సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యాలను తన కుంచె ద్వారా ఎత్తిచూపిన కార్టూనిస్టు బాలాను తమిళనాడు సర్కార్ అరెస్టు చేయడాన్ని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు గొడ్డలిపెట్టని ఐజేయూ అధ్యక్షుడు ఎస్.ఎన్.సిన్హా, సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారి బెదిరింపులు తాళలేక ఒక వ్యక్తి, భార్య, ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి తరునెల్వేలి కలెక్టరేట్ వద్ద నిప్పు అంటించుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై తమిళనాడు సీఎం, తిరునెల్వేలి కలెక్టర్, ఇతర పోలీసులపై బాలా వేసిన వ్యంగ్య కార్టూన్ ఫేస్‌బుక్‌లో వైరల్ అయింది. వైఫల్యాల్ని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కలెక్టర్ ఫిర్యాదు మేరకు బాలాపై కేసు పెట్టి జైలుపాలు చేయడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే అవుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment