కరీంనగర్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరగనున్న తరుణంలో త్వరలోనే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆవిర్భవించనున్నట్లు ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ తెలిపారు. ఈనెల 28న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీయూడబ్ల్యూజే కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల ప్రాంతీయ సదస్సు కరీంనగర్‌లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ..యాజమాన్యాలు ఎవరైనా.. తవు వృత్తిధర్మంలో ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించామని చెప్పారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఏపీయూడబ్ల్యూజేను తెలంగాణ జర్నలిస్టుల ఫోరం చీల్చే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. టీజేఎఫ్ యూనియన్‌గా ఏర్పడితే అభ్యంతరంలేదన్నారు.
త్వరలో టీయూడబ్ల్యూజే: దేవులపల్లి అమర్
Published Wed, Dec 25 2013 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement