ దేశం నిండా అంత గొప్ప కార్టూనిస్టులన్నారు మరి. వాళ్లలో ఒకరు మెహదీ. మెహదీ హసన్ గజల్స్ వింటుంటే, అమృతం పరవళ్లు తొక్కుతున్న అనుభూతి కలుగుతుంది. మెహదీ హసన్ రేఖల్లో నవ్వులగంగ ఉప్పొంగిపోతుంది. ‘భాషతో నీకు పనిలేదు’ అన్నట్టుగా ఒక్క అక్షరం లేకుండానే అందమైన కార్టూన్లను అందించిన గొప్ప కార్టూనిస్టు మెహదీ. సామాజిక, రాజకీయ అంశాలే కాదు... ఆయన ఆయన దృష్టి నుంచి ఏ ఒక్క విషయమూ తప్పిపోదు. ‘రవి గాంచని చోటు కవిగాంచును’ అన్న నానుడిని, ‘కవి గాంచని చోటును సైతం కార్టూనిస్ట్ గాంచును’ అని మార్చేశారు మెహదీ! పందొమ్మిదో ఏట నుంచి నవ్వులు పూయిస్తున్న మెహదీ... ఇప్పుడు ఓ పే....ద్ద నవ్వుల తోటకు యజమాని. ఆ తోటలో పూసిన ఒక పువ్వు ఇది. దాని హాస్య పరిమళాన్ని హాయిగా ఆస్వాదించండి! -
సామాన్యుని సృష్టికర్తకు గూగుల్ నివాళి
'కామన్ మేన్' సృష్టికర్త, ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ కు ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఘనంగా నివాళి అర్పింపించింది. ఆర్కే లక్ష్మణ్ 94వ జయంతిని పురస్కరించుకుని ఆయన ఫోటోను 'డూడుల్'గా పెట్టింది. తన డెస్క్ వద్ద దీక్షగా పనిచేసుకుంటున్న ఆర్కే లక్ష్మణ్, ఆయన కార్టూన్ కేరెక్టర్ 'కామన్ మేన్' లు కలిసి ఉన్న చిత్రాన్ని డూడుల్ గా రూపొందించింది. ఆర్కే లక్ష్మణ్ గా సుపరిచితులు అయిన ఈ కామన్ మేన్ సృష్టికర్త పూర్తి పేరు రాశిపురం కృష్ణ స్వామి అయ్యర్ లక్ష్మణ్, ఆయన అక్టోబర్ 23, 1924లో మైసూర్ లో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. కుటుంబంలోని ఆరుగురు కుమారుల్లో లక్ష్మణ్ చివరి వారు. మాల్గుడి సృష్టి కర్త ఆర్ కే నారాయణ్, లక్ష్మణ్ ఇద్దరూ సోదరులు కావడం విశేషం. ముంబాయి నుంచి ప్రచురించే ఇంగ్లీష్ దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా లో కార్టూనిస్టుగా పనిచేశారు. కన్నడ వ్యంగ్య పత్రిక కొరవంజిలో ఇలస్ట్రేటర్ గా ఆయన కెరీర్ ప్రారంభించారు. ఆయన పద్మవిభూషణ్, మెగసెసే , తదితర విశేష పురస్కారాలు ఎన్నోఅందుకున్నారు. కామన్ మేన్ పాత్రను సృష్టించి, దానికి తన వ్యంగ్య చిత్రాల్లో స్థానంకల్పించిన లక్ష్మణ్ సామాన్యుని పక్షాన నిలచి రాజకీయ నాయకులపై వ్యంగ్యాస్ర్తాలు సంధించేవారు. ఆయన జనవరి 26న పూనేలో మరణించారు. -
చిత్రహింసల కొలిమిలోంచి...
మనదేశంలో న్యాయం, చట్టం ఏమాత్రం అమలు జరగని ప్రదేశం జైలు. చట్టబద్ధంగా జరిగేదేదీ అతిక్రమణ కాజాలదు. కానీ జైలులో అమలు జరిగే దేదీ చట్టం పరిధిలో ఉండదు. అక్కడ అధికారులు, పోలీసులు చెప్పిందే శాసనం. ఇనుపచువ్వల మాటున, ఖాకీ డ్రస్సుల చాటున, జైలు గోడల మధ్యన దాగిన క్రూరత్వానికి సజీవసాక్ష్యం అరుణ్ ఫరేరా. ఊపిరి సలపని జైలు గోడలకు వేళాడదీసిన వేన వేల శాల్తీల్లో అరుణ్ ఫరేరా ఒకరు. పెడరెక్కలు విరి చికట్టి మానవ శరీరాలను మాంసపు ముద్దలుగా మార్చి, కారే నెత్తుటి చుక్కల లెక్కల నుంచి మొదలవుతుంది ఇంటరాగేషన్. ఒకటా, రెండా... అచ్చంగా ఐదేళ్ల పాటు విచారణ పేరుతో నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోని అండా సెల్లో మగ్గిపోయిన మావోయిస్టు ఖైదీయే అరుణ్ ఫరేరా. ముంబై మూలవాసి అయిన అరుణ్ విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతోన్న విద్యార్థి సంఘ నాయ కుడు. తప్పుడు కేసులు పెట్టి, ఇనుప బూట్లతో ఒళ్లుకుళ్ల బొడిచి, గోళ్లల్లో గుండు సూదులు గుచ్చి, చెవుల్లోంచి రక్తం చిందినా చలించని ఉక్కు మనిషి అరుణ్ ఫరేరా. కలర్స్ ఆఫ్ ద కేజ్ పేరుతో ఆంగ్లంలో పుస్తక రూపంలో విడుదలైన తన అనుభవాలను ‘సంకెళ్ల సవ్వడి’ పేరుతో మలుపు పబ్లిషర్స్ తెలుగులోకి తెచ్చారు. పుస్తకావిష్క రణ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన అరుణ్ ఫరేరాతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. జైలులో ఉండగానే ఈ పుస్తకం రాశారా? స్వతహాగా నేను కార్టూనిస్టుని. నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించి చిత్రహింసలకు గురిచేశారు ముంబయి పోలీ సులు. నాలుగు సంవత్సరాల 8 నెలలపాటు గాలి, వెలు తురు సోకని అండాసెల్ అని పిలిచే చీకటి కారాగారంలో ఉంచారు. నేననుభవిస్తున్న హింసని, జైలుగోడల మధ్య నలుగుతున్న నాలాంటి ఎందరో ఖైదీల అనుభవాలనూ కార్టూన్లుగా గీసాను. నాపై మోపినవి తప్పుడు కేసులని రుజువయ్యాక బయటికి వచ్చిన వాటికి అక్షర రూపం ఇచ్చాను. జైళ్లపై మీ అభిప్రాయం? భారత దేశంలోని జైలు... న్యాయం, చట్టం అమలు జర గని ఒక ప్రదేశం. చట్టబద్ధంగా జరిగేదేదీ అతిక్రమణ కాజాలదు. కానీ ఇక్కడ అమలు జరిగే దేదీ చట్టం పరి ధిలో ఉండదు. అక్కడ అధికారులు, పోలీసులు చెప్పిందే శాసనం. నాలుగ్గోడల మధ్య మాకున్న ఏకైక పోరాట రూపం నిరాహార దీక్ష. అదే చేశాం. భారత ప్రభుత్వం ఆమోదించిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశాం. పోరాటం జైలు గోడలు దాటి రాకపోతే మేం చేసింది వృథాయే. ఆ వార్తను పత్రికలకు చేరవేయడం మరో ప్రహసనం. ఇంటరాగేషన్ క్రమంలో మీరెలాంటి చిత్రహింసలు ఎదు ర్కొన్నారు? నా శరీరంలో ఒక్క అంగుళం కూడా మిగలకుండా హిం సించారు. గోళ్లల్లో సూదులు గుచ్చారు. తల్లకిందులుగా వేలాడదీసారు. కిటికీకి చేతులు విరిచికట్టి నా తొడలపై ఇద్దరు కానిస్టేబుల్స్‌ని గంటలకొద్దీ నించోబెట్టేవారు. కరెంట్ షాక్ ఇచ్చారు. వారు పెట్టిన హింసకు చెవుల్లో నుంచి రక్తం కారేది. కానీ నా నోటినుంచి మాత్రం ఏనా డూ ఒక్కమాట రాబట్టలేకపోయారు. ఇది నా కథ మాత్రమే కాదు. నాలాంటి వేలాది మంది ఖైదీలు అను భవిస్తున్న ఘోరాలు. నాతోటి ఖైదీలకు ఎనీమా ఇచ్చి నట్టు 100 మిల్లీ లీటర్ల పెట్రోల్ లోపలికి పంపించారు. అంతే కటి భాగంలో పుళ్లుపడి నడవలేక, రోజులు, నెలల తరబడి రక్తం కారి, చివరకు ప్రాణం పోయేంతటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకమైన శిక్షణ లేకపోతే తప్ప ఇలా హింసించాలని వాళ్లకెలా తెలు స్తుందా అని నాకెప్పటికీ ఆశ్చర్యమే. మావోయిస్టు ఖైదీల పరిస్థితేనా, లేక ఎవరికైనా ఈ చిత్ర హింసలు తప్పవా? తేడా ఉంటుంది. అలా అని సాధారణ ఖైదీలను హింసిం చరని కాదు. నాకు జరిగింది కేవలం ఒక వంతే. అంతకు పదింతలు ఎక్కువగా చిత్రహింసలు అనుభవిస్తున్న వారు ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు. అంతెందుకు ఢిల్లీలో అక్రమంగా అరెస్టయిన సాయిబాబా నేనున్న అండాసెల్ లోనే ప్రస్తుతం ఉన్నాడు. 48 డిగ్రీల వేడికి గాలిసోకని అండాసెల్ ఉడికి పోతుంది. ఓ మూలకు చేరి రాత్రిపగలు వేడి సెగసోకకుండా గొంతుక్కూర్చొని శరీ రాన్ని కాపాడుకోవాలి. నేనైతే ఐదేళ్లపాటు అదే సెల్లో ఎలాగో బతికాను. కానీ, సాయిబాబా నడవలేడు. మం డే గచ్చుమీద పాక్కుంటూ వేడిని తట్టుకోవాలి. ఊహిం చుకోడానికే భయంగా ఉంది. జైళ్లలో మగ్గుతున్నది నూటికి 80 శాతం మంది విచారణ ఖైదీలే. 30 ఏళ్లనాటి జైలు నిబంధనలనే ఇప్పటికీ అనుసరించడం దారుణ మైన విషయం. విషయాలు రాబట్టడానికే పోలీసులు మిమ్మల్ని చిత్రహిం సలు పెట్టారని భావించొచ్చా? పోలీసు అధికారులకు కావాల్సింది వేరు. శాశ్వతంగా ఉద్యమం నుంచి మమ్మల్ని దూరంగా ఉంచడం. ఓ మావోయిస్టు ఖైదీపై నార్కో టెస్ట్‌లు చేయడం నాతోనే మొదలు. నార్కో టెస్ట్‌లో మేం ఏం చెప్పినా అది వారికి అనుకూలంగా మార్చుకొని రాసుకుంటారు. సమాధా నాలు మావే ఉంచి, ప్రశ్నలు మార్చి రికార్డు చేస్తారు. ఇప్పుడైతే ఖైదీ అనుమతి లేకుండా నార్కో టెస్ట్ చేయకూ డదు. ఎన్ని హింసలు పెట్టినా సత్యం జయించింది. నాపై మోపిన తప్పుడు కేసులు వీగిపోయాయి. కానీ కోల్పోయిన నా జీవితం తిరిగిరాదుగా... జైళ్లలో మగ్గుతున్న వారిలో అత్యధిక శాతం దళితులు, ఆదివాసీలు, మైనారిటీలే. అలా ఎందుకు జరుగుతోంది? అమెరికా జైళ్ళ నిండా బ్లాక్సే ఉంటారు ఎందుకు? ఎం దుకంటే వారు వాయిస్ లెస్ పీపుల్. గొంతులేని వారే అణచబడతారు. అందుకే మేం ఇలాంటి వేలాది మంది జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు లీగల్ ఎయిడ్ కావాలని కోరుతున్నాం. వారి పక్షాన నిలబడే బాలగోపాల్ లాం టి అడ్వొకేట్ ఒక్కరయినా కావాలి. న్యాయాన్ని కొనుక్కో లేక ఏళ్లతరబడి జైళ్లలో మగ్గుతున్న వాళ్లకి న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతోనే నేనిప్పుడు లా చేస్తున్నాను. జైలు జీవితం తరువాత మీ దృక్పథంలోగానీ, మీ సంక ల్పంలోగానీ ఏమైనా తేడా ఉందా? కచ్చితంగా లేదు. నా చిన్నారి బిడ్డని వదిలి వెళ్లినా, మళ్లీ స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చి వాడిని గుండెలకు హత్తు కున్నాను. అలాగే ఉద్యమాన్ని హత్తుకుంటాను. జైలు గోడలు బద్దలయ్యే రోజు కోసం ఎదురుచూస్తాను. - అత్తలూరి అరుణ -
ఉత్తమ కళాకారుడి అవార్డు అందుకున్న సాక్షి కార్టూనిస్టు శంకర్
నల్లగొండ: నల్లగొండజిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మంగళవారం అవార్డులు ప్రదానం చేశారు. 'సాక్షి' దినపత్రిక కార్టూనిస్టు పామర్తి శంకర్‌కు ఉత్తమ కళాకారుడి అవార్డు ప్రదానం చేశారు. దశాబ్దాలుగా కార్టూనిజం వృత్తిలో రాణిస్తున్న శంకర్ తన సొంత జిల్లా అయిన నల్లగొండ నుంచి తెలంగాణ అవతరణ తొలి వార్షికోత్సవ సందర్భంగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయనతో పాటు 'సాక్షి' దినపత్రిక అర్వపల్లి మండల విలేకరిగా పనిచేస్తున్న శ్రీరంగం వెంకన్నకు ఉత్తమ ఫొటో జర్నలిస్టు అవార్డును అందజేశారు. ఇటీవల నల్లగొండ జిల్లా అర్వపల్లిలో సిమి ఉగ్రవాదులను తన కెమెరాలో సజీవం గా బంధించినందుకుగాను వెంకన్నకు ఈ అవార్డును ప్రకటించారు. -
సాక్షి కార్టూనిస్టు శంకర్‌కు ఉత్తమ కళాకారుడి అవార్డు
అర్వపల్లి విలేకరి శ్రీరంగం వెంకన్నకు కూడా.. నల్లగొండ: ‘సాక్షి’ దినపత్రిక కార్టూనిస్టు పామర్తి శంకర్‌కు ఉత్తమ కళాకారుడి అవార్డు లభించింది. దశాబ్దాలుగా కార్టూనిజం వృత్తిలో రాణిస్తున్న శంకర్ తన సొంత జిల్లా అయిన నల్లగొండ నుంచి తెలంగాణ అవతరణ తొలి వార్షికోత్సవ సందర్భంగా ఈ పురస్కారానికి ఎం పికయ్యారు. ఆయనతో పాటు ‘సాక్షి’ దినపత్రిక అర్వపల్లి మండల విలేకరిగా పనిచేస్తున్న శ్రీరంగం వెంకన్నకు ఉత్తమ ఫొటో జర్నలిస్టు అవార్డును సోమవారం సాయంత్రం కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ప్రకటించారు. ఇటీవల నల్లగొండ జిల్లా అర్వపల్లిలో సిమి ఉగ్రవాదులను తన కెమెరాలో సజీవం గా బంధించినందు కుగాను వెంకన్నకు ఈ అవార్డును ప్రకటించారు. వీరిద్దరికి మంగళవారం నల్లగొండలో జరిగే అవతరణ వేడుకల ఉత్సవాల్లో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పురస్కారంతోపాటు నగదు బహుమతి అందజేయనున్నారు. -
కార్టూనిస్టు గోపులు మృతి
చెన్నై: ప్రముఖ కార్టూనిస్టు గోపులు(ఎస్. గోపాలన్) మృతి చెందారు. తమిళనాట గొప్ప చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా పేరొందిన ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నెల 27న ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 7.30 గంటలకు కన్నుమూశారు. ఆనంద వికటన్ పత్రికలో కార్టూనిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన జాతీయ స్థాయిలో కీర్తి సాధించారు. తమిళనాట పలు సీరియళ్లకు కూడా ఆయన పనిచేశారు. 1991లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదుతో ఆయన్ను సత్కరించింది. -
నాకు నేను మెరుగులు దిద్దుకుంటూనే ఉంటాను...
ప్రముఖ చిత్రకారుడు బాపు తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న ఆర్టిస్టు బాలి. లక్షల చిత్రాలు గీసిన చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా, కథారచయితగా తన ‘చిత్ర’ యానాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్‌లో పనిచేసి, ఇప్పుడు సొంతగడ్డ విశాఖలో స్థిరపడ్డ బాలి జీవన ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే.. మా తండ్రి లక్ష్మణరావు బ్రిటిష్ వారి పాలనలో ఆర్మీలో సుబేదార్ ఆయనకు చిత్రకళపై ఆసక్తి ఉండేది. వీలు చిక్కినప్పుడల్లా బొమ్మలు వేసేవారు. అమ్మ అన్నపూర్ణ అందమైన ముగ్గులు వేసేవారు. అలా వారిద్దరి నుంచి నాకు చిత్రకళ అబ్బింది. ఆరేళ్ల వయసు నుంచే ఏకాంతంగా కూర్చుని ఏవేవో బొమ్మలు గీసేవాడ్ని. తొలుత ఏపీపీఎస్సీ ద్వారా పీడబ్ల్యుడీలో చేరాను. అందులో ఉండగా నాకిష్టమైన బొమ్మలు వేసుకునే తీరికుండేది కాదు. దీంతో ‘బొమ్మలేసుకుని బతకలేనా?’ అంటూ ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకొచ్చేశాను. నేను గీసిన ‘ఉబుసుపోక’ అనే రేఖాచిత్రం 1958లో ఆంధ్రపత్రిక వారపత్రికలో తొలిసారిగా అచ్చయింది. ఆ తర్వాత కొన్ని తెలుగు దినపత్రికల్లో కార్టూనిస్టుగా, స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేశాను. అలా పనిచేస్తూనే నవలలకు కవర్ డిజైన్లు, బ్రోచర్ డిజైన్లు గీస్తూనే అందమైన బొమ్మలు వేసేవాడ్ని. మల్లాది, యండమూరి, లత, రంగనాయకమ్మ, అడవి బాపిరాజు, కొడవటిగంటి సహా దాదాపు ప్రముఖ రచయితలందరి నవలలకు కవర్ పేజీ డిజైన్లు వేశాను. కథలు రాశాను. కార్టూన్లపై ఎనిమిది పుస్తకాలు, జోక్స్పై రెండు సంకలనాలు తెచ్చాను. రెండు చిన్నపిల్లల నవలలు, ‘చిన్నారులు బొమ్మలు వేయడం ఎలా’? అనే పుస్తకం కూడా ముద్రించాను. బాలి ఇలా.. నేను పత్రికల్లో పనిచేసేటప్పుడు శంకర్ పేరు మీద ఆర్టులు, కార్టూన్లు వేసేవాడ్ని. అప్పటికే శంకర్ పేరుతో పలువురు ఆర్టిస్టులున్నారు. దీంతో అప్పటి పత్రికా సంపాదకుడు పురాణం గారు నన్ను ‘బాలి’గా మార్చారు. పురస్కారాలు.. నాకెన్నో పురస్కారాలొచ్చాయి. న్యూజిలాండ్ బైబిల్ సొసైటీకి బొమ్మలు గీసినందుకు, పర్యావరణ పరిరక్షణపై జర్మనీ నిర్వహించిన పోటీలో ప్రతిభ చూపినందుకు ప్రశంసలందుకున్నాను. చిన్నపిట్టల పెద్దమనసు అనే పిల్లల నవలకు ఎన్‌సిఇఆర్‌టి బహుమతినిచ్చింది. ఇంకా చిత్రకళా సమ్రాట్, హంస వంటి పలు అవార్డులు దక్కాయి. నేను వేసిన పెయింటింగ్‌లను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, మచిలీపట్నం డిప్యూటీ కలెక్టర్ ఆఫీసుల్లో అలంకరించారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, చికాగో (అమెరికా)ల్లో నేను వేసిన బొమ్మలను ప్రదర్శించారు. సాగరతీరంలో కాలక్షేపం.. నా సతీమణి పదేళ్ల క్రితమే అనారోగ్యంతో కన్నుమూసింది. రెండేళ్ల క్రితం విశాఖలోని సొంతింటికి వచ్చేశాను. పిల్లలు అమెరికాలో సెటిలవ్వడంతో ఒక్కడినే ఉంటున్నాను. నా వంట నేనే చేసుకుంటాను. టిఫిన్‌కు బదులు పెరుగన్నం తినడమే నా ఆరోగ్య రహస్యం. పగలంతా ప్రశాంతంగా కూర్చుని బొమ్మలు వేసుకుంటాను. రోజూ సాయంత్రం వేళ సమీపంలోని బీచ్‌కి నడిచి వెళ్తాను. నాకు టీవీ అంటే ఇష్టం ఉండదు. సినిమా చూసి 30 ఏళ్లవుతోంది. బొమ్మలపై ఉన్న ఇష్టంతో ఒక్కడినే ఉన్నా నాకు బోర్ అనిపించదు. రాత్రివేళ కథల పుస్తకాలు చదువుతాను. స్వయంకృషితోనే చిత్రకళను అభ్యసించాను. ఆర్టిస్టు ఎప్పుడూ సమాజాన్ని గమనిస్తూ ఉండాలి. బొమ్మల్లో మార్పులతో కొత్తదనం తెచ్చుకోవాలి. బొమ్మలెప్పుడూ మూసలా ఉండకూడదు. నేను రాసిన 30 కథలను పుస్తక రూపంలో తేవాలనుకుంటున్నాను. జీవితాంతం బొమ్మలు గీస్తూనే ఉంటాను. ...::: బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం ఫోటోలు: శ్రీనివాస్ ఆకుల -
చెదిరిన గీత
దివికేగిన కార్టూన్ క్వీన్ తొలి మహిళా కార్టూనిస్టు రాగతి పండరి జీవితం విభిన్న భావాల మిళితం. అనేక అనుభూతుల సంగమం. హృదయానికి బాధ కలిగితే విషాదం వెల్లువవుతుంది. సంతోషం అతిశయిస్తే ఆనందం పల్లవిస్తుంది. చిలిపితనం పులకింతలు పెడితే పెదాలపై నవ్వు పరవళ్లు తొక్కుతుంది. నవ్వు టానిక్‌లా పని చేస్తుంది. యాంత్రిక జీవితంలో నిరాశను కాసేపైనా తరిమి కొట్టే కిక్ ఇస్తుంది. ఈ ‘గీతా’సత్యాన్ని రాగతి పండరి చిన్ననాటనే గ్రహించారు. తన జీవితంలో తొణికిన విషాదాన్ని పక్కకు నెట్టి పదిమందికీ నవ్వుల పూలు పంచిపెడుతూ బతుకును ధన్యం చేసుకున్నారు. తామేడుస్తూ ఎందరినో ఏడ్పించే వారు ఎక్కువయ్యే లోకంలో, తాను నవ్వుతూ పదిమందిని నవ్విస్తూ ఆ రంగంలో అగ్రగణ్యురాలిగా ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. వైకల్యాన్ని ఓడించి ఆహ్లాదాన్ని అందరికీ పంచి పెడుతూ హాస్య ప్రపంచాన మకుటం లేని మహారాణిగా వెలుగొందిన రాగతి పండరి అభిమానులకు విషాదం మిగిల్చి జీవితం నుంచి సెలవు తీసుకున్నారు. విశాఖపట్నం-కల్చరల్: జీవితంలో అన్ని సదుపాయాలూ ఉండి, ముందుకు దూసుకుపోయే అవకాశాలు కలిగిన వారెందరో చతికిలబడుతూ ఉంటే ఆకాశమే అవధిగా రాగతి పండరి అద్భుతాలు సాధించారు. కేవలం ఎనిమిదేళ్ల వయస్సులో ఓ పత్రికలో కార్టూన్ ప్రచురితమయ్యే స్థాయిని సాధించారంటే అందుకు ఆమె సాధన, తపన ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. జిజ్ఞాస కొద్దీ నేర్చుకుంటూ, ఆసక్తి కొద్దీ గమనిస్తూ, తనకు తానుగానే సాధన చేస్తూ ఆమె ఉన్నత లక్ష్యాల దిశగా సాగిపోయారు. పాఠశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేని రాగతి పండరి, ఇంట్లో సోదరి చెప్పగా చదువు నేర్చుకున్నారు. తోచినట్టు గీతలు గీసి, అలాగే బొమ్మలు సాధన చేసి, క్రమంగా పూర్తి స్థాయి కార్టూనిస్టుగా ఎదగడానికి అవసరమైన సత్తా సంపాదించారు. ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్ వ్యంగ్య చిత్రాలను పత్రికల్లో చూసి, మురిసిపోయి, తానుకూడా అదే రీతిలో నేర్పు సంపాదించాలని ఆరాటపడి... అలా నిర్విరామంగా బొమ్మలు గీసి, రాతలు రాసి ఓ స్థాయికి చేరుకున్నారు. చూడగానే ‘ఇది రాగతి పండరి కార్టూన్’ అన్న గుర్తింపు వచ్చేలా నేర్పు సంపాదించారు. తెలుగునాట తొలి మహిళా కార్టూనిస్టుగా ఖ్యాతి పొందారు. దేశంలోనూ ఈ ఖ్యాతికి ఆమె అర్హురాలే. ఎన్నో కార్టూన్లు... మరెన్నో శీర్షికలు పండరి మొదటి కార్టూన్ ఎనిమిదో ఏటే జ్యోతి వార పత్రికలో ప్రచురితమైంది. మొత్తం 16 వేలకు పైగా కార్టూన్లు వేశారు. వ్యంగ్య చిత్రాలకు సంబంధించి ఆమె కర స్పర్శ సోకని ప్రక్రియ లేదు. క్లిష్టమైన రాజకీయ కార్టూన్లను సుదీర్ఘ కాలం పాటు ‘రాజకీయ చెదరంగం’ శీర్షిక కింద గీసి ఆ విధంగా కూడా తనకు అవగాహన అనల్పమని రుజువు చేసుకున్నారు. నవగ్రహం- అనుగ్రహం పేరున ఇద్దరు అమ్మాయిల కార్టూన్ ఫీచర్, శ్రీమతి పేరున మహిళామణి స్ట్రిప్ కార్టూన్.. ప్రతి పండగకు ప్రత్యేక పేజీ కార్టూన్లు.. అవీ ఇవీ అని కాకుండా నిర్విరామంగా వ్యంగ్య చిత్రాలు సృజించారు. తెలుగులో అన్ని పత్రికలకు తన వ్యంగ్య చిత్రాల వెలుగులు పంచి ఇచ్చారు. తెలుగు కార్టూన్ సామ్రాజ్యానికి ఆమె మకుటం లేని మహారాణి అని జయదేవ్ చేత ప్రశంసలు పొందారు. ‘మీవి కేవలం కార్టూన్లే కాదు.. నేటి కాలపు తెలుగు మధ్యతరగతి వారి చరిత్ర’ అని బాపు ప్రశంసలు అందుకున్నారు. ముగ్ధులైన మహారథులు.. తనంత తానుగా సాధన చేస్తూ, తప్పులు సరిదిద్దుకుంటూ ఒక్కో మెట్టే ఎక్కి ఉన్నత స్థాయికి చేరిన విశిష్టత పండరిది. అందుకే ఆమె ప్రతిభ మహామహులను సైతం ముగ్థులను చేసింది. కార్టూన్లు సాధన చేసిన మొదట్లో తాను గీసిన చిత్రాలను చెన్నైలో నివసించే కార్టూనిస్టు జయదేవ్‌కు పండరి పంపారు. ఆయన జవాబు రాస్తూ, ఆమె కార్టూన్లను మెచ్చుకోవడమే కాకుండా, అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. కొంత కాలానికి ఆయన స్వయంగా విశాఖపట్నం వచ్చి తన శిష్యురాలిని అభినందించారు.. బాపు అంతటి వాడు రచన మాస పత్రికలో 2005లో ప్రచురించిన వినాయక చవితి కార్టూన్ మెచ్చుకొంటూ లేఖ రాశారు. పండరి కార్టూన్‌కు బాపు బొమ్మ గీశారు. బాధాకరం ప్రముఖ కార్టూనిస్టు రాగతి పండరి అకాల మృతికి పలువురు చిత్రకారులు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. అచ్చమైన తెలుగు నుడికారపు హాస్యంతో కార్టూన్లు సృషించిన రాగతి పండరి చిరస్మరణీయురాలని కార్టూనిస్ట్ హరి ఒక ప్రకటనలో నివాళులర్పించారు. భార్య, భర్త, పక్కింటి వాళ్లు, ఆఫీసు... ఇలా చిన్నచిన్న విషయాలమీద చక్కటి హాస్యాన్ని పంచగలిగే శైలి ఆమెదన్నారు. తెలుగు కార్టూన్‌కి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన వారిలో ఆమె ఒకరుగా శ్లాఘించారు. మహిళా కార్టూన్లు ఎక్కువగా వేసినా మహిళలను కించపరిచేలా కార్టూన్ వేయకపోవడం పండరి ప్రత్యేకతన్నారు. తీరని లోటు ప్రముఖ కార్టూనిస్ట్ రాగతి పండరి అకాల మరణం కార్టూన్ రంగానికి తీరని లోటని చిత్రకారుడు, షిప్‌యార్డు రచయితల సంఘం, చిత్రకళా పరిషత్ సంఘ కార్యదర్శి సుంకర చలపతిరావు అన్నారు. ఆమె మృతికి చింతిస్తూ గురువారం చిత్రకళా పరిషత్ సంఘం వద్ద సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాగతి పండరి వివిధ అంశాలకు సంబంధించి సుమారు 15 వేల కార్టూన్లు గీశారని, ఆమె ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదును ప్రదానం చేసిందన్నారు. మద్రాస్ తెలుగు అకాడమీ ఆమెను ఉగాది పురస్కారంతో గౌరవించిందన్నారు. నవ్వుల పువ్వులు ‘దగ్గర చూపా, దూరం చూపా? మీకేంటి ప్రాబ్లెం?’ అని డాక్టర్ ప్రశ్నిస్తే.. ‘ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేకపోతున్నాను డాక్టర్’ అనే కడుపు మంట పేషెంట్.. ‘మా నాన్న నాకు వేరే వాడితో పెళ్లి కుదురుస్తున్నాడు.. నువ్విలాగే చూస్తూ కూచుంటావా?’ అని ప్రేయసి అంటే ‘ లేదు రాధా.. నీ పెళ్లికి తప్పక వస్తాను’ అనే కపట ప్రేమికుడు.. ‘పక్కింటి వాళ్ల పిల్లాడ్ని చేర్పించిన కాన్వెంట్లో ఇంగ్లిష్ సరిగ్గా చెప్పడం లేదల్లే ఉందండీ.. ఇంకా ఆవిడ్ని అమ్మా అనే పిలుస్తున్నాడట పాపం’ అని జాలిపడే పరభాషాభిమానీ.. ‘మా ఆవిడ నగలు ఎక్కడ దాచిందో క్లూ ఇస్తా గానీ అందులో నాకో రెండొంతులు ఇస్తావా?’ అని దొంగతోనే బేరం పెట్టే గడుసు భర్తా.. ‘ఏంటీ.. మనవాడు తీరిగ్గా కూర్చుని చదువుకుంటున్నాడూ?’ అని ఆరా తీసే భర్తకి, ‘పాపం.. వాడి సెల్ ఫోన్ పోయిందటండీ’ అని సర్ది చెప్పే జాలి భార్యా.. ఒకటా రెండా.. వందలు.. ఊహూ.. వేలు.. అవును వేలాది పాత్రలు.. లక్షలాది విలక్షణ, విభిన్న స్వభావాలు.. వ్యక్తిత్వాలు.. జీవితంలో అడుగడుగునా తారసపడే రకరకాల వైవిధ్యభరితమైన ప్రవృత్తులు.. అమాయక మాలోకాలు.. గడుసు పిండాలు.. ఇలా ఎన్నో పాత్రలు రాగతి పండరి కార్టూన్లలో ప్రాణం పోసుకొని నవ్వులు పూయించాయి. -
కార్టూనిస్ట్ మోహన్‌కు పతంజలి స్ఫూర్తి అవార్డు
విజయనగరం: ప్రముఖ వ్యంగ్య రచయిత, కార్టూనిస్టు మోహన్‌కు దివంగత జర్నలిస్టు, సంపాదకులు కె.ఎన్.వై.పతంజలి స్ఫూర్తి అవార్డును అందజేయనున్నట్టు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తెలిపారు. శనివారం విజయన గరంలోని గురజాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పతంజలి జయంతి రోజైన మార్చి 29న మోహన్‌కు ఈ అవార్డు అందజేయనున్నట్టు తెలిపారు. మార్చి 11, 29 తేదీల్లో కె.ఎన్.వై.పతంజలి వర్ధంతి, జయంతి సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 11న సభకు ఎన్.వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. -
‘కామన్ మేన్’ సృష్టికర్త ఇకలేరు
-
‘కామన్ మేన్’ సృష్టికర్త ఇకలేరు
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ దైనందిన జీవితంలో అష్టకష్టాలు పడుతూ అన్నిచోట్లా తారసపడే నిస్సహాయ ‘కామన్ మేన్’ సృష్టికర్త, ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్(94) ఇక లేరు. ఐదు దశాబ్దాలుగా సామాన్యుడివైపు నిలిచి రాజకీయ నేతలపై చురుక్కుమనిపించే వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఆయన సోమవారం పుణేలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్ తదితరులు సంతాపం తెలిపారు. అనారోగ్యంతో కన్నుమూసిన ‘సామాన్యుడి’ సృష్టికర్త పుణే/న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దైనందిన జీవితంలో అష్టకష్టాలు పడుతూ అన్నిచోట్లా తారసపడే నిస్సహాయ ‘కామన్ మేన్’ సృష్టికర్త, ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్(94) ఇక లేరు. ఐదు దశాబ్దాలుగా సామాన్యుడివైపు నిలిచి రాజకీయ నేతలపై చురుక్కుమనిపించే వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఆయన సోమవారం పుణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం 6.50 గంటలకు తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వైద్యుడు సమీర్ జోగ్ తెలిపారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్, శ్వాస సమస్యలతో లక్ష్మణ్ ఈ నెల 17న ఆస్పత్రిలో చేరారు. పలు కీలక అవయవాలు పనిచేయకపోవడంతో ఆయనకు వెంటిలేటర్‌పై శ్వాస అందించారు. చికిత్సకు స్పందించినా ఆదివారం పరిస్థితి విషమించింది. లక్ష్మణ్‌కు భార్య, రచయిత్రి కమల, మాజీ జర్నలిస్టు అయిన కుమారుడు శ్రీనివాస్, కోడలు ఉష ఉన్నారు. సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఆర్కే నారాయణ్‌కు ఆయన తమ్ముడు. లక్ష్మణ్ అంత్యక్రియలను మంగళవారం నిర్వహించనున్నారు. ‘మీ బొమ్మలు సామాన్యుల మనోభావాలు’ లక్ష్మణ్ మృతితో ఆయన అభిమానులు విచారంలో మునిగిపోయారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితర ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన చిత్రాలు సామాన్యుల మనోభావాలని కొనియాడారు. సామాన్యుడిని జాతి ప్రతిమలా మలచిన ప్రజ్ఞాశాలిని కోల్పోయామని, తాను లక్ష్మణ్ అభిమానినని ప్రణబ్ పేర్కొన్నారు. ‘దేశం మిమ్మల్ని కోల్పోయింది. మా జీవితాల్లో అవసరమైన హాస్యాన్ని పంచి, మా ముఖాల్లో నవ్వులు పూయించినందుకు మీకు ఎంతో కృతజ్ఞులం’ అని మోదీ ట్వీటర్లో పేర్కొన్నారు. సమకాలీన రాజకీయాలపై లక్ష్మణ్ కార్టూన్లు పదునైన విమర్శలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. లక్ష్మణ్ సృజనాత్మకతకు సున్నిత హాస్యాన్ని జోడించారని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో రాజకీయ వ్యంగ్యచిత్రానికి నడకలు నేర్పిన మహామనీషి లక్ష్మణ్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. ఆయన కార్టూన్లు జాతీయ సంపద అని, ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. సీపీఎం నేత బీవీ రాఘవులు, సీపీఐ నేత కె.రామకృష్ణ కూడా సంతాపం తెలిపారు. లక్ష్మణ్ పూర్తిపేరు రాసీపురం కృష్ణస్వామి లక్ష్మణ్. 1921, అక్టోబరు 24న మైసూర్లో ఓ బడిపంతుల కుటుంబంలో జన్మించారు. ఏడుగురు తోబుట్టువుల్లో ఆయన ఆఖరి వారు. అన్నయ్య సుప్రసిద్ధ నవలా రచయిత ఆర్కే నారాయణ్. లక్ష్మణ్ బాల్యం నుంచే చిత్రకళపై ఆసక్తి కనబరచారు. అక్షరాలు అబ్బకముందే బొమ్మలు గీశారు. మైసూరు మహారాజా కాలే జీలో చదువుతుండగా స్వరాజ్య, బ్లిట్జ్ పత్రికలకు బొమ్మలు వేశారు. ముంబైలోని ‘జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’లో చేరాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన బొమ్మల్లో పరిణతి లేదని కాలే జీ అడ్మిషన్ నిరాకరించింది. లక్ష్మణ్ నిరాశపడకుండా తన కళ లో మరింత కృషి చేశారు. మైసూరు వర్సిటీ నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా సాధించారు. ఆ తర్వాత పలు పత్రికల్లో కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు వేసి పేరు తెచ్చుకున్నారు. దివంగత శివసేన అధినేత, కార్టూనిస్టు బాల్ ఠాక్రేతో కలసి కొన్నాళ్లు ‘ఫ్రీ ప్రెస్ జర్నల్’లో పనిచేశారు. పతనమౌతున్న ప్రజాస్వామిక విలువలపై వ్యంగ్యాస్త్రాలు సంధించి గొప్ప మానవతావాదిగా కూడా పేరు గడించారు. లక్ష్మణ్ 1951లో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికలో ‘యూ సెడిట్’ శీర్షికతో కామన్ మేన్ కార్టున్లు ప్రారంభించి యావత్ దేశాన్ని ఆకర్షించారు. ఆ పత్రిక 150వ వార్షికోత్సం సందర్భంగా 1988లో ‘కామన్ మేన్’పై ఓ పోస్టల్ స్టాంపు విడుదలైంది. పుణేలో 16 అడుగుల ఎత్తున్న కామేన్ మేన్ విగ్రహాన్నీ నెలకొల్పారంటే ఆ కార్టూన్లకు దక్కిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు. లక్ష్మణ్ 1985లో లండన్‌లో తన చిత్రాలను ప్రదర్శించారు. ఓ భారతీయ కార్టూనిస్టు చిత్రాలను ఆ నగరంలో ప్రదర్శించడం అదే తొలిసారి. ‘దేశానికి రాజకీయ నాయకులు చెడ్డవాళ్లే కావొచ్చుగానీ నా వృత్తికి మాత్రం మంచివాళ్లే’ అని ఆయన చమత్కరించేవారు. ‘నా కామన్ మేన్ సర్వాంతర్యామి.. అతడు ఈ యాభై ఏళ్ల నుంచీ మౌనంగా ఉంటున్నాడు. కేవలం వింటుంటాడు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. లక్ష్మణ్ బహుముఖ ప్రజ్ఞశాలి కూడా. ‘ది టన్నెల్ ఆఫ్ టైమ్’ పేరుతో ఆత్మకథ రాశారు. ‘హోటల్ రివేరా’ తదితర నవలలూ రచించారు. నారాయణ్ రాసిన ‘మాల్గుడీ డేస్’ టీవీ ప్రసారాలకు, కొన్ని హిందీ సినిమాలకు ఇలస్ట్రేటర్‌గా పని చేశారు. ఆయన భరతనాట్య కళాకారిణి, అలనాటి సినీనటి కుమారి కమలను వివాహం చేసుకున్నారు. విభేదాలతో ఆమెనుంచి విడాకులు తీసుకున్నారు. తర్వాత కమల అనే రచయిత్రిని పెళ్లాడారు. 2003లో పక్షవాతం వచ్చేవరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో అనుబంధం కొనసాగింది. కళలు, సాహిత్యం, జర్నలిజంలో విశిష్ట కృషికి ఆయన పద్మవిభూషణ్, మెగసెసే తదితర విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. కార్టూనే ఖఢ్గం.. ఆర్కే లక్ష్మణ్ అనగానే పాఠకులకు అతని కామన్ మేన్ గుర్తుకొస్తాడు. బట్టతల, గాంధీ కళ్లద్దాలు, గళ్ల కోటు, ధోవతీతో అన్నిచోట్లా తిరుగుతూ సమస్త అన్యాయాలనూ మౌనంగా భరించే ఆ సామాన్యుడి చిత్రంతో లక్ష్మణ్ దిగజారుడు రాజకీయాలపై పదునైన విమర్శలు చేశాడు. సామాన్యుల ఆశలను వమ్ము చేసి వాగ్దాన భంగాలకు పాల్పడే నాయకులను వెటకారాల గీతలతో దునుమాడారు. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలకు అద్దం పడుతూ సున్నితమైన హాస్యంతోనే అయినా ఘాటు విమర్శలు సంధించారు. -
స్కూళ్లలో బోధించాలి!
కార్టూన్లపై ఆర్.కె. లక్ష్మణ్ ఇంటర్వ్యూ: పన్నాల సుబ్రహ్మణ్యభట్టు మంచి బొమ్మలతో పాటు రాజకీయ వ్యంగ్య చిత్రాలకు తలమానికం వంటి ఆలోచనలతో ఎక్కడా వన్నె తగ్గకుండా, ప్రజాదరణ కోల్పోకుండా, తేలిపోని చిత్రాలు వేసినవారు ఆంగ్లపత్రికా రంగంలో ఇద్దరే ఇద్దరు. వారు ఇద్దరూ ‘ఆకుంచె శ్రీమంతులు’. బంగారు కుంచెతో పుట్టినవారి క్రింద లెక్క. వారు - శంకర్, ఆర్.కె. లక్ష్మణ్. అతి తక్కువ లైన్లతో రంగులు పూసిన గీతల క్యారికేచర్లు అనే పోలికల హెచ్చుతగ్గుల ఆలోచనాత్మకమైన ముఖ కవళికల రూపురేఖలు దిద్దగల్గిన దిగ్దంతులు వాళ్లిద్దరే. మరొకరు జన్మించరేమో! లక్ష్మణ్ ‘ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ’లో అతి తక్కువ గీతలతో గీసిన రంగు బొమ్మలను కాపీ చేస్తూ నా మిత్రుడూ, నేనూ 1965లో సెలవులు గడుపుతుండేవాళ్ళం. మొహంలో కండలు నిర్ణయించే గీతలు, వ్యక్తి పోలికలకు పారా కాసే రేఖలు పట్టుకోవడానికి తంటాలుపడుతూ ఉండేవాళ్ళం. పెద్ద కుర్చీలో కూర్చున్న చిన్న లాల్‌బహదూర్ శాస్త్రి బొమ్మను కాపీ చేయడం దగ్గర నుండి ఆరంభమయిన నా యాత్ర త్వరగానే ముగిసింది కానీ, ఆ బొమ్మలు గీసిన మహానుభావుణ్ణి చూడాలన్న కోరిక మాత్రం నాలుగు దశాబ్దాలకు గానీ తీరలేదు. అదీ నాటకీయంగా కుదిరింది. ఆమధ్య ‘విజయవాడ పుస్తక ప్రదర్శన’కు అతిథిగా వచ్చిన ఆర్.కె. లక్ష్మణ్ గారిని దుర్గ గుడికి తీసుకెళ్లడం నా పని. ఆయనకు దేవాలయ సందర్శనం అప్పుడు చేయడం ఇష్టం లేదు. శ్రీమతి కమలా లక్ష్మణ్ తప్పదన్నారు. ప్రత్యేక ఏర్పాట్లతో ఆవిడ ముందు వరుసకు పదోన్నతి పొందారు. లక్ష్మణ్‌గారు వెనుకబడ్డారు. క్యూలో చాలాసేపు పట్టింది. ‘మీకూ తప్పలేదు చూశారా’ అని నేను నవ్వాను. ‘ఇదే మనకు ఆహారం’ అన్నారాయన. నెత్తి మీద అక్కడే కోతి కిచకిచలు. ‘‘హనుమంతుడు కూడా నిరసన తెలియజెబుతున్నాడు చూశావా’’ అన్నారు. ప్రక్కనే ఎవరి చంకలోనో ఉన్న పిల్లాడు ఆయనకు ముద్దు వచ్చాడు. ఆయన ఆ పిల్లవాడి బుగ్గ మీద చిటికేశారు. తండ్రికి కోపం లాంటి విసుగొచ్చింది. రెండేళ్ళు నిండని తన పసిపిల్లాణ్ణి తాకిన పరాయివాడంటే సద్భావం కలగలేదు. ఆయనకు ‘‘మనం ఆమోదయోగ్యులం కాదు కదా! నాకు తెలుసు’’ అన్నారు ఆర్.కె. లక్ష్మణ్. కమలగారు దర్శనం చేసుకున్నారు. ఈయన ఆనందంగా బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో నేను ఆయన్ని తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేయాలి. ఆయనకు చెప్పలేదు ఇంటర్వ్యూ అని! ఆయన కాదంటే మొదటికే మోసం వస్తుంది. ‘‘మీకు దండలు వేయడానికి అక్కడ ఒకాయన చాలాసేపు నుంచి వెయిటింగ్. సాధారణ మనిషి ఒకరు ఎదురుచూస్తున్నా’’రని చెప్పి రేడియో స్టేషనుకి తీసుకెళ్ళాను. సంతోషించారు. నాలుగు మాటలు... మీ అభిమానులు సంతోషిస్తారని మైకు ముందు మొదలుపెట్టాను. చివరన ‘‘అభిమాని మంచి ప్రశ్నలు వేశాడే’’ అని నవ్వారు. ఆ ఇంటర్వ్యూ ఇంగ్లీషులో సాగింది. అందులోని కొన్ని భాగాలు: ప్రశ్న: మీలాటి గొప్ప కార్టూనిస్టులు అరుదుగా కనబడతారు ఏ దేశంలోనైనా! కోపం వస్తే నివారించుకోవడానికి కార్టూన్లను వేసుకుంటూ ఉంటారా? నిజం చెప్పండి. ఆర్.కె. లక్ష్మణ్: కోపం అని అనుకోను, వంగ్య వ్యాఖ్య అంటాను. ప్రజల మీద, ముఖ్యంగా రాజకీయ నాయకుల మూర్ఖత్వం మీద, నాయకులం అనుకుని దేశాన్ని నడిపించే నాయకుల మీద! నాయకులే కాదు, మామూలు ప్రజలు కూడా! తప్పని తెలిసే రోడ్లను ఆక్రమించేవారు, మార్గమధ్యంలో నించునేవారు, లారీలు వస్తున్నా రోడ్లు దాటేవారు, ఎర్రదీపాన్ని ధిక్కరించేవారు - అందరూ నాకు కార్టూనుకు పనికొచ్చే సంగతులే. ఇది వేయాలన్న ఆలోచన తటాలున వస్తుందా? ఆర్.కె: లేదు. గంటలకొద్దీ మథనపడితే కానీ రాదు. అది కాదని, ఇది కాదని, చివరికి ఎంపిక చేసుకుని రేపటికి పనికివస్తుందో రాదో చూసుకునీ - చాలా తంటాలుపడాలి. చాలా అలసిపోయాననిపిస్తుందా? ఆర్.కె: నిజమే. అయిదారు గంటలు శ్రమపడితే కానీ కార్టూన్ గీయడానికి ఆ రోజుకు ఆలోచన రాదు. అదో నిరంతర ప్రక్రియ. ఇక్కడ కూర్చున్నా అదే ధ్యాస. బుర్రలో కదలాడుతూ ఉంటుంది. కానీ గీతల్లో గ్రాఫిక్‌గా రిజిస్టర్ కాదు. అక్కడ సంఘటనలో ఏదో వ్యంగ్యం తారాడుతూనే ఉంటుంది. తరచూ, రోజుకో ఆలోచనను ఎలా దింపగల్గుతున్నారు? ఆర్.కె: నాకు భోజనం పెట్టేదే అది. చేయక తప్పదు. కార్టూనిస్టును కాకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇంజనీరుగా ఇళ్లు కడుతూ ఉండేవాడినేమో! మంచి కార్టూన్ కాకపోయినా ప్రచురించి, పాఠకులు పొగిడితే, బాగుందంటే - మీరు వాళ్ళను చూసి నవ్వుకున్న సందర్భాలున్నాయా? ఆర్.కె: బాగుండని కార్టూనే ప్రతిరోజూ వేస్తున్నాను. వేసినందుకు విచారిస్తాను. రేపు మంచిది వేద్దామని ఆశపడతాను. నా కార్టూను విజయానికి వీళ్ళు కారకులు అని ఎవరినైనా చెప్తారా? ఆర్.కె: నా దేశం, నా ప్రజాప్రతినిధులు. వీళ్లు తెంపు లేకుండా నా జీవితంలో ప్రతిరోజూ ఆలోచనలు సరఫరా చేస్తున్నవారు. వీళ్ళే కారకులు నా విజయానికి! ఇక కార్టూను గీసే యంత్రాంగంలో ఏయే నాయకులు సదుపాయంగా, గీతలకు ఆదర్శవంతంగా కనబడతారు? ఆర్.కె: దీనికి సమాధానం కష్టం. క్యారికేచర్ కళాకారుడికి నెహ్రూ బొమ్మ గీయడం కష్టంగా ఉంటుంది. అయితే గాంధీ దేశానికి సేవ చేయడానికే జన్మించలేదు, కార్టూనిస్టులకీ సదుపాయం కల్గించాడు. ఆయన రూపం అలాంటిది. బట్టతల, పెద్ద చెవులు, చట్టిముక్కు, ముఖంమీద ఎప్పుడూ నవ్వు, దుస్తులు, ధోతీ, కండువా, నడుము వద్ద వేలాడుతున్న జేబు గడియారం - అన్నీ క్యారికేచర్ వేసేవాళ్ళ కోసమా అన్నట్లుంటాయి. కార్టూన్లకు పనికి వచ్చే వస్తువులకు వస్తే నెహ్రూ గారి యుగం బాగా ఉత్సాహం కలిగించేదిగా చెప్పుకోవచ్చా? ఆర్.కె: అబ్బే! అన్ని కాలాలూ ప్రోత్సాహజనకాలే. నెహ్రూ యుగమనేమీ లేదు. ఆ మాటకొస్తే మీ తెలుగు ప్రాంతం నుంచి వచ్చిన పి.వి. నరసింహారావు నా కార్టూన్ల అయిడియాలకి చాలా ఉపయోగపడ్డారు. రాజకీయ వ్యంగ్య చిత్రాలనే మా మీద బలంగా రుద్దుతున్నారెందుకు? సాంఘిక పరిస్థితుల మీద, కుటుంబ విషయాల మీద కార్టూన్లకు ప్రాముఖ్యం లేదేం? ఆర్.కె: ఇప్పటికిప్పుడు ఈ ప్రశ్న నీకు తోచినదనుకోవడం లేదు. మన దేశంలో రాజకీయాలు లేకుండా సాంఘిక జీవనం లేదు. సోషల్ లైఫ్ లేకుండా రాజకీయాలు లేవు. గుడికెళ్ళు. ఇవాళ వెళ్ళాం కదా! ఇద్దరు ఎంపిలు, ఎమ్మెల్యేలు వచ్చి గర్భగుడిలోకి సామాన్య ప్రజలను వెళ్ళనీయకుండా అడ్డుపడ్డారు కదా! దేవాలయం పవిత్రమైన స్థలం. అందరూ సమానమే. కానీ రాజకీయ నాయకులొచ్చి - రేపు మళ్ళీ ఈ పదవుల్లో ఉంటారో ఉండరో తెలియని రాజకీయ నాయకులు వచ్చి - దర్శనాన్ని రాజకీయం చేశారు. పుస్తక ప్రదర్శన ఆరంభించడానికి రాజకీయ నాయకుడు కావాలి. మీ ఇంటికి నీరు సరఫరా కావాలంటే స్థానిక ఎం.పి. సాయపడాలి. సాంఘిక విషయాల కంటే మనం రాజకీయాలే ఎక్కువ చర్చిస్తాం. అందుకని మన దేశంలో రాజకీయ జీవితం, సాంఘిక జీవితం అని విడివిడిగా లేవు. ఇక్కడ ఒకే పాత్రల వరుస వ్యంగ్య చిత్రాలు - స్ట్రిప్ కార్టూన్లు - వృద్ధి చెందలేదేం? ఆర్.కె: ఇంగ్లండ్‌లోనూ పెంపొందలేదు. అమెరికా వారు వీటిని ముందు ఆరంభించారు. వారే కొనసాగించారు. మన దేశంలో ఇది నడిచే వ్యవహారం కాదు. ఏం ఎక్కువ చిత్రాలు వరుసగా ఏక్షన్‌తో వేయాల్సి ఉండడం వల్లనా? ఆర్.కె: అలాగని కాదు. దాంట్లో సృజనాత్మకత ఉండదు. అంతేకాకుండా కార్టూనిస్టు అనేవాడు బొమ్మగీయడం అనే ఆలోచనలో నుంచి జన్మిస్తాడు. కార్టూన్లు గీయడం పాఠశాలలో బోధించడం లేదు. బోధించాలి.రచయితలకు ముందు తరం వారి రచనలు ఆదర్శంగా ఉంటాయి. ఎక్కడ నుంచి ఆలోచన తోస్తుందో వారి రచనలు చెప్పి, సాయపడతాయి. ఆర్.కె: కాదు. చిత్రకారుడికీ, రచయితకీ చాలా భేదాలున్నాయి. రచయితకి దృశ్యం సాక్షాత్కరించే గుణం ఉండదు. ఉదాహరణకు బేట్‌మాన్, ఫాంటమ్ పాత్రలు ఆకాశహర్మ్యాల నుండి వీధిలోకి ఎగురుతూ రావడం, దాన్ని చూపటం - ఒక దర్శనీయ అనుభవం. రచయిత రచించగలడు, కాని ఎలా ఎగురుతుందో చూపించే విధంగా ఊహించలేడు. ఆ రెండూ రాయడం, ఊహించగలగడం కలిసి రావాలి. బొమ్మలు వేయడం, వాటిని కార్టూన్లుగా మలచడంలో మీ మీద ఇతర వ్యంగ్య చిత్రకారుని ప్రభావం ఎవరిది ఉంది? ఆర్.కె: నా మీద డేవిడ్‌లో అనే వ్యంగ్య చిత్రకారుడి ప్రభావం చాలా ఉంది. ఇప్పుడు ఆయనను ఎవరూ గుర్తుంచుకోరు. చాలా గొప్ప కార్టూనిస్టు... ఇంగ్లండులో. తరువాత ‘సర్’ బిరుదు పొందాడు. సరే ఇంగ్లండులోనే కార్టూన్ కళ ఆరంభమైంది. యూరప్‌లో ప్రారంభం కాలేదు. చిన్నప్పటి నుండీ నా మీద అమిత ప్రభావం చూపాడు ఆయన. అతని ఆలోచనలు నాకు అప్పుడు అర్థమయ్యేవి కావు. ఐర్లండ్ విప్లవం మీద ఉండేవి. డ్రాయింగ్లు మాత్రం బలమైన ప్రభావం చూపాయి. డ్రాయింగ్‌లో పనితనాన్ని నిర్లక్ష్యంగా చూడకూడదు. ఒక పద్ధతిలో మనిషి కార్టూనులో నిలబడినా, చేతులు పెట్టుకొని ఒక విదంగా నిద్రపోతున్నా - ఉదాహరణకి ‘గౌడా’లా -ఆ పోజు ఎలా వస్తుంది? నువ్వు మంచి డ్రాయింగ్ వేసే కళాకారుడివి కాగలిగినప్పుడే సాధ్యమవుతుంది. ముందు డ్రాయింగ్ చిత్రకారుడు, తరువాత కార్టూనిస్టు, తర్వాతే వ్యంగ్యం చూపగల సెటైరిస్టు కాగలరు. వ్యంగ్య రచయితలకీ, కార్టూనిస్టులకీ మధ్య కామిక్ ఊహాశక్తి సంబంధమైన పోలికలున్నాయా? ఆర్.కె: నేను వ్యంగ్య రచనలు చేపట్టలేదు. మనం చూసేవాటిలో ప్రతిదాన్లోనూ ఒక వ్యంగ్య దృష్టి ఉంటుంది. ప్రతివాడి అనుభవాన్నీ వ్యంగ్యాత్మకంగా మలచవచ్చు. వ్యంగ్యం రాసేవారికీ, వ్యంగ్య రచయితలైన వోలటైర్, షాలాంటి వాళ్లకీ మధ్యన; వ్యంగ్య రచయితలైన వారికీ కార్టూనిస్టులకీ మధ్య బంధం ఒకటి ఉంది. మంచి డ్రాయింగులు కాకుల మూకనీ, జంతువులనీ వాష్ డ్రాయింగ్‌లో చాలా బలంగా, అందంగా చిత్రిస్తూ బొమ్మలు వేశారు కదా! ఆర్.కె: నా చిన్నతనం నుండి నాకు కాకులంటే ఎంతో అభిమానం. మన దేశంలో ప్రతి పిల్లవాడూ కిటికీలో నుంచి మొదట చూసేది కాకిని. పచ్చటి చెట్టు వెనుక ఉంటే కాకి కనబడుతుంది. ముందు కాకి, వెనుక నీలాకాశం ఉంటుంది. ఎక్కడైనా అది సిద్ధంగా అందరికీ కనబడుతుంది. నెమలి అనే అంద వికారమైన పక్షినీ, పావురాన్నీ ఎవరూ గమనించకపోవచ్చు. అందుకే, నేను ఈ కాకి అనే పక్షినే చిత్రిస్తూ ఆనందించాను. హైందవ చిత్రకళ, వాస్తుకళ, శిల్పాలు మిమ్మల్ని అబ్బురపరచలేదా? ఆర్.కె: లేదు. దానికి కారణం ఉంది. భారతీయ వాస్తు శిల్పకళలు పరిణతి చెందిన శైలితో విలసిల్లుతూ ఉంటాయి. దుర్గామాత చాలా ఎత్తుగా కనబడుతుంది. ఎంత ఎత్తు అంటే ముందు నిల్చున్న అర్చకుడు చాలా చిన్నవాడుగా ఉంటాడు. వాస్తు శిల్పాలలో భాగాల విభజన వాస్తుకళను గమనించేవారికి చాలా ఆసక్తిని కలిగిస్తుంది, మురిపిస్తుంది. పురాణ పాత్రల నుండి కార్టూనిస్టులు చాలా విషయాలు గీయగలరేమో? అసంఖ్యాకమైన ఆలోచనలు పుడతాయి - పురాణాల నుండి! కానీ నేను పూర్తిగా వద్దనుకున్నాను. మతపరమైనవి కదా అని మానివేశారా? ఆర్.కె: అలాగని కాదు. అవి సందర్భాలను చిన్నగా చిత్రింప చేస్తాయి. విపులంగా తెలివిగా చెప్పనీయవు. రావణుడికి పదితలలు కదా అని ఒక తల బీదరికం, మరొకటి అజ్ఞానం, అనారోగ్యం... అలా చిత్రిస్తూపోవడం గొప్పకాదు. కార్టూన్ అంటేనే సూక్ష్మీకరించి చెప్పడం కూడా కదా? ఆర్.కె: కాదు కాదు. కార్టూన్లో వ్యంగ్యం ఉంటుంది. దెప్పిపొడుస్తున్న వ్యాఖ్యానం ఇస్తూ, నువ్వు అర్థం చేసుకునేలా గీయడం ఉంటుంది. అలా సూక్ష్మంగా చేస్తే కార్టూన్ కాదు. విపులీకరించే చిత్రం మాత్రం కాగలదు. ఈ దేశంలో కార్టూనిస్టులకు గౌరవం ఇస్తున్నారా? ఆర్.కె: సారీ! ఇస్తున్నారు అనే అంటాను. నేను ఇందిరాగాంధీని ప్రతిరోజూ దాడి చేస్తూనే వచ్చాను. ‘పద్మభూషణ్’ గౌరవం ఇచ్చారు. మర్యాద చేసినట్లే కదా! ఎన్నో బహుమతులు, గౌరవాలు నాకు లభించాయి. నేను వారి పట్ల మర్యాదగా ఉన్నందుకు కాదు... వాళ్లను గౌరవించనందుకు లభించాయి. మీ కార్టూన్ బాగులేదని తోచి మీకు మీరే మీ కార్టూన్ బయటకు రాకుండా చూసుకున్నారా? ఆర్.కె: నాకో చిత్రమైన పని చేసే పద్ధతి ఉంది. ఆఫీసుకెళ్లి రెండు మూడు గంటలు పేపర్లు చదువుతాను. ప్రతీదీ విశ్లేషిస్తాను. ఆలోచన వచ్చేదాకా సతమతమవుతాను. అయిడియా కుదిరాక ఫ్రేములో ఎలా దృశ్యంగా దాన్ని మలచడం అనే బాధ మొదలవుతుంది. అంటే ఆ ఆరాటం సినిమా దర్శకుడి చిత్రీకరణ లాంటిది. సీతారామ్ కేసరిని ఇక్కడ నిలబెట్టాలా, లేక లాలూప్రసాద్‌ని మరోచోట ఉంచాలా, లేదా లాలూని శిఖరాగ్రం మీద పెట్టి, కేసరి శిఖరం మీదకు పరిగెడ్తూ ఇద్దరూ పడిపోతారా - ఇలా సినీ దర్శకుడిలా ఆలోచిస్తాను. చివరికి ఓ ఏర్పాటు చేస్తా. ఒక చోట కేసరి, ఒక చోట రబ్రీదేవి, మరొక చోట లాలూప్రసాద్‌ని పెట్టి - అప్పుడు నేపథ్యం వగైరాలు చిత్రిస్తాను. తర్వాత వ్యాఖ్యానం తయారవుతుంది. ఎవరు ఏమంటారు అనే విషయం... అటువంటివి. మొన్న ఒక కార్టూన్ వేశాను. కేసరిగారి గదిలో కాంగ్రెస్ నాయకులు బయటకు పోదామని చూస్తూ ఉంటారు. గది తలుపు సగం తెరచి ఉంటుంది. తలుపు మీద ‘కేసరి’గారి పేరు. పైన మామూలు మనిషి పత్రిక చదువుతూ నిలబడి ఉంటాడు. ఆ పత్రిక మీద ‘కాంగ్రెస్ నుండి వలసలు’ అని రాసి ఉంటుంది. తలుపు నుండి బయటకు మహాత్మాగాంధీ లాంటివాడు బయటకు వస్తూంటాడు. తలుపులో నుండి ఒక గొంతు వినబడుతుంది. ‘బెంగపడకండి... చాలామంది గతంలో కాంగ్రెస్ నుండి వెళ్లిపోయారు’ అని! ఇలా కార్టూన్‌ను చిత్రించడానికి చాలా సమయం పడుతుంది. వ్యంగ్యంతో ఏమీ చేయలేము అని భావంతో నిండి ఉంటుంది. నా మెదడులో పూర్తిగా ఈ ఆలోచన చిత్రరూపం పొందేవరకు పెన్సిల్, కాగితం చేత పట్టను. అప్పుడే కార్టూన్ గీయడం ఆరంభిస్తాను. అంతవరకూ చేయను. ఆలోచన ఒకటి నడవకపోతే, ఇంకొకటి ఆలోచిస్తాను. అలా అశాంతితో ఉంటాను. మీరు అందర్నీ కార్టూన్ల ద్వారానే వేళాకోళం చేస్తారు, విమర్శిస్తారు. మరి మీలోని కార్టూనిస్టు మిమ్మల్ని ఎప్పుడైనా విమర్శించాడా? ఆర్.కె: ప్రతిదాన్నీ, ప్రతివాడినీ నేను విమర్శిస్తాను - నన్ను తప్ప. మీ కార్టూనుని, మీ సంపాదకుడు ఎప్పుడైనా కాదన్నాడా? తిరస్కరించాడా? ఆర్.కె: ఎవడూ, నా కార్టూన్ని ఎడిట్ చేయడు. నాకు ఎడిటర్ లేడు. నేను చిత్రించిన కార్టూన్ని మొదట చూసేవాడు నా దగ్గర పనిచేసే వ్యక్తి. నేను ఇచ్చింది తీసుకొని ముద్రణశాఖకు వెళ్తాడు. అక్కడి నుంచి ఆ కార్టూన్ పదకొండు కేంద్రాలకు వెళుతుంది. ఎడిటర్లు, మిగతావాళ్లు తరువాత ప్రింట్లో చూస్తారు. అంతే! అమ్మయ్యో! ఎవరో నా కార్టూన్‌ను కాదనడమే!! -
ఆర్కే లక్ష్మణ్ పరిస్థితి విషమం
-
కుంచెతో యువతకు సందేశం
పెందుర్తి: ‘ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలి. నిత్యం దాని గురించి కలలు కనాలి. దానిని చేరుకునేందుకు నిరంతరం శ్రమించాలి. అప్పుడు ఎలాంటి లక్ష్యమైనా నీ పాదాల చెంతకు చేరుతుంది. నీ స్పూర్తితో మరికొందరు నీ బాటలో నడవాలి’ యువతకు వివేకానందుడు ఇచ్చిన సందేశమిది. దీన్ని అక్షరాల పాటిస్తున్నారు యువ కార్టూనిస్ట్ బి.హరివెంకటరమణ. పెందుర్తి దరి పురుషోత్తపురంలో నివాసం ఉంటున్న హరి రాష్ట్ర, జాతీయ స్థాయిలో కార్టూనిస్ట్‌గా గుర్తింపును పొందారు. అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 వేల కార్టూన్లు, మూడు యానిమేషన్ చిత్రాలు, ఐదు షార్ట్‌ఫిల్మ్‌లు, మూడు డాక్యుమెంటరీలు, నాలుగు పుస్తకాలు రచించారు. 2013లో వివేకానందుని జయంతి సందర్భంగా జాతీయ యూత్ అవార్డు సాధించారు. హరి తన కార్టూన్లతో యువతను మేలుకొల్పేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఆధునిక పోకడలు, పెరిగిన సాంకేతికత, విదేశీ సంస్కృతిపై వ్యామోహం తదితర అంశాలపై తనదైన శైలిలో యువతకు సందేశాన్ని అందిస్తున్నారు. వివేకానందుని వాక్కులే స్ఫూర్తి నేటి యువత టెక్నాలజీని, సోషల్ మీడియాను వేదిక చేసుకుని అద్భుతాలు చేస్తున్నారు. షార్ట్‌ఫిల్మ్‌ల ద్వారా తమ ఆలోచనలను ఆవిష్కరిస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు చాలా వరకు అవి ప్రేమ చుట్టూ తిరుగుతున్నాయి. కానీ వాటికి సామాజిక అంశాలను జత చేసి చూపిస్తే కొంతవరకైనా సమాజంలో మార్పు వస్తుంది. ‘బీ బోల్డ్.. బీ స్ట్రాంగ్’ అన్న స్వామి వివేకానందుని మాటలే నాకు స్ఫూర్తి. కళారంగం ద్వారానే మన ఉద్దేశాన్ని అందరికీ సులభంగా చెప్పవచ్చు. - హరి -
గీత కార్మికుని గ్రాండ్ ప్రిక్స్ స్టోరీ
పామర్తి శంకర్.. ఈ పేరు నిన్నమొన్నటి వరకు ఇండియన్ లోకల్ ఫేం.. ఇప్పుడు వరల్డ్ ప్రీషియస్ నేమ్! ఆ ఫ్రేమ్‌ని అమర్చింది ‘వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ’ అవార్డ్! ఆ కీర్తిని ఈ కార్టూనిస్ట్ అండ్ క్యారికేచరిస్ట్కు అందించింది ఓ గీతలబొమ్మ! ఇలాంటి బొమ్మలకు నెగటివ్సెన్స్ను తప్పించి సెలబ్రిటీ హోదా కల్పించిన ఆ బ్రహ్మ గురించి ఆయన మాటల్లోనే.. ‘వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ అవార్డ్’.. ప్రింట్ మీడియా కార్టూనిస్టులకు ఇంతకు మించిన గొప్ప సత్కారం ఉండదు. ఈ అవార్డ్ కోసం 2009లో మదర్‌థెరిసా క్యారికేచర్‌ను నా ఫస్ట్ ఎంట్రీగా పంపాను. తొలిసారే ‘ఆనరబుల్ మెన్షన్’ వచ్చింది. ఆ ఉత్సాహంతో ఏటా ఎంట్రీలు పంపిస్తూనే ఉన్నాను. అరవై దేశాల కార్టూనిస్ట్‌లు, క్యారికేచరిస్ట్లు పాల్గొనే ఇందులో నాకు థర్డ్ ప్రైజ్ వచ్చినా చాలనుకునేవాడిని. కానీ ఊహించని విధంగా వరల్డ్ కార్టూన్ గ్రాండ్ ప్రీ.. అంటే ఫస్ట్ ప్రైజే వచ్చింది. పోర్చుగల్‌లో దీన్ని బహూకరిస్తారు.ఈ అవార్డుతో నాకు దక్కిన ఇంకో ఆనర్ ఏమిటంటే ఈ జ్యూరీలో నేనూ వన్ ఆఫ్ ది మెంబర్‌గా ఉండడం. గీతే నా రాత మాది నల్లగొండ. మా ఇంటావంటా బొమ్మలు గీయడంలేదు. పైగా బొమ్మలు గీస్తున్నానని మా నాన్న నాలుగుసార్లు ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. ఏ మెకానిక్ పనో నేర్చుకుంటే పైసలు సంపాదించొచ్చని ఆయన సలహా. బొమ్మలే మనసునిండా ఉన్నాక అయ్య మాటలు చెవినెందుకు ఎక్కుతయ్?. అందుకే గీతే నా రాత అనుకున్న.. ప్రాక్టీస్ మొదలుపెట్టిన. మూడో తరగతి నుంచే బొమ్మలు వేస్తుంటి. హైస్కూల్కొచ్చా క సీరియస్‌గా తీసుకున్న. ఆర్టిస్ట్ మోహన్ రాసిన ‘కార్టూన్ కబుర్లు’ పుస్తకాన్ని బాగా చదివాను. ఒకరకంగా ఆయన, శ్రీధర్, సుభానీ, నర్సిం నాకు ఇన్స్పిరేషన్. వివిధ మ్యాగజైన్లలో వచ్చే కార్టూన్స్నీ అబ్జర్వ్ చేసేవాడిని. ది వీక్ కార్టూనిస్ట్ ప్రకాశ్‌శెట్టి చాలా ప్రేరణ. ఆర్ట్‌లో అఆలు నేర్పి, సలహాలిచ్చిం ది రామానుజాచారి, రామచంద్రం, చిత్ర, సుదర్శన్ సార్లు. కార్టూన్... క్యారికేచర్.. స్కూల్లో ఉన్నప్పుడు సరదాగా మా దోస్తులందరివీ క్యారికేచర్స్ వేస్తుంటి. ఆ బొమ్మల్ని చూసి నా ఫ్రెండ్స్ భయపడేవాళ్లు..మన మొఖాల్ని ఖరాబ్ చేస్తాడ్రా అని. నా ఆసక్తి చూసి సుంకి నారాయణరెడ్డి అక్కడ లైబ్రరీలో నా క్యారికేచర్స్తో ఎగ్జిబిషన్ పెట్టించారు. మా ఫ్రెండ్స్ అంతా వచ్చి వాళ్ల వాళ్ల బొమ్మల కాగితాలను చింపుకొని వెళ్లిపోయారు (నవ్వుతూ). హైదరాబాద్.. మీడియా డిగ్రీ అయిపోయాక నల్లగొండలోనే ఓ స్కూల్లో డ్రాయింగ్ టీచర్‌గా చేరా. మూడేళ్లకే ఉద్యోగం బోర్ కొట్టింది. 1995లో హైదరాబాద్ వచ్చేశాను. మోహన్ దగ్గర చేరా. జర్నలిజంలో ప్రవేశం కోసం రచనా జర్నలిజం కాలేజ్‌లో చేరాను. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గోవిందరాజు చక్రధర్ ‘జర్నలిస్ట్ కోసం’ అని రాస్తున్న పుస్తకం కోసం క్యారికేచర్స్ కావాలంటే వేశాను. అవి రామచంద్రమూర్తికి నచ్చి తన కాలమ్కీ వేయాలన్నారు. ఆ పని చేస్తూనే ఇంకొన్ని మ్యాగజైన్స్కూ ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్‌గా పనిచేసేవాడిని. ఆర్థిక అవసరాలు తీరక తిరిగి వెళ్లిపోదామని నాలుగుసార్లు ఊరెళ్తే తమ్ముడు కరెంట్‌రావు నీకు అక్కడే గుర్తింపు ఉంటుందని ధైర్యమిచ్చి హైదరాబాద్ పంపాడు. ‘వార్త’లో చేరి 2002 వరకు పనిచేశాను. ఆపై ఆంధ్రజ్యోతిలో చేరాను. ఆర్ట్‌లో ఉన్న డిస్టార్షన్ నీ బొమ్మల్లో ఉందని లక్ష్మణ్ ఏలె, బి.నర్సింగరావు వందేళ్ల తెలంగాణ ఆర్ట్‌లో నా బొమ్మలకి స్థానమిచ్చి సత్కరించారు. ఫ్రంట్ పేజ్‌లో క్యారికేచర్.. కార్టూన్.. పొలిటికల్ సెటైర్. క్యారికేచర్.. వ్యక్తికి వ్యంగ్యాస్త్రం. ప్యాకెట్ కార్టూన్‌తో సమానంగా క్యారికేచర్కి పత్రికలో ఫ్రంట్‌పేజ్ హోదా కల్పించింది నేను, సరికొండ చలపతి. ఈ దిశగా మమ్మల్ని ప్రోత్సహించిన సార్లు వర్ధెల్లి మురళి, అల్లం నారాయణ . నిజానికి క్యారికేచర్ నెగటివ్సెన్స్కి ప్రతీక. అలాంటి క్యారికేచర్కి ఓ సెలిబ్రిటీ హోదాను తెచ్చాను. నల్ల సూరీడు నెల్సన్మండేలా పోరాటస్ఫూర్తిని ఆయన వ్యక్తిత్వంగా మలచిన క్యారికేచరే ఈ రోజు నాకు వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ అవార్డును తెచ్చిపెట్టింది. సైన్ బోర్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్న నన్ను ప్రపంచానికి పరి చయం చేసింది ఆ క్యారికేచర్ నేచరే. అయితే ఇంతటి ఘనతను సాధించిపెట్టిన ఈ క్యారికేచర్ ఆర్ట్ నా దృష్టిని మార్చింది. ఎవరిని చూసినా వాళ్ల మొహం క్యారికేచర్గానే కనిపిస్తోంది (నవ్వుతూ). రాజ్యం.. లక్ష్మి నా బొమ్మలకు ఫస్ట్ జడ్జి.. బెస్ట్ క్రిటిక్ మా ఆవిడ లక్ష్మి. ఆఫీస్లోనైతే నేను గీసిన బొమ్మను ఫస్ట్ ఆఫీస్ బాయ్స్‌కి చూపిస్తా. వాళ్లకు నచ్చితే జనసామాన్యానికీ అర్థమైనట్టే కదా. అట్లాగే మా అమ్మ రాజ్యం.. తను నా బొమ్మల్లో ఎంత ఇన్వాల్వ్ అయిందంటే.. మా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ల ముఖకవళికలు కాస్త భిన్నంగా ఉంటే చాలు మెల్లగా నా వెనక్కి వచ్చి ‘ఒరేయ్.. ఈయన క్యారికేచర్ వేస్తే బాగుంటది కదా’ అని నా చెవిలో చెప్తుంది. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ. చేస్తున్న పనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే చాలు పర్ఫెక్షన్ అదే వస్తుంది. అదే పేరూ తీసుకొస్తుంది. - శరాది -
కార్టునాభిషేకం
-
రామభక్త హనుమాన్.. మన బాపు!
ప్రఖ్యాత కార్టూనిస్టు, చిత్రకారుడు, దర్శకుడు, రచయిత అయిన సత్తిరాజు లక్ష్మీనారాయణ.. అదే మన బాపు గారికి శ్రీరాముడన్నా, ఆంజనేయుడన్నా ఎక్కడలేని భక్తి ప్రపత్తులున్నాయి. ఈ విషయం పలు సందర్భాలలో తేటతెల్లం అయ్యింది. తాను గీసిన ఒకానొక పెయింటింగ్‌లో కూడా శ్రీరాముడు సీతమ్మ వారికి పర్ణశాలలో ఉన్నప్పుడు కుంచెతో పారాణి దిద్దుతున్నట్లు బాపు చూపించారు. అందులోనూ.. ఆంజనేయుడి వేషంలో తాను స్వయంగా ఉన్నట్లు చూపించుకుంటూ తానే స్వయంగా రంగులను శ్రీరాముడికి అందిస్తున్నట్లుగా అందులో చిత్రీకరించారు. 'ఆది చిత్రకారుడైన మా గురువుగారు' అంటూ.. శ్రీరాముడిని తన గురువుగాను, ఆది చిత్రకారుడి గాను ప్రస్తావించారు. ఇక తాను రాసిన 'రామాయణ విషవృక్షం' పుస్తకానికి కవర్ పేజీ బొమ్మ వేయాల్సిందిగా ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ బాపు గారిని కోరుతూ.. ముందస్తుగానే ఒక చెక్కు కూడా పంపించారట. అయితే, ఆ చెక్కు వెనకాల 'రామ.. రామ' అని రాసి బాపు గారు తిప్పి పంపారట. ఈ విషయాన్ని స్వయంగా రంగనాయకమ్మే చెప్పుకొన్నారు కూడా. ఇలా రామభక్తి విషయంలో బాపు ఎలాంటి తరుణంలోనూ వెనుకాడలేదు. -
‘చాచా చౌదరి’ ప్రాణ్ ఇక లేరు!
సుప్రసిద్ధ భారతీయ కామిక్ క్యారెక్టర్ చాచాచౌదరి సృష్టికర్త ప్రాణ్ బుధవారం గుర్గావ్లో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. క్యాన్సర్‌తో బాధపడ్తూ ఆస్పత్రిలో చేరిన ఆయన గుండెపోటుతో మరణించారని ప్రాణ్ కుమార్తె తెలిపారు. ఎర్రటి తలపాగా ధరించిన బక్కపలచటి మనిషి చాచాచౌదరి, భీమబలుడు అయిన అతని అనుచరుడు సాబూ పాత్రలతో ప్రాణ్ భారతీయ కామిక్ చరిత్రలో అద్భుతాన్ని సృష్టించారు. చాచాచౌదరి బుద్ధి బలం, సాబూ బాహుబలం కలిసి అతి క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తుంటారు. భారతీయ మధ్య తరగతి విలువలతో, గ్రామీణ నేపథ్యంలో ఆయన రూపొందించిన పాత్రలు దేశంలో అన్ని వయసులవారిని అలరించడమే కాక విదేశీ కార్టూన్ క్యారెక్టర్ల ధాటికి తట్టుకుని నిలిచాయి. దేశవిభజనకు ముందు లాహోర్ వద్దనున్న కసూర్‌లో 1938లో జన్మించిన ప్రాణ్‌కుమార్ శర్మ ఢిల్లీకి చెందిన మిలాప్ దినపత్రికలో కార్టూనిస్ట్‌గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1969లో లట్పట్ అనే హిందీ పత్రిక కోసం ఆయన సృష్టించిన చాచాచౌదరి అనే కార్టూన్ క్యారెక్టర్ ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగింది. చాచాచౌదరికి తోడుగా ఆయన సాబూ, పింకీ, శ్రీమతీజీ, బిల్లూవంటి అనేక పాత్రలను సృస్టించారు. పాశ్చాత్య కార్టూన్ పాత్రల్లాగ వీటికి అద్భుత శక్తులేవీ లేకపోయినా అవి చిరుదొంగల నుంచి ఉగ్రవాదుల వరకు పలురకాల దుష్టశక్తులను తుదముట్టించేవి.. చాచాచౌదరి కామిక్ పుస్తకాలే కాక, టీవీ సీరియల్ కూడా ప్రజాదరణ పొందింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ ఆయనను 2001లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. భారత్‌లో కార్టూన్లకు ప్రజాదరణ కల్పించినందుకు ఆయనకు 1995 లిమ్కా బుక్‌లోనూ చోటు దక్కింది. -
నవ్విస్తూనే చురకలేసే.. కార్టూనిస్ట్
అప్‌కమింగ్ కెరీర్ : మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పత్రికల్లో తనపై వచ్చిన కార్టూన్లను కత్తిరించి, దాచుకొనేవారట. ప్రముఖ పొలిటికల్ కార్టూనిస్ట్ ఆర్.కె.లక్ష్మణ్ కుంచె నుంచి జాలువారిన ‘కామన్ మ్యాన్’ విగ్రహంగా మారి, కార్టూనిస్ట్‌ల గౌరవం పెంచాడు. మనదేశంలో అన్ని భాషల్లో ప్రసార మాధ్యమాలు విస్తరిం చడంతో కార్టూనిస్ట్‌లకు గిరాకీ పెరిగింది. వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, టీవీ ఛానళ్లు వంటి వాటిలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. వార్తాపత్రికల్లో పనిచేసే కార్టూనిస్ట్ లు జర్నలిస్టుల కంటే ఎక్కువ పాపులర్ కావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం యానిమేషన్, గ్రాఫిక్స్, అడ్వర్టైజ్ మెంట్ రంగాలు, ఇంటర్నెట్, కామిక్స్ బుక్స్ ప్రచురణ సంస్థల్లోనూ కార్టూనిస్ట్‌లకు మంచి డిమాండ్ ఉంది. పాఠకులకు నాలుగు కాలాలపాటు గుర్తుండిపోయే కార్టూన్ వేయడం ఒక కళ. దీనికి ఎంతో ఊహా శక్తి, పరిశీలనా నైపుణ్యాలు ఉండాలి. నిత్య జీవితంలో జరిగే సంఘటనల నుంచి తనకు పనికొచ్చే అంశాన్ని గుర్తించగల నేర్పు ఉండాలి. కార్టూన్ల ప్రధాన ఉద్దేశం.. నవ్విస్తూనే సున్నితంగా చురకలేయడం. కాబట్టి హాస్యరసాన్ని కాచి వడబోసిన వారే మంచి కార్టూనిస్ట్‌గా త్వరగా గుర్తింపు పొందగలుగుతారు. మనదేశంలోని విద్యాసంస్థల్లో కార్టూన్ల కోసం ప్రత్యేకంగా కోర్సులు లేకపోయినా పెయింటింగ్‌లో భాగంగా వీటిపై శిక్షణ ఇస్తున్నారు. ఫైన్ ఆర్ట్స్ సంస్థల్లో పెయింటింగ్ కోర్సులు ఉన్నాయి. అర్హతలు కార్టూనిస్ట్‌గా కెరీర్లో స్థిరపడాలనుకొనేవారికి పదో తరగతి, ఇంటర్మీయెట్ పూర్తిచేసిన తర్వాత పూర్తిస్థాయి డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి. కొన్ని సంస్థలు స్వల్పకాలిక కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేతనాలు ఫ్రీలాన్స్ వర్క్ చేస్తే ఒక్కో కార్టూన్‌కు రూ.250 నుంచి రూ.2000 వేల వరకు అందుకోవచ్చు. వార్తాపత్రిక లేదా మేగజైన్లో చేరితే ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా వేతనం లభిస్తుంది. కార్టూనిస్ట్(పెయింటింగ్) కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.jnafau.ac.in సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వెబ్సైట్: http://teluguuniversity.ac.in సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్-ముంబై వెబ్సైట్: www.mu.ac.in కళ నిత్యనూతనం ‘‘కళాత్మకమైన కోర్సులన్నీ నిత్యనూతనమే. అయితే మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ కావటంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఎంతబాగా సృజనాత్మకతను ప్రదర్శించగలిగితే కళాకారుడికి అంత గొప్ప పేరు, ప్రఖ్యాతులు వస్తాయి. చిత్రకళలో అవకాశాలకు కొదవలేదు. ఎప్పటికప్పుడు ప్రతిభను నిరూపించుకోవడం పైనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. కార్టూనిస్ట్‌లు టీచర్స్‌గా, ఫ్రీలాన్సర్లుగా, మీడియా రంగంలో దేశ, విదేశాల్లో పనిచేయవచ్చు’’ - కప్పరి కిషన్, ఆర్ట్ ఇన్స్ట్రక్టర్, తెలుగు విశ్వవిద్యాలయం -
కార్టూనిస్టు శేఖర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కార్టూనిస్టు కంబాలపల్లి శేఖర్ (49) అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన శేఖర్ విద్యార్థి దశ నుంచే కార్టూన్లు గీసేవారు. 1989లో పాత్రికేయ రంగంలో వెలుగులోకి వచ్చిన ఆయన.. ప్రజాశక్తి, ఆంధ్రప్రభల్లో కార్టూనిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేస్తున్న శేఖర్.. కొంతకాలంగా జీర్ణకోశ సంబంధ కేన్సర్‌తో బాధపడుతున్నారు. రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు. ఆదివారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా... చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. శేఖర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కార్టూన్లలో తనదైన బాణి కలిగి, సామాజిక స్పృహను ప్రతిబింబించే కార్టూన్లు వేసిన శేఖర్ మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు, జర్నలిస్టు సంఘాల నేతలు పేర్కొన్నారు.