కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
-
వంటావార్పుతో వినూత్న నిరసన
-
సంఘీభావం తెలిపిన వివిధ పార్టీల నాయకులు
హన్మకొండ అర్బన్ : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం టీడీడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిచారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా, వంటా వార్పు చేపట్టి నిరసన తెలిపారు. తుమ్మ శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరి గిన కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు దాసరి కృష్ణారెడ్డి, వల్లాల వెంకటరమణ, కేకే, మిద్దెల రంగనాథ్, గాడిపెల్ల మధు, కంకణాల సంతోష్, బుచ్చిరెడ్డి సునీల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు అందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉదయంనుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన ఆందోళనలో వంటావార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ, కట్ల శ్రీనివాస్‌రావు, ఈ.వీ.శ్రీనివాస్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క, సీపీఐ, సీపీఎం నాయకులు శ్రీనివాస్‌రావు, వాసుదేవరెడ్డి, చక్రపాణి, తదితరులు సంఘీభావం తెలిపారు. అనంతరం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం నాయకులు డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.