IJU
-
ఐజేయూ అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడిగా ప్రజాపక్షం తెలుగు దినపత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఐజేయూ అధ్యక్షుడిగా ఉన్న దేవులపల్లి అమర్ ఇటీవల ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా నియమితులైన నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాజీ నామా చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఐజే యూ జాతీయ కార్యవర్గ కమిటీ అత్యవసర సమా వేశం అమర్ రాజీనామాను ఆమోదించింది. తర్వాత ఎన్నికలో ఐజేయూ అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌గా బల్విందర్ సింగ్ (జమ్మూ) ఎన్నికయ్యారు. బల్విందర్ సింగ్ పంజాబ్ ట్రిబ్యూన్ స్పెషల్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. -
ఐజేయూ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దేవులపల్లి అమర్
సాక్షి, అమృత్సర్ : ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ)అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్ బాధ్యతలు చేపట్టారు. శని, ఆదివారాలు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన ఐజేయూ 9వ మహాసభలో ఎస్. ఎన్ సిన్హా నుంచి అమర్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీకి చెందిన సబినా ఇంద్రజిత్ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. జాతీయ కార్యవర్గానికి ఈరోజు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ నుంచి వై. నరేందర్ రెడ్డి కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నగునూరి శేఖర్, కె.సత్యన్నారాయణ ఎన్నికయ్యారు. ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా స్థానిక సంస్థలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియా స్వతంత్ర్యంగా, నిర్భయంతో పనిచేయాలన్నారు. -
భయభ్రాంతులకు గురిచేస్తున్నారు: ఐజేయూ
సాక్షి, హైదరాబాద్ : పుణే పోలీసులు విచారణ పేరుతో హైదరాబాద్‌లో జర్నలిస్టులు, ప్రజాసంఘాల నేతల ఇళ్లపై దాడులు జరపడమే కాకుండా, అక్రమ అరెస్టులకు పాల్పడటం సహించరానిదని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు దేవులపల్లి అమర్ అన్నారు. పీసీఐ కమిటీ పర్యటనలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న అమర్ ఈ సంఘటనపై స్పందించారు. పౌర హక్కుల నాయకులను, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసి మీడియా స్వేచ్ఛను, భావప్రకటనా స్వేచ్ఛను హరించడానికే పోలీసులు పథకం ప్రకారం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అమర్ స్పష్టం చేశారు. పోలీసుల చర్యను ఖండిస్తున్నాం: టీయూడబ్ల్యూజే మోదీపై హత్య కుట్రను ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు గతంలో చేసిన ప్రకటనపై విశ్వాసం లేకుండా పోయినందువల్లే, తమ ఉనికిని చాటుకోవడానికి ప్రజాసంఘాల ప్రముఖులు వరవరరావు, కూర్మనాథ్, టేకుల క్రాంతి ఇళ్లపై పుణే పోలీసులు దాడులకు పాల్పడ్డారని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్లూజే) అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌అలీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలు అని పేర్కొన్నారు. పోలీసు చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. అరెస్టులు సరికాదు: టీయూడబ్ల్యూజే మోదీ హత్యకు కుట్ర పేరుతో పుణే పోలీసులు విరసం నేత వరవరరావును అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని, జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి ఇళ్లలో అక్రమంగా సోదాలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఒక ప్రకటనలో తెలిపింది. సెర్చ్ వారంట్ లేకుండా సోదాలు నిర్వహించడం అక్రమమని యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ, క్రాంతి పేర్కొన్నారు. -
ఐజేయూ కొత్త అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్
-
ఐజేయూ అధ్యక్షునిగా దేవులపల్లి అమర్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ జర్న లిస్ట్‌ల యూనియన్(ఐజేయూ) కొత్త అధ్యక్షునిగా దేవులపల్లి అమర్, సెక్రటరీ జనరల్‌గా సబీనా ఇంద్రజిత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐజేయూ –2018 ఎన్నికల అధికారి ప్రేమ్‌నాథ్ భార్గవ ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో జరగ నున్న ఇండియన్ జర్నలిస్టుల యూని యన్ ప్లీనరీలో వీరు పదవీ బాధ్య తలు స్వీకరిస్తారు. హైదరాబాద్ కేం ద్రంగా పనిచేస్తున్న దేవులపల్లి అమర్ జర్నలిజం వృత్తిలోనూ, ట్రేడ్ యూని యన్ కార్యకలాపాల్లోనూ 42 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. ఆయన ప్రస్తుతం సాక్షి టీవీలో కన్స ల్టింగ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. 1976 లో ఈనాడు దినపత్రిక ద్వారా జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించిన అమర్ ఆ తరువాత వివిధ దినపత్రి కలలో వివిధ హోదాల్లో పని చేశారు. ప్రజాతంత్ర పత్రిక వ్యవస్థాపక సంపా దకుడు కూడా అయిన అమర్ రెండు సార్లు ఏపీ ప్రెస్ అకాడమీ అధ్యక్షు డిగా వ్యవహరించారు. ఆయన ప్రస్తు తం ఐజేయూ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. సబీనా ఇంద్రజిత్ ఢిల్లీలో ఇండియన్ న్యూస్ అండ్ ఫీచర్స్ ఏజె న్సీ(ఇన్ఫా)లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఇన్ఫా సంస్థ స్థాపకులు, ప్రముఖ సంపాదకుడు దుర్గాదాస్ మనుమరాలు. ప్రముఖ పార్లమెంటేరియన్, జర్నలిస్ట్ ఇంద్ర జిత్ కుమార్తె. సబీనా ప్రస్తుతం బ్రస్సె ల్స్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జా తీయ జర్నలిస్ట్ సమాఖ్య (ఐఎఫ్‌జే) ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. అమర్, సబీనాల ఎన్నిక పట్ల పదవీ విరమణ చేయనున్న ఐజేయూ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హా, ఐజేయూ మాజీ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ రెడ్డి , మరో సీనియర్ నేత అమర్నాథ్ వారికి అభినందనలు తెలిపారు. -
ఆమరణ దీక్షకు ఐజేయూ ప్రెసిడెంట్ సిన్హ మద్దతు
-
భావప్రకటనా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యాలను తన కుంచె ద్వారా ఎత్తిచూపిన కార్టూనిస్టు బాలాను తమిళనాడు సర్కార్ అరెస్టు చేయడాన్ని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు గొడ్డలిపెట్టని ఐజేయూ అధ్యక్షుడు ఎస్.ఎన్.సిన్హా, సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారి బెదిరింపులు తాళలేక ఒక వ్యక్తి, భార్య, ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి తరునెల్వేలి కలెక్టరేట్ వద్ద నిప్పు అంటించుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై తమిళనాడు సీఎం, తిరునెల్వేలి కలెక్టర్, ఇతర పోలీసులపై బాలా వేసిన వ్యంగ్య కార్టూన్ ఫేస్బుక్లో వైరల్ అయింది. వైఫల్యాల్ని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కలెక్టర్ ఫిర్యాదు మేరకు బాలాపై కేసు పెట్టి జైలుపాలు చేయడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే అవుతుందని పేర్కొన్నారు. -
గౌరీలంకేశ్ హత్యపై దిగ్భ్రాంతి
తీవ్రంగా ఖండించిన జర్నలిస్టు సంఘాలు సర్వత్రా పెల్లుబుక్కుతున్న నిరసన న్యూఢిల్లీ: ప్రముఖ కన్నడ జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యంత కిరాతకంగా జరిగిన ఆమె హత్యపై పాత్రికేయ లోకం భగ్గుమంటోంది. ఆమెను కాల్చిచంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. గౌరీలంకేశ్ హత్యను ఐండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) ఖండించింది. గౌరీ హత్య ప్రజాస్వామ్యంపై దాడిగా చూడాలని పేర్కొంది. ఇలాంటి దాడులను జర్నలిస్టులంతా ముక్తకంఠంతో ఖండించాలని ఐజేయూ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హా, ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ పిలుపునిచ్చారు. గౌరీలంకేశ్ హత్యపై ఎడిటర్స్ గిల్డ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసి.. అసమ్మతి వాదాన్ని వినిపించిన ఆమెను హత్య చేయడమంటే.. భావప్రకటనా స్వేచ్ఛపై కిరాతకంగా దాడిచేయడమేనని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. -
హత్యకు గురైన జర్నలిస్టులకు ఘన నివాళి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇంటర్నేషనల్ డే అగనిస్ట్ ఇంప్యూనిటీ ఆన్ క్రైమ్స్ అగనిస్ట్ జర్నలిస్ట్స్ సందర్భంగా హత్యకు గురైన జర్నలిస్టులకు దేశ వ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు.వృత్తిలో ప్రాణాలు విడిచిన జర్నలిస్టులను స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని భారతీయ జర్నలిస్టుల సంఘం(ఐజేయూ), ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)లు దేశ వ్యాప్తంగా జర్నలిస్టులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా నవంబర్ 2న జర్నలిస్టుల రక్షణా దినోత్సవాన్ని జరుపుకోవాలనే యూఎన్ నిర్ణయాన్ని 2015లో పీసీఐ ఆమోదించింది. ఈ మేరకు ఐజేయూ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో రోజు రోజుకూ జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయని ఐజేయూ, అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్(ఐఎఫ్ జే)లు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ నలుగురు జర్నలిస్టులు వృత్తిపరమైన కారణాల వల్ల హత్యకు గురవగా.. గతేడాది ఎనిమిది మంది ఇలానే బలయ్యారు. గత రెండున్న దశాబ్దాల్లో హత్యకు గురైన జర్నలిస్టుల సంఖ్య 100కు పైగానే ఉంది. వీటిలో 94 శాతం కేసులు కోర్టులో పెండింగ్ లోనో లేక సరైన ఆధారాలు లేక కేసు నిలబడక పోవడమో జరుగుతోంది. ప్రజలకు నిజానిజాలను తెలియజేసే క్రమంలో జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావాలి. జర్నలిస్టులపై దాడికి పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని ప్రకటనలో పేర్కొన్నాయి. కాగా, సీనియర్ జర్నలిస్టు ఎస్ నిహాల్ సింగ్ ను రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు 2016కు ఎంపిక చేసినట్లు పీసీఐ ప్రకటించింది. ఈ నెల 16న నిహాల్ కు అవార్డుతో పాటు రూ.లక్ష నగదును అందజేయనున్నట్లు తెలిపింది. -
కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
వంటావార్పుతో వినూత్న నిరసన సంఘీభావం తెలిపిన వివిధ పార్టీల నాయకులు హన్మకొండ అర్బన్ : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం టీడీడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిచారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా, వంటా వార్పు చేపట్టి నిరసన తెలిపారు. తుమ్మ శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరి గిన కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు దాసరి కృష్ణారెడ్డి, వల్లాల వెంకటరమణ, కేకే, మిద్దెల రంగనాథ్, గాడిపెల్ల మధు, కంకణాల సంతోష్, బుచ్చిరెడ్డి సునీల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు అందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని, డబుల్ బెడ్రూం ఇళ్లు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉదయంనుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన ఆందోళనలో వంటావార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ, కట్ల శ్రీనివాస్‌రావు, ఈ.వీ.శ్రీనివాస్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క, సీపీఐ, సీపీఎం నాయకులు శ్రీనివాస్‌రావు, వాసుదేవరెడ్డి, చక్రపాణి, తదితరులు సంఘీభావం తెలిపారు. అనంతరం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం నాయకులు డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. -
మీడియా ద్వారానే ప్రజాస్వామ్యం
* అమెరికా కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ వెల్లడి * ఐజేయూ ఆధ్వర్యంలో ‘విస్తరిస్తున్న మీడియా- జర్నలిస్టుల నైతిక విలువల’పై చర్చ సాక్షి, హైదరాబాద్: ప్రజలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని, అలాంటి వాతావరణం మీడియా ద్వారానే సాధ్యమని అమెరికా కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ పేర్కొన్నారు. మీడియా చైతన్యం లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో ‘విస్తరిస్తున్న మీడియా- జర్నలిస్టుల నైతిక విలువలు’ అనే అంశంపై చర్చ నిర్వహించారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మైఖేల్ ముల్లిన్స్తోపాటు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు కె.అమరనాథ్, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్, హిందూ బిజినెస్‌లైన్ డిప్యూటీ ఎడిటర్ ఎం.సోమశేఖర్, ప్రొఫెసర్ పి.వినోద్ తదితరులు పాల్గొన్నారు. బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే మీడియా వాతావరణం పారదర్శకంగా, స్వేచ్ఛగా ఉండాలని మైఖేల్ ముల్లిన్స్ పేర్కొన్నారు. మీడియా ఏదైనా సమాచారాన్ని అందించడమే కాదు.. ఆ ఘటన ఎందుకు జరిగింది, అందులో ఉన్న మర్మమేమిటి, దానిపై ప్రభుత్వం, పౌర సమాజం ఏమని భావిస్తున్నాయనే అంశాలను కూలంకషంగా వివరిస్తుందని చెప్పారు. చాలా దేశాల్లో ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పత్రికల మూసివేత, వార్తల పట్ల సెన్సార్ విధించడం, సరైన వేతనాలు చెల్లించకుండా వేధింపులకు గురిచేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. వ్యతిరేక వార్తలు రాసేవారిపై భౌతిక దాడులకు దిగుతున్న ఘటనలూ చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. విపరీత పోకడల వల్ల వృత్తికే ఇబ్బంది: ఎమ్మెల్సీ రామచంద్రరావు మీడియా వృత్తి ఆహ్వానించదగినదేగానీ, విపరీత పోకడల వల్ల వృత్తికే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. కావాలంటే పత్రిక పాలసీకి తగినట్లుగా ఎడిటోరియల్ పేజీలో అభిప్రాయాలు చెప్పుకోవచ్చన్నారు. స్టింగ్ ఆపరేషన్ల పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదని వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ మీడియాను స్వీయ నియంత్రణలో ఉంచడానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాదిరి ఒక వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. చెల్లింపు వార్తలు ప్రజాస్వామ్యానికి చేటని, వాటిని నిలువరించాలని కోరారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించే అంశం చాలా కాలం నుంచి నానుతోందని, ఈ విషయమై ప్రభుత్వాలు ఆలోచన చేయాలని కమ్యూనిటీ మీడియా యునెస్కో చైర్మన్, ప్రొఫెసర్ వినోద్ పావురాల అభిప్రాయపడ్డారు. కమ్యూనిటీ రేడియో వంటి ప్రసార సాధనాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. అమెరికాలో సీఐఏ అధికారులు లాడెన్‌ను కాల్చిచంపిన పోస్టులను రీట్వీట్ చేసిన అంశంపై అక్కడి మీడియా రక్షణ శాఖను ప్రశ్నించిందని, అలాంటి పరిస్థితులు భారత్‌లో కూడా రావాలని ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. అమెరికాలో స్టింగ్ ఆపరేషన్ చేస్తే అక్కడి ప్రభుత్వాలు మీడియా సలహాలు సూచనలు స్వీకరిస్తాయని... అలాంటి పరిస్థితి భారత్‌లో లేదని ఎం.సోమశేఖర్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో మీడియాకు ఇస్తున్న స్వేచ్ఛ, ప్రాధాన్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. -
అక్రెడిటేషన్ల జారీలో జర్నలిస్టులకు అన్యాయం
ఐజేయూ, టీయూడబ్ల్యూజే నేతల ఆరోపణ * అక్రెడిటేషన్ కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీలో రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఇండియన్ జర్నలిస్టు యూనియన్(ఐజేయూ), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి కమిటీ రూపొందించిన అసలు నివేదికలోని కీలకాంశాలను మార్చేసి సీఎం కేసీఆర్‌కు తప్పుడు నివేదిక సమర్పించిందని ఆరోపించాయి. నివేదికను టైపింగ్ చేసే సమయంలో పలు అంశాలను తారుమారు చేశారని, అసలు నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశాయి. జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డుల జారీ అంశంపై ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, మాజీ సెక్రటరీ జనరల్ కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే కార్యదర్శి వి.విరాహత్ అలీ, హెచ్‌జేయూ అధ్యక్షుడు కె.కోటిరెడ్డి గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో అక్రెడిటేషన్ కమిటీ తీరును దుయ్యబట్టారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలు, పాత జీవోలను కాదని అక్రెడిటేషన్ల కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు జారీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నా, అక్రెడిటేషన్ కమిటీ తీరుతో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం ప్రకారం ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టులతోపాటు ఆర్టిస్టులూ జర్నలిస్టులేనని, అందరికీ అక్రెడిటేషన్ కార్డులను జారీ చేయాల్సి ఉండగా.. అక్రెడిటేషన్ కమిటీ మోకాలడ్డుతోందని ఆరోపించారు. కమిటీ సిఫారసుల మేరకే అక్రెడిటేషన్లు: అల్లం రామచంద్రమూర్తి కమిటీ నివేదికను తూచ తప్పకుండా అనుసరిస్తూ అక్రెడిటేషన్ దరఖాస్తుల స్క్రూటినీ నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. డెస్క్, ఆర్టిస్టు, స్కానర్స్ లాంటి వారికి అక్రెడిటేషన్లు ఇవ్వడానికి కూడా కమిటీకి అభ్యంతరం లేదన్నారు. అక్రెడిటేషన్ల కమిటీపై టీయూడబ్ల్యూజే, ఐజేయూ నేతల ఆరోపణలను ఖండిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. పద్ధతి ప్రకారమే అక్రెడిటేషన్లు: క్రాంతి, పల్లె రవి జర్నలిస్టులకు ప్రభుత్వం అందజేసే అక్రిడిటేషన్ల ప్రక్రియ నిబంధనల మేరకే జరుగుతున్నా... ఒక జర్నలిస్టు యూనియన్ తప్పుడు ప్రచారం చేస్తోందని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సీహెచ్ క్రాంతికిరణ్, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్రెడిటేషన్ కమిటీపై అపోహలు సృష్టించి, బురద చల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లయితే.. ఆ ఆరోపణలు చేస్తున్న యూనియన్‌కు చెందిన ఇద్దరు సభ్యులు కూడా కమిటీలో ఉన్నారని, వారెందుకు అడ్డగించలేదని ప్రశ్నించారు. రామచంద్రమూర్తి కమిటీ సిఫారసుల మేరకే కార్డుల జారీ జరుగుతుందన్నారు. -
టీ న్యూస్‌కు ఏపీ నోటీసులు పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి
గవర్నర్‌కు జర్నలిస్టు సంఘాల నేతల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: టీ న్యూస్ చానల్‌కు ఏపీ పోలీసులు అర్ధరాత్రి వేళ నోటీసులిచ్చి పత్రికా స్వేచ్ఛపై దాడి చేశారని వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు, పాత్రికేయులు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. న్యూస్ చానళ్లకు, టీవీ ప్రసారాలకు కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టం వర్తించదని, కేబుల్ ఆపరేటర్స్‌కు సంబంధించిన ఈ చట్టంపై పక్కరాష్ట్రం పోలీసులు నోటీసులు జారీ చేయడం చట్టాలను ఉల్లంఘించడమేనని గవర్నర్‌కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి, జై తెలంగాణ సీఈవో క్రాంతికిరణ్, వివిధ పాత్రికేయ సంఘాల నేతలు కె.విరాహత్ అలీ, బి.బసవపున్నయ్య, పల్లె రవికుమార్, ఎస్.వినయ్‌కుమార్ తదితరులు గవర్నర్‌ను కలిశారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ‘ఆడియో వెర్షన్’ను ప్రసారం చేసినందుకు వైజాగ్ ఏసీపీ రమణ టీ న్యూస్ కార్యాలయంలోకి చొరబడి నోటీసులు జారీ చే శారని వివరించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం అల్లం నారాయణ, శేఖర్‌రెడ్డి, ఆర్. దిలీప్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను అడ్డుకోవడం ద్వారా నిజాలను దాచలేరన్నారు. తనకు చుట్టుకున్న ఉచ్చును హైదరాబాద్‌కు చుట్టాలని బాబు చూస్తున్నారన్నారు. -
జర్నలిస్టులందరికీ హెల్కార్డులకు మంత్రి హామీ
హైదరాబాద్ : జర్నలిస్టుల హెల్త్‌కార్డులపై మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారమిక్కడ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం ఐజేయూ నేత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అక్రిడేషన్‌తో సంబంధం లేకున్నా జర్నలిస్టులందరకీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. నవంబర్ నెలాఖరు నాటికి హెల్త్‌కార్డుల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ప్రీమియం వెయ్యి నుంచి 2వేల వరకూ ఉంటుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
చంద్రబాబు తీరును ఖండించిన IJU
-
'సాక్షి'పై మారని చంద్రబాబు తీరు
-
'సాక్షి'పై మారని చంద్రబాబు తీరు
సాక్షి సహా కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులకు తిరస్కారం తీవ్రంగా ఖండించిన ఐజేయూ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశా నికి ‘సాక్షి’ మీడియా సంస్థల ప్రతినిధులను ఆహ్వానించి, తీరా వారిని లోపలి కి అనుమతించకపోవడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. చంద్ర బాబు విలేకరుల సమావేశాలకు కొన్ని పత్రికలు, కొన్ని చానళ్లను అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇండియన్ జర్నలిస్టు యూనియన్ సెక్రటరీజనరల్ దేవులపల్లి అమర్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.సోమసుందర్, ఐవీ సుబ్బారావు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.శేఖర్, విరాహత్ అలీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె.అమరనాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వం కొన్ని మీడియా సంస్థలను అనుమతించకపోవడం పూర్తి అప్రజాస్వామికమన్నారు. సాక్షి దినపత్రిక, సాక్షి న్యూస్ చానల్, నమస్తే తెలంగాణ పత్రిక, టీన్యూస్ చానల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ ఆహ్వానాలు పంపినా, ముఖ్యమంత్రి విలేకరుల సమావేశాలకు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడం సరైంది కాదన్నారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని ఇటీవల జరిగిన సంపాదకుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఐజేయూ జాతీయ నాయకుడు కె.శ్రీనివాసరెడ్డికి హామీ కూడా ఇచ్చారని గుర్తుచేశారు. అయినా, అదే మళ్లీ పునరావృతం కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామనిచెప్పారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మార్కేండయ కట్జూ దృష్టికి ఈ విషయం తీసుకెళతామన్నారు. -
'సాక్షి'పై కక్ష సాధింపు తగునా?
సమన్యాయం అంటూ సుద్దులు వల్లించే చంద్రబాబు ఆచరణలో మాత్రం సొంత ఎజెండానే అమలు చేస్తున్నారు. మాటలకు చేతలకు పొంతన లేకుండా ముందుకెళుతున్నారు. సాక్షి మీడియాపై పక్షపాత వైఖరిని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాధినేతగా అందరిని సమాన దృష్టితో చూడాల్సిన చంద్రబాబు సాక్షిపై సమయం దొరికినప్పుడల్లా అక్కసు వెళ్లగక్కుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు, ఆంగ్ల దినపత్రికల సంపాదకులకు చంద్రబాబు సోమవారం విందు ఇచ్చారు. ‘సాక్షి’ సంపాదకులను ఈ విందుకు ఆహ్వానించకుండా తన పక్షపాత వైఖరి ప్రదర్శించారు. టీడీపీ కార్యక్రమాలకు ఇప్పటికే సాక్షి మీడియాను ఆహ్వానించడం మానుకున్న ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకూ దూరంగా పెట్టడం శోచనీయం. తమకు అనుకూలంగా వ్యహరించలేదన్న కారణంతో 'సాక్షి'పై పచ్చ పార్టీ అధినేత కక్ష సాధిస్తున్నారు. ఇందులో భాగంగా తమ పార్టీ కార్యక్రమాలను కవర్ చేయకుండా నిషేధం విధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వైఖరి మారలేదు. ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి ఈవిధంగా కక్ష సాధింపు చర్యలకు దిగడం తగునా? సాక్షి మీడియా పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) తప్పుబట్టింది. ఇకనైనా చంద్రబాబు మారతారో, లేదో చూడాలి. -
బాబుపై ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు
తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాపై కక్ష సాధింపునకు పాల్పడటం దారుణమని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఆందోళన వ్యక్తం చేసింది. తిరుపతిలో జరిగిన ఐజేయూ కార్యవర్గ సమావేశంలో ఎనిమిది తీర్మానాలు చేసింది. 'సాక్షి' దినపత్రిక, మీడియా పట్ల చంద్రబాబు వైఖరిని ఐజేయూ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి అధికారిక ప్రెస్మీట్లకు సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్ ప్రతినిధులను హాజరు కానీయకుండా భద్రతా సిబ్బంది ద్వారా అడ్డుకోవటం దారుణమని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హా, జాతీయ ప్రధాన కార్యదర్శి డి.అమర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ నుంచి సాక్షి ప్రతినిధులకు ఆహ్వానాలు అందుతున్నాయి, ఆహ్వానం ఉన్నా మీడియా ప్రతినిధుల్ని అడ్డుకోవటం సరికాదన్నారు. ఈ వైఖరిని మీడియాపై దాడిగా అభివర్ణిస్తున్నామన్నారు. ఐజేయూ సమావేశంలో మీడియా పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ల తీరును చర్చించినట్లు తెలిపారు. చంద్రబాబుపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. -
ఆ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలి
ఐజేయూ, టీయూడబ్ల్యూజే టీవీ9 కార్యక్రమంపై ఖండన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్ల ప్రసారాలను నిలిపివేస్తూ తెలంగాణ ఎంఎస్ఓల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్(ఐజేయూ), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్ల్యూజే) ఖండించాయి. ఈ నిర్ణయం భావ ప్రకటనా స్వేచ్ఛకు, సమాచారాన్ని తెలుసుకునే హక్కుకు విఘాతం కలిగిస్తున్నదని ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. శేఖర్, విరాహత్ అలీలు సోమవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. టీవీ చానళ్లలో ప్రసార నాణ్యత, మంచీ చెడ్డలను నిర్ణయించే అధికారాలను సొంతం చేసుకునే ప్రయత్నాలను ఎంఎస్ఓలు విరమించుకొని, తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించాలని కోరారు. ప్రజాప్రతినిధుల పట్ల టీవీ-9 ప్రసారం చేసిన కార్యక్రమాన్ని ఐజేయూ, టీయూడబ్ల్యూజే ఖండిస్తున్నాయని పేర్కొన్నారు. -
త్వరలో టీయూడబ్ల్యూజే: దేవులపల్లి అమర్
కరీంనగర్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరగనున్న తరుణంలో త్వరలోనే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆవిర్భవించనున్నట్లు ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ తెలిపారు. ఈనెల 28న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీయూడబ్ల్యూజే కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల ప్రాంతీయ సదస్సు కరీంనగర్లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ..యాజమాన్యాలు ఎవరైనా.. తవు వృత్తిధర్మంలో ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించామని చెప్పారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఏపీయూడబ్ల్యూజేను తెలంగాణ జర్నలిస్టుల ఫోరం చీల్చే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. టీజేఎఫ్ యూనియన్‌గా ఏర్పడితే అభ్యంతరంలేదన్నారు.