
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ జర్న లిస్ట్‌ల యూనియన్(ఐజేయూ) కొత్త అధ్యక్షునిగా దేవులపల్లి అమర్, సెక్రటరీ జనరల్‌గా సబీనా ఇంద్రజిత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐజేయూ –2018 ఎన్నికల అధికారి ప్రేమ్‌నాథ్ భార్గవ ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో జరగ నున్న ఇండియన్ జర్నలిస్టుల యూని యన్ ప్లీనరీలో వీరు పదవీ బాధ్య తలు స్వీకరిస్తారు. హైదరాబాద్ కేం ద్రంగా పనిచేస్తున్న దేవులపల్లి అమర్ జర్నలిజం వృత్తిలోనూ, ట్రేడ్ యూని యన్ కార్యకలాపాల్లోనూ 42 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు.
ఆయన ప్రస్తుతం సాక్షి టీవీలో కన్స ల్టింగ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. 1976 లో ఈనాడు దినపత్రిక ద్వారా జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించిన అమర్ ఆ తరువాత వివిధ దినపత్రి కలలో వివిధ హోదాల్లో పని చేశారు. ప్రజాతంత్ర పత్రిక వ్యవస్థాపక సంపా దకుడు కూడా అయిన అమర్ రెండు సార్లు ఏపీ ప్రెస్ అకాడమీ అధ్యక్షు డిగా వ్యవహరించారు. ఆయన ప్రస్తు తం ఐజేయూ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు.
సబీనా ఇంద్రజిత్ ఢిల్లీలో ఇండియన్ న్యూస్ అండ్ ఫీచర్స్ ఏజె న్సీ(ఇన్ఫా)లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఇన్ఫా సంస్థ స్థాపకులు, ప్రముఖ సంపాదకుడు దుర్గాదాస్ మనుమరాలు. ప్రముఖ పార్లమెంటేరియన్, జర్నలిస్ట్ ఇంద్ర జిత్ కుమార్తె. సబీనా ప్రస్తుతం బ్రస్సె ల్స్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జా తీయ జర్నలిస్ట్ సమాఖ్య (ఐఎఫ్‌జే) ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. అమర్, సబీనాల ఎన్నిక పట్ల పదవీ విరమణ చేయనున్న ఐజేయూ అధ్యక్షుడు ఎస్‌ఎన్ సిన్హా, ఐజేయూ మాజీ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ రెడ్డి , మరో సీనియర్ నేత అమర్నాథ్ వారికి అభినందనలు తెలిపారు.